ఖురేషిగా ఎందుకు మారాడు? | L2 Empuraan: Mohanlal Unveils First Look Of His Character Khureshi Abraam | Sakshi
Sakshi News home page

ఖురేషిగా ఎందుకు మారాడు?

Published Wed, May 22 2024 12:44 AM | Last Updated on Wed, May 22 2024 12:44 AM

L2 Empuraan: Mohanlal Unveils First Look Of His Character Khureshi Abraam

ఖురేషి అబ్రమ్‌గా స్టీఫెన్‌ నెడుంపల్లి ఎందుకు మారాడు? ‘లూసిఫర్‌’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సందేహం కలగడం సహజం. ఈ సందేహానికి ‘లూసిఫర్‌ 2’లో సమాధానం దొరకనుంది. స్టీఫెన్‌ నెడుంపల్లి అలియాస్‌ ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘లూసిఫర్‌’ (2019). హీరో, డైరెక్టర్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కాంబినేషన్‌లోనే ‘లూసిఫర్‌’కి సీక్వెల్‌గా ‘ఎల్‌2 ఎంపురాన్‌’ రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని లైకా ప్రోడక్షన్స్‌ సుభాస్కరన్, ఆశీర్వాద్‌ సినిమాస్‌ ఆంటోని పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం (మే 21) మోహన్‌లాల్‌ బర్త్‌ డే సందర్భంగా ‘ఎల్‌ 2 ఎంపురాన్‌’లో ఖురేషి అబ్రమ్‌గా మోహన్‌లాల్‌ లుక్‌ను విడుదల చేశారు. స్టీఫెన్‌ నెడుంపల్లి అసలు ఖురేషి అబ్రమ్‌గా ఎలా మారాడు? అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. 2025లో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement