నేహాశెట్టి, ఆకాశ్ పూరి, ‘దిల్’ రాజు, ఛార్మి
‘‘పూరి జగన్నాథ్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. టాప్ సార్ట్స్ అందరితో సినిమాలు చేసి సక్సెస్ కొట్టారు. అద్భుతమైన కథ రాస్తే ఆయన అత్యద్భుతంగా సినిమా తీస్తారు. ‘మెహబూబా’ సినిమా చూశాను. బయటకు వచ్చాక తెలిసినవారికి, తెలియనివారికి సినిమా బాగుందని చెప్తున్నాను’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మెహబూబా’. నేహా శెట్టి కథానాయిక. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత ‘దిల్’ రాజు మే 11న రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఎలా ఉంటుందో అనుకుంటూ ‘మోహబూబా’ చూశాను. ఎందుకంటే ఆడియన్స్‌లో నా జడ్జ్‌మెంట్‌పై మంచి అభిప్రాయం ఉంది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సినిమాను పూరి సూపర్‌గా తీశారు. పూరి జగన్నాథ్ కెరీర్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఆకాశ్, నేహా బాగా నటించారు’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘చాలా కాన్ఫిడెన్స్‌గా సినిమా చేశాం. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి బాగుంది అనగానే మా కాన్ఫిడెన్స్ టెన్ టైమ్స్ రెట్టింపు అయ్యింది.
అందరూ ‘మీ నాన్న నిన్ను లాంచ్ చేస్తున్నారు. వెరీ లక్కీ’ అంటున్నారు. కానీ ‘మెహబూబా’ లాంటి సినిమాతో మా నాన్నని నేను లాంచ్ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఆడియన్స్‌కు సినిమా నచ్చుతుంది’’ అన్నారు ఆకాష్ పూరి. ‘‘పూరి చాలా క్లారిటీగా స్క్రిప్ట్ రాస్తారు. సినిమా బాగా వచ్చింది. ‘దిల్’ రాజుగారు సినిమా చూసి, పూరీని హగ్ చేసుకుని ‘ఇదీ పూరి సినిమా అంటే.. ఇదీ పూరి సినిమా అంటే’’ అన్నారు. ఆయన జడ్జ్‌మెంట్ కరెక్ట్‌గా ఉంటుంది’’ అన్నారు ఛార్మి. ఈ కార్యక్రమంలో కెమెరామేన్ విష్ణుశర్మ, ఆర్ట్ డైరెక్టర్ జానీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment