PDP
-
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్‌కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
నా ఓటమికి ఎన్నో కారణాలు: ఇల్తిజా ముఫ్తీ
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆమె దక్షిణ కశీ్మర్లోని బిజ్బెహరా స్థానం నుంచి పోటీచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ వీరీ చేతిలో పరాజయం చవిచూశారు. తన ఓటమిపై ఇల్తిజా ముఫ్తీ మంగళవారం స్పందించారు. బీజేపీతో గతంలో పీడీపీ పొత్తు పెట్టుకోవడం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. తన పరాజయానికి బీజేపీతో అప్పటి స్నేహం కారణం కాదని స్పష్టంచేశారు. తాను ఆశించిన ఫలితం రాలేదని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలు చాలామంది పీడీపీకి దూరమయ్యారని, దీనివల్ల పార్టీ కొంత బలహీన పడిందని అంగీకరించారు. బిజ్బెహరా నుంచి గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ రిస్క్ చేశానని ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. రిస్క్ చేసినప్పటికీ తగిన ఫలితం రాలేదన్నారు. సురక్షితమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే గొప్పేం ఉంటుందని ప్రశ్నించారు. పరాజయం ఎదురైనా కుంగిపోనని, పోరాటం సాగిస్తూనే ఉంటానని తేలి్చచెప్పారు. ఐదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. -
జమ్ము కశ్మీర్: ‘ఆమె మద్దతిస్తే.. తీసుకుంటాం’
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూఖ్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకున్నా పీడీపీ మద్దతు ఇస్తానంటే తాము అంగీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి మద్దతు ఇచ్చేందుకు మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై సోమవారం ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘జమ్ము కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం లేకపోయినా మద్దతు ఇస్తానంటే తీసుకుంటాం. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు మనమందరం కృషి చేయాలి. జమ్ము కశ్మీర్ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. అయితే ఎన్నికల తర్వాత పొత్తుపై నేను మెహబూబా ముఫ్తీతో మాట్లాడలేదు. నేను ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.#WATCH | Srinagar: JKNC chief Farooq Abdullah says, "Even if we don't need it, we will take the support (from PDP) because if we have to go ahead, we have to do it together. We all have to make an effort to save this state. This state is in a lot of difficulties..." pic.twitter.com/apwy9ZSry1— ANI (@ANI) October 7, 2024 ..మేమందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తాం. అయితే ప్రస్తుతానికి నేను ముఫ్తీతో మాట్లాడలేదు. ఆమె మద్దతు ఇస్తానన్న విషయాన్ని పేపర్లలో మాత్రమే చదివాను. ఎగ్జిట్ పోల్స్ గురించి నేను ఉత్సాహంగా లేను. ఎందుకంటే అవి సరైనవి కావోచ్చు. తప్పు కూడా కావచ్చు. ఓట్ల లెక్కింపు తర్వాత అసలు నిజం వెల్లడి అవుతుంది. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. మా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’ -
ఆ మూడు కుటుంబాల పాలన అంతమే ఈ ఎన్నికలు: అమిత్ షా
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఎన్నికలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అనే మూడు కుటుంబాల పాలనను అంతం చేయబోతున్నాయని పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలే ఎన్నోఏళ్లుగా జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే, జమ్మూకశ్మీర్‌లో ఎప్పటికీ పంచాయతీ లేదా బ్లాక్ స్థాయి ఎన్నికలు జరిగేవి కావని అన్నారు.ఈ మేరకు జమ్ముకశ్మీర్‌లోని మెంధార్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో శనివారం కేంద్రమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూలో మూడు కుటుంబాలు (గాంధీ, ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా)హింసను ప్రేరేపించాయని, కాబట్టి ఆ మూడు పార్టీల (కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ) వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.‘1947 నుంచి పాకిస్థాన్‌తో జరిగిన ప్రతి యుద్ధంలోనూ జమ్ము సైనికులు భారత్‌కు రక్షణగా నిలిచారు. సరిహద్దుల్లో దైర్యసాహాలు ప్రదర్శించి బుల్లెట్లను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యువతకు రాళ్లు, తుపాకులు బదులు పెన్నులు, ల్యాప్‌టాప్‌లు ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో మరిన్ని బంకర్లను ఏర్పాటు చేస్తాం.जम्मू-कश्मीर के मेंढर की जनसभा में लोगों का उत्साह बता रहा है कि यहाँ भाजपा की जीत सुनिश्चित है। https://t.co/7gGuXRtocV— Amit Shah (@AmitShah) September 21, 2024మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీలు, వెనుకబడిన తరగతులు, గుజ్జర్ బకర్వాల్లు, పహారీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఆ బిల్లును నేను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఫరూక్ అబ్దుల్లా పార్టీ దానిని వ్యతిరేకించి ఇక్కడి గుజ్జర్ సోదరులను రెచ్చగొట్టడం చేశారు. అప్పుడు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాను. గుజ్జర్-బకర్వాల్ సోదరుల రిజర్వేషన్లను తగ్గించకుండా కొండ ప్రాంత ప్రజలకు.. ఆ హామీని నెరవేర్చాం’అని పేర్కొన్నారు.जम्मू-कश्मीर का ये चुनाव, यहाँ तीन परिवारों का शासन समाप्त करने वाला चुनाव है। अब्दुल्ला परिवार, मुफ्ती परिवार और नेहरू-गांधी परिवार... इन तीनों परिवारों ने यहां जम्हूरियत को रोक कर रखा था। अगर 2014 में मोदी सरकार न आती तो पंचायत, ब्लॉक, जिले के चुनाव नहीं होते: श्री @AmitShah…— Office of Amit Shah (@AmitShahOffice) September 21, 2024 కాగా జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 18న తొలివిడత పోలింగ్ నిర్వహించగా.. రెండో దశ సెప్టెంబరు 25న, చివరిదశ అక్టోబర్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 8న వెల్లడి కానున్నాయి. -
నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్లో ఉన్నా. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.చదవండి: ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్! -
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
J&K: అసెంబ్లీ ఎన్నికల ముందు.. పీడీపీ పార్టీకి కీలక నేత రాజీనామా
జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ సీఎం మెహబూబాఫ్తీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె నేతృత్వంలోని జమ్మకశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను పీడీపీ నుంచి వైదొలిగినట్లు సుహైల్ బుఖారీ వెల్లడించారు. అందుకు గల కారణాలను ఆయన వివరించలేదు.అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సుహైల్ బుఖారీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగూరా-క్రీరీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశించారు, అయితే గత నెలలో మాజీ మంత్రి బషారత్ బుఖారీ తిరిగి పీడీపీలోకి రావడంతో ఆయనకు వాగూరా-క్రిరీ టికెటు ఇచ్చే వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సుహైల్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.జర్నలిస్టు అయిన సుహైల్ బుఖారీ.. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఆయన సన్నిహితుడు. ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు సలహాదారుగా కూడా పనిచేశారు. -
అనంత్‌నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
జమ్మూ కశీ్మర్లో అనంత్‌నాగ్–రాజౌరీ స్థానంలో పోటీ ఈసారి ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మెహబూబా ముఫ్తీ బరిలో దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ పోలింగ్ మే 7న మూడో విడతలో జరగాల్సింది. బీజేపీ, ఇతర పారీ్టల విజ్ఞప్తి మేరకు ఆరో విడతలో భాగంగా మే 25కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది... 2022 పునర్విభజనలో అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం కాస్తా అనంత్‌నాగ్–రాజౌరీగా మారింది. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ కశీ్మర్ లోయలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయి. లోయలోని 3 లోక్‌సభ స్థానాలూ 2014లో పీడీపీకే దక్కాయి. 2019లో వాటన్నింటినీ ఎన్సీ కైవసం చేసుకుంది. సిట్టింగ్ ఎంపీ హస్నాయిన్ మసూదీ కేవలం 6,676 ఓట్లతో గట్టెక్కారు. ఎన్సీ ఈసారి వ్యూహాత్మకంగా గుజ్జర్ బకర్వాల్ మత నాయకుడు, పార్టీ సీనియర్ నేత మియా అల్తాఫ్‌ను బరిలో దింపింది. ఆయనకు పూంచ్, రాజౌరిలో గట్టి మద్దతుంది. ఇది ఇతర పారీ్టల ఓట్లను చీల్చే అవకాశముంది. మోదీ ప్రభుత్వం ఫిబ్రవరిలో పహాడీ జాతి సమూహాలకు షెడ్యూల్డ్ తెగ హోదా ఇచ్చాక సమీకరణాలు మారాయి. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) నుంచి మహమ్మద్ సలీమ్ పారే, అప్నీ పార్టీ నుంచి జాఫర్ ఇక్బాల్ మన్హాస్ బరిలో ఉన్నారు. ఆరి్టకల్ 370 రద్దు నేపథ్యంలో బల్దేవ్ కుమార్ రూపంలో జమ్మూకశీ్మర్‌లో తొలిసారిగా ఓ స్థానికేతరుడు పోటీ చేస్తుండటం విశేషం. ఆయన స్వస్థలం పంజాబ్. లెక్కలు మార్చేసిన డీలిమిటేషన్! 2022కు ముందు జమ్మూలో రెండు (జమ్మూ, ఉధంపూర్), కశ్మీర్లో మూడు (శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్), లద్దాఖ్‌లో ఒక లోక్‌సభ స్థానముండేవి. డీలిమిటేషన్ తర్వాత జమ్మూలో రెండు స్థానాలు కొనసాగినా అక్కడి పూంచ్, రాజౌరి జిల్లాల్లో చాలా భాగాన్ని కశీ్మర్లోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానంతో కలిసి అనంత్‌నాగ్–రాజౌరీగా చేశారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో 18 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 18.3 లక్షల ఓటర్లున్నారు. 10.94 లక్షల మంది కశీ్మర్ ప్రాంతంలో, 7.35 లక్షల మంది జమ్మూలో ఉన్నారు. మెజారిటీ కశీ్మరీలు ముస్లింలు. జమ్మూలో 3 లక్షల మేర గుర్జర్లు, బేకర్వాల్ సామాజిక వర్గం ఉంది. మిగతా జనాభా పహాడీలు (హిందువులు, సిక్కులు ఇతరత్రా). వారిని ఎస్టీ జాబితాలోకి చేర్చడం వంటి చర్యల ద్వారా బీజేపీ నెమ్మదిగా లోయలో పాగా వేయజూస్తోంది. ఈసారి పోటీ చేయకున్నా వేరే పారీ్టలకు మద్దతిస్తోంది. బీజేపీ నేతలు తీవ్రంగా ప్రచారమూ చేస్తున్నారు. ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీలపై సభలు పెట్టి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు! ఆ మూడింటికి కాకుండా ఎవరికైనా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కశీ్మరీ పండిట్ ఒంటరి పోరు కశీ్మరీ పండిట్లు. 1980ల్లో పెచ్చరిల్లిన హింసాకాండకు తాళలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలసపోయిన ప్రజలు. ఏళ్ల కొద్దీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన దిలీప్ కుమార్ పండిత (54) ఈసారి అనంత్‌రాగ్–రాజౌరి నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు! ముఫ్తి, మియా అల్తాఫ్ అహ్మద్‌లకు గట్టి సవాల్ విసురుతున్నారు. పౌర చర్చల ద్వారా పండిట్లు, ముస్లింలతో పాటు కశ్మీరీలందరినీ ఏకం చేస్తానన్నది ఆయన హామీల్లో ప్రధానమైనది. నిజాయితీగా ఆయన చేస్తున్న ప్రయత్నం స్థానికులను ఆకర్షిస్తోంది. ప్రతి గడపకూ వెళ్లి ఓట్లడుగుతున్నారు. స్థానికులతో భేటీ అవుతున్నారు. ఐదు వలస శిబిరాల్లో ఉన్న 35,000 మంది పండిట్లను తనకే ఓటేయాలని కోరారు. ‘‘35 ఏళ్లుగా ఇంటికి దూరంగా బతుకుతున్నాం. మాకిప్పటికీ న్యాయం జరగలేదు. కశీ్మరీ పండిట్లకు న్యాయం కోసం, వారు లోయలోకి సురక్షితంగా తిరిగొచ్చే పరిస్థితులను నెలకొల్పడం కోసం పోరాడుతున్నాను’’ అని మీడియాకు తెలిపారు పండిత.బీజేపీ అడ్డుకుంటోంది: ముఫ్తీ తాము ప్రజలను కలవకుండా మోదీ సర్కారు అడ్డుకుంటోందని ముఫ్తీ ఆరోపిస్తున్నారు. ‘‘ఆరి్టకల్ 370 రద్దుతో వారు నెలకొల్పామంటున్న శాంతి నిజానికి శ్మశాన వైరాగ్యం. మాకది ఆమోదయోగ్యం కాదు. జమ్మూ కశ్మీర్ యంత్రాంగం దన్నుతో దక్షిణ కశీ్మర్లో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి’’ అని మండిపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీనగర్‌లో నువ్వా? నేనా? అంటున్న ఎన్సీ, పీడీపీ?
దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఈ నేపధ్యంలో శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం మే 13న ఆసక్తికర పోటీకి సిద్ధమైంది. మొత్తం 17,43,845 మంది ఓటర్లు.. బరిలో ఉన్న 24 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా రెండు లక్షల మంది ఓటు వేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగించి, కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించారు. ఈ ప్రకియ తరువాత ఇప్పుడు తొలిసారిగా ఇక్కడ ఎన్నికల పోరు జరుగుతోంది. కశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో విస్తరించి ఉన్న శ్రీనగర్ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 17,43,845 మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరిలో 8,73,426 మంది పురుషులు, 8,70,368 మంది మహిళలు కాగా, 51 మంది ట్రాన్స్జెండర్లు.భారత ఎన్నికల కమిషన్ అందించిన డేటా ప్రకారం శ్రీనగర్, గందర్బాల్, బుద్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొత్తం 2,135 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నుండి అఘా సయ్యద్ రుహుల్లా మెహదీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నుండి వహీద్-ఉర్-రెహ్మాన్ పర్రా ప్రధాన పోటీదారులుగా నిలిచారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్‌కు అమీర్ భట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంపై నేషనల్ కాన్ఫరెన్స్‌కు మంచి పట్టు ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 2014 మినహా 1977 నుండి 2019 వరకు నిరంతరం ఈ స్థానాన్ని గెలుచుకుంటూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఫరూక్ అబ్దుల్లా 1,06,596 ఓట్లతో విజయం సాధించారు. అయితే 2014లో పీడీపీ అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 1,57,923 ఓట్లతో గెలుపొందడంతో పరిస్థితి మారిపోయింది. కశ్మీర్‌లోని ఐదు స్థానాల్లో మూడింటిని ఎన్సీ కైవసం చేసుకుంది.జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో మూడు నేషనల్ కాన్ఫరెన్స్, రెండు బీజేపీ చేతిలో ఉన్నాయి. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నేషనల్ కాన్ఫరెన్స్‌కు బలమైన కోటగా ఉంది. పార్టీ 1947 నుండి 15 పార్లమెంటరీ ఎన్నికల్లో 12 సార్లు ఈ సీటును దక్కించుకుంది.శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అబ్దుల్లా కుటుంబ ఆధిపత్యం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. శ్రీనగర్ లోక్‌సభ స్థానాన్ని సున్నితమైన స్థానంగా పరిగణిస్తారు. గత 35 ఏళ్లలో వేర్పాటువాదం, హింసాయుత ఘటనల కారణంగా ఈ ప్రాంతంలో తక్కువ శాతం ఓటింగ్ జరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈసారి ఇక్కడి ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. -
జేకేలోనూ ‘ఇండియా’ కూటమికి ఎదురు దెబ్బ!
జమ్ముకశ్మీర్‌లో ‘ఇండియా’ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) తర్వాత ఇప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కూడా లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని సమాచారం. గతంలోనే ఎన్సీ తాము లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామన్నారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ మెహబూబ్ బేగ్, గులాం నబీ లోన్ హంజురా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎన్సీకి ప్రస్తుతమున్న సీట్లు మినహా మిగిలిన స్థానాల్లో పొత్తును గురించి పరిశీలిస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
జమ్మూలో 6..కశ్మీర్లో 1
న్యూఢిల్లీ: జమ్మూ ప్రాంతంలో అదనంగా ఆరు నియోజకవర్గాలు, కశ్మీర్ ప్రాంతంలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ప్రతిపాదించింది. ఎస్సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి. జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలపై నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ తదితర పార్టీలతోపాటు బీజేపీ మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ కూడా తీవ్ర నిరసన తెలిపాయి. ఈ సిఫారసులను బీజేపీ రాజకీయ ఎజెండాగా నేషనల్ కాన్ఫరెన్స్ అభివర్ణించింది. 2019 ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అసోసియేట్ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. సోమవారం జరిగిన కమిషన్ మొట్టమొదటి సమావేశానికి ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు. ఈ ప్రతిపాదనలపై ఆయా పార్టీలు డిసెంబర్ 31వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ.. గుప్కార్ డిక్లరేషన్‌లో భాగమైన ఐదు పార్టీల నేతలతో చర్చించాకే ఈ ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. ప్రతిపాదనలను అంగీకరించం ఈ ప్రతిపాదనలు నిరుత్సాహాన్ని కలిగిం చాయని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. ‘ప్రతిపాదనల కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన కమిషన్.. బీజేపీ రాజకీయ అజెండాను ముందుకు తీసుకురావడానికే మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. శాస్త్రీయ విధానాలకు బదులు రాజకీయ ఉద్దేశాలతోనే ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. 2011 జనగణన వివరాలను ఆధారంగా తీసుకోలేదు. వీటిని మేం అంగీకరించం’అని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై సంతకం పెట్టేది లేదని ఎన్సీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ప్రజలను మత, ప్రాంతాల వారీగా విభజించేందుకు, బీజేపీ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ దుయ్యబట్టారు. -
పీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో భారతీయులు ఎవరైనా భూములు కొనుగోలు చేసేలా పలు చట్టాలను సవరించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే పీడీపీ నేత బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూ చట్టాల్లో మార్పుల నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి భారతీయులు ఇక్కడ స్ధిరపడేందుకు వస్తే లైంగిక దాడులు పెరిగిపోతాయని పీడీపీ నేత, ఆ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీకి సన్నిహితులు సురీందర్ చౌధరి వ్యాఖ్యానించడం కలకలం రేపింది. జమ్ముకు ఘనమైన డోగ్రా సంస్కృతి వారసత్వం ఉందని, తాము దేశం కోసం విలువైన త్యాగాలు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. వారు (ఇతర ప్రాంతాల వారు) ఇక్కడికి రాగానే లైంగిక దాడుల వంటి నేరాలు అధికమవుతాయనే తాము చెప్పడం లేదని, తాము అస్సాం, మహారాష్ట్ర వాదననూ వినిపిస్తున్నామని..బయటి వారు ఇక్కడికి వస్తే తమ ఉద్యోగాలు పోతాయని చౌధరి పేర్కొన్నారు. ప్రస్తుతం జమ్ము ప్రాంతం ప్రశాంతంగా ఉందని, పలు గ్రామాల నుంచి మహిళలు చదువుకునేందుకు జమ్ముకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఫరీదాబాద్‌లో ఓ బాలికను కాల్చి చంపారు..హథ్రాస్‌లో ఏం జరిగిందో చూశామని వ్యాఖ్యానించారు. లైంగిక దాడుల కేసులు పెరుగుతున్నాయి...ఇవన్నీ జాతీయ మీడియాలో చూపుతున్నారని అన్నారు. కాగా, జమ్ము కశ్మీర్లో అభివృద్ధికి ద్వారాలు తెరిచేలా దేశంలో ఎవరైనా ఇక్కడ భూములు కొనుగోలు చేసేలా చట్ట సవరణలు చేపట్టడం స్వాగతించదగిన పరిణామమని బీజేపీ వ్యాఖ్యానించింది. చదవండి : ఇకపై కశ్మీర్లో భూములు కొనొచ్చు.. -
మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.త్రివర్ణ పతాకంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దేశభక్తి మనోభావాలను దెబ్బతీయంటూ సొంత పార్టీ నేతలే విమర్శించారు. ముఫ్తీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్టీని వీడుతున్నట్లు పీడీపీ నేతలు త్రిలోక్ సింగ్ బజ్వా, పుర్బ లెసిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్యే వేద్ మహాజన్, గుజ్జర్ నేత చౌదరి మహమ్మద్ హుస్సేన్ రాజీనామా చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలు క్షమించరానివని వ్యాఖ్యానిస్తూ ఇలాంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని లేఖలో పేర్కొన్నారు. ఇక గతేడాది ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా పలువురు రాజకీయ నాయకులను ప్రభుత్వం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. (గుప్కార్ అధ్యక్షుడిగా ఫరూక్ అబ్దుల్లా ఎన్నిక ) కాగా 14 నెలల నిర్బంధం తర్వాత శుక్రవారం జైలు నుంచి విడుదలైన ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ..జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగురవేసేందుకు అనుమతించినప్పుడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను దొంగలు అని అభివర్ణిస్తూ జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండాను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ సహా పలు పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. (తీవ్ర దుమారం రేపుతున్న ముఫ్తీ వ్యాఖ్యలు ) -
మెహబూబాతో పార్టీ నేతల మీటింగ్‌కు గవర్నర్ ఓకే
శ్రీనగర్: గృహనిర్బంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీని ఆ పార్టీ నేతలు సోమవారం కలవనున్నారు. 10 మంది నాయకులతో కూడిన పీడీపీ బృందం ముఫ్తీతో భేటీ అయ్యేందుకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి ఇచ్చారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్ట్ 4 నుంచి మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధంలో ఉన్నారు. అబ్దుల్లాను కలిసిన ఎన్సీ నేతలు రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పార్టీ నేతలను కలుసుకున్నారు. ఎన్సీ జమ్మూ అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా నేతృత్వంలో 15మంది సీనియర్ నాయకులు ఫరూక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ ఆయ్యారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితులపై చర్చించారు. -
సత్వర ఆచరణే కీలకం
జమ్మూ–కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హక్కులు, అధికారాలను రద్దు చేయాలని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించిన మూడురోజుల తర్వాత ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు సాగిన ఆ ప్రసంగంలో సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక యువతకు విద్య, ఉద్యోగావకాశాలు వగైరాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ విధాన నిర్ణయంపైన అయినా అనుకూల, ప్రతికూతలు వ్యక్తం కావడం సర్వసాధా రణం. ప్రస్తుత నిర్ణయం కశ్మీర్‌కి సంబంధించింది కనుక వాటి తీవ్రత అధికంగానే ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్లో వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న చర్యలపై అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయో, వారి స్పందనేమిటో తెలియడానికి మరికొంతకాలం పడుతుంది. పరి స్థితులన్నీ కుదుటపడి, ఇప్పుడు విధించిన ఆంక్షలన్నీ రద్దయ్యాక మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. జనం కదలికలపై ఆంక్షలు విధించాక గత అయిదురోజులుగా సాధారణ ప్రజానీకం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చానెళ్లలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆంక్షల్ని క్రమేపీ సడలిస్తామని ఈ ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు గనుక పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆశించాలి. వచ్చే సోమవారం బక్రీద్ పర్వదినం. ఈలోగానే అంతా చక్కబడితే సాధారణ ప్రజానీకం ఉత్సాహంగా పండుగ చేసుకోగలుగుతారు. దేశ విభజన నాటినుంచీ కశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్ అక్కడ ఏదో విధంగా చిచ్చు రేపాలని ప్రయత్నిస్తూనే ఉంది. 35 ఏళ్లక్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి తోడ్పడ్డాయి. ఇదే అదునుగా పాకిస్తాన్ తన కోరలు చాచడం మొదలుపెట్టింది. తదనంతరకాలంలో వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోగా పరిస్థితులు మరింత వికటించడానికి కారణమయ్యాయి. భద్రతాబలగాలపై దాడులు, నిరవధిక ఉద్యమాలు, ఆందోళనలు యధావిధిగా సాగుతూనే వచ్చాయి. అంతర్గతంగా కశ్మీర్లో అధికారం చలాయించడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నా అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని అవి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేసిన రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా అవి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని విస్తరింపజేసేందుకు పాకిస్తాన్‌కు తోడ్పడ్డాయ న్నది మోదీ అభియోగం. కనుక కేంద్రం ఈ సమస్య మూలాల్ని కొత్త కోణం నుంచి చూస్తున్నదని అర్ధమవుతుంది. ఈ రెండు అధికరణల తొలగింపుతో పరిస్థితులు చక్కబడి, అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశిస్తున్నారు. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డు రవాణా తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని ఆయన ఇచ్చిన హామీ అయినా... ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానమైనా ఆచరణలోకొస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఇటీవలికాలంలో సివిల్ సర్వీసులకు జమ్మూ–కశ్మీర్ నుంచి ఎంపికవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అక్కడివారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకునేందుకు ఇప్పుడు కల్పిస్తున్న అవకా శాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించడంలోనూ ఆ దృక్పథమే ఉండాలి. అలాంటి చర్యలు ఈ దేశంలో తామూ భాగమేనన్న విశ్వాసాన్ని వారికి కలిగిస్తాయి. కశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరికీ ఆందోళన కలిగి స్తూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి పార్టీల నేతలంతా ఈపాటికే ఈ సంగతి గ్రహించారు. మధ్యేవాద హుర్రియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలకే దిక్కుతోచని స్థితి ఏర్పడితే నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ వంటి పార్టీల గురించి చెప్పనవసరం లేదు. ఎన్సీ, పీడీపీలది స్వయంకృతం. అవి రెండూ గతంలో కేంద్రంతో తాము పోరాడుతున్నామని, రాష్ట్రానికి అవసరమైనవి సాధిస్తున్నామని చెప్పేం దుకు ప్రయత్నించేవి. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీలు కేంద్రంలో ఎవరుంటే వారితో పొత్తు కుదుర్చుకోవడానికి, రాజీ పడేందుకు సిద్ధపడ్డాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా హోరాహోరీ సంఘర్షించిన పీడీపీ, బీజేపీలు ఎన్నికలయ్యాక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చటం వీటన్నిటికీ పరాకాష్ట. ఇదే సమయంలో ఐఎస్ వంటి ఉగ్ర సంస్థల జాడలు నేరుగా కనబడకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితులైనవారు అనేకులు ఈమధ్యకాలంలో సాయుధ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని భావించింది. ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడమన్నది స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి జమ్మూ–కశ్మీర్ విషయంలోనే జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. కానీ జమ్మూ–కశ్మీర్ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతం. దాని సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ఉన్నాయి. కనుకనే ఆ తరహా చర్య సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న సందేహం కేంద్రా నికి కలిగి ఉండొచ్చు. అయితే తీసుకునే చర్య ఎలాంటిదైనా స్థానికులను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏదేమైనా జనానికి మేలు కలిగించే భిన్న చట్టాల అమలు, భారీ యెత్తున ఉద్యోగాల భర్తీ, మౌలికసదుపాయాల కల్పన, ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు, క్రీడల కోసం శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తామన్న మోదీ వాగ్దానాలు సాధ్యమైనంత త్వరగా ఆచరణరూపం దాలిస్తే నిజంగానే నయా కశ్మీర్‌కు ఆ చర్యలు దోహదపడతాయి. -
హఠాత్ నిర్ణయాలు!
కశ్మీర్‌కు భారీయెత్తున భద్రతా బలగాల తరలింపు, అక్కడ నిట్‌తోసహా విద్యా సంస్థలన్నిటికీ సెలవులు, అమర్నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలుపుదల, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ వగైరా నిర్ణ యాలతో నాలుగైదు రోజులుగా అందరిలోనూ ఉత్కంఠ రేపి, రకరకాల ఊహాగానాలకు తావిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం చకచకా పావులు కదిపింది. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అందుకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని ఆమోదాన్ని పొందింది. పర్యవసానంగా ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధికారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35ఏ అధికరణ కూడా రద్దవుతుంది. ... జమ్మూ–కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్ పునర్విభజన బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు చట్టమైతే జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా... లడఖ్ చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మారతాయి. ఈ బిల్లులు మంగళవారం లోక్‌సభ ముందుకొస్తాయి. జనసంఘ్‌గా ఉన్నప్పటినుంచీ బీజేపీకి 370, 35ఏ అధికరణల విషయంలో ఉన్న అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. తమకు సొంతంగా మెజా రిటీ లభిస్తే వాటిని రద్దు చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోల్లో ఆ పార్టీ హామీ ఇస్తూనే ఉంది. కానీ 2014 ఎన్నికల మేనిఫెస్టో ఆ అధికరణల రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది. ఎన్నికలయ్యాక 2015లో పీడీపీతో కలిసి జమ్మూ– కశ్మీర్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా స్వయంప్రతిపత్తి అంశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేసింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల మేని ఫెస్టోలో మాత్రం స్వరం మారింది. వీటిని రద్దు చేస్తామని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎవరితోనూ సంప్రదించలేదన్న విమర్శలకు జవాబుగా బీజేపీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోనే ఉదహరిస్తోంది. జమ్మూ–కశ్మీర్ పునర్విభజన బిల్లు అసాధారణమైనది. ఇంతవరకూ కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తినిచ్చిన సందర్భాలున్నాయి. కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించిన సందర్భాలున్నాయి. కానీ రాష్ట్ర హోదా గల ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడం ఇదే తొలిసారి. పరిస్థితులు కుదుటపడితే జమ్మూ– కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. అది ఎంతవరకూ సాధ్యమో మున్ముందు చూడాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రాల సంఖ్య 29కి పెరగ్గా, అది ఇప్పుడు మళ్లీ 28కి తగ్గింది. ఇతర సంస్థానాల విలీనానికీ, జమ్మూ–కశ్మీర్ విలీనానికీ మధ్య మౌలికంగా వ్యత్యా సాలున్నాయి. ఇతర సంస్థానాలు కొద్దికాలంలోనే దేశంలో విడదీయరాని భాగంగా మారాయి. కానీ జమ్మూ–కశ్మీర్‌కు అప్పుడు పాలకుడుగా ఉన్న హరిసింగ్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా రాజ్యాంగంలో మొదట 370 అధికరణ, ఆ తర్వాత 35 ఏ అధికరణ వచ్చిచేరాయి. విదేశీ వ్యవ హారాలు, రక్షణ, కమ్యూనికేషన్లు మినహా ఇతర అంశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప జమ్మూ–కశ్మీర్ ప్రాంతంలో కేంద్ర చట్టాలేవీ అమలుకాబోవని 370 అధికరణ చెబుతోంది. అయితే 35ఏ అధికరణ విషయంలో ఆదినుంచీ వివాదం ఉంది. ఇది 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో భాగమైంది. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించి చేర్చాల్సిన అధికరణను ఇలా దొడ్డిదోవన తీసుకురావడమేమిటని అప్ప ట్లోనే జనసంఘ్ నేతలు నిలదీశారు. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2015లో జమ్మూ–కశ్మీర్ హైకోర్టు తీర్పునిస్తూ 35ఏను సవరణగా కాక 370 అధికరణకు వివరణగా లేదా అనుబంధంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోఉంది. అయితే 370 అధికరణ స్వభావరీత్యా తాత్కాలికమైనదే నన్న పిటిషన్‌ను 2016లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అందులోని సబ్ క్లాజ్ 3లోనే అందుకు సంబంధించిన మెలిక ఉన్నదని తెలిపింది. రాష్ట్ర రాజ్యాంగ సభ సిఫార్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువరించినప్పుడు మాత్రమే 370 రద్దవుతుందని ఆ క్లాజు చెబుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారానే అది రద్దయింది. కానీ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్న ప్రస్తుత సమయంలో దాని సిఫార్సు లేకుండా తీసుకున్న ఈ చర్య చెల్లుతుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్ మొదటినుంచీ కల్లోలంగా ఉండటం, అది ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తుండటం వాస్తవం. 2014లో అక్కడ ఉగ్రవాద ఘటనలు 222 జరిగితే నిరుడు అది 614కు చేరుకుంది. అప్పట్లో ఉగ్రవాదం కారణంగా భద్రతా దళాలకు చెందినవారు 47మంది మరణిస్తే, నిరుడు ఆ సంఖ్య 91కి చేరుకుంది. మత ఛాందసవాదుల ఆధిపత్యం గతంతో పోలిస్తే పెరిగింది. ఇప్పుడు 370 రద్దును గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూడా పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణమే. తన సుదీర్ఘపాలనా కాలంలో అది జమ్మూ–కశ్మీర్లో శాంతి నెలకొనడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దానికితోడు ఇప్పటికే అక్కడున్న పాక్ అనుకూల ఉగ్రవాద ముఠాలకు తోడు ఇతర ఇస్లామిక్ దేశాల మిలిటెంట్ల జాడలు కూడా కనబడుతున్నాయి. ఈ దశలో నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే మున్ముందు పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన కేంద్రానికి ఉన్నట్టు కనబడుతోంది. తాజా నిర్ణయాల విషయంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివారిని సంప్రదిస్తే బాగుండేది. భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని వారు దృఢంగా విశ్వసిస్తున్నవారే. ఏదేమైనా జమ్మూ–కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సామరస్యం నెలకొనాలని, అది నిజమైన భూలోక స్వర్గంగా కాంతులీనాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. -
ఎంపీలను సభ నుంచి ఈడ్చేసిన మార్షల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ప్రకటించడంతో సభలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పెద్దల సభ గందరగోళంగా మారింది. అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ సభ్యులు నజీర్ అహ్మాద్, ఎంఎం ఫయాజ్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. సభలో పెద్ద ఎత్తున అరుస్తూ.. వీరంగ సృష్టించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారిని సభ నుంచి బయటకు పంపించాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో వారిద్దరిని ఈడ్చూకుంటూ సిబ్బంది సభ నుంచి బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎంపీ నజీర్ చొక్కా పూర్తిగా చినిగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ఆయన సభ నుంచి బయటకు వచ్చారు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌తో విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడుతోన్న విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో నేడు ఒక దుర్దినం అని.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉందని విమర్శించారు PDP's RS MPs Nazir Ahmad Laway&MM Fayaz protest in Parliament premises after resolution revoking Article 370 from J&K moved by HM in Rajya Sabha; The 2 PDP MPs were asked to go out of the House after they attempted to tear the constitution. MM Fayaz also tore his kurta in protest pic.twitter.com/BtalUZMNCo — ANI (@ANI) August 5, 2019 -
సభ నుంచి ఈడ్చేసిన మార్షల్స్
-
కథువా కేసు: ఆ చిన్నారికి న్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో చిన్నారి బాధితురాలికి న్యాయం చేకూరడం తనకు ఆనందం కలిగించిందని ఈ కేసు విచారణకు నేతృత్వం వహించిన జమ్మూకశ్మీర్ మాజీ పోలీసు అధికారి రమేశ్‌కుమార్ జల్లా తెలిపారు. ‘ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరగడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కథువా రేప్ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ.. పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కథువా అత్యాచార కేసు.. అప్పుడు అధికారంలో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో తమ బృందానికి ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఎదురుకాలేదని రమేశ్‌కుమార్ జల్లా మీడియాతో పేర్కొన్నారు. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన ఆయన గత నెలలో పదవీ విరమణ తీసుకున్నారు. ‘నేను ఇప్పుడు రిటైరయ్యాను. ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేను. నమ్మండి నేను చెప్పేది నిజం. ఏ వర్గం నుంచి మాకు ఒత్తిడి ఎదురుకాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, పీడీపీ ఇలా ఏ ఒక్కరి నుంచి మాకు ఒత్తిడి రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసుకు మతపరమైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారని, కానీ, అప్పటి మంత్రుల నుంచి కానీ, అధికార వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదని ఆయన వివరించారు. మీడియాలో విభిన్నమైన కథనాలు రావడం తమను ఒత్తిడికి గురిచేసిందని, అయినా దానిని తాము పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే అత్యాచారం చేసి.. హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
ఫారూఖ్‌కు గట్టి పరీక్ష
జమ్మూ, కశ్మీర్ రాజధాని నియోజకవర్గమైన శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు నాయకత్వం వహించే షేక్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు గతంలో ఏడుసార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా మరోసారి శ్రీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అబ్దుల్లాను పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 42 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన అబ్దుల్లా తన సమీప పీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్‌పై పది వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఉప ఎన్నికలో జనం స్వల్ప సంఖ్యలో (7 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫారూఖ్ అబ్దుల్లాతోపాటు ఆగా సయ్యద్ మొహిసిన్ (పీడీపీ), ఖాలిద్ జహంగీర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో ప్రస్తుత పీడీపీ అభ్యర్థి ఆగా మొహిసిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఈ నెల 18న పోలింగ్ జరిగే శ్రీనగర్ స్థానంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలకు చెందిన 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట ఫారూఖ్ అబ్దుల్లా తల్లి బేగం అక్బర్ జహాన్ ఒకసారి (1977), ఫారూఖ్ మూడుసార్లు (1980, 2009, 2017), ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మూడు సార్లు (1998, 99, 2004) శ్రీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో పరాజయం ఎరగని ఫారూఖ్ 2014లో నగరానికి చెందిన పీడీపీ అభ్యర్థి తారిఖ్ కర్రా చేతిలో ఓడిపోవడం సంచలనం అయింది. తర్వాత కర్రా పీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో ఫారూఖ్ విజయం సాధించారు. బీజేపీతో కలిసి కొన్నేళ్లు సంకీర్ణ సర్కారు నడిపిన తర్వాత విడిపోయిన కారణంగా పీడీపీకి జనాదరణ తగ్గిందని భావిస్తున్నారు. పీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ లేకపోవడం అబ్దుల్లాకు అనుకూలాంశమే. అయితే, గతంలో తీవ్రవాదిగా ఉండి ప్రజాతంత్ర పంథా ఎంచుకున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) నేత సజ్జద్ గనీ లోన్ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. కిందటేడాది చివర్లో జరిగిన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ బహిష్కరించడంతో పీసీ అభ్యర్థి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ తరఫున ఇర్ఫాన్ అన్సారీ ఇక్కడ పోటీలో ఉన్నారు. రాజకీయాలకు అన్సారీ కొత్తే అయినా ఫారూఖ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారనీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు పడే ఓట్లను ఆయన గణనీయంగా చీల్చుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. పీసీ అభ్యర్థి రంగంలోకి దిగడం వల్ల అబ్దుల్లా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు శ్రీనగర్ పరిధిలో తక్కువే ఉత్తర, దక్షిణ కశ్మీర్‌తో పోల్చితే ఈ నియోజకవర్గ పరిధిలో వేర్పాటువాద తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. కాని, పోలింగ్ బహిష్కరణకు ఇచ్చిన పిలుపు 2017 ఉప ఎన్నికలో పనిచేసింది. ఈసారి కూడా ఎంత శాతం జనం ఓటు హక్కు వినియోగించకుంటారో చెప్పడం కష్టం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూఖ్ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. శ్రీనగర్‌లో కాంగ్రెస్ పోటీ పెట్టలేదు. జమ్మూ, ఉధంపూర్‌లో కాంగ్రెస్‌కు నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 81 ఏళ్ల ఫారూఖ్ గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆయన పార్టీ నమ్ముతోంది. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు నడపడంతో పీడీపీ జనాదరణ కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం కూడా పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత గెలుపుపై అనుమానాలు అనవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. జమ్మూ కశ్మీర్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్‌లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన. జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్పాల్ మాలిక్‌ని జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు. తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్‌లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్ఎస్ఎస్ భావన. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్‌కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది. కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్‌షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. పైగా ఆర్ఎస్ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్‌మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం. బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్‌ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్‌లోని సవర్ణులతో కశ్మీర్గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్‌లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు. ఇప్పుడు కశ్మీర్‌కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కశ్మీర్లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు. -విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు -
జమ్మూకశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు
-
అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అనూహ్య నిర్ణయం
శ్రీనగర్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్‌లు ఒక్కటై, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్ మాలిక్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత సజ్జాద్ లోన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్‌కు 12, ఎన్సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్ కాన్ఫెరెన్స్‌కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. ‘ఇతరుల’ మద్దతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కాన్ఫెరెన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్ లోన్ గవర్నర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. బేరసారాలకు అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది. మరోవైపు, కాంగ్రెస్– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు. కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ కశ్మీర్లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మిషన్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
‘ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’
శ్రీనగర్ : గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను శ్రీనగర్‌లో ఉన్నందున గవర్నర్‌ను ప్రత్యక్షంగా కలవలేకపోతున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోట ఫ్యాక్స్ పనిచేయనందున ఈ మెయిల్ ద్వారా లేఖను పంపిస్తానని తెలిపారు. కాగా పీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఫ్తీ ముందుకొచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. Have been trying to send this letter to Rajbhavan. Strangely the fax is not received. Tried to contact HE Governor on phone. Not available. Hope you see it @jandkgovernor pic.twitter.com/wpsMx6HTa8 — Mehbooba Mufti (@MehboobaMufti) November 21, 2018 -
కశ్మీర్లో పోలీస్ ఇన్స్పెక్టర్ హత్య
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) కార్యకర్తను ఆదివారం కాల్చిచంపారు. జమ్మూకశ్మీర్ సీఐడీ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ మిర్(30) పూల్వామా జిల్లాలోని తన ఇంటికి వెళుతుండగా కాపుకాసిన ఉగ్రవాదులు ఆయన్ను మార్గమధ్యంలోనే అడ్డుకుని హత్యచేశారు. ఈ విషయమై ఇంతియాజ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూసి చాలాకాలం కావడంతో ఇంతియాజ్ సొంతబాగ్లోని ఇంటికి బయలుదేరాడని తెలిపారు. అయితే ఇప్పుడు పుల్వామాలో పరిస్థితి బాగోలేదనీ, ఉగ్రవాదులు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. కానీ ఇంతియాజ్ అంగీకరించలేదనీ, గడ్డం తీసేసి, వస్త్రధారణను మార్చుకుని సొంత వాహనంలో ఊరికి బయలుదేరాడన్నారు. ఇంతియాజ్ రాకపై సమాచారం అందుకున్న ఉగ్రవాదులు అతడిని చేవకలాన్లో కిరాతకంగా హతమార్చారని తెలిపారు. మరోవైపు పీడీపీ నేత సయ్యద్ అల్తాఫ్ బుఖారి అనుచరుడు మొహమ్మద్ అమిన్ దార్(40)ను కూడా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. -
జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
-
ఎన్నికల వేళ.. నేతల గృహనిర్భందం
శ్రీనగర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా 12 జిల్లాల్లోని 30 మున్సిపాలిటీలో గల 400 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకుండా వేర్పాటువాదల నాయకుల్ని ముందస్తుగా గృహనిర్భందంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్, సయ్యద్ అలీ షా గిలానీ, యాసీన్ మాలిక్ వంటి కరుడుగట్టిన వేర్పాటువాద నాయకుల్ని గృహనిర్భందం చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 13 ఏళ్ల అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను.. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌స్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బహిష్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 35(ఎ)పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రెండు పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇదివరికే ప్రకటించాయి. ప్రధాన పార్టీలు రెండూ బరిలో నుంచి తప్పుకోవడంతో.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. జమ్మూ ప్రాంతంలో బలమైన క్యాడర్ గల బీజేపీ.. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ఈ రాష్ట్ర మాజీ సీఎం కవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కాగా 400 స్థానాలకుగాను 1283 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అలర్లు జరిగే అవకాశం ఉన్నందున్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని భద్రత దళాలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయగా, మరోకొన్ని ప్రాంతాల్లో 2జీ సేవలు అందిస్తున్నారు. -
దేశమంతటికీ ఒకే రాజ్యాంగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 35(ఏ)పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని నీరుగార్చలేమని దోవల్ వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతోపాటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దోవల్ వ్యాఖ్యలను ఖండించని పక్షంలో.. కేంద్రమే కావాలని ఈ వ్యాఖ్యలు చేయించినట్లుగా భావించాల్సి వస్తుందన్నాయి. మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. ‘వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయడంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సంస్థానాలతోపాటు దేశమంతా ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజల సార్వభౌమత్వం దేశమంతటికీ వర్తిస్తుంది. కానీ జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండడం.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతమంతా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా కింద ఉండాలని పటేల్ భావించారు. కానీ అప్పటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇందుకు విభేదించారు’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం చాలామటుకు అహింసాయుతంగా కొనసాగడం వల్ల సరైన వేడి రాజుకోలేదని.. అందుకే దేశ ప్రజలకు స్వాతంత్య్రం విలువ అర్థం కావడం లేదని దోవల్ అభిప్రాయపడ్డారు. -
కశ్మీర్లో ఆర్టికల్ 35Aపై రాజకీయ దుమారం
-
‘మూక హత్యలతో మళ్లీ దేశ విభజన’
శ్రీనగర్: గోవులను తరలిస్తున్నారనే అనుమానంతో ముస్లింలపై దాడులు, హత్యలకు అడ్డుకట్టపడకుంటే అది మళ్లీ దేశ విభజనకు దారి తీస్తుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నేత, మాజీ ఉపముఖ్యమంత్రి ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీడీపీ 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘గో సంరక్షకుల పేరుతో ముస్లింలపై దాడులు, మూకహత్యలను అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నాం. ఇప్పటికే 1947లో దేశ విభజన జరిగింది. ముస్లింలపై దాడులు ఇంకా కొనసాగితే అది మరోసారి దేశం విచ్ఛిన్నానికి దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో మొన్నటి దాకా సాగిన బీజేపీతో పీడీపీ పొత్తు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యంగా కాశ్మీరీలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కానీ, అధికారం కోసం మాత్రం కాదన్నారు. -
పీడీపీ సహకరిస్తే హిందూ వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటాం
-
కశ్మీర్లో గవర్నర్ పాలనకే బీజేపీ మొగ్గు
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తలను బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఖండించారు. రాష్ట్రాభివృద్ధి, సుపరిపాలన, శాంతి కోసం తమ పార్టీ గవర్నర్ పాలనకే మొగ్గు చూపుతోందన్నారు. ‘రాం మాధవ్ ప్రకటనతో పనిలేకుండా అక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు పీడీపీని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్నదే వారి అభిమతంగా ఉంది’ అంటూ ఒమర్ అబ్దుల్లా మరో ట్వీట్ చేశారు. దీనికి రాం మాధవ్ స్పందిస్తూ..‘అది నిజం కాదు. పార్టీ రాష్ట్ర శాఖతో ఈ విషయమై మాట్లాడతాం. ఇతర పార్టీల్లో ఎలాంటి పరిణామాలు సంభవించినా మేం జోక్యం చేసుకోం’ అని తెలిపారు. -
కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. మాజీ సీఎం, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీరును జీర్ణించుకోలేని కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసి, గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగటం, శాంతి భద్రతలు కాపాడటంలోముఫ్తీ సర్కార్ విఫలం కావడం వంటి అంశాలను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్లో గవర్నర్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో.. గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా తగిన సంఖ్యా బలంతో ముందుకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. -
కశ్మీర్ రాజకీయంపై కాంగ్రెస్ సమీక్ష
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని తాజా రాజకీయ పరిస్థితులపై కశ్మీర్‌పై ఏర్పాటైన కాంగ్రెస్ కోర్ గ్రూపు సోమవారం చర్చించింది. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు కరణ్ సింగ్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అంబికా సోనీ, కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్‌లు పాల్గొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలతో మంగళవారం శ్రీనగర్‌లో చర్చలు జరపాలని భేటీలో నిర్ణయించారు. సమావేశం అనంతరం అంబికా సోనీని ‘పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఊహాగానాలపై తాను స్పందించను’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తుకు పీడీపీ రాయబారం? కశ్మీర్లో కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని, ఆజాద్‌కు సీఎం చాన్స్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా వర్తమానం పంపినట్లు సమాచారం. కశ్మీర్లో పీడీపీకి 28, బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యుల బలముంది. -
మీడియా అభూత కల్పన.. అభివృద్ధే మా లక్ష్యం..
శ్రీనగర్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారం కోసం పాకులాడదని, కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో శనివారం ఆయన కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో హిందూవులు అత్యధికంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. అయితే, ఆ డబ్బు జమ్మూ, లద్ధాఖ్‌లకు చేరలేదని తెలిపారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు. అభివృద్ధిలో సమన్యాయం లేకపోవడం వల్లే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)కి మద్దతు ఉపసంహరించామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్రవేసిందని వెల్లడించారు. కానీ, ఇందుకు జమ్మూ ప్రాంతంలో పీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హయాంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ చేసేందుకు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారని మీడియా అభూత కల్పనలు వండి వారుస్తోందని మండిపడ్డారు. -
ఎన్నికలకు తొందరేంటి?
శ్రీనగర్ : తాజా రాజకీయ పరిస్థితులపై జమ్ము కశ్మీర్ గవర్నర్ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆధ్వర్యంలో అన్ని పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేయగా, పీడీపీ మాత్రం ఎన్నికలకు తొందరేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానోక దశలో భేటీలో గందరగోళం చెలరేగగా, నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు స్థానిక ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఎలా సాధారణ స్థితికి తీసుకురావటం, రాజకీయ పరస్పర సహకారం ప్రధాన ఎజెండాలుగా భేటీలో గవర్నర్ వోహ్రా ప్రతిపాదన చేశారు. అయితే బలగాల మోహరింపు ద్వారానే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాని పార్టీలన్నీ గవర్నర్‌తో స్పష్టం చేశాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయటమే ఉత్తమమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు గవర్నర్‌తో తేల్చి చెప్పాయి. ‘ఇప్పటికే అన్ని పార్టీలు తమకు మెజార్టీ లేదన్న విషయం చెప్పేశాయి. పైగా ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చాయి. ఇలాంటి సమయంలో ఇంకా అసెంబ్లీని కొనసాగించటం సబబు కాదు. ఇది గందరగోళాన్ని, రాజకీయ అస్థిరతను సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని కాంగ్రెస్ జమ్ము చీఫ్ గులాం అహ్మద్ మీర్ కోరారు. మరోవైపు ఎన్సీ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. పీడీపీ, బీజేపీలు మాత్రం... అయితే పీడీపీ మాత్రం కాంగ్రెస్, ఎన్సీల డిమాండ్‌ను తోసిపుచ్చింది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష భేటీకి హాజరుకాకపోవటంతో ఆమె తరపున ఆ పార్టీ కార్యదర్శి దిలావర్ మీర్ మీటింగ్‌కు హాజరయ్యారు. ‘ఇది సున్నితమైన అంశం. గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉందనే అనుకుంటున్నాం. ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేయటం కన్నా కొనసాగించటమే మంచిది. ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370 (ప్రత్యేక హోదా అంశం)లపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు కథువా కేసు కూడా విచారణ దశలో ఉంది. ఇలాంటి స్థితిలో రాజకీయ గందరగోళం ఆయా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడ్డప్పుడే ఎన్నికలు కూడా నిర్వహించటం మంచిదని ముఫ్తీ భావిస్తున్నారు’ అని సమావేశం అనంతరం మీర్ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. ‘అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రశాంత వాతావరణంలో యాత్ర కొనసాగేలా చూడాలి. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. ముందు ఆ ఎన్నికలు జరిగేలా చొరవ చూపాలి’ అని బీజేపీ నేత, మాజీ మంత్రి సత్ శర్మ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు అసంతృప్తిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోవటం గమనార్హం. -
కశ్మీర్‌పై సంచలన ప్రకటన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌పై ఉగ్రసంస్థ లష్కరే తాయిబా సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ గురువారం ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల మూలంగా కశ్మీర్లో నరమేధం జరిగే అవకాశం ఉందని అభిప్రాయడింది. లష్కరే చీఫ్ మహ్మద్ షా పేరిట గురువారం ఓ మెయిల్ భారత మీడియా ఛానెళ్లకు చేరింది. (ముష్కరుల ఏరివేత కోసం...) ఇది నరమేధమే... ‘మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ సహా మిగతా నేతలు అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. ఇకపై అమాయకులైన కశ్మీరీలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వారిని ఊచకోత కోసేందుకే గవర్నర్ పాలన విధించారు. మళ్లీ జగ్మోహన్ (1990లో కశ్మీర్ మాజీ గవర్నర్) రోజులను గుర్తుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనిక చర్య దిగుతోంది. ఆపరేషన్ ఆల్అవుట్ పేరిట కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 8 లక్షల మంది సైనికులు జమ్ములో అరాచకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. జర్నలిస్ట్ బుఖారీ భారత దళాల ప్రధాన అజెండాలను బయటపెట్టేందుకు యత్నించారు. ఆరెస్సెస్ ఎజెండాను తీసికెళ్లడంలో పీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన వంతు ప్రయత్నం చేశారు. కశ్మీర్‌పై ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేకం, ఆలస్యమైన ఐరాస అసలు విషయాన్ని గమనించింది. అయితే అక్కడి దుస్థితిని వివరించేందుకు ఈ ఒక్క నివేదిక సరిపోదు’’అని మీడియా సంస్థలకు పంపిన ఈమెయిల్లో దుయ్యబట్టారు. ఈ పరిణామం రాజకీయంగా వివాదాన్ని రేపుతోంది. కాంగ్రెస్‌కు లష్కరే లాంటి ఉగ్రవాదసంస్థలు కొమ్ముకాస్తున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. ఆజాద్ ఏమన్నారంటే... ‘ఉద్ధృతమైన మిలటరీ ఆపరేషన్ అంటే అమాయకుల ఊచకోతే. ఎందుకంటే ఉగ్రవాదుల కంటే ప్రజలనే ఎక్కువ సంఖ్యలో సైనిక, పారా మిలటరీ దళాలు చంపుతున్నాయి. సగటున నలుగురు టెర్రరిస్టులకు 20 మంది ప్రజలను హతమారుస్తున్నారు. పుల్వామాలో ఒక్క ఉగ్రవాదిని చంపడానికి 13 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళికను సూచిస్తోంది. ’’ అని వ్యాఖ్యానించి గులాంనబీ అజాద్ దుమారం రేపారు. -
పీడీపీలో చీలిక ఏర్పడే అవకాశం!!
శ్రీనగర్ : అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 కింద గవర్నర్ పాలనను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఎన్ఎన్ వోహ్రా.. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఓ జాతీయ మీడియాకు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీపీ(పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చీలిక ఏర్పడే అవకాశం ఉందన్న అబ్దుల్లా.. మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు పీడీపీలోని ఓ వర్గం బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. అధికారమే పరమావధిగా భావించే బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఏమాత్రం వెనకాడబోదన్నారు. ‘మా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ’ బీజేపీ నేత, కశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అసెంబ్లీని రద్దు చేయాలి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ వోహ్రా పదవీ కాలాన్ని పొడగించడం సరైన నిర్ణయమని అబ్దుల్లా పేర్కొన్నారు. అయితే జమ్ము కశ్మీర్ అసెంబ్లీని వెంటనే రద్దు చేయాలని.. లేనిపక్షంలో బీజేపీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ ముందుకు రాని నేపథ్యంలో అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచడం వల్ల ప్రజా ధనం దుర్వినియోగమవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని... అయితే బీజేపీ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతికి బీజేపీ, పీడీపీల అధికార దాహమే కారణమని ఆయన ఆరోపించారు. -
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్ పాలన..
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో మళ్లీ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో రాష్ట్రంలో మరోసారి గవర్నర్ పాలన విధించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో గవర్నర్ పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ వోహ్రా పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడం తెలిసిందే. అనంతర పరిణామాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హయాంలోనే ఇక్కడ గతంలో మూడుసార్లు గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. తాజాగా కూడా గవర్నర్ పాలన విధించడంతో ఆయన హయాంలో నాలుగోసారి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం. ఇవీ గవర్నర్ పాలన తీరుతెన్నులు.. ♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్ పాలన విధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన వచ్చింది. ♦ 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్ షా ప్రభుత్వానికి సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్ గవర్నర్ పాలన కిందే కొనసాగింది. ♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది. ♦ 2008లో ఐదోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు. ♦ 2014 డిసెంబర్ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు. -
సంకీర్ణంలో కొనసాగలేం..గవర్నర్ పాలన తప్పనిసరి
-
సంకీర్ణానికి బీజేపీ రాం..రాం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పీడీపీ–బీజేపీ సంకీర్ణ కూటమి పాలన ముగిసింది. ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నామని బీజేపీ ప్రకటించడంతో.. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేశారు. రంజాన్ సందర్భంగా కశ్మీర్లో కేంద్రం ప్రకటించిన కాల్పుల విరమణ.. తదనంతర పరిణామాలు మూడేళ్ల పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికే ఎసరుపెట్టాయి. కశ్మీర్లో కాల్పుల విరమణ ఆదివారంతో ముగిసిందని కేంద్ర హోం మంత్రి ప్రకటించగా.. దానిని పొడిగించాలని పీడీపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ, శ్రీనగర్‌లో పరిణామాలు చకచకా మారిపోయాయి. కశ్మీర్ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రుల్ని అత్యవసరంగా ఢిల్లీ రప్పించిన అధిష్టానం.. వారితో చర్చలు కొనసాగించింది. అనంతరం బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ప్రకటన చేస్తూ.. పీడీపీతో పొత్తు నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది గంటలకు జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలిసిన సీఎం మెహబూబా రాజీనామాను సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన తప్పనిసరని పేర్కొంటూ రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక పంపారు. నేడో రేపో గవర్నర్ పాలనపై రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు వెలువరించే అవకాశముంది. రాష్ట్రంలో సంకీర్ణ కూటమిలో కొనసాగడం ఇక సాధ్యం కాదని, గవర్నర్ పాలన తప్పనిసరని రాం మాధవ్ చెప్పగా.. బీజేపీ నిర్ణయం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పీడీపీ పేర్కొంది. పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం వైదొలిగిన నేపథ్యంలో.. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), కాంగ్రెస్‌లు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ పాలనే ఉత్తమమని ఎన్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా గవర్నర్‌కు సూచించారు. ఒకవేళ జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధిస్తే.. 1977 నుంచి ఇది ఎనిమిదోసారి అవుతుంది. 2008 నుంచి నాలుగుసార్లు ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగింది. 89(ఇద్దరు నామినేటెడ్‌తో కలిపి) సభ్యులున్న కశ్మీర్ అసెంబ్లీలో బీజేపీకి 25 స్థానాలు, పీడీపీకి 28, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12, ఇతరులకు ఏడు స్థానాలున్నాయి. డిసెంబర్ 2014లో ఎన్నికలు జరగగా.. మార్చి, 2015లో పీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నిజానికి ఆ ఎన్నికల్లో పీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ.. రాష్ట్రంలో హింసకు ముగింపు పలకాలన్న లక్ష్యంతో ఒక్కటయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వ పాలన ప్రారంభం నుంచి ఇరు పార్టీలు అనేక అంశాలపై విభేదించాయి. శాంతి భద్రతల్లో పీడీపీ విఫలం: బీజేపీ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించిన అనంతరం కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నామని రాం మాధవ్ వెల్లడించారు. ‘కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో పీడీపీ విఫలమైంది. రాష్ట్రీయ రైఫిల్స్ జవాను ఔరంగజేబు, రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ షుజాత్ బుఖారీల హత్య ఘటనలే అందుకు ఉదాహరణ. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. అక్కడి హింసాత్మక పరిస్థితుల్ని అదుపు చేయడమే లక్ష్యంగా అధికారాల్ని గవర్నర్‌కు అప్పగించాలని మేం నిర్ణయించాం’ అని చెప్పారు. కశ్మీర్లో ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు పెరిగిపోయాయని, జీవించే హక్కు, వాక్స్వాతంత్య్రం మొదలైన ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ లోయలో ప్రశాంతత, అభివృద్ధి కోసం కేంద్రం సాధ్యమైనదంతా చేసింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు ముగింపు పలికేందుకు ప్రయత్నించాం. అయితే పీడీపీ తన వాగ్దానాల్ని నెరవేర్చడంలో విఫలమైంది. జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల విషయంలో బీజేపీ నేతలు పీడీపీ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీడీపీ ఉద్దేశాల్ని మేం ప్రశ్నించడం లేదు. అయితే కశ్మీర్లో పరిస్థితుల్ని మెరుగుపర్చడంలో వారు విఫలమయ్యారు’ అని రాం మాధవ్ పేర్కొన్నారు. సంకీర్ణ సర్కారులోని బీజేపీ మంత్రులు గవర్నర్‌తో పాటు, సీఎంకు తమ రాజీనామాల్ని సమర్పించారని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత కవిందర్ గుప్తా వెల్లడించారు. చర్చలతోనే పరిష్కారం: మెహబూబా బలప్రయోగంతో కూడిన భద్రత రాష్ట్రంలో ఫలితం ఇవ్వదని, చర్చలే పరిష్కారమని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. రాజీనామా సమర్పించాక తన నివాసంలో పార్టీ మంత్రులు, కార్యకర్తలతో ఆమె చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘అధికారం కోసం బీజేపీతో జట్టుకట్టలేదు. ప్రజల కోసమే పనిచేశాం. ఇక ఏ పార్టీతోను పీడీపీ పొత్తు పెట్టుకోదని గవర్నర్‌కు స్పష్టం చేశాను’ అని చెప్పారు. పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్ ప్రజలతో చర్చలు జరపాలన్న పీడీపీ ఎజెండాకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. చేసిందంతా చేసి...: కాంగ్రెస్ పీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రాన్ని పీడీపీ–బీజేపీ కూటమి నాశనం చేసిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ విమర్శించారు. ‘ఈ మూడేళ్లలో కశ్మీర్‌ను ఎంత వీలైతే అంత బీజేపీ నాశనం చేసి ఇప్పుడు పక్కకు తప్పుకుంది. గత మూడేళ్లలో 373 మంది జవాన్లు, 239 పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అని ఆయన చెప్పారు. పీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ భారీ తప్పిదానికి పాల్పడిందని నాడే రాజ్యసభలో ప్రధా ని మోదీని హెచ్చరించానని గుర్తు చేశారు. మరో ప్రత్యామ్నాయం లేదు: ఒమర్ ‘2014 ఎన్నికల్లో ఎన్సీకి మెజార్టీ దక్కలేదు. అందువల్ల ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యా బలం మాకు లేదని గవర్నర్‌కు చెప్పాను. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు చేయడం లేదనీ స్పష్టం చేశాను. ఏ పార్టీకి మెజార్టీ లేనందున గవర్నర్ పాలన విధించడం మినహా ప్రత్యామ్నాయం లేదని కూడా వివరించాను’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. రాష్ట్రపతికి నివేదిక జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఓ నివేదిక పంపారు. రాష్ట్రం లోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ పాలనకు వోహ్రా సిఫారసు చేశారు. మెహబూబా ముఫ్తీతోపాటు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రవీందర్ రైనా, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు జీఏ మిర్లతో వోహ్రా మాట్లాడారు. తగినంత సంఖ్యాబలం లేని కారణంగా ఎవ్వరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. అనూహ్యం.. ఆశ్చర్యకరం! శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రయాణం అర్ధాంతరంగా, ఆకస్మికంగా ముగిసింది. మంగళవారం ఉదయం కూడా ఆమె సాధారణంగా విధులకు హాజరై తన కార్యాలయంలో పనులు చేసుకున్నారు. అయితే మధ్యాహ్నం గవర్నర్ నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌కాల్ పరిస్థితిని తారుమారు చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలుగుతున్నట్లు అనూహ్యంగా ప్రకటించారు. ఆ వెంటనే బీజేపీ జమ్మూ కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా గవర్నర్ వోహ్రాకు లేఖ రాస్తూ తాము పీడీపీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. బీజేపీ మంత్రుల రాజీనామా లేఖలను కూడా గవర్నర్‌కు పంపారు. ఆ తర్వాత గవర్నర్ జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీబీ వ్యాస్‌కు ఫోన్ చేసి, ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ తర్వాత బీజేపీ నిర్ణయాన్ని గవర్నర్ ముఫ్తీకి తెలియజేయడంతో తాను రాజీనామా చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఈ విషయంపై బీజేపీ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని ఆమె గవర్నర్‌తో అన్నారు. బీజేపీ–పీడీపీ కూటమి పాలన ♦ 2014 డిసెంబర్ 28: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హంగ్. మొత్తం 87 స్థానాలకు గాను పీడీపీకి 28, బీజేపీకి 25 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. ♦ డిసెంబర్ 28: రాష్ట్రంలో గవర్నర్ పాలన విధిస్తూ కేంద్రం ప్రకటన ♦ 2015 మార్చి 1: బీజేపీ, పీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ♦ 2016 జనవరి 7: ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అనారోగ్యంతో మృతి. ♦ 2016 జనవరి 8: రాష్ట్రంలో మరోసారి గవర్నర్ పాలన విధింపు. ♦ 2016 ఏప్రిల్ 4: మొదటి మహిళా సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం. ♦ 2016 ఏప్రిల్ 5: భారత్– పాక్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాష్ట్ర, రాష్ట్రేతర విద్యార్థుల మధ్య గొడవ. ♦ 2016 జూలై 8: హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతి. ఈ ఘటనపై ప్రజాందోళనలు వెల్లువెత్తడంతో పీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు ప్రారంభం. ♦ 2018 మే 9: ఎన్కౌంటర్లు జరిగిన ప్రాంతాల్లో ప్రజాందోళనల సందర్భంగా పోలీసు కాల్పుల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవటంపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన సీఎం మెహబూబా. సమావేశం అనంతరం రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం. వ్యతిరేకించిన డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా. ♦ మే 17: రంజాన్‌ను పురస్కరించుకుని నెల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం ♦ జూన్ 17: కాల్పుల విరమణను పొడిగించబోమని కేంద్రం ప్రకటన. ♦ జూన్ 18: రాష్ట్ర కేబినెట్లోని బీజేపీ మంత్రు లంతా ఢిల్లీకి రావాలన్న పార్టీ అధిష్టానం. ♦ జూన్19: సంకీర్ణం నుంచి వైదొలగిన బీజేపీ. -
ఎనిమిదోసారి గవర్నర్ పాలన!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడంతో అక్కడ గవర్నర్ పాలన అనివార్యం కానుంది. గత నాలుగు దశాబ్దాల్లో ఇప్పటివరకు అక్కడ ఏడుసార్లు గవర్నర్ పాలన విధించారు. ప్రస్తుత గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హయాంలోనే మూడుసార్లు అక్కడ గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈసారి కూడా విధిస్తే ఆయన హయాంలో నాలుగోసారి అమల్లోకి వచ్చినట్లవుతుంది. రాష్ట్రంలో తీవ్రవాదం, టెర్రరిజం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కొనసాగడం అసాధ్యమైందని పేర్కొంటూ పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష, పరోక్ష రాజకీయ నిర్ణయాల వల్లే అత్యధిక పర్యాయాలు జమ్మూలో గవర్నర్ పాలన అమల్లోకి రావడం విశేషం. ఇవీ గవర్నర్ పాలన తీరుతెన్నులు.. ♦ 1977 మార్చిలో తొలిసారి గవర్నర్ పాలన విధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి అప్పటి జమ్మూ కాంగ్రెస్ అధ్యక్షుడు సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో గవర్నర్ పాలన వచ్చింది. ♦ 1986లో రెండోసారి గవర్నర్ పాలన విధిం చారు. గులాం మొహమ్మద్ షా ప్రభుత్వానికి సయీద్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ♦ 1990 జనవరిలో మూడోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ఈ సమయంలో సయీద్ కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. గవర్నర్‌గా జగ్మోహన్ నియామకంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సీఎం ఫరూక్ వ్యతిరేకించినప్పటికీ జగ్మోహన్ను గవర్నర్‌గా నియమించారు. దీనికి నిరసనగా సీఎం ఫరూక్ అబ్దుల్లా రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది. ఈసారి అత్యధికంగా 6 సంవత్సరాల 264 రోజులు జమ్మూకశ్మీర్ గవర్నర్ పాలన కిందే కొనసాగింది. ♦ 2002 అక్టోబర్‌లో నాలుగోసారి గవర్నర్ పాలన విధించారు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా కొనసాగడానికి నిరాకరించడంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. అయితే ఈసారి 15 రోజులే ఈ పాలన సాగింది. ♦ 2008లో ఐదోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని కాంగ్రెస్– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి పీడీపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి విధించారు. ♦ 2014 డిసెంబర్ అసెంబ్లీ ఫలితాల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. అప్పటి ఆపద్ధర్మ సీఎం ఒమర్ అబ్దుల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 2015 జనవరి 7న ఆరోసారి గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. ♦ మాజీ సీఎం ముఫ్తీ సయీద్ మరణానంతరం 2016 జనవరి 8న గవర్నర్ పాలన విధించారు. రాష్ట్రపతి పాలన కాదు.. గవర్నర్ రూల్! న్యూఢిల్లీ: సాధారణంగా రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. కానీ జమ్మూకశ్మీర్‌లో మాత్రం అలా కుదరదు. జమ్మూకశ్మీర్‌కే ప్రత్యేకమైన రాజ్యాంగం ప్రకారం ఇక్కడ సంక్షోభ సమయాల్లో విధించేది గవర్నర్ పాలన. జమ్మూకశ్మీర్ రాజ్యాంగంలోని సెక్షన్ 92 ప్రకారం.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం రాష్ట్రంలో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన విధించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సందర్భాల్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. గవర్నర్ పాలన సమయంలో అసెంబ్లీని రద్దు చేయడం కానీ, సుప్త చేతనావస్థలో ఉంచడం కానీ చేస్తారు. ఆర్నెల్లలోపు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాని పక్షంలో మరో ఆర్నెల్ల పాటు గవర్నర్ పాలన పొడిగిస్తారు. త్వరలో కొత్త గవర్నర్! జమ్మూకశ్మీర్‌కు కేంద్రం త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్లు సమాచారం. అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర జూన్ 28న ప్రారంభమై.. రెండు నెలల పాటు కొనసాగనుంది. ప్రస్తుత గవర్నర్ వోహ్రాకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని యాత్ర బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. యూపీఏ హయాంలో నియమితులై.. ఎన్డీఏ హయాంలో పొడిగింపు పొందిన కొద్దిమంది గవర్నర్లలో వోహ్రా ఒకరు. -
కలహాల కాపురం
మూడేళ్లు అధికారంలో కొనసాగిన అనంతరం జమ్మూ కశ్మీర్లో సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగింది. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి పీడీపీతో విభేదాలు తీవ్రమవడంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెహబూబా ముఫ్తీ సీఎంగా కొనసాగిన పక్షంలో కశ్మీర్లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కేంద్రం కఠిన వైఖరిని అవలంబించడం కుదరదని బీజేపీ భావించడం, రంజాన్ మాసంలో సైనిక కార్యకలాపాలను నిలిపివేయాల్సిందిగా ముఫ్తీ పట్టుబట్టడం, రంజాన్ నెల ముగిశాక కూడా సైనిక కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై పీడీపీ అసంతృప్తిగా ఉండటంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు ఇటీవల మరింతగా దెబ్బతిన్నాయి. ♦ కఠువాలో బాలికపై హత్యాచారం విషయంలో పోలీసుల విచారణను పీడీపీ సమర్థించిగా, బీజేపీ ప్రాంతీయ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ♦ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగిన తీరుపై ఆర్మీని బీజే పీ ప్రశంసించగా, పీడీపీ మాత్రం వ్యతిరేకించింది. ♦ భద్రతా దళాలపై తొలిసారి రాళ్లు విసిరిన వారిపై కేసులను ఉపసంహరించాలని నిర్ణయించడం. ♦ ఉగ్రవాదులకు నిధుల సేకరణ కేసులో పలువురు హురియత్ సభ్యుల ప్రమేయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)విచారణ జరపడం. ♦ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్–370ని బీజేపీ గతంలో తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తర్వాత దానిపై మాట్లాడలేక పోవడం. -
‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు’
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీడీపీతో పొత్తు విరమించుకున్నట్లు బీజేపీ కశ్మీర్ ఇంచార్జి రాం మాధవ్ ప్రకటించగానే బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు అంటూ’ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువకాలం నిలవదని ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడో చెప్పారన్నారు. ఒకవేళ పీడీపీతో కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనే బీజేపీ ఈవిధంగా వ్యవహరించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కేవలం రాజకీయ లబ్ది కోసమే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ విమర్శించారు. ‘అవకాశవాది బీజేపీ... ముందు పీడీపీతో జతకట్టింది. ఇప్పుడు వైదొలిగింది. రెండూ కూడా రాజకీయ లబ్ది కోసమే... ఇలా అయితే దేశం ఎలా మారుతుందని’ ఆయన ట్వీట్ చేశారు. పీడీపీతో జతకట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. An opportunistic BJP First an opportunistic alliance with PDP Now an opportunistic breakaway Both acts of political immorality Kaise Desh badlega ? — Kapil Sibal (@KapilSibal) June 19, 2018 -
బీజేపీకి మెహబూబా ముఫ్తీ ఘాటు కౌంటర్
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగిన బీజేపీకి పీడీపీ చీఫ్, సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్‌ను శత్రుస్థావరంగా చూసే అలవాటును మానుకోవాలని హితవుపలికారు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున, వారి ద్వారానైనా కశ్మీర్‌కు న్యాయం దక్కుతుందన్న ఆశతోనే బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకుందే తప్ప అధికారం కోసం కానేకాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మాకు కావలసింది సాధించుకున్నాం: బీజేపీతో మేమేమీ ఊరికే పొత్తు పెట్టుకోలేదు. 370వ అధికరణ కొనసాగింపు (జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి), ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు, యువకులపై కేసుల ఎత్తివేత, పాకిస్తాన్ సహా ఇక్కడి అన్ని వర్గాలతో చర్చలు జరపడం... అనే అంశాల ప్రాతిపదికన మేము వారితో(బీజేపీతో) కలిశాం. ఈ మూడేళ్లలో 370వ అధికరణకు సంబంధించి వివాదాలు రాలేదు... ప్రధాని మోదీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధానిని కలిసి వచ్చారు... 12వేల మంది యువకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాం... అన్ని వర్గాలతో చర్చలు కొనసాగుతాయని కేంద్రం ప్రకటించేలా చేయగలిగాం... ఇలా సంకీర్ణ ప్రభుత్వంలో మాకు కావలసినవి మేం సాధించుకున్నాం. రాజకీయంగా నష్టపోయినా భరించాం: బీజేపీతో పొత్తు వల్ల పీడీపీ నష్టపోయినమాట నిజం. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినాసరే, రాస్ట్ర సంక్షేమం కోసం మాత్రమే బీజేపీని భరించాం. ఇవాళ వారు పొత్తును తెంచుకోవడం మాకేమీ శరాఘాతం కాదు. మేం పొమ్మనలేదు. వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారు. మా వైపు నుంచి తప్పేమీ లేదు. కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలు జరిగేలా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలన్నది మా రెండో ప్రధాన డిమాండ్..’’ అని మెహబూబా ముఫ్తీ అన్నారు. సీఎం పదవికి రాజీనామా: సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలడంతో మెహబూబా ముఫ్తీ తన సీఎం పీఠానికి రాజీనామా ప్రకటించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపానని, కశ్మీర్లో శాంతి, సుస్థిరతల కోసం పీడీపీ ఎప్పటికీ పాటుపడుతుందని ఆమె చెప్పారు. -
రాజకీయంగా నష్టపోయినా భరించాం
-
కశ్మీర్ వినాశనంలో బీజేపీ పాత్ర లేదా!
సాక్షి, హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో జరుగుతోన్న వినాశనంలో తన పాత్రేమీ లేనట్లు బీజేపీ బొంకడం విడ్డూరంగా ఉందని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. గడిచిన మూడేళ్లుగా పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. సీమాంతర ఉగ్రవాదం పేట్రేగిపోవడం, ఆర్మీ క్యాంపులపై వరుసగా దాడులు, షుజీత్ బుఖారీ లాంటివాళ్ల హత్యలు, స్కూళ్లు, కాలేజీల మూసివేత... తదితర పరిణామాలకు సంబంధించి పీడీపీ కంటే బీజేపీనే ప్రధాన ముద్దాయి అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంపై మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: బీజేపీ బ్రేకప్.. సీఎం రాజీనామా!) ముఫ్తీని నిందిస్తే బీజేపీ తప్పులు మాసిపోతాయా?: ‘‘పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని వ్యవహారాలకు మంత్రివర్గానిదే బాధ్యత అన్న కనీస సూత్రాన్ని బీజేపీ మర్చిపోయినట్లుంది. మెహబూబా కేబినెట్లో బీజేపీ డిప్యూటీ సీఎం సహా, మంత్రులు కూడా ఉన్నారుగా! గత మూడేళ్లుగా కశ్మీర్లో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపీ బాధ్యురాలే. ఇప్పుడు సడన్‌గా పీడీపీతో పొత్తుతెంచుకుని, ముఫ్తీని నిందించినంత మాత్రాన బీజేపీ గొప్పదైపోదు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో రాజకీయ పోరాటం ప్రారంభమైంది కాబట్టే, కాషాయనేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. (చూడండి: ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!) కశ్మీర్ నడిచేది కేంద్రం ఆదేశాలతో కాదా?: పీడీపీ ప్రభుత్వం నుంచి వైదొలిగినందుకు బీజేపీ చెబుతున్న కారణాలేవీ సహేతుకంగాలేవు. కాల్పుల విరమణ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం నియంత్రణ కేంద్రం చేతుల్లోనే కదా ఉన్నది! మరి వీళ్లు(బీజేపీ) ముఫ్తీని మాత్రమే నిందించడంలో అర్థం ఉందా? బీజేపీ ఘోర తప్పిదాలు చేసి, ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తోంది. ముఫ్తీకి చెంపపెట్టు: బీజేపీని నమ్ముకున్నందుకు మెహబూబా ముఫ్తీకి సరైన శాస్తి జరిగింది. ఇవాళ్టి పరిణామం ఖచ్చితంగా ఆమెకు చెంపపెట్టులాంటింది. ఇక కశ్మీర్ లోయలో పీడీపీకి భవిష్యత్తులేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే ఎవరికైనా ఇది గుణపాఠం అవుంది. కొద్ది మంది అనుకుంటున్నట్లు 2019 ఎన్నికల్లో లబ్ది కోసమే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లైతే నాదొక సవాల్.. రాంమాధవ్‌కు దమ్ముంటే శ్రీనగర్ నుంచి పోటీకి దిగాలి. జమ్ముకశ్మీర్ విషయంలో బీజేపీ తీసుకున్నవన్నీ తప్పుడు నిర్ణయాలే’’ అని అసదుద్దీన్ అన్నారు. -
ఉగ్రవాదుల వెన్ను విరిచారా.. ఏమైంది!
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అంతా నాశనం చేశాక జమ్మూ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందంటూ కేజ్రీవాల్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు సమయంలో బీజేపీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ బీజేపీని ప్రశ్నించారు. నోట్లరద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కశ్మీర్లో ఉగ్రవాదుల వెన్ను విరిచామని చెప్పారని.. కాగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమైందంటూ ట్విటర్లో ప్రశ్నించారు. ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కేజ్రీవాల్.. బీజేపీ నిర్ణయాన్ని, వారి విధానాలను తప్పుపట్టారు. కాగా, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. పీడీపీతో కటీఫ్ చెప్పాక.. బీజేపీ కశ్మీర్ ఇన్ఛార్జ్ రాం మాధవ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. గవర్నర్ పాలనతోనే యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కొనసాగుతాయని రాం మాదవ్ పేర్కొన్నారు. Didn’t BJP tell us that demonetisation had broken the back of terrorism in Kashmir? Then what happened? https://t.co/S9nyOMocKl — Arvind Kejriwal (@ArvindKejriwal) 19 June 2018 -
జమ్మూ కశ్మీర్: పీడీపీ-బీజేపీ బంధానికి బీటలు
-
బీజేపీ బ్రేకప్.. సీఎం రాజీనామా!
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. కాషాయదళం వైదొలగడంతో ప్రస్తుతం కశ్మీర్‌లోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడినట్లయింది. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ కశ్మీర్ ఇన్ఛార్జ్ రాం మాధవ్ ఇక పీడీపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగలేమని, తమ మంత్రులను ఉప సంహరించుకుంటున్నామని చెప్పారు. ‘కాశ్మీర్లో ఉగ్రవాదం పెరుగుతోంది. శాంతి భద్రతలు కరువయ్యాయి. ఇంకా చెప్పాలంటే పత్రికా స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్ర్యానికి ప్రమాదం వాటిల్లింది. పట్టపగలే జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేశారు. ఉగ్రవాదులను నియంత్రించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేసింది. జాతీయ ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి వైదొలిగాం. పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గవర్నర్ పాలనతో పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని ఆశిస్తున్నాం. రంజాన్ కాల్పుల విరమణకు ఉగ్రవాదులు, వేర్పాటువాదుల నుంచి సానుకూల స్పందన రాలేదు. మూడేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాం. కేంద్రం సాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అయితే పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగలేం. 600మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు నిర్మూలించాయి. గవర్నర్ పాలనలో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కొనసాగుతాయని’ బీజేపీ నేత రాం మాధవ్ వివరించారు. సీఎం మెహబూబా ముఫ్తీ రాజీనామా సంకీర్ణ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించిన కొంత సమయానికే సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో చేసేదేం లేక మెహబూబా ముఫ్తీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్రపక్షాలు బీజేపీ-పీడీపీల మధ్య విభేదాలు కీలక పరిణామాలకు దారితీసిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలని పీడీపీ పట్టుపట్టగా, బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. -
జమ్మూకశ్మీర్ మంత్రిపై సీఎం వేటు
శ్రీనగర్: కశ్మీర్ అంశం ‘రాజకీయ సమస్య కాద’ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రిపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వేటు వేసింది. ‘ఈ రాష్ట్రం రాజకీయ అంశాలతో కాకుండా సామాజిక సమస్యలతో సతమతమౌతోంద’ని ఆయన అన్నారు. ‘కశ్మీర్-ది వే ఫార్వార్డ్’ అంశంపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ద్రాబు ఈ కామెంట్ చేశారు. గత 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యగా కశ్మీర్ మిగిలిపోవడానికి కారణం రాజకీయాలేనని అన్నారు. ద్రాబు చేసిన వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు పీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అయితే బీజేపీకి అనుకూల ప్రకటన చేశాడంటూ సదరు మంత్రి పై పీడీపీ చర్యలు తీసుకోక తప్పలేదు. తమ ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి హసీబ్ అహ్మద్ ద్రాబుని మంత్రి వర్గం నుంచి తొలంగించాలని గవర్నర్ వొహ్రాని పీడీపీ కోరింది. -
వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్
సాక్షి, శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సైన్యం పై కేసు నమోదు చేయటం ఏంటని? ఆయన కశ్మీర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సైన్యంపైనే కేసా? ఆమె తీసుకున్న నిర్ణయం అర్థం పర్థం లేనిది. ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చెయ్యండి’’ అని సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యానించారు. కాగా, ఈ వివాదం ఇప్పుడు పీడీపీ-బీజేపీ మిత్రపక్షం మధ్య చిన్నగా చిచ్చును రాజేస్తోంది. మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం. అసలేం జరిగింది... దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురా ప్రాంతంలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. అంతేకాదు ఒక అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో వారిపై సైనికులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దీంతో లోయలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జవాన్ల కాల్పుల్లో పౌరుల మృతికి నిరసనగా వేర్పాటువాదులు ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు. గర్వాల్ 10 బెటాలియన్‌పై హత్య, హత్యాయత్నం కేసును నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
'ఇంకా కలిసే ఉన్నాం.. అలాంటిదేం లేదు'
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఏదైనా బలమైన సంఘటన జరిగిన ప్రతిసారి చర్చలోకి వచ్చే అంశం అక్కడ ప్రభుత్వం మారుతుందా అని.. గతంలో మాదిరిగానే తాజాగా కూడా అదే అంశం చర్చకు వచ్చింది. ఇక్కడ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ సరిగా పరిపాలనను నిర్వహించలేకపోతున్నారని, అందువల్లే అక్కడ అశాంతియుత వాతావరణం చోటు చేసుకుంటుందని, నిత్యం అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ శ్రేణులతోపాటు ఇతర వర్గాలు పరోక్షంగా ఆమెను విమర్శిస్తున్నారు. తాజాగా అమర్నాథ్ యాత్రికులపై అనంతనాగ్ జిల్లాలో దాడి నేపథ్యంలో ఆ విమర్షలు ఎక్కువకావడంతోపాటు మరోసారి ఇక బీజేపీ ముఫ్తీని దింపేసి సీఎం పగ్గాలు చేపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. అలా జరగకుంటే దాడి విషయంపై ఆ పార్టీల మధ్య విభేదాలు వస్తాయని వదంతలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఎలాంటి మార్పులు జరగబోవని ముప్తీనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, దాడికి పీడీపీని బాధ్యురాలిగా చేయలేమంటూ బీజేపీ నేతలు క్లారిటీ ఇచ్చారు. తమ బంధం ఇప్పటికే బలంగా ఉందంటూ స్పష్టత నిచ్చారు. ఈ మేరకు బీజేపీ నేత ఒకరు మీడియాతో మాట్లాడుతూ 'పీడీపీని తప్పుబట్టడానికి ప్రస్తుతం మాకు ఏ కారణమూ కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న తప్పులకు, దాడికి పీడీపీది బాధ్యత కాదు. మేం ఇప్పటికీ కలిసే ఉన్నాం' అని చెప్పారు. -
కశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతాయి!
శ్రీనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం జమ్మూకశ్మీర్‌లోని తమ పార్టీ నేతలతో విస్తారంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలోని ప్రముఖులు, పౌరసంఘాల నాయకులతో ముచ్చటించారు. జమ్ములో జరుగుతున్న ఈ చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ ఆదివారం కొనసాగనుంది. తాను తలపెట్టిన 95రోజుల దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రెండురోజుల జమ్మూ పర్యటనకు అమిత్‌షా వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా, 2014 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 120 సీట్లలో అదనంగా పాగా వేయడమే వ్యూహంగా షా పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే. అమిత్ షా బీజేపా శాసనసభ్యులు, నేతలు, జమ్మూ హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, పారిశ్రామిక ప్రముఖులు తదితరులతో భేటీ అయి వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆయన రాష్ట్ర బీజేపీకి చెందిన ఐదుగురు సభ్యుల కోర్ కమిటీతో ముఖాముఖి సమావేశమయ్యారు. అలాగే బీజేపీ-పీడీపీ ప్రభుత్వంలోని పలువురు సీనియర్ బీజేపీ మంత్రులతో ముచ్చటించారు. కశ్మీర్ లోయ మళ్లీ అల్లర్లతో అట్టుడుకుతున్న నేపథ్యంలో అమిత్ షా చేపట్టిన ఈ మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కశ్మీర్లో పరిస్థితులు త్వరలోనే చక్కబడుతాయని, అధికార మిత్రపక్షంతో పీడీపీతో ఉన్న విభేదాలు సైతం తొలిగిపోయి.. అన్ని సమస్యలు త్వరలోనే చక్కబడతాయని ఈ సందర్భంగా పార్టీ నేతలకు అమిత్ షా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. -
రాజకీయాల్లోకి మాజీ సీఎం కొడుకు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఫ్తీ మహమ్మద్ సయీద్ కొడుకు తసాదుక్ ముఫ్తీ ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేశారు. తండ్రి తొలి వర్ధంతి సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన అధికార పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ)లో చేరారు. వృత్తిరీత్యా సినిమాటోగ్రాఫర్ అయిన తసాదుక్, ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా తన ప్రతిభతో కష్టపడి పైకి వచ్చారు. సోదరి, జమ్మూకశ్మీర్ ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతూ ‘మన రాష్ట్రంలో రాజకీయాలను ప్రక్షాళన చేయాలనేది నా కల. ఇన్నాళ్లూ నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఈ రోజు పీడీపీలో చేరాను. ఇది నా జీవితంలో ముఖ్యమైన రోజు’అని అన్నారు. తసాదుక్ చేరికను మెహబూబా ముఫ్తీ స్వాగతించారు. -
జాతీయ గీతానికి అవమానం
కశ్మీర్లో గందరగోళం మధ్య ‘అసెంబ్లీ’ ప్రారంభం జమ్మూ కశ్మీర్: జమ్ము కశ్మీర్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం జాతీయ గీతానికి అవమానం జరిగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి పీడీపీ–బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ.. కార్యక్రమాలను అడ్డుకున్నాయి. సభ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనూ విపక్షాల నినాదాల హోరు కొనసాగింది. గవర్నర్ ఎన్ఎన్ హోరా సభలోకి అడుపెట్టేటప్పుడే ఎన్సీపీ, సీపీఎం, స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించగా.. కొందరు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యం లో గవర్నర్ కూడా మాట్లాడాల్సిన విషయాన్ని క్లుప్తంగా ఉభయసభల్లో ప్రసం గించి వెళ్లిపోయారు. కొత్త సంవత్సరం లోనైనా రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. భారత్, పాక్ మధ్య శాంతి చర్చలు కొనసాగాలని అభిలసించారు. విపక్షాల తీరు గర్హనీయ మని.. వారు క్షమాపణ చెప్పాలని, జాతీయ గీతాన్ని అవమానిం చడంపై సోనియా, రాహుల్ సమాధానం చెప్పాల ని బీజేపీ డిమాండ్ చేశారు. సభలో ఈ రోజు జరిగిన ఘటన విచారిం చదగిందని పీడీపీ పేర్కొంది. సమావేశాలు గందరగోళంగా ప్రారంభం కావడానికి రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు సృష్టించిన పీడీపీ, బీజేపీనే కారణమని ఎన్సీపీ వివరించింది. -
'ముఫ్తీ రాజీనామా చేసి దిగిపోవాలి'
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెంటనే పదవిలో నుంచి దిగిపోవాలని పీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముజఫర్ బేగ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితులు ఆమె నియంత్రించలేదని అనుకుంటే వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని అన్నారు. కశ్మీర్ ప్రజలకు న్యాయం చేస్తుందో లేదో అనే విషయాన్ని ఆమె లోతుగా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను నియంత్రించడంలో బీజేపీ, పీడీపీ భాగస్వామ్యం విఫలమైందనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, అసలు తమ భాగస్వామ్యం పీడీపీ కోసం పనిచేయడం లేదని, తమ కార్యకర్తల కార్యకలాపాలు నియంత్రించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఓపక్క ప్రధాని నరేంద్రమోదీ కశ్మీర్ వికాసానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెబుతుంటే ఆయన పార్టీకి చెందిన నేతలు మాత్రం పూర్తిగా ఆ మాటల దూరం జరిగి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. -
తొలి అధ్యక్షురాలు వచ్చేసింది
తైపీ: తైవాన్ పరిపాలన బాధ్యతలు తొలిసారి ఓ మహిళ చేతికి వచ్చాయి. తైవాన్ అధ్యక్షురాలిగా సెయింగ్ వెన్ శుక్రారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం పూర్తవగానే ప్రదాని లి చువాన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము చైనాతో స్టేటస్ కో విధానం పాటిస్తామని అదే సమయంలో తైవాన్ ప్రజాస్వామ్యాన్ని బీజింగ్ గౌరవించాలని చెప్పారు. తమ దేశంలోని ఎన్నో ఆర్థిక సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు చైనా సహకారం కోరుకుంటామని, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆమె చెప్పారు. తైవాన్ లో జనవరి 16 ఎన్నికలు జరగ్గా సాయింగ్ పార్టీ ప్రొ-ఇండిపెండెన్స్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(పీడీపీ) 56.2శాతం గెలుచుకుంది. ఆమె ప్రత్యర్థి ఎరిక్ చూను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన దాదాపు ఐదు నెలల తర్వాత ఆమె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. -
మెహబూబాకు పెద్ద పరీక్ష
జమ్మూ-కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడ్డ పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వానికి 48 గంటలు గడవకుండానే సంక్లిష్ట సమస్య వచ్చిపడింది. శ్రీనగర్ ఎన్ఐటీలో కశ్మీర్ విద్యార్థులకూ, స్థానికేతర విద్యార్థులకూ మధ్య తలెత్తిన వివాదం చివరకు లాఠీచార్జికీ, సీఆర్పీ బలగాల మోహరింపునకూ దారితీసింది. ఈమధ్య కాలంలో ఎక్కడో ఒకచోట విశ్వవిద్యాలయాలు ఆందోళనలతో అట్టుడుకుతు న్నాయి. క్యాంపస్‌లలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులను చితకబాదడం, ఆడపిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపారేయడం వంటి దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొద లుకొని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ), బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ వరకూ అలజడులు రేకెత్తడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. జేఎన్‌యూ, జాదవ్‌పూర్ వర్సిటీలు సద్దుమణిగినా...దళిత యువ మేధావి రోహిత్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొని సెలవుపై వెళ్లిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిల అప్పారావు పునరాగమనంతో ఆ క్యాంపస్ మళ్లీ రాజుకుంది. దానికొక పరిష్కారం లభించ కుండానే ఇప్పుడు శ్రీనగర్ ఎన్ఐటీ అంటుకుంది. అక్కడ తలెత్తిన సమస్య నిజానికి చాలా చిన్నది. గత వారం టీ20 సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌పై భారత్ టీం ఓడిపోయాక కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీన్ని జాతి వ్యతిరేక చర్యగా భావించిన స్థానికేతర విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వెనువెంటనే ఎన్ఐటీ డెరైక్టర్, ప్రొఫెసర్లు బాధ్యత తీసుకుని రెండు వర్గాలతోనూ మాట్లాడివుంటే ఆ వివాదం బహుశా అక్కడితో సద్దుమణిగేది. కానీ ఆ పని జరగకపోవడం వల్ల అది క్రమేపీ ముదిరి పెను వివాదంగా మారింది. విద్యార్థులు లేవనెత్తే సమస్యలనైనా, విద్యార్థుల్లో వచ్చే పొరపొచ్చాలనైనా పరిష్క రించడానికి తామొక ప్రయత్నం చేసి చూద్దామనే ధోరణి విద్యా సంస్థల నిర్వా హకుల్లో కొరవడుతోంది. పిల్లలు తరగతులకొస్తే పాఠం చెప్పడమే తమ బాధ్యతని, మిగిలినవేమైనా ఉంటే పోలీసులు చూసుకుంటారనే మనస్తత్వం పెరుగుతోంది. అసలు క్రికెట్‌లాంటి క్రీడల్లో దేశభక్తి, జాతీయవాదంవంటి అంశాలను తీసుకు రావడమే అసంగతం. మన జట్టే గెలవాలనుకోవడం తప్పేమీ కాదు. ఓడిపోయి నప్పుడు నిరాశ కలగడంలోనూ దోషం లేదు. అయితే స్టేడియంలో నువ్వా నేనా అన్నట్టు రెండు జట్లు పోరాడుతుంటే ఆ ఆటను చూసి ఆనందించగలిగే మనస్తత్వం ఉండాలి. మంచి ఆట తీరును ప్రదర్శించిన జట్టు...అది ఏ దేశానికి సంబంధించిన దైనప్పటికీ గెలిస్తే అభినందించగలిగే క్రీడాస్ఫూర్తి ఉండాలి. ఇప్పుడు శ్రీనగర్ ఎన్ఐటీలో సంబరాలు చేసుకున్నవారు అవతలి జట్టు బాగా ఆడిందన్న కారణంతో కాక ఎదుటి వర్గం విద్యార్థుల్ని రెచ్చగొట్టవచ్చునన్న ఉద్దేశంతో కూడా అలా చేసి ఉండొచ్చు. మన జట్టు గెలుపోటములపై స్పందించే తీరు ఆధారంగా ఒకరి దేశభక్తినీ లేదా అది లేకపోవడాన్నీ నిర్ధారించడానికి పూనుకోవడం సరికాదు. ఢిల్లీ జేఎన్‌యూ లేదా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతీయ వాదం వంటి అంశాలపై వివాదాలు చోటుచేసుకోవడం వేరు. శ్రీనగర్ ఎన్ఐటీలో అలాంటి సమస్య తలెత్తడం వేరు. అనేక చారిత్రక కారణాల వల్ల జమ్మూ-కశ్మీర్లో సమస్యల విస్తృతి ఎక్కువ. ఉగ్రవాదాన్నీ, మిలిటెన్సీని అణచడం కోసం తీసుకున్న చర్యలవల్ల అయితేనేమి, కేంద్రంలో ఉన్న పాలకులు జమ్మూ-కశ్మీర్లో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహరించిన తీరువల్ల అయితేనేమి అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనికితోడు నిరుద్యోగం, అభివృద్ధి స్తంభించడం ఆ అసం తృప్తిని మరింతగా పెంచాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మిలిటెన్సీ తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద ఉదంతాలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భిన్న ధ్రువాలుగా ఉన్న పీడీపీ, బీజేపీలు కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది అక్కడి ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ తొలగించడానికి దోహదపడుతోంది. ఇలాంటి తరుణంలో అందుకు భిన్నమైన పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించడం మంచిది కాదు. విద్యార్థుల్లో ఆవేశాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సునీల్ సేఠి రాష్ట్రం వెలుపల ఉండే కశ్మీరీ విద్యార్థుల క్షేమానికి ఇలాంటి పరిణామాలు ముప్పు కలిగిస్తాయంటూ హెచ్చరించడం ఏం సబబు? శ్రీనగర్ ఎన్ఐటీలో 2,800మంది విద్యార్థులుంటే వారిలో 1,200మంది కశ్మీర్ విద్యార్థులు. మిగిలినవారు వెలుపలి ప్రాంతాలవారు. ఎవరో కొద్దిమంది చేసుకున్న సంబరాలను జాతి వ్యతిరేక చర్యగా పరిగణించడమేకాక...దాన్ని అందరికీ ఆపాదించి మిగిలినచోట్ల చదువుకునే కశ్మీర్ విద్యార్థులకు ముప్పు కలుగుతుందనడం బాధ్యతారాహిత్యం. జేఎన్‌యూలో జరిగిన తంతును శ్రీనగర్ ఎన్ఐటీలో పునరావృతం చేద్దామనుకుంటే మేలు కన్నా కీడే జరుగుతుందని గుర్తించాలి. ఇది దేశ శ్రేయస్సును కాంక్షించేవారు చేయాల్సిన పనికాదు. భిన్న భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్న మన దేశంలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఒకచోట చదువుకుంటే అది జాతీయ సమైక్యతకూ, సమగ్రతకూ దోహదపడుతుందని ఎన్ఐటీ వంటి సంస్థలు నెలకొల్పినప్పుడు భావించారు. కానీ ఎన్ఐటీ యాజమాన్యం వైఫల్యం కారణంగా ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థి తులు తలెత్తాయి. ‘ఇది భారత్ కాదు సార్...ఇక్కడ మేం ఉండలేం. మమ్మల్ని మరేదైనా ప్రాంతానికి మార్చండ’ని కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ బృందంతో స్థానికేతర విద్యార్థులు అన్నారంటే వైషమ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే స్థానిక పోలీసులకు బదులు అక్కడ సీఆర్పీ బలగాలను మోహరించడం కూడా దీన్నే సూచిస్తోంది. ఇప్పటికైనా ఎన్ఐటీ యాజమాన్యం తమ బాధ్యత గుర్తెరిగి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటానికి తమ వంతు ప్రయత్నం చేయాలి. -
ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణ స్వీకారం
జమ్ము : జమ్మూ కశ్మీర్ పదమూడో ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు గర్నవర్ వోహ్రా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో పీడీపీ అధ్యక్షురాలు, దివంగత సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె అయిన 56 ఏళ్ల మెహబూబా.. రాష్ట్రంలో తొలి మహిళా సీఎంగా, దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ ఇదివరకు మాదిరిగానే తన వాటా దక్కించుకునే పరిస్థితి ఉన్నా పోర్ట్‌ఫోలియోలు మారే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కౌర్ బాదల్, బీజేపీ నేత రాంమాధవ్ తదితరులు హాజరయ్యారు. కాగా ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పీడీపీ- బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మరణంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఎట్టకేలకు చర్చల అనంతరం ప్రతిష్టంభన తొలగటంతో ప్రభుత్వ ఏర్పాటు సుగమమం అయింది. 87 స్థానాలున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) 15, కాంగ్రెస్12 సీట్లు గెల్చుకున్నాయి. -
గవర్నర్‌తో మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంక్షోభం తొలగిపోయినట్లు అనుకున్నప్పటికీ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. తాజాగా గవర్నర్ ఎన్ ఎన్ వోరాతో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఫ్తీ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్‌ను కలవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో రాంమాధవ్, జితేందర్ సింగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా నిర్మల్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. కాగా గత జనవరిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సీఎం పీఠం ఖాళీగా ఉంటోంది. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మద్దతు లేఖ రావడం లాంఛనమే. -
కశ్మీర్‌కు తొలి మహిళా సీఎం!
పీడీపీ శాసనసభాపక్ష నేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవ ఎన్నిక నేడు గవర్నర్‌ను కలవనున్న బీజేపీ, పీడీపీ నేతలు శ్రీనగర్/జమ్మూ: ఎట్టకేలకు జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నెలకొన్న అనిశ్చితి తొలగింది. రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ(56) అధికారం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. పీడీపీ ఎమ్మెల్యేలు గురువారం ఆమెను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన భేటీలో మెహబూబా ముఫ్తీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. పీడీపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లుగా బీజేపీ నుంచి లేఖ రావడమే ఇక మిగిలింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మద్దతు లేఖ రావడం లాంఛనమే. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలో పీడీపీ, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం, సయీద్ ఆకస్మిక మృతితో రాష్ట్రం గవర్నర్ పాలనలోకి వెళ్లడం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్‌ను కలిసిన తరువాత, పీడీపీ, బీజేపీ నేతలు ప్రమాణ స్వీకారం చేసే తేదీని నిర్ణయిస్తారని పీడీపీ సీనియర్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీకి ఎటువంటి షరతులు విధించలేదన్నారు. ‘గతంలో విస్తృత సంప్రదింపుల అనంతరం ఇరుపార్టీలు అంగీకరించిన ఎజెండా సమగ్రంగా ఉంది. ఆ ఎజెండాలో ఎలాంటి మార్పులు లేవు. కొత్తగా ఎలాంటి షరతులు విధించలేదు’ అని స్పష్టం చేశారు. బీజేపీ పొత్తుతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే గతంలో అంగీకరించిన ఎజెండా అమలుకు కాలపరిమితి విధించాలని మెహబూబా ముఫ్తీ బీజేపీకి షరతు విధించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధానితో భేటీ అయిన మెహబూబా ముఫ్తీకి ఆ డిమాండ్‌కు సంబంధించి ఆయన నుంచి ఏదైనా హామీ లభించిందా? అన్న విషయం తెలియలేదు. అయితే, ఆ భేటీ అనంతరమే ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకున్న విషయం గమనార్హం. కాగా, బీజేపీ ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్, ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జతేంద్ర సింగ్ నేడు(శుక్రవారం) సమావేశం కానున్నారు. ఆ తరువాత వారు గవర్నర్‌ను కలుస్తారు. శుక్రవారం తనను కలసి ప్రభుత్వ ఏర్పాటులో తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా మెహబూబా ముఫ్తీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్ శర్మకు ఇప్పటికే లేఖలు రాశారు. కాగా, ప్రభుత్వ ఏర్పాటులో తాత్సారం చేస్తూ, బలహీనమైన నాయకత్వ వైఖరితో వ్యవహరిస్తున్నారంటూ మెహబూబా ముఫ్తీని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. రాష్ట్ర సమగ్రతకు సవాలు విసురుతున్న వేర్పాటు శక్తులను ఇలాంటి బలహీన నాయకత్వం ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు. 87 మంది సభ్యులున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. సజ్జాద్ గని లోన్‌కి చెందిన పీపుల్స్ కాన్ఫెరెన్స్ ఎమ్మెల్యేలు ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్రులు సయీద్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. -
జమ్మూకు జేజమ్మే వస్తోంది
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా మఫ్తీ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండు నెలలపాటు వివిధ సందర్భాల్లో పలు అంతర్గత సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి పదవికి పీడీపీ అభ్యర్థిగా ఆమెను ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కీలక వర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు ఆమెను శాసనసభా పక్ష నేతగా కూడా మఫ్తీని ఎన్నుకున్న నేపథ్యంలో ఇక మఫ్తీ మహ్మద్ సయీద్ స్థానంలో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైపోయింది. గత జనవరిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సీఎం పీఠం ఖాళీగా ఉంటోంది. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. గురువారం ఇక్కడ జరిగిన కీలక సమావేశంలో సీఎం అభ్యర్థిగా మఫ్తీ పేరును పార్టీ సీనియర్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ ప్రతిపాదించగా అబ్దుర్ రెహ్మాన్ వీరి అనే మరో నేత బలపరిచారు. అనంతరం ఏకగ్రీవంగా ఆమె అభ్యర్థిత్వానికి ఒప్పుకున్నారు. -
నిబంధనలతో ప్రభుత్వం ఏర్పడదు: బీజేపీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై మెహబూబా ముఫ్తీ రోజుకో డిమాండ్‌ను తెరపైకి తెస్తుండటంతో సంకీర్ణంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. నిబంధలనపై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేమని పేర్కొంది. గురువారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో పీడీపీ చీఫ్ మెహబూబా భేటీ, తెరవెనక మంత్రాంగం జరిగినా, సానుకూల ఫలితాలేమీ కనిపించలేదని పీడీపీ పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా.. పీడీపీ పెడుతున్న నిబంధనలే ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయన్నారు. నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం శనివారం ఢిల్లీలో జరగనుంది. -
'ఒక్క అడుగు ముందుకు పడలేదు'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ, పీడీపీ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిచడం లేదు. ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయిద్ మరణం తర్వాత ఆ పదవికి ఆయన కుమార్తెను ఎన్నుకున్నారని, అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. కశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి తాము కారణంగా కాదని స్పష్టం చేశారు. పీడీపీ కొత్త షరతులకు ఒప్పుకోమని అన్నారు. కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సివుందని, అంతవరకు సందిగ్ధం కొనసాగుతుందని రాంమాధవ్ చెప్పారు. -
'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం'
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. అదేవిధంగా గతంలో కొనసాగినట్టే బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి మహమ్మద్ సయీద్ సంకీర్ణ ప్రభుత్వ అజెండాను పవిత్ర పత్రంగా భావించారని, అదేవిధంగా కొనసాగాలని ఇప్పుడు పార్టీ కూడా భావిస్తున్నదని పీడీపీ నేత నయీం అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి డెడ్‌లైన్ విధించుకోలేదని ఆయన విలేకరులకు చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా పీడీపీతో తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉంటే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. -
'ఇది టీ కప్పులో తుఫాను'
ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ వ్యాకులత నుంచి జమ్ముకశ్మీర్ ఇంకా బయటపడలేదు. మొన్నటివరకు పీడీపీ- బీజేపీ సంకీర్ ప్రభుత్వం కొనసాగగా.. మొహమూద్ మరణం, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీను ముఖ్యమంత్రిని చేసేందుకు పీడీపీ ఏకపక్ష ప్రయత్నాలు.. దోస్తీపై బీజేపీని పునరాలోచనలో పడేశాయి. దీంతో కొత్త పొత్తులు ఉద్భవిస్తాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే బీజేపీ- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి. ఎన్సీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలంటూ బీజేపీ ప్రతినిధులెవరైనా వస్తే తప్పక ఆహ్వానిస్తామని, పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అన్నారు. గతంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణంలో కొనసాగిన దరిమిలా ఫారూఖ్ ప్రకటన రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది. కాగా, 'ఇదంతా టీ కప్పులో తుఫాను' అని కొట్టిపారేశారు ఫారూఖ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని, బీజేపీ- ఎన్సీల కలయికా అలాంటిదేనని ఒమర్ పేర్కొన్నారు. ఇతర పార్టీలవాళ్లొచ్చి మాట్లాడతామంటే వారిని ఆహ్వానించడం పార్టీ అధినేతగా ఫారూఖ్ విధి. అందుకే ఆయనలా మాట్లాడారేతప్ప బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం ఎన్సీకి లేదు అని తేల్చిచెప్పారు. మొత్తం 87 సభ్యులు గల జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27మంది, బీజేపీకి 25 మంది నేషనల్ కాన్ఫెన్స్ కు 15 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది. -
కశ్మీర్లో కలిసే సాగుతాం..: పీడీపీ, బీజేపీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు, అనిశ్చితికి, ఊహాగానాలకు తెరపడింది. పీడీపీ, బీజేపీల పొత్తు కొనసాగుతుందని, సంవత్సరం క్రితం ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వ ఎజెండానే కొనసాగుతుందని మంగళవారం ఆ రెండు పార్టీలు స్పష్టం చేశాయి. ఇటీవల మరణించిన సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీనే తదుపరి సీఎం అని, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రెండు పార్టీలు తాజాగా ఎలాంటి షరతులు విధించలేదని వివరించాయి. అయితే, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడున్నదానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. పీడీపీతో పొత్తులో క్రియాశీలంగా వ్యవహరించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్.. మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
పీడీపీ - బీజేపీ సంకీర్ణానికి ఇబ్బందులు
-
'ముందు వాళ్లే నిర్ణయించుకోవాలి.. ఆ తర్వాతే మేం'
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పీడీపీ ముందు తమ పార్టీకి కొత్త అధినేతను ఎన్నుకోవాలని బీజేపీ ఎంపీ రామ్ మాధవ్ అన్నారు. ఆ తర్వాతే తామంతా ఓ చోట కూర్చుని మాట్లాడుకొని కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. మఫ్తీ కూతురు మెహబూబా మఫ్తీ సీఎం బాధ్యతలు చేపడతారని భావించినా అలా జరగలేదు. పీడీపీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీడీపీతో భేటీ కాలేదు. ఈ అంశంపై మీడియా ప్రశ్నించగా రామ్ మాధవ్ ఇలా స్పందించారు. -
పార్టీ నేతల మధ్య మఫ్తీ కంటతడి
శ్రీనగర్: తన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ నేత మెహబూబా మఫ్తీ కంటతడిపెట్టారు. అదే సమయంలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే విషయంపై మౌనం వహించారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ మఫ్తీ గత గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు మెహబూబానే స్వీకరిస్తారని చెప్తూ వస్తున్నా ఇప్పటి వరకు ఆమె ఆ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ కూడా మెహబూబాకు ఇప్పటి వరకు స్పష్టమైన మద్దతుపై బహిరంగ ప్రకటనా చేయలేదు. అదీ కాకుండా ఆదివారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ నేత నితిన్ గడ్కరీలు ఆమెను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. అయితే, తాము కేవలం సంతాపం తెలిపేందుకే వచ్చామని, ఎలాంటి రాజకీయాలు చేసే ఉద్దేశంతో రాలేదని ఇరువురు నేతలు ప్రకటించారు. వీరి భేటీ అనంతరం పీడీపీ నేతలతో మెహబూబా భేటీ అయ్యి కేవలం పార్టీ బలోపేతంపైనే చర్చించారని, సీఎం పీఠం విషయంపై ఎలాంటి స్పందన, అభిప్రాయం చెప్పలేదని ఆ పార్టీ నేతలు తెలిపారు. అదే సమయంలో సమావేశంలో కంటతడిపెట్టారని కూడా వివరించారు. -
ముఫ్తీ వారసత్వం
సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులుండే జమ్మూకశ్మీర్‌లో భిన్న ధ్రువాలైన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ), బీజేపీలు నిరుడు మార్చి నెలలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అంతకు నాలుగు నెలల ముందు...2014 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్న వైరి పక్షాలు రెండూ ఒద్దికగా ప్రభుత్వాన్ని నడపగలవా అన్న సందేహాన్ని వెలిబుచ్చారు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు ముఫ్తీ మహ్మద్ సయీద్ బుధవారం కన్నుమూశారు. ఆయనంతగా జమ్మూ-కశ్మీర్లో అన్ని వర్గాల అభిమానాన్నీ చూరగొన్న నేత మరొకరు లేరు. కశ్మీర్ రాజకీయాల్లో ముఫ్తీ లేని లోటు తీర్చలేనిదని పలువురు నాయకులు చేసిన ప్రకటనల్లో నిజముంది. వేర్పాటు వాదానికి దగ్గరగా ఉన్నదని భావించే ‘స్వయంపాలన’ నినాదం ఊపిరిగా ఎన్నికల్లో పోటీచేసిన పీడీపీ...అసలు ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాం గంలోని 370వ అధికరణ రద్దు చేయాలనే బీజేపీతో సన్నిహితం కావడం కేవలం ముఫ్తీ వల్లనే సాధ్యమైంది. ఇందువల్ల తనను సమర్ధించేవారు కొంత అసంతృప్తికి లోనైనా జమ్మూ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీని విస్మరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాష్ట్ర భవిష్యత్తు రీత్యా మంచిది కాదన్న ఉద్దేశం తోనే అందుకు సిద్ధపడ్డానని ముఫ్తీ ఒక సందర్భంలో చెప్పారు. గతంలో ఈ విషయంలో జరిగిన తప్పిదాలవల్లనే రెండు ప్రాంతాలమధ్యా అవసరమైనంతగా సామరస్యత నెలకొనలేదన్న భావన ఆయనలో ఉండేది. అలాగని ఆయన తన అభిప్రాయాల విషయంలోనూ, సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడలేదు. సర్కారీ సహకారంతో గోప్యంగా నడిచే హంతక ముఠాలకు సీఎం అయ్యాక ఆయన చోటు లేకుండా చేశారు. విచారణలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. అధీన రేఖకు అటూ, ఇటూ ఉండే కశ్మీరీలు ఒకరినొకరు తరచు కలుసుకునే అవకాశం కల్పించారు. వేదిక ఏదైనా తన అభిప్రాయాలను ముఫ్తీ నిర్మొహ మాటంగా చెప్పేవారు. మొన్నటి నవంబర్ నెలలో గోవాలో బీజేపీకి చెందిన మేధావుల ఫోరం సదస్సుకు ఆయన హాజరైనప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్తోసహా విపక్షాలన్నీ విమర్శించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ‘పారదర్శకత, సుపరిపాలన, అభివృద్ధి’ నినాదాలు తనను ఆకర్షించాయనీ, అందువల్లే బీజేపీతో చేతులు కలిపానని ఆ వేదికపైనుంచి ముఫ్తీ అనడమే మీడియాలో ప్రముఖంగా వచ్చింది. కానీ ఆ వేదికపైనే ఆయన బీజేపీని నిశితంగా విమర్శించారు కూడా. మోదీ నినాదంలోని అంశాలన్నీ వెనక్కు వెళ్లి అసహనం ఆధిపత్య స్థానంలోకి వస్తున్న వైనంపై ఆ పార్టీని హెచ్చరించారు. గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నాడన్న అను మానంతో ఒక ట్రక్కు డ్రైవర్‌ను కొట్టి చంపిన ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావిం చారు. దేశం పురోగమించాలంటే సమ్మిళిత అభివృద్ధి ద్వారానే సాధ్యమని హితవు పలికారు. రెండు వర్గాలూ భుజం భుజం కలిపి నడిస్తే దేశం అభివృద్ధి బాట పడుతుందని, అందుకు కశ్మీరే ఉదాహరణని వివరించారు. ఉగ్రవాదం విషయంలోనూ ఆయన అభిప్రాయాలు విలక్షణమైనవి. ప్రజా స్వామ్యమన్నది భావాల సంఘర్షణ అని ముఫ్తీ అనేవారు. ఒకరిని బంధించడం ద్వారా లేదా హతమార్చడం ద్వారా భావాల్లో మార్పు తీసుకురావడం అసాధ్య మన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. కశ్మీరీల వ్యక్తిత్వం గురించి ఇతర ప్రాంతాల వారిలో ఉన్న దురభిప్రాయాలనూ ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు. 1947లో పాకిస్థాన్ దురాక్రమణను గట్టిగా ప్రతిఘటించిందీ, జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిందీ, తమ అనుబంధం భారత్‌తోనే ఉండాలని ప్రగా ఢంగా కోరుకు న్నదీ కశ్మీరీలేనని ఆయన చెప్పారు. జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రాంతా లను ఒక రాష్ట్రంగా చేయడం బాగానే ఉన్నా జాతి, మత, ప్రాంతీయ స్థాయిల్లో ఉండే ఘర్షణాత్మక ధోరణులను సరిగా పరిష్కరించలేదన్న భావన ఆయనది. వాటిని ఎంతో ఒడుపుగా చేయగలిగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయనేవారు. దానికి తగినట్టే కూటమి ఏర్పర్చిన సందర్భంలో పీడీపీ, బీజేపీలు రెండూ పట్టు విడుపుల ధోరణిని ప్రదర్శించాయి. తమ తమ వైఖరులను తగ్గించుకుని సన్నిహితమయ్యాయి. తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్న మెహబూబా ముఫ్తీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారు. తనకు అనారోగ్యం ఏర్ప డ్డాక కుమార్తెను ఆ పీఠంపై కూర్చోబెట్టాలని ముఫ్తీ తహతహలాడారు. మొన్న నవంబర్‌లో ఆ సంగతిని ఆయన ప్రకటించారు కూడా. ఆ పదవికి కావాల్సిన అర్హతలన్నీ ఆమెకున్నాయని ఆ సందర్భంగా ముఫ్తీ చెప్పారు. ‘క్షేత్ర స్థాయిలో పనిచేసేదంతా ఆమెనే...నేను కేవలం ప్రసంగాలకూ, కార్యాలయానికే పరిమితం’ అని కూడా అన్నారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మెహబూబా పీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు. మొదట్లో పార్టీ ఉపాధ్యక్షురాలిగా, చాన్నాళ్లనుంచి అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా ముందు ఇప్పుడు చాలా సవాళ్లున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొన్ని అంశాల్లో బీజేపీతో తీవ్రంగా విభేదించిన సందర్భాలున్నాయి. అవి ఒక్కోసారి రెండు పార్టీలమధ్యా వివాదా లకు కూడా దారితీశాయి. ముఫ్తీ అనుభవశాలి గనుక అలాంటివాటిని అవలీలగా ఎదుర్కోగలిగారు. ఇప్పుడు మెహబూబాయే అలాంటి సందర్భాలు తలెత్త కుండా జాగ్రత్తపడవలసిన స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆమె ఇకపై ఆచితూచి అడుగేయక తప్పదు. ఇప్పుడు శ్రీనగర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ సాగిస్తున్న చర్చల్లో సహజంగానే మెహబూబా వైఖరి గురించి ప్రస్తావన వచ్చి ఉంటుంది. ముఫ్తీ కేవలం 11 నెలలు మాత్రమే పాలన సాగించారు. అయిదేళ్ల సుదీర్ఘకాలం కూటమి ఒడిదుడుకులు లేకుండా నడవాలంటే కొత్తగా చాలా అంశాల్లో అవగాహనకు రావలసి ఉంటుంది. కీలకమైన నిర్ణయాల విషయంలో పొరపొచ్చాలు ఏర్పడకుండా చూడటానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోక తప్పదు. రాష్ట్రంలో కూటమిని జాగ్రత్తగా నడుపుతూ, వివిధ పక్షాలను కలుపుకొనిపోతూ, కేంద్రంలో కావలసినవి రాబట్టుకోవడంలో నేర్పరితనాన్ని ప్రదర్శించిన ముఫ్తీని ఆదర్శంగా తీసుకోగలిగి నప్పుడే మెహబూబా విజయం సాధించగలుగుతారు. -
రెండు రోజుల్లో నిర్ణయం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) సందిగ్ధంలో పడింది. ముఫ్తీ ఆరోగ్య పరిస్థితి కుదుటపడకుంటే ఏం చేయాలనే దానిపై పీడీపీ సమాలోచనలు జరుపుతోంది. ఆయన కోలుకోకపోతే అసెంబ్లీలో పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముఖ్యమంత్రి లేకుండా కేబినెట్ సమావేశం సాధ్యం కాదు. అయితే తమ ముందు రెండు మార్గాలు ఉన్నాయని పీడీపీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పేరుతో ముందుకెళ్లడం లేదా సంకీర్ణ భాగస్వామిని సంప్రదించి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించాలని పేర్కొన్నాయి. ఒకవేళ మరొకరిని ముఖ్యమంత్రిని చేయాల్సివస్తే సయీద్ కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వైపు పార్టీ ఏకగ్రీవంగా మొగ్గుచూపే అవకాశముందని తెలిపాయి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడుతున్న సయీద్ గత రెండు వారాలుగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
'తప్పదు.. భారత్‌కు వేరే మార్గం లేదు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో చర్చలు తప్ప మరొక మార్గం లేదని, చర్చల నుంచి భారత్ తప్పించుకోలేదని జమ్మూకాశ్మీర్ లో బీజేపీ భాగస్వామి పీడీపీ పేర్కొంది. ప్రపంచం మొత్తాన్ని ఉగ్రవాదం వణికిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మాటామంతి జరుపుకోవాల్సిందేనని పీడీపీ అధ్యక్షుడు మహబూబా మఫ్తీ అన్నారు. ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా, తాలిబన్ వంటి సంస్థలు ఉగ్రవాదంతో కలవరపెడుతున్నాయని, దానినుంచి బయటపడాలంటే ఇప్పటికైనా భారత్ పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో చేతులు కలపాల్సిందేనని చెప్పారు. గత నవంబర్ 7న శ్రీనగర్ లో ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా కాశ్మీర్ విషయంలో ఎవరి సలహాను తీసుకోకపోవడంపై ఆమెను ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ప్రజలకు అనుభవం ద్వారా కొన్ని విషయాలు తెలిసి వస్తాయని, జమ్ముకాశ్మీర్ విషయం మిగితా రాష్ట్రాల మాదిరిగా కాదనేది అందరికీ తెలిసిందేనని అన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాల సరిగా లేకుంటే, సరైన చర్చలు జరపకుంటే ఆ ప్రభావం నేరుగా దేశంపై పడుతుందని చెప్పారు. సుష్మా స్వరాజ్ పాక్ పర్యటనకు వెళ్లి మంచి సందర్బానికి తెరతీశారని అన్నారు. -
'ఇక్కడ సిక్స్‌ల మోత మోగాలి'
-
'వారి భాగస్వామ్యం పెళ్లిలాంటిదేమీ కాదు'
జమ్మూ: జమ్మూ-కశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ-పీడీపీల మధ్య ఏదొక వివాదం రాజుకుంటూనే ఉంది. తాజాగా ఆ పార్టీల భాగస్వామ్యంపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-పీడీపీల సంకీర్ణం పెళ్లిలాంటిదేమీ కాదంటూ ఆ పార్టీల భాగస్వామ్యంపై పెదవి విరిచారు. కోట్ల మంది నరేంద్ర మోదీని ఎన్నుకున్నా.. మోదీని బీజేపీ కురు వృద్ధుడు వాజ్ పేయితో పోల్చలేమన్నారు. వేర్పాటువాది అలంను కోర్టు ఉత్తర్వులు ప్రకారమే విడిచిపెట్టామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అందులో ఎటువంటి పొరపాటు ఏముందని ప్రశ్నించారు. జమ్మూ-కశ్మీర్ లను ఒక్క తాటిపైకి తేవడమే తమ సంకల్పమని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ఇస్లాం పేరుతో అహింసకు పాల్పడేవారికి తాము వ్యతిరేకమని.. తుపాకీ ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. -
రాజకీయ పొత్తులు ముఖ్యం కాదు
దేశ రక్షణే ప్రధానం: హోంమంత్రి రాజ్‌నాథ్ ఆలం వివాదంలోకి గవర్నర్‌ను లాగిన కశ్మీర్ హోంశాఖ ఘజియాబాద్/జమ్మూ: దేశరక్షణ తమ ప్రభుత్వ అతి ప్రాధాన్య అంశమని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తు దేశ రక్షణ కంటే ముఖ్యం కానే కాదన్నారు. వేర్పాటువాది మసరత్ ఆలం విడుదలపై వివాదం రేగిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్‌నాథ్ మంగళవారం ఘజియాబాద్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కాగా, కశ్మీర్ సీఎం సయీద్.. రాజ్‌నాథ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇకపై సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తామని, బీజేపీని సంప్రదించకుండా ఏ వేర్పాటువాదినీ విడిచిపెట్టబోమని ఆయన అన్నట్లు సమాచారం. ఆలంను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. మరోవైపు ఆలం విడుదలపై పార్లమెంటులో రెండో రోజు కూడా విపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. సయీద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. సయీద్ ప్రభుత్వం మరో 800 మంది వేర్పాటువాదులను విడుదల చేయాలనుకుంటోందని ఆ రాష్ట్ర గవర్నర్ నివేదిక పంపించారన్న వార్తలపై కేంద్రం జవాబివ్వాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ఆలం విడుదలకు సంబంధించి కశ్మీర్ హోం శాఖ జమ్మూ కలెక్టర్‌సకు రాసిన లేఖ వివాదానికి తెరలేపింది. ఆలం విడుదల ఉత్తర్వులు గవర్నర్ పాలన ఉన్న ఫిబ్రవరిలోనే వెలువడినట్లు ఈ లేఖ స్పష్టం చేస్తోంది. దీంతో ఈ వివాదంలోకి కొత్తగా గవర్నర్ ఎన్ఎన్ వోరా చిక్కుకున్నారు. -
మసరత్ అలాం తీవ్రవాది.. రాజకీయ ఖైదీ కాదు
కాన్పూర్: ప్రత్యేక కశ్మీర్ వేర్పాటువాద నేత మసరత్ అలాం ఒక తీవ్రవాది అని, అతడు రాజకీయ ఖైదీ అనిపించుకోడని బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి అన్నారు. అతడిని పట్టించినవారికి పదిలక్షలు ఇస్తామని అవార్డు కూడా గతంలో ప్రకటించినట్లు తెలిపారు. అలాం ఒక నేరస్తుడని, ప్రత్యేకవాదని, తీవ్రవాదని ఆయన మండిపడ్డారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగానే అలాంను విడుదల చేసినట్లు పీడీపీ ప్రకటించడంతో ఆయన ఈ మేరకు స్పందించారు. విశ్వహిందు పరిషత్ కాన్పూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అలాం ఎప్పటికీ రాజకీయ ఖైదీ అనిపించుకోడని తమను సంప్రదించకుండానే జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.