Mehbooba
-
పూరి నెక్ట్స్ ‘వాస్కోడగామా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన మెహబూబా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న పూరి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాకు పూరి నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారట. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే వాస్కోడగామా అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
చిరు కాదన్న కథతో నాగ్
మెహబూబా సినిమాతో మరోసారి నిరాశపరిచిన పూరి తన తదుపరి చిత్రాన్ని కూడా ఆకాష్ హీరోగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సీనియర్ హీరో నాగార్జునకు ఓ కథ వినిపించాడట పూరి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని భావించారు. పూరి చెప్పిన ఆటోజాని కథతో పూర్తిగా సంతృప్తి చెందని చిరు రీమేక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి నాగార్జునకు వినిపించాడట పూరి. మరి నాగ్ ఆటోజానికి ఓకె చెప్తాడా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. గతంలో పూరి, నాగార్జున కాంబినేషన్లతో వచ్చిన సూపర్, శివమణి సినిమా మంచి విజయాలు సాధించాయి. అందుకే మరోసారి పూరితో సినిమా చేసేందుకు నాగ్ ఓకె చెప్పే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
న్యూజెర్సీలో మెహబూబా టీం సందడి
-
నాలుగోసారి.. ఐదోసారీ చూశారు – పూరి జగన్నాథ్
‘‘అమెరికాలో తెలుగువాళ్లతో కలిసి ‘మెహబూబా’ ప్రీమియర్ చూశాం. అందరికీ బాగా నచ్చింది. హైదరాబాద్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూశాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాలుగోసారి, ఐదోసారి చూసినవాళ్లను కూడా నేను కలిశాను. ఆకాష్ బాగా చేశాడంటూ అభినందిస్తున్నారు’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆకాష్ పూరి, నేహాశెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి కనెక్ట్స్ నిర్మాణంలో రూపొందిన ‘మెహబూబా’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘మెహబూబా’ రెగ్యులర్‌గా నేను తీసే సినిమాల్లా ఉండదు. కమర్షియల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే లవ్‌స్టోరీ. నా కెరీర్లో బాగా మనసుపెట్టి తీసిన సినిమా ఇది. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘మెహబూబా’ లాంటి సినిమాను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలోని విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్‌ని ఎంజాయ్ చెయ్యాలంటే బిగ్ స్క్రీన్లోనే సాధ్యమవుతుంది’’ అన్నారు చార్మి. ‘‘మెహబూబా’ చూసినవాళ్లంతా చాలా బాగుందని చెబుతున్నారు. నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నాన్నకి థ్యాంక్స్. ఆ పదం చాలా చిన్నదని నా ఒపీనియన్. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు పూరి ఆకాష్. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చూడాలనుకునేవారికి ‘మెహబూబా’ తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నేహాశెట్టి. నటులు విషురెడ్డి, విజయ్, పృథ్వీ, ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్ పాల్గొన్నారు. -
‘మెహబూబా’ మూవీ రివ్యూ
టైటిల్ : మెహబూబా జానర్ : లవ్ ఎంటర్టైనర్ తారాగణం : ఆకాష్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి, మురళీ శర్మ, షియాజీ షిండే సంగీతం : సందీప్ చౌతా దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : పూరి కనెక్ట్స్ చాలా రోజులుగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్, తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్ చేస్తూ తెరకెక్కించిన సినిమా మెహబూబా. ముందు నుంచి ఇది పూరికి కూడా రీలాంచ్ లాంటి సినిమా అంటూ ప్రచారం చేశారు చిత్రయూనిట్. పూరి తన రెగ్యులర్ స్టైల్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి ఓ డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ టేకింగ్‌తో చేసిన మెహబూబా పూరికి సక్సెస్ అందించిందా..? ఆకాష్ హీరోగా కమర్షియల్ హిట్ అందుకున్నాడా..? కథ ; రోషన్ (ఆకాష్ పూరి)ను చిన్న తనం నుంచి ఓ కల వెంటాడుతుంటుంది. తాను ఓ సైనికుడినని ఎవరో తనను చంపేశారని అనిపిస్తుంటుంది. అదే సమయంలో హిమాలయాల్లో తాను ఎవరికో మళ్లీ వస్తానని మాట ఇచ్చానని.. ఒకే కల పదే పదే వస్తుంటుంది. అదే సమయంలో లాహోర్ లో ఉన్న అఫ్రీన్ (నేహా శెట్టి)కు కూడా ఇలాంటి కలే వస్తుంది. తనను ఎవరో చంపేసారని భయపడుతుంటుంది అఫ్రీన్. ఇంట్లో వాళ్లు చేసే పెళ్లి ఇష్టం లేని అఫ్రీన్, చదువుకోవాలన్న కారణం చెప్పి ఇండియా వచ్చేస్తుంది.(సాక్షి రివ్యూస్) ఇంట్లో వాళ్లందరూ అఫ్రీన్‌ను ఇండియా పంపించడానికి భయపడినా.. అఫ్రీన్ మాత్రం తనకు సొంత ఇంటికి వెళుతున్నంత ఆనందంగా ఉందంటూ ఇండియాకు వస్తుంది. అలా హైదరాబాద్ చేరిన అఫ్రీన్‌ను.. రోషన్ ఓ ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆ సమయంలో రోషన్ ముఖం చూడని అఫ్రీన్.. ఎలాగైన తనకు సాయం చేసిన వ్యక్తిని కలుసుకొని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటుంది. అఫ్రీన్ ఇండియాకు రావటం, ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న నాదిర్ (విషు రెడ్డి)కు నచ్చదు. అందుకే ఇంట్లో గొడవ చేసి తనను తిరిగి పాకిస్తాన్‌కు పిలిపిస్తాడు. పాకిస్తాన్ వెళ్లేందుకు బయలుదేరిన అఫ్రీన్కు.. అదే ట్రైన్లో హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తున్న రోషన్‌ను కలుస్తాడు. తనను ప్రమాదం నుంచి కాపాడింది రోషనే అని తెలుసుకొని కృతజ్ఞతలు చెప్తుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన రోషన్‌కు అక్కడ తన గత జన్మకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి.(సాక్షి రివ్యూస్) గత జన్మలో తాను ప్రేమించిన అమ్మాయే ఈ జన్మలో అఫ్రీన్‌గా మళ్లీ పట్టుందని తెలుసుకుంటాడు రోషన్. అసలు రోషన్‌కు తన గతం ఎలా తెలిసింది..? పాకిస్తాన్ వెళ్లిపోయిన అఫ్రీన్‌ను రోషన్ ఎలా కలవగలిగాడు..? చివరకు ఆ ఇద్దరు ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్.. చాలా రోజులు తరువాత మెహబూబాతో ఓ కమర్షియల్ హీరోగా రీలాంచ్ అయ్యాడు. అయితే రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌ను ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు వేరియేషన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. లుక్స్ పరంగా మెప్పించిన ఆకాష్, కొన్ని సన్నివేశాల్లో తన వయసుకు మించిన పాత్రను ఎంచుకున్నాడనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే ఛాన్స్ మాత్రం దక్కలేదు. హీరోయిన్గా పరిచయం అయిన నేహాశెట్టి పరవాలేదనిపించింది. విలన్‌గా విషు రెడ్డి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ, హీరో తండ్రిగా షియాజీ షిండే రొటీన్ పాత్రల్లో కనిపించారు. విశ్లేషణ ; ఆకాష్‌కే కాదు మెహబూబా పూరి జగన్నాథ్‌కు కూడా రీలాంచ్ లాంటిందే. అందుకే తన రెగ్యులర్ స్టైల్‌ను పక్కన పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టేకింగ్‌తో సినిమా చేశాడు పూరి. పునర్జన్మల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే పూరి తన ప్రేమకథకు ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని జోడించాడు. తన స్టైల్ మార్చి కొత్త టేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరి తన మార్క్ టేకింగ్‌ను ఇష్టపడేవారిని కాస్త ఇబ్బంది పెట్టాడు. (సాక్షి రివ్యూస్) అభిమానులు పూరి సినిమాలో ఆశించిచే పూరి మార్క్ హీరోయిజం, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లేకపోవటమే ఇందుకు కారణం. చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతమందించిన సందీప్ చౌతా డిఫరెంట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆకట్టుకునే అంశం సినిమాటోగ్రఫి. యాక్షన్ సీన్స్ తో పాటు ట్రెక్కింగ్‌కు సంబంధించిన సన్నివేశాల్లో కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి ఫస్ట్ హాప్లో కొన్ని డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే లాజిక్ లేని సీన్స్ పూరి మార్క్ కనిపించకపోవటం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మెహబూబా రెగ్యులర్ పూరి సినిమాలా లేదు
-
మెహబూబా కొత్తగా ఉంది : ప్రభాస్
కొద్ది రోజులుగా సరైన హిట్స్లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ శుక్రవారం మెహబూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో తన తనయుడు ఆకాష్‌ను రీ లాంచ్ చేస్తున్నాడు పూరి. భారత్ పాక్‌ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథను పూరి స్వయంగా నిర్మించారు. ప్రమోషన్ విషయంలో కూడా పూరి జగన్నాథ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మెహబూబా టీంకు తన అభినందనలు తెలియజేశారు. ‘మెహబూబా రెగ్యులర్ పూరి సినిమాలా లేదు. పూరి సినిమాలు ఎక్కువగా హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరుగుతాయి. మెహబూబా కొత్తగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఆకాష్ లుక్స్, వాయిస్ బాగున్నాయి. ఆకాష్ పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నా’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. -
ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది
‘‘పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ మనస్ఫుర్తిగా రాస్తే చాలా అద్భుతంగా సినిమా తీస్తాడు. ఆ విషయం ఇది వరకు చాలాసార్లు ప్రూవ్ అయింది. ఈ సినిమాతో మళ్లీ ప్రూవ్ అవుతుంది. జెన్యూన్ లవ్‌స్టోరీ తీశాడు’’ అన్నారు ‘దిల్’ రాజు. ఆకాశ్ పూరి, నేహా శెట్టి జంటగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెహబూబా’. శ్రీ వెంకటేశ్వర రిలీజ్ బ్యానర్‌పై వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రేపు విడుదల కానుంది. బుధవారం ‘మెహబూబా’ సినిమా స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లతో సినిమా తీస్తున్నప్పుడు జనరల్ ఆడియన్స్‌కు చూపిస్తే జనరల్ టాక్ తెలుస్తుందని పబ్లిక్ షో ఏర్పాటు చేశాం. నేనూ, పూరి కలసి రెండు సినిమాలు చేశాం (ఇడియట్, పోకిరి) రెండూ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. మామూలుగా పూరి సినిమాల్లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిది ఏమీ ఉండదు’’ అని అన్నారు. పూరి మాట్లాడుతూ– ‘‘దిల్’ రాజుగారు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నిజంగానే చాలా సంవత్సరాల తర్వాత జెన్యూన్‌గా సినిమా తీశాను. పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మా కాంబినేషన్లో వచ్చిన ఇడియట్, పోకిరి పెద్ద హిట్లు. ఈ సినిమా కూడా అదే రేంజ్లో అవుతుందనుకుంటున్నాను. ఆడియన్స్ ఒక చోట నవ్వుతారు అనుకుంటే నాలుగు చోట్ల నవ్వుతున్నారు. స్పెషల్ థ్రిల్ కలిగింది. అమేజింగ్ రెస్పాన్స్’’ అన్నారు. చార్మి మాట్లాడుతూ – ‘‘ఈ షో తర్వాత ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు యూఎస్‌లో ఫస్ట్ ప్రీమియర్‌ను టీమ్ అంతా కలసి చూస్తాం. యూఎస్‌లో 2 వీక్స్ టూర్ చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశ్ పూరి, నేహా శెట్టి, విషు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చూసిన వెంటనే షాకయ్యా : నాని
ఒకప్పుడు డైనమిక్ డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ మాత్రమే అని అనేవారు. స్టార్ డైరెక్టర్ హోదాలో చాలా కాలమే కొనసాగారు. కానీ ప్రస్తుతం పూరి సినిమాలు వస్తున్నాయంటే ఒకప్పటి హంగామా ఇప్పుడు ఉండటం లేదు. దానికి కారణం వరుసబెట్టి ఒకే మూసధోరణిలో సినిమాలు చేస్తుండటమే. అయితే ‘మెహబూబా’ మాత్రం పూర్తిగా తన పంథా మార్చి కొత్తగా ట్రై చేసిన సినిమా అంటూ చెప్తున్నాడు పూరి. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ హైలెవల్లో చేస్తోంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రమోషన్లో భాగంగా నాని ఈ సినిమా గురించి వివరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ‘ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా. టెక్నికల్లి బ్రిలియంట్‌గా ఉంది. ఇదంతా ఎప్పుడు తీశారా అని డౌట్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న క్యూరియాసిటీ పెరిగింది. చిత్రబృంధానికి,పూరి గారికి, ఆకాష్, ఛార్మి గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్’ అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇండో పాక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుభూతికి లోనయ్యా : కోన ఇప్పుడే మెహబూబా సినిమా చూశాను. కాదు...కాదు...అనుభూతికి లోనయ్యాను. ప్రేమతో పూరి తీసిన గొప్ప ప్రేమకథ మెహబూబా. చిత్రబృంధానికి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడే "మెహబూబా" చూసాను .. కాదు .. కాదు .. ఒక అనుభూతికి లోనయ్యాను.. పూరి ప్రేమతో తీసిన ఒక గొప్ప ప్రేమకథ ఇది !! ఆకాష్ చాలా చాలా బాగా చేసాడు.. It’s a mind blowing love story 👍Congratulations @purijagan , @PuriConnects & the whole team 👏👏👏 — kona venkat (@konavenkat99) May 9, 2018 -
మెహబూబా ట్రైలర్ చూసిన వెంటనే షాకయ్యా
-
ఆయనంటే పిచ్చి
‘‘ఈ క్షణం కోసం పదిహేనేళ్లుగా ఎదురు చూస్తున్నా. ‘మెహబూబా’ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో ఉన్నా. ఈ తరహా లవ్‌స్టోరీ మా నాన్న నుంచి వస్తుందనుకోలేదు. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమాకీ ఇంత కాన్ఫిడెంట్‌గా లేను. ‘మెహబూబా’ తో నాన్నకు చాలా మంచి పేరొస్తుంది’’ అని ఆకాశ్ పూరి అన్నారు. ఆకాశ్, నేహాశెట్టి జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మెహబూబా’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ–‘‘ఇండియా– పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో హీరోకి ఆర్మీలో చేరాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది నా డెబ్యూ మూవీ అని హీరోయిజం చూపించలేదు. కథకు ఎంత అవసరమో అంతే చూపించారు. నా తొలి సినిమా ‘చిరుత’ నుంచి ‘మెహబూబా’ వరకూ ప్రతి సినిమాకి ఎంతో కొంత నటన నేర్చుకుంటున్నా. రామ్‌చరణ్, ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్.. వంటి స్టార్లతో నటించడం నా అదృష్టం. వారి స్థాయికి ఎదగాలంటే చాలా కష్టపడాలి.. కష్టపడతా. నా రోల్‌మోడల్, దేవుడు రజనీకాంత్‌గారు. చిన్నప్పటి నుంచి ఆయనంటే పిచ్చి. నేను ఎంత బాగాచేసినా నాన్న ‘బావుందిరా’ అంటారు. కానీ, పెద్దగా కాంప్లిమెంట్స్ ఇవ్వలేదు. 2017 అక్టోబర్ 12న ‘మెహబూబా’ షూటింగ్లో ఓ సీన్ చేశాక ‘సూపర్ సూపర్’ అన్నారు. ఈ రోజుని నా జీవితంలో మరచిపోలేను. నేహాశెట్టితో పోటీపడి మరీ నటించా. ‘దిల్’ రాజుగారు మా సినిమా రిలీజ్ చేస్తున్నందకు ‘థ్యాంక్స్’ చెబితే చిన్నమాట అవుతుంది. నాన్న, రాజుగారి కాంబినేషన్లో వచ్చిన ‘ఇడియట్, పోకిరి’ సూపర్ హిట్స్ అయ్యాయి. ‘మెహబూబా’ కూడా అదే కోవలోకి వస్తుంది. బయటి కథలు కూడా వింటున్నా. కానీ, నా తర్వాతి సినిమా నాన్నగారితోనే ఉంటుంది. నేను ఇంటర్ పూర్తి చేశా. అదే నాకు ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు అనిపిస్తోంది. ఇక నా దృష్టి అంతా సినిమాలపైనే ’’ అన్నారు. -
ఆకాష్‌తో మరో సినిమా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లు ఎదురవ్వటంతో పూరికి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. అయితే పూరి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ మెహబూబా షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. చిత్రయూనిట్ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మెహబూబా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు పూరి. అంతేకాదు తన తదుపరి చిత్రాన్ని ఆకాష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. రిలీజ్‌కు రెడీ అవుతున్న మెహబూబా ఇంటెన్స్ లవ్ స్టోరి కాగా.. నెక్ట్స్ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాను కూడా పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ లోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పూరి టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
పెళ్లి చేసుకోను.. ప్రేమించనూ లేను..
లైఫ్ చాలా సింపుల్ రిలేషన్షిప్స్ ఇంకా సింపుల్ లైఫ్‌లో కిందపడితే ‘భౌభౌ’ అంటారు. అదే పైకి లేస్తే ‘వావ్ వావ్’ అంటారు. మొరిగేవాళ్లే కాంప్లికేటెడ్ ఎప్పుడు ‘భౌభౌ’ అంటారో ఎప్పుడు ‘వావ్ వావ్’ అంటారో తెలియదు. ‘పీసీ’ అంటే పూరీ కనెక్ట్స్ కాదు.. పూరి, చార్మి అంటున్నారని టాక్ అంటే.. మొరిగేవాళ్లను మొరగనివ్వండి అంటున్నారు చార్మి. పీసీ అంటే ‘ప్రొఫెషనల్ కనెక్షన్’ అని కన్ఫార్మ్ చేస్తున్నారు చార్మి. బేసిక్‌గా మీరు మంచి యాక్ట్రెస్. ఆన్ స్క్రీన్‌కి దూరమై, ఆఫ్ స్క్రీన్ ప్రొడక్షన్ వ్యవహారాలకు స్టిక్ అయిపోయారేంటి? చార్మి: నేను ఆల్ టైప్ ఆఫ్ జానర్ మూవీస్ చేసేశాను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం.. ఇలా ఎక్కువ భాషల్లో, అందరి సూపర్ స్టార్స్‌తో సినిమాలు చేశాను. రొమాన్స్, మాస్ మసాలా, దెయ్యాలు, థ్రిల్లర్స్, ఐటమ్ సాంగ్స్... ఏదీ వదిలిపెట్టలేదు. ఇప్పుడూ అలాంటి సినిమాలే అంటే నా మైండ్ ఒప్పుకోవడంలేదు. ఇంకా ఎన్నాళ్లని అదే చేస్తాం? చేసినన్నాళ్లు చాలా జెన్యూన్‌గా, హానెస్ట్‌గా చేశాను. ఏదో డబ్బు ఇస్తున్నారు కదా అని నా ప్రొఫెషన్ని చీట్ చేయలేదు. పదిహేనేళ్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశా. అప్పుడు అది బాగుందనిపించింది. ఇప్పుడు ఇది చూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా మైండ్, నా సోల్ అన్నీ ఈ కంపెనీ (పూరీ కనెక్ట్స్) మీదే. ప్రొడక్షన్‌ని డీల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ స్ట్రెస్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నా. జనరల్‌గా ఏ కంపెనీ అయినా ఉన్నని రోజులు అంతా బాగానే ఉంటుంది. తర్వాత కలహాలొస్తే అప్పుడు మీ లైఫ్ ఏంటి ? పూరీగారు ‘నథింగ్ ఈజ్ పర్మినెంట్’ అంటారు. అప్స్ అండ్ డౌన్స్ కామన్. అవి పేరెంట్స్‌తో కూడా రావొచ్చు కదా? వాళ్లు నాతో జీవితాంతం ఉంటారని గ్యారంటీ ఏంటి? రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావని గ్యారంటీ ఏంటి? మేం లైమ్‌లైట్‌లో ఉన్నాం అని మా కంపెనీ మీద చాలామందికి ప్రత్యేక దృష్టి ఉంటుందేమో. ఇక్కడ ఎప్పుడూ వర్క్ గురించే. వర్క్ తప్ప ఇక్కడేమీ ఉండదు. 24 గంటలు సినిమా పనులతో బిజీగా ఉంటాం. నాకు మెన్, ఉమెన్ అని వేరు చేయడం ఇష్టం ఉండదు. ఎవరి మైండ్ కరెక్ట్‌గా ఉంటే వాళ్లతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. పీసీ అంటే ‘పూరీ కనెక్ట్స్’. కానీ చాలామంది పి అంటే పూరి, సి అంటే చార్మి అనుకుంటున్నారు. దాని గురించి? పూరీగారు ఫేమస్ కాబట్టి, చార్మి ఫేమస్ కాబట్టి అలా అనుకుంటున్నారు. అదే నేను అబ్బాయిని అయితే అలా అనుకోరు కదా. లేదా నేను ఒక హీరోయిన్ని కాకుంటే అలా అనుకోరు కదా. ఇప్పుడు నేనేం చెప్పినా పట్టించుకోరు. మాట్లాడుకునేది మాట్లాడుకుంటూనే∙ఉంటారు. అందుకే ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం మానేశాను. నా బిల్స్ సొసైటీ కట్టడంలేదు. పబ్లిక్ కట్టడం లేదు. మీరూ కట్టడంలేదు. నేనే కట్టుకోవాలి. నా జీవితం నేనే బ్రతకాలి. వాళ్లు ఇలా అనుకుంటున్నారు... వీళ్లు ఇలా అనుకుంటున్నారని నా పనులన్నీ ఆపేసి కూర్చోలేను. మీ ఇష్టం అని వదిలేయడమే. మీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్పై చాలామందికి క్వొశ్చన్స్ ఉన్నాయి.. వాటికి ఆన్సర్స్ ఆశిస్తారు? ఇతరుల లైఫ్ గురించి కొన్ని క్వొశ్చన్స్ అనుకుని ఆన్సర్స్ కోసం చూడటం మానుకోవాలి. ఆ ఆరాటాన్ని వదిలించుకుంటే పైకి వస్తారు. వర్క్‌లో ఫోకస్ ఉంచితే ఎక్కడికో వెళ్లిపోతారు. సాయంత్రం అవ్వగానే వాళ్ల గురించి, వీళ్ల గురించి సొల్లు కబుర్లు చెప్పుకునేవాళ్లు లైఫ్‌లో పైకి రారు. పూరీగారి లవ్‌స్టోరీలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఆయన తీసిన మిగతా లవ్‌స్టోరీలకు ‘మెహబూబా’ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోంది? ‘మెహబూబా’ ఫుల్ ఇన్టెన్స్ లవ్‌స్టోరీ. 1970 టైమ్‌లో జరిగే కథ. బేసిక్‌గా ఇది పునర్జన్మల కథ. 1970లో ఒక కథ, 2018లో మరో కథ జరుగుతుంది. 1970లో జరిగేది ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్ కొత్త కాన్సెప్ట్. న్యూ అటెమ్ట్ కూడా. పూరీగారికి వార్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఈ వార్ బేస్డ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. యాక్ట్రె స్‌గా ఉండటం వల్ల ఎక్కువ సంపాదించారా? లేక ప్రొడక్షన్లో ఉండటం వల్లనా? నేనెప్పుడూ మనీ వైపు అట్రాక్ట్ అవ్వలేదు. ‘ఐ యామ్ అట్రాక్టెడ్ టు వర్క్’. మనకి కావల్సింది ఏంటి? మంచి ఇల్లు, లగ్జరీ కారు, కోరుకున్న ఫుడ్, మంచి డ్రెస్సులు. నాకు విశాలమైన ఇల్లు ఉంది. లగ్జరీ కారు ఉంది. ఫైవ్‌స్టార్ హోటల్స్‌కి వెళ్లే స్తోమత ఉంది. హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఎందుకు డబ్బు కోసం పరిగెత్తడం? అందుకే ఇక డబ్బు గురించి అంత ధ్యాస లేకుండా పోయింది. ఇప్పుడు నాకు మంచి వర్క్ కావాలి. అది ఈ కంపెనీలో దొరుకుతోంది. ఐ యామ్ హ్యాపీ. సొసైటీలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారా? సొసైటీ మీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకుంటారా? ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటేనే తెలుసుకుంటా. పట్టించుకోకూడదనుకుంటే పట్టించుకోను. నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతాను. ‘లివ్, లెట్ లివ్’. నేను ఒకరి జీవితంలోకి తొంగి చూడాలని ఆరాటపడను. సొసైటీ గురించి మాట్లాడుకుంటే... ‘నేను ఆడ, తను మగ’ అనే వ్యత్యాసాన్ని వేరు చేయాలి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ని మైండ్‌లో నుంచి తీసేయాలి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి వర్క్ చేస్తే అదేదో కాని పని అన్నట్లు చూడటం మానేయాలి. మా కంపెనీలో ఒక్కటే రూల్. రండి.. వర్క్ చేయండి. మీకేమైనా వేరే ఉద్దేశం ఉంటే వెళ్లిపోండి. అంతే. ఎందుకంటే మా మైండ్‌లో వర్క్ తప్పితే ఇంకేం ఉండదు. మా ఇంట్లో నన్ను మా నాన్నగారు అబ్బాయిలానే చూస్తారు. అందుకే ‘బేటా’ అని పిలుస్తారు. మా ఫ్యామిలీలో నేను ‘బాయ్ టైప్’. అంటే ‘బేటా’ అనిపించుకోవడంలోను, ‘బాయ్ టైప్’ అనుకోవడంలోనూ ప్రౌడ్‌నెస్ ఉంది అంటారా? ఉమెన్‌గా ఉండటంలో అది లేదా? స్ట్రాంగ్ ఉమన్ అని అనుకోవచ్చు కదా? ఎగ్జాంపుల్ కోసం ‘బాయ్’ అన్నా. ‘ఐయామ్ ఎ స్ట్రాంగ్ ఉమన్’. అసలు మ్యాన్, ఉమన్ అని ఎందుకీ డిఫరెన్స్? నేనేంటి? ఈరోజు లేవగానే ఏం పని చేయాలి? అని మాత్రమే ఆలోచిద్దాం. ఎవర్నీ హర్ట్ చేయకుండా ఉందాం. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్లు ఉంటే అందరూ హ్యాపీగా ఉంటాం. చేసిన క్యారెక్టర్లే వస్తున్నాయని నటించడంలేదు. కానీ పబ్లిక్ అప్పియరెన్స్‌లు కూడా తగ్గించేశారు.. కారణం? ఆఫీసులో ఉండి, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ లొకేషన్‌కి వెళుతున్నాను. కానీ నేను బయట కనిపించాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు నాకు పబ్లిక్ అప్పియరెన్స్ ఇష్టం లేదు. బయటకు నా ఫేస్ చూపించడం ఇష్టం లేదు. కెమెరా వెనక ఉండి వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నా. ఒక ఉమన్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. ‘మెహబూబా’ని సింగిల్ హ్యాండెడ్‌గా చేయడం ఎలా అనిపించింది? సింగిల్ హ్యాండ్ అని చెప్పలేను. మా కంపెనీ (పూరీ కనెక్ట్స్) నుంచి వస్తున్న సినిమా ఇది. పూరీగారు మోస్ట్ ఈజియస్ట్ బిజినెస్ పార్టనర్, ఈజియస్ట్ డైరెక్టర్. ఆయన కింద పని చేసేవాళ్లను అడగండి. పూరీగారంటే మాకు పిచ్చ ఇష్టం అంటారు. వాళ్లందరికీ ఆయన మీద అంత ఇష్టం ఉండటం వల్ల ప్రేమతో వర్క్ చేస్తారు. నాకు వాళ్లందర్నీ హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాలేదు. ఒకవేళ పూరీగారి సినిమా కాకుండా వేరే సినిమా అయితే కష్టంగా ఉంటుందా? అవును. ఇంపాజిబుల్. ఆయన కాబట్టి వర్క్ చాలా ఈజీ అయిపోయింది. పూరీగారు లేకుండా అంటే చాలా కష్టం. ఎలాగూ ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడం వచ్చింది. సోలోగా సినిమాలు ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు. ‘ఫిమేల్ ప్రొడ్యూసర్స్’ తక్కువ ఉన్నారు కదా? నాకలాంటి ఆలోచనలు లేవు. ఇన్నేళ్లూ సోలో హీరోయిన్ గానే చేశాను కదా. ఇప్పుడు టీమ్ వర్క్‌గా అందరం కలిసి ప్రొడక్షన్ చేద్దామనుకుంటున్నాను. టీమ్ వర్క్ వల్ల చాలాకాలం నిలబడతామని నా నమ్మకం. సాఫ్ట్వేర్ కంపెనీలనే తీసుకుందాం. ఇద్దరు ముగ్గురు ఫౌండర్స్ ఉంటారు. వాళ్లెప్పుడూ సోలోగా పేరు ఇవ్వరు. వాళ్ల కంపెనీ పేరునే బయటకు ఇస్తారు. ఎందుకంటే వాళ్లు టీమ్ వర్క్‌ని నమ్ముతారు. కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ కాంబినేషన్ సెట్ కావడం రేర్.. అలా చూస్తే మీకు రేర్‌గానే అనిపిస్తుంది. కాంబినేషన్స్ ఎందు కు కలవవు. బాపు–రమణగారు జీవితం మొత్తం కలిసే ట్రావెల్ చేశారు. యస్వీ కృష్ణారెడ్డిగారు–అచ్చిరెడ్డిగారు ఉన్నారు. వాళ్లు కలిసే ట్రావెల్ చేస్తారు. ఎవరూ ఏమీ అనరు. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ‘జెండర్’ వేరయ్యేసరికి టాపిక్ అవుతోంది. ఇలా టాపిక్ అవుతుందని ఇంట్లో కూర్చోలేం కదా. మీరు తీసుకునే నిర్ణయాలపట్ల చాలా క్లారిటీగా ఉన్నారనిపిస్తోంది. మరి.. ఇంతే క్లారిటీతో పెళ్లి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకోను. ‘ఐ యామ్ నాట్ మేడ్ ఫర్ మ్యారేజ్’. నేను రిలేషన్షిప్లో కూడా ఉండలేను. ఎవర్నీ ప్రేమించలేను. ఒక రిలేషన్‌షిప్‌కి కావాల్సినట్టు ఉండలేను. అందుకే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను. నా అంతట నేను బతకగలను. కావాలంటే పాస్‌పోర్ట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతా. ఎవ్వరికీ ఫోన్ కూడా చేయను. ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే చాలా క్వొశ్చన్స్కు ఆన్సర్ చేయాలి. ‘నేను ఓ ఇరవై రోజుల తర్వాత ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్దాం అనుకుంటున్నా’ అని ముందే ప్రిపేర్ చేయాలి. అవన్నీ నా వల్ల కాదు. నాకు నచ్చినట్టు ఉంటాను. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. కానీ ‘ఒక బంధం’లో సెక్యూరిటీ ఉంటుంది కదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అదే సెక్యూరిటీ. భర్త ఉంటాడు. అతను డబ్బు ఇవ్వకపోతే ఆ భార్య పరిస్థితి ఏంటి? ఇల్లు ఎలా గడుస్తుంది? ఏదో హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. సమయానికి భర్త ఇంట్లో ఉండడు. హాస్పటల్‌కి వెళితే ఎవరు చూస్తారు? నర్సే కదా. ఆ నర్స్‌కి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులుంటే చాలు. సెక్యూర్డ్ పొజిషన్లో ఉన్నట్లే. గతంలో ఓ వ్యక్తితో ఏర్పడిన ‘రిలేషన్షిప్’ తాలూకు చేదు అను భవం వల్లే మీ మైండ్ సెట్ ఇలా మారిందా? ఆ రిలేషన్షిప్ గురించి ఎవరికి వాళ్లు ఊహించుకున్నారు. నేనెప్పుడైనా రిలేషన్షిప్లో ఉన్నానని ఒప్పుకున్నానా? క్లియర్‌గా చెబుతున్నాను.. నేనిలా ఆలోచించడానికి ఎవరూ కారణం కాదు. ఎవర్నీ నిందించదలచుకోలేదు. మీరు హ్యాపీగా ఉన్నారని అర్థం అవుతోంది. మీ డెసిషన్‌తో మీ అమ్మానాన్న కూడా హ్యాపీనా? ఇక వాళ్లకు ఆప్షన్ లేదు. నన్ను ఫోర్స్ చేయరు. వాళ్లకేం కావాలి? వాళ్ళ అమ్మాయి నవ్వుతూ, ఆనందంగా ఉండాలి. పని చేసుకుని, నవ్వుకుంటూ ఇంటికి వస్తుందా? లేదా అన్నది వాళ్లకు ముఖ్యం. నేను హ్యాపీగా ఉన్నాను. మా నాన్నగారు మా అమ్మతో ‘ఇదిగాని పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో డైవర్స్ అయిపోతుంది’ అంటూంటారు. మీ ప్లాన్స్ ఏంటి? ప్రస్తుతం ప్రొడక్షన్ చూస్తున్నారు.. డైరెక్షన్ వైపు కూడా వెళతారా? ఆ ప్లాన్స్ లేవు. నా ఊపిరి ఉన్నంతవరకూ సినిమాల్లోనే ఉండాలి. ఈ పూరీ కనెక్ట్స్ కంపెనీని చాలా పెద్దది చేయాలి. పూరీగారితో మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. ఆకాశ్ పూరి గురించి? తన యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆకాశ్ ఈజ్ సూపర్. ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ‘మెహబూబా’ చేశాడని చెప్పడం లేదు. తను బయట సినిమాలు చేసినా కూడా నేను ఇదే చెబుతాను. చిన్నప్పటి నుంచి తనలో తపన ఉంది. పెద్ద హీరో అవ్వాలనే కసి ఉంది. ఆకాశ్ది మంచి పెంపకం. తన బిహేవియర్ చాలా బాగుంటుంది. ఇతరులకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం, తను యాక్ట్ చేసే వి«ధానం సూపర్. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. ఒక ప్రొడ్యూసర్‌గా పూరీగారి డైరెక్షన్ గురించి? నేనెవర్ని ఆయన గురించి చెప్పడానికి. హీ ఈజ్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ‘మెహబూబా’ ఆన్ లొకేషన్లో ఏదైనా సీన్ చూసినా, డబ్బింగ్లో ఏదైనా సీన్ చూసినా నేను ఆడియన్‌లాగా చూస్తాను. నేను నిర్మాత.. ఆయన డైరెక్టర్.. అలా ఏమీ ఉండదు. ఆయన బాస్. పూరీగారితో పని చేయడమే నేను గొప్ప అనుకుంటున్నాను. నాకు పనిలో ఇంత రెస్పెక్ట్ ఇవ్వడమే గొప్ప. ‘హీ ఈజ్ పూరి జగన్నాథ్’. బయట చాలామంది పూరీగారితో పని చేయాలని కోరుకుంటారు. నాకా అవకాశం దక్కింది. మీ కెరీర్‌ని ఎనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది? నా కెరీర్లో బెస్ట్ ఫేజ్ అంటే ఇదే. ఎందుకలా? కారణం? హీరోయిన్గా ఉన్నప్పుడు కష్టమైనా ఉదయాన్నే నిద్ర లేవాలి. వర్కవుట్స్ చేయాలి. ఫుడ్ విషయంలో కంట్రోల్‌గా ఉండాలి. ఇప్పుడీ కష్టాలు లేవు. లేటుగా నిద్ర లేవాలనిపిస్తే అలానే చేస్తాను. వర్క్ చేయాలనే మూడ్ లేకపొతే చేయను. యాక్ట్ చేసినప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీదే దృష్టి పెట్టాను. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. ఫిల్మ్ ప్రొడక్షన్ ఈజీ కాదు. సినిమా తీయడం, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, దాన్ని పబ్లిసిటీ చేసి, సినిమా రిలీజ్ చేయడం.. ఇవన్నీ పెద్ద టాస్క్. ‘మెహబూబా’ సినిమా ద్వారా ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. ఇదివరకు సంవత్సరానికి ఆరు సినిమాలు చేశాను కానీ ఆ ఫుల్ఫిల్మెంట్ అప్పుడు లేదు. ఇప్పుడు ‘మెహబూబా’ ట్రైలర్ బావుంది, సినిమా రిలీజ్ ఎప్పుడు అని అందరూ అడుగుతుంటే చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్ ఇన్ హ్యాపీ స్పేస్. ఫిల్మ్ ప్రొడక్షన్ చూసుకుంటూ హ్యాపీ స్పేస్‌లో ఉన్న మీరు హీరోయిన్గా చేసినప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ లాంటి వాటితో ఇబ్బందులు పడ్డారా? నిజం చెప్పాలంటే నేను బ్లెస్డ్. నా పేరెంట్స్ ఎప్పుడూ నాతోనే ఉన్నారు. 13 ఏళ్లకే యాక్టింగ్ స్టార్ట్ చేశాను. 15కి స్టార్ అయిపోయాను. స్టార్ అయ్యాక నా డెసిషన్స్ అన్నీ మా నాన్నగారే తీసుకునేవారు. నా ప్రతి బర్త్‌డేని యూనిట్ సభ్యుల మధ్య లొకేషన్లో జరుపుకున్నాను. కేక్ కట్ చేసి మళ్లీ షాట్‌కి వెళ్లిపోయేదాన్ని. హ్యాపీగా గడిచింది. అంతా దేవుడి దయ. -
ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా తీసిన సినిమా మెహబూబా
‘‘నేను రోజూ పొద్దున నిద్ర లేవగానే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ చెప్పి, ‘ఒక వేషం ఇవ్వండి’ అని అడిగేవాడు ఆకాశ్. వాడి టార్చర్ తట్టుకోలేక ‘చిరుత’లో ఒక వేషం ఇచ్చాను. ఓసారి ‘నువ్వు హీరో అవ్వడానికి ఇంకో పదేళ్లు పడుతుంది. ఆ టైమ్‌కు నాకు కెపాసిటీ ఉంటుందో, డబ్బులు ఉంటాయో లేదో తెలీదు. నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో’ అని చెప్పా. అప్పటినుంచి ఇంటికి ఏ డైరెక్టర్ వచ్చినా చాన్స్ కోసం కాళ్లు పట్టేసుకునేవాడు. టైమ్ బావుండి నేనే సినిమా తీశా’’ అని అన్నారు పూరి జగన్నాథ్. ఆకాశ్ పూరి, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘మెహబూబా’ మే 11న రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘నేను 35 సినిమాలు చేసినా ఫస్ట్ టైమ్ జెన్యూన్‌గా ఒక సినిమా చేశాను అనే ఫీల్ వచ్చింది. హీరో ఆకాశ్ గురించి చెప్పాలి. వీడు నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేవాడు (నవ్వుతూ). ‘దిల్’ రాజుగారు సినిమా చూసి రెండు విషయాలు చెప్పారు. ఒకటి.. నువ్వు మనసు పెట్టి చేస్తే ఇలా ఉంటుంది. రెండు.. నీ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతాతో నాకిది మూడో సినిమా. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు. తమ్ముడు భాస్కరభట్ల ‘మెహబూబా’ మీద పగబట్టి పాటలు రాశాడు. అందరూ మనసుపెట్టి సినిమా చేశారు. చార్మి ప్రొడక్షన్ బాగా చేసింది. మగాళ్ల కంటే ఎక్కువగా పనిచేస్తుంది చార్మి. అందుకే నాకు ఇష్టం. నేహా చాలా బాగా చేసింది. నాకు యాభై ఏళ్లు దాటాయి. నెక్ట్స్ టెన్ ఇయర్స్‌లో ఆకాశ్ కంటే ఎక్కువ సినిమాలు, మంచి సినిమాలు నేను చేస్తాను. ఇది నా ఛాలెంజ్’’ అన్నారు. ‘‘పూరీగారితో నాకిది 25వ సినిమా. ఇంతవరకూ రాసిన సినిమాలు ఒక ఎల్తైతే. ఈ సినిమా మరో ఎత్తు. చాలా ఇష్టంతో రాశాను. ఈ సినిమా కోసం చాలా పాటలు వదిలేశాను. అయినా రిగ్రెట్ లేదు. గొప్ప సినిమా కోసం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు వెచ్చించినా నష్టం లేదని నా ఉద్దేశం’’ అన్నారు భాస్కరభట్ల. ‘‘సందీప్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్‌బోన్. షూటింగ్ స్టార్ట్ చేయడమే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో స్టార్ట్ చేశాం. మా నాన్న ఇంత మంచి కథను ఏ స్టార్ హీరోతో అయినా తీయొచ్చు కానీ నాతో చేశారు. ఇది డెఫినెట్‌గా మా నాన్నకు కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఈ కమ్‌బ్యాక్ ఏ స్టార్‌తో ఇవ్వట్లేదు. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని, ఏమాత్రం ఫ్యాన్ బేస్ లేని ఒక 22 ఏళ్ల కుర్రాడితో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. ‘ఆకాశ్ చాలా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నాడు’ అని అంటున్నారు. అవును కాన్ఫిడెన్సే. మా నాన్న మీద ఉన్న కాన్ఫిడెన్స్’’ అన్నారు ఆకాశ్. ‘‘ట్రైలర్‌కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. మేం చాలా కష్టమైన క్లైమెటిక్ కండీషన్లో షూట్ చేశాం. ఫాదర్, సన్ కాంబినేషన్ గురించి అందరూ అడుగుతున్నారు. సెట్లో పూరీగారు ఎంత కూల్‌గా ఉంటారో అందరికీ తెలుసు. అంతకన్నా ఎక్కువ కూల్ ఆకాశ్’’ అన్నారు చార్మి. -
‘మెహబూబా’ ప్రెస్‌మీట్
-
పూరి కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ మెహబూబా
‘‘పూరి జగన్నాథ్ ఎక్స్ట్రార్డినరీ డైరెక్టర్. టాప్ సార్ట్స్ అందరితో సినిమాలు చేసి సక్సెస్ కొట్టారు. అద్భుతమైన కథ రాస్తే ఆయన అత్యద్భుతంగా సినిమా తీస్తారు. ‘మెహబూబా’ సినిమా చూశాను. బయటకు వచ్చాక తెలిసినవారికి, తెలియనివారికి సినిమా బాగుందని చెప్తున్నాను’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మెహబూబా’. నేహా శెట్టి కథానాయిక. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత ‘దిల్’ రాజు మే 11న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఎలా ఉంటుందో అనుకుంటూ ‘మోహబూబా’ చూశాను. ఎందుకంటే ఆడియన్స్‌లో నా జడ్జ్‌మెంట్‌పై మంచి అభిప్రాయం ఉంది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను పూరి సూపర్‌గా తీశారు. పూరి జగన్నాథ్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఆకాశ్, నేహా బాగా నటించారు’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమా చేశాం. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి బాగుంది అనగానే మా కాన్ఫిడెన్స్ టెన్ టైమ్స్ రెట్టింపు అయ్యింది. అందరూ ‘మీ నాన్న నిన్ను లాంచ్ చేస్తున్నారు. వెరీ లక్కీ’ అంటున్నారు. కానీ ‘మెహబూబా’ లాంటి సినిమాతో మా నాన్నని నేను లాంచ్ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఆడియన్స్‌కు సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆకాష్ పూరి. ‘‘పూరి చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాస్తారు. సినిమా బాగా వచ్చింది. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి, పూరీని హగ్ చేసుకుని ‘ఇదీ పూరి సినిమా అంటే.. ఇదీ పూరి సినిమా అంటే’’ అన్నారు. ఆయన జడ్జ్మెంట్ కరెక్ట్‌గా ఉంటుంది’’ అన్నారు ఛార్మి. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ తదితరులు పాల్గొన్నారు. -
మొహబ్బత్ జిందాబాద్
‘‘మొహబ్బత్ జిందాబాద్.. మేరీ మెహబూబా జిందాబాద్’’ అంటున్నారు ఆకాశ్ పూరి. తనయుడు ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’. ఇండియా– పాకిస్థాన్ బోర్డర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘శత్రువు గేట్ దగ్గరకు వచ్చినంత వరకూ సైనికుడిని ఎవ్వరూ ప్రేమించరు.. మమ్మల్ని (ప్రేమికుల్ని) విడదీస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం’’ వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాత ‘దిల్’ రాజు ఈ సినిమాని మే 11న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, కెమెరా: విష్ణు శర్మ. -
మెహబూబా.. ప్రేమ కోసం సరిహద్దులో పోరాటం
పైసా వసూల్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం మెహబూబా. పూరీ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ‘నో వన్ లవ్స్ ఏ సోల్జర్.. అన్ టిల్ ది ఎనిమీ ఎట్ ది గేట్’ అంటూ ఇంగ్లీష్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సరిహద్దులో ప్రేమ కోసం రవి అనే యువ సైనికుడు చేసే పోరాటం.. అవతలి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన.. ఇలాంటి అంశాలను చూపించేశారు. దేశాన్ని ప్రేమించే మనసు ఓ సైనికుడికి మాత్రమే ఉంటుంది. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలూ.. అసలీ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది.. అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మమల్ని చంపేస్తే మళ్లీ పుడతాం, మళ్లీ మళ్లీ పుడతాం.. చివర్లో సల్మాన్, షారూఖ్, అమీర్, అబ్దుల్ కలాం, మేరీ మెహబూబా... జిందాబాద్ అంటూ ఆకాశ్ చెప్పిన డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. రవి అనే సైనికుడి పాత్రలో ఆకాశ్.. మెహబూబా పాత్రలో నేహా శెట్టి.. వారి మధ్య ప్రణయ గాథగా మెహబూబా చిత్రం తెరెక్కింది. సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. యాక్షన్ పార్ట్ కూడా ఓకే అయినప్పటికీ... యుద్ధ సన్నివేశాల కోసం వాడిన గ్రాఫిక్స్ ట్రైలర్లో కాస్త నాసిరకంగా అనిపిస్తున్నాయి. మొత్తానికి ఓ టిపికల్ సబ్జెక్ట్‌కు తన స్టైల్ టేకింగ్‌తో పూరీ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమౌతోంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై పూరీ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్న మెహబూబా మే 11న విడుదల కానుంది. -
మెహబూబా ట్రైలర్ వచ్చేసింది..
-
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మెహబూబా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా మెహబూబా. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన తన తనయుడు ఆకాష్‌ను ఈసినిమాతో రీలాంచ్ చేస్తున్నాడు పూరి. భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్, ప్యాచ్ వర్క్‌తో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని హీరోయిన్ ఛార్మీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ‘విజయవంతంగా మెహబూబా షూటింగ్ మొత్తం పూర్తి చేశాము. ఆనందంగా, సంతృప్తిగా ఇంటికి తిరిగి వెలుతున్నాం. ఈ పోరాటంలో మాతో కలిసి ప్రయాణించిన అందరికీ కృతజ్ఞతలు’ అంటూ యూనిట్ సభ్యులతో దిగిన ఫోటోలను ట్వీట్ చేసింది ఛార్మీ. Successfully completed the total shoot of #Mehbooba.. feeling light n going back home happy n satisfied.. thanks to each n everyone who fought this journey along with us 🙏🏻🤗 #PCfilm @PuriConnects @PuriConnects @ActorAkashPuri @Neha__Shetty @ActorVishuReddy @TheFilmMehbooba pic.twitter.com/oSk6NMJxaI — CHARMME KAUR (@Charmmeofficial) 23 February 2018 -
‘నా లిస్ట్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా’
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా టెంపర్. తొలిసారిగా ఎన్టీఆర్‌ను నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలో చూపించిన పూరి ఘనవిజయం సాధించాడు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టెంపర్ సక్సెస్ పూరికి కొత్త ఉత్తేజాన్ని అందించింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘టెంపర్.. నా సినిమాల జాబితాలో గర్వంగా చెప్పుకునే సినిమా. నటుడిగా తారఖ్ నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాడు. కథ అందించిన వక్కంతం వంశీకి, ఘనవిజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు పూరి. ప్రస్తుతం పూరి తన తనయుడు ఆకాష్‌ను హీరోగా రీ లాంచ్ చేస్తూ మోహబూబా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమా భారత్ పాక్‌ల యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. Yessssssss ! #Temper is a proud film in my list , as an actor @tarak9999 gives me immense high .. thanks to #VakantamVamsi n all the fans 👍🏼#3YearsOfTemper .. love u all — PURI JAGAN (@purijagan) 13 February 2018 -
‘పూరి కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది’
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా పెట్టి ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్ శుక్రవారం విడుదలైంది. దీనిపై విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘వావ్.. మెహబూబా మూవీ పూరి జగన్నాథ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంలా ఉంది. ఈ సినిమా తీసిన విధానం చూస్తుంటే మహాకావ్యం (ఎపిక్ లవ్‌స్టోరీ)లా నిలిచే అవకాశముంద’ని వర్మ ట్వీట్ చేశారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాశ్ సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
-
పూరీ ‘మెహబూబా’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరెకెక్కిస్తున్న ‘మెహబూబా’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను శుక్రవారం విడుదలచేశారు. పాక్-భారత్ సరిహద్దులో ఆకాశ్ సైనికాధికారిగా నేహాశెట్టి చేయి పట్టుకుని యుద్ధం చేసుకుంటూ పరిగెత్తడం అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ ‘మెహబూబా..’ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సాగుతుంది. 1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సందీప్ చౌతా సంగీతం అందించారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ విలన్ గా నటించారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. పూరి జగన్నాథ్ కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
మెగా హీరోతో పూరి నెక్ట్స్..?
కొంత కాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రస్తుతం ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తనయుడు ఆకాష్ ను హీరోగా రీ లాంచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమా విషయంలో పూరి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ సినిమా తరువాత పూరి ఓ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. చిరుత సినిమాతో తను హీరోగా పరిచయం చేసిన మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తో పూరి ఓ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను సీనియర్ నిర్మాత కేయస్ రామారావు నిర్మించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాతో పాటు, బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు చరణ్. ఈ రెండు సినిమాల తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇంత బిజీ షెడ్యూల్లో చరణ్, పూరితో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.