సాక్షి, హైదరాబాద్ : యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కొమ్ముకాసిన కమ్యూనిస్టు పార్టీకి ఇందులో బాధ్యత లేదా అని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. సోమ వారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు నిలయమైన కూటములతో జతకట్టే కమ్యూనిస్టులు కౌరవులా, దేశంకోసం పనిచేస్తున్న బీజేపీ నేతలు కౌరవులా అని ప్రశ్నించారు.
గవర్నర్‌కు మెమోరాండం
అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకు నేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే తగు విధంగా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్‌ను కోరింది. సోమవారం ఆ పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్‌రెడ్డి, సుధాకరశర్మ, ప్రకాశ్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment