యంగ్ హీరో రానా దగ్గుబాటి సినీ పరిశ్రమలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తవుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయిన రానా..తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. 2010, ఫిబ్రవరి 19న విడుదలైన లీడర్ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 11 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్త రానాకు విషెస్ తెలిపింది. లీడర్ పోస్ట్‌ర్‌ను షేర్‌చేస్తూ.. 'హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అంటూ లవ్లీ విషెస్ తెలిపింది. ఇక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో రానా వివాహం విహికా బజాజ్‌తో జరిగిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది.
ఇక, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా రానాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నటుడిగా 11ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రానాకు స్పెషల్ విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఏప్రిల్ 30న వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రానాకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రానా ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో పవన్ కల్యాణ్‌తో కలిసి నటిస్తున్నారు.
చదవండి : (పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ హీరో)
(సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!)
Rana completes 11 years as an actor! Here's to all his unforgettable characters, super hit movies, undeniable energy and passion for what he does ♥️@RanaDaggubati #11GloriousYrsOfRANADAGGUBATI pic.twitter.com/WQIEkWb4uX
— Suresh Productions (@SureshProdns) February 18, 2021
Comments
Please login to add a commentAdd a comment