తొలి అధ్యక్షురాలు వచ్చేసింది
తైపీ: తైవాన్ పరిపాలన బాధ్యతలు తొలిసారి ఓ మహిళ చేతికి వచ్చాయి. తైవాన్ అధ్యక్షురాలిగా సెయింగ్ వెన్ శుక్రారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణం పూర్తవగానే ప్రదాని లి చువాన్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము చైనాతో స్టేటస్ కో విధానం పాటిస్తామని అదే సమయంలో తైవాన్ ప్రజాస్వామ్యాన్ని బీజింగ్ గౌరవించాలని చెప్పారు.
తమ దేశంలోని ఎన్నో ఆర్థిక సమస్యలను, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు చైనా సహకారం కోరుకుంటామని, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆమె చెప్పారు. తైవాన్ లో జనవరి 16 ఎన్నికలు జరగ్గా సాయింగ్ పార్టీ ప్రొ-ఇండిపెండెన్స్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(పీడీపీ) 56.2శాతం గెలుచుకుంది. ఆమె ప్రత్యర్థి ఎరిక్ చూను దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన దాదాపు ఐదు నెలల తర్వాత ఆమె శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.