యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది | Actress Meena heads to Drishyam 2 location clad in PPE kit | Sakshi
Sakshi News home page

యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది

Oct 3 2020 3:47 AM | Updated on Oct 3 2020 4:04 AM

Actress Meena heads to Drishyam 2 location clad in PPE kit - Sakshi

పీపీఈ కిట్‌లో మీనా

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్‌ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్‌ ధరించి ప్రయాణం చేశారామె.

దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్‌ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్‌ (పీపీఈ కిట్స్‌) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్‌లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్‌’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement