'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం' | PDP core group authorises Mehbooba to decide on govt formation | Sakshi
Sakshi News home page

'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం'

Published Sun, Jan 17 2016 8:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం' - Sakshi

'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం'

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. అదేవిధంగా గతంలో కొనసాగినట్టే బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి మహమ్మద్ సయీద్‌ సంకీర్ణ ప్రభుత్వ అజెండాను పవిత్ర పత్రంగా భావించారని, అదేవిధంగా కొనసాగాలని ఇప్పుడు పార్టీ కూడా భావిస్తున్నదని పీడీపీ నేత నయీం అఖ్తర్‌ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి డెడ్‌లైన్‌ విధించుకోలేదని ఆయన విలేకరులకు చెప్పారు.

మరోవైపు బీజేపీ కూడా పీడీపీతో తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉంటే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement