
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. అదే సమయంలో రెండు మనసులు కలిశాయి. ప్రేమను గెలిపించుకోవడానికి ఆ మనసులు ఆరాటపడతాయి. స్టోరీలైన్ ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ పాయింట్‌ను బేస్ చేసుకొని తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు.
1971లో జరిగిన ఇండో–పాక్ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం టైటిల్ ‘మెహబూబా’. ‘‘ఆకాష్ పూరి నా కుమారుడు కాబట్టి మమకారంతో ఈ సినిమా తీయడంలేదు. సినిమా పట్ల తనకున్న ప్రేమ, తపన చూసి చేస్తున్నా. మంగళూరు బ్యూటీ నెహా శెట్టి హీరోయిన్. సందీప్ చౌతా సంగీత దర్శకుడు.
ఇంతకుముందు నేను ట్రై చేయని హైలీ ఇంటెన్స్ అండ్ సోల్‌ఫుల్ లవ్‌స్టోరి ఇది. అక్టోబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. హిమాచల్‌ప్రదేశ్‌లో షూట్ చేసిన తర్వాత పంజాబ్, రాజస్థాన్‌లో షెడ్యూల్స్ ప్లాన్ చేశాం’’ అని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. గురువారం పూరి బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలు తెలిపారు.