
పైసా వసూల్ సినిమాతో మరోసారి నిరాశపరిచిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ రోజు (28-09-2017) పూరి పుట్టిన రోజు సందర్భంగా తన నెక్ట్స్ సినిమా టైటిల్ లోగోనూ రిలీజ్ చేశాడు పూరి.
ఇంటెన్స్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మెహబూబా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971లో ఇండియా పాకిస్థాన్ ల మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సాగనుంది. సూపర్, బుజ్జిగాడు సినిమాల తరువాత మరోసారి పూరి సినిమాకు సందీప్ చౌతా సంగీతమందిస్తున్నాడు. మంగళూరు మోడల్ నేహా శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. హిమాచల్, పంజాబ్, రాజస్థాన్ లలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.
#Mehbooba ❤ @ActorAkashPuri @Neha__Shetty @Sandeep_Chowta @PuriConnects @Charmmeofficial @TheFilmMehbooba pic.twitter.com/7MOo6EMYwf
— PURI JAGAN (@purijagan) 28 September 2017