కశ్మీర్‌లో గందరగోళం మధ్య ‘అసెంబ్లీ’ ప్రారంభం
జమ్మూ కశ్మీర్: జమ్ము కశ్మీర్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం జాతీయ గీతానికి అవమానం జరిగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచి పీడీపీ–బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ.. కార్యక్రమాలను అడ్డుకున్నాయి. సభ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలోనూ విపక్షాల నినాదాల హోరు కొనసాగింది. గవర్నర్ ఎన్‌ఎన్ హోరా సభలోకి అడుపెట్టేటప్పుడే ఎన్‌సీపీ, సీపీఎం, స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించగా.. కొందరు నల్ల రిబ్బన్‌లతో నిరసన తెలిపారు.
ఈ పరిస్థితుల నేపథ్యం లో గవర్నర్ కూడా మాట్లాడాల్సిన విషయాన్ని క్లుప్తంగా ఉభయసభల్లో ప్రసం గించి వెళ్లిపోయారు. కొత్త సంవత్సరం లోనైనా రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఆయన ఆకాంక్షించారు. భారత్, పాక్ మధ్య శాంతి చర్చలు కొనసాగాలని అభిలసించారు. విపక్షాల తీరు గర్హనీయ మని.. వారు క్షమాపణ చెప్పాలని, జాతీయ గీతాన్ని అవమానిం చడంపై సోనియా, రాహుల్ సమాధానం చెప్పాల ని బీజేపీ డిమాండ్ చేశారు. సభలో ఈ రోజు జరిగిన ఘటన విచారిం చదగిందని పీడీపీ పేర్కొంది. సమావేశాలు గందరగోళంగా ప్రారంభం కావడానికి రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు సృష్టించిన పీడీపీ, బీజేపీనే కారణమని ఎన్‌సీపీ వివరించింది.
జాతీయ గీతానికి అవమానం
Published Tue, Jan 3 2017 2:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement