మొహబ్బత్‌ జిందాబాద్‌ | Puri Jagannadh Mehbooba Movie Trailer Out starring Puri Akash and Neha Shetty | Sakshi
Sakshi News home page

మొహబ్బత్‌ జిందాబాద్‌

Published Tue, Apr 10 2018 1:30 AM | Last Updated on Tue, Apr 10 2018 1:30 AM

Puri Jagannadh Mehbooba Movie Trailer Out starring Puri Akash and Neha Shetty - Sakshi

ఆకాశ్‌ పూరి

‘‘మొహబ్బత్‌ జిందాబాద్‌.. మేరీ మెహబూబా జిందాబాద్‌’’ అంటున్నారు ఆకాశ్‌ పూరి. తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మెహబూబా’. ఇండియా– పాకిస్థాన్‌ బోర్డర్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం రిలీజ్‌ చేశారు.

‘‘శత్రువు గేట్‌ దగ్గరకు వచ్చినంత వరకూ సైనికుడిని ఎవ్వరూ ప్రేమించరు.. మమ్మల్ని (ప్రేమికుల్ని) విడదీస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం’’  వంటి డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాత ‘దిల్‌’ రాజు ఈ సినిమాని మే 11న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, కెమెరా: విష్ణు శర్మ.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement