criticised
-
ఆయన ఢిల్లీకి ఎల్జీ కాదు.. వీకే సక్సేనాపై ‘ఆప్’ సెటైర్లు..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నీటి సంక్షోభం తలెత్తిన వేళ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) విమర్శల దాడికి దిగింది. వీకే సక్సేనా హర్యానా బీజేపీకి అధికార ప్రతినిధి అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. ఈ మేరకు ఆప్ నేత గోపాల్‌రాయ్ ఆదివారం(జూన్23) మీడియాతో మాట్లాడారు.‘ఎల్జీ వీకే సక్సేనా హర్యానాకు ఎల్జీ కాదు. ఆయన ఢిల్లీకి ఎల్జీ. ఢిల్లీ ప్రజల ఇబ్బందులు ఎల్జీకి పట్టవు. ఆయకు ఇది సిగ్గుచేటు. ఢిల్లీలో నీటి కొరతపై మంత్రి ఆతిషి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు’అని గోపాల్‌రాయ్ మండిపడ్డారు. ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పొరుగు రాష్ట్రాల వారిని అపఖ్యాతిపాలు చేయడానికి వాడుకుంటున్నారని ఆప్‌ను ఉద్దేశించి ఎల్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ ఆయనపై విమర్శలకు దిగింది. -
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. బైంసా సభలో కేసీఆర్... ‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి.. ‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు. -
Jack Ma: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా వ్యాపార దిగ్గజం
చైనా ఫిన్ టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై యాంట్ గ్రూప్‌ను నియంత్రించే అధికారాన్ని వదులుకోనున్నారు. ఫిన్‌టెక్ కంపెనీలో ఉన్న వాటాలను షేర్ హోల్డర్లకు సర్దుబాటు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాటాలను షేర్ హోల్డర్లకు వాటాలను సర్దుబాటు చేసిన తర్వాత ఏ షేర్ హోల్డర్ సింగిల్‌గా లేదంటే ఇతర వ్యక్తులతో జత కలిసి యాంట్ గ్రూప్‌ని నియంత్రణ చేయలేరంటూ ఓ ప్రకటనలో తెలిపింది. జాక్ మా విమర్శలు..ఐపీవోకి వెళ్లకుండా అడ్డంకి యాంట్ గ్రూప్‌లో ఈకామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు మూడో వంతు వాటా ఉంది. అయితే 2020లో 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులపై జాక్‌మా విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ప్రభుత్వ అధికారులు యాంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూకి వెళ్లకుండా అడ్డుకున్నారు. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీ తొలుత యాంట్ గ్రూప్ లిస్టింగ్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించగా..తదుపరి హాంకాంగ్ మార్కెట్ సైతం ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. వెరసి 37 బిలియన్ డాలర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తాత్కాలికంగా చెక్ పడింది. చైనా బ్యాంకులా.. పాన్ షాపులా గతంలో సంస్థల్ని నియంత్రించే రెగ్యులేటర్లు ఇన్నోవేషన్‌ను అరికడుతున్నాయని జాక్ మా విమర్శించారు. దీంతో పాటు గ్లోబల్ బ్యాంకింగ్ నియమాలను తోలుబొమ్మలతో పోల్చారు. చైనాలో పటిష్టమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ లేదని, చైనీస్ బ్యాంకులు పాన్ షాప్‌లు లాంటివని అంటూ చైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లింది. 2నెలల్లో రూ.80వేల కోట్ల లాస్ 2020 చివరి నెలలు బిలియనీర్ ‘జాక్ మా’కు అంతగా కలిసి రాలేదు. అక్టోబర్ చివరి నుంచి, ఏడాది చివరి నాటికి ఆయన సుమారు 11 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.80వేల కోట్లకు పైమాటే. చైనా ప్రభుత్వం ఊరుకుంటుందా? అనలిస్టుల అభిప్రాయం ప్రకారం.. యాంట్ గ్రూప్, జాక్ మా సంస్థల విస్తరణను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే జాక్ మా తరచూ చైనా ప్రభుత్వాన్ని ఇబ్బంది కామెంట్లు చేస్తుంటారు. పైగా ఆయన ఎదుగుతున్న తీరుతో తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వ భావిస్తోంది. అందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. -
దేశప్రగతికి టీఆర్ఎస్ బ్రేకులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తుంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు మాత్రం అభివృద్ధికి బ్రేకులు వేస్తోందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం సంగారెడ్డిలోని అంబేడ్కర్‌చౌక్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని, ప్రశ్నించిన బీజేవైఎం కార్యకర్తలపై ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్ తరహాలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పారు. ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు ఇద్దరుకంటే ఎక్కువ సంతానం ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని టీఆర్ఎస్ సర్కారు చూస్తోందని, ఆ బిల్లును అడ్డుకుంటామని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కేంద్రానికి పంపిన కేసీఆర్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఈ సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాగా, ఈ బహిరంగసభ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అతడిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
‘టీకాలను భారత్‌లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయ్యింది. ఇందుకు మోదీ సర్కార్ అనుసరించిన వ్యాక్సిన్ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఏర్పడిందని జాతీయ స్థాయిలో పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు. ఆయన తన ట్విటర్లో.. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీకాలకు సంబంధించి తెలుపుతున్న 10 సెకండ్ల వీడియోను ట్వీట్ చేశారు. “ఈ పది సెకన్ల వీడియో మోదీ భండారాన్ని బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. మోదీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం” అని కామెంట్ పెట్టి తీవ్రస్థాయిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్‌తో పాటుగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిపింగ్‌ను జతచేశారు. ఆ వీడియోలో.. భారత్‌లో సరఫరా చేసిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసినట్లు రాయబారి తెలిపారు. ఇటీవల పరిమిత టీకాల కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల క్రితమే 18-44 ఏళ్ల పిల్లలకు టీకాలు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ( చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్ ) A 10 sec video that EXPOSES MODI. India’s representative at the @UN informed the United Nations that India sent more vaccines abroad than has vaccinated its own people. Modi is now truly a world leader. Indians can go to hell. pic.twitter.com/tTF8q60HT5 — Yashwant Sinha (@YashwantSinha) May 16, 2021 -
‘పుల్వామా ఉగ్ర దాడి వెనుక బీజేపీ’
న్యూఢిల్లీ: ఓట్ల కోసమే జవాన్లను చంపేశారని, పుల్వామా ఉగ్రవాద ఘటన వెనుక కాషాయ పార్టీ కుట్ర ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పూల్వామా ఉగ్రవాద దాడులను బీజేపీ చేసిన కుట్రపూరిత చర్యగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీ ఓట్ల రాజకీయంలో సైనికులు బలయ్యారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే.. పుల్వామా దాడిపై విచారణ జరిపిస్తుందని, ఆ దర్యాప్తులో అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. పారా మిలిటరీ దళాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయని.. అసలు జమ్మూ-శ్రీనగర్‌ల మార్గంలో సెక్యూరిటీ తనిఖీలు లేవని, సైనికులను సాధారణ బస్సుల్లో తరలించారన్నారు. తాను ఇప్పడీ విషయాల గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని, ప్రభుత్వం మారినప్పడు జరిగే దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ యాదవ్ చెప్పారు. -
ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మిసెస్ ట్రంప్
వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వలసదారుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలిసిన విషయమే. మెక్సికో నుంచి వచ్చే అక్రమ వలసదారులను అరికట్టేందుకు ఏకంగా మెక్సికో - అమెరికా సరిహద్దులో గోడ నిర్మిస్తానన్న సంగతి విధితమే. గోడనైతే నిర్మించలేదు కానీ అంతకంటే కఠిన చట్టాలు చేసి వలసదారులకు ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ట్రంప్ అనుసరిస్తున్న ‘కఠిన సరిహద్దు భద్రతా విధానం’ పట్ల అమెరికాలోని అన్ని రాజకీయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచే కాక స్వయంగా స్వపక్షం నుంచి కూడా విమర్శలు ఎదురవుతుండటం గమనార్హం. చివరకు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా వలసదారుల పట్ల ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరును తప్పు పట్టారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా ‘ఫాదర్స్ డే’ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెలానియా ట్రంప్...‘చట్టాలు నిక్కచ్చిగా అమలు చేసే దేశం, అమెరికా అంటే నాకు నమ్మకం ఉంది. కేవలం చట్టాలతో మాత్రమే కాక హృదయంతో కూడా పాలన కొనసాగడం మరింత శ్రేయస్కరం. వలసదారులను వెనక్కి పంపించే క్రమంలో చాలామంది పిల్లలను వారి కుటుంబాల నుంచి వేరు చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ఈ జఠిల సమస్య పరిష్కారానికి ఇరు రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. ఇరువురు ఉమ్మడిగా ఆలోచించి సరైన వలసదారుల విధానాన్ని రూపొందించాలి’ అన్నారు. ఇదిలా ఉండగా ట్రంప్ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ‘వలసదారుల అమెరికా విడిచి పోవాల్సింది’గా ఆదేశాలు జారీ చేయడమే కాక అందుకు ఆరు వారాల గడువు విధించింది. ఇచ్చిన గడువు లోపు వలసదారులు వారి దేశాలకు తిరిగి వెళ్లాలి. లేదంటే వారిని అరెస్టు చేస్తామని ఆదేశించింది. అంతేకాక వలసదారుల పిల్లలకు అమెరికాలోనే ఆశ్రయం కల్పిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన నేపధ్యంలో దాదాపు 2 వేల మంది మైనర్ పిల్లలను వారి కుటుంబం నుంచి వేరు చేసి, వారిని శరణార్ధుల శిబిరానికి తరలించారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ చర్యలు పిల్లలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని...ఈ చర్యలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. -
ఎన్నికల కోసమే చెక్కుల పంపిణీ
సాక్షి, గద్వాల : భూమి సర్వే చేయకుండానే భూ రికార్డులు సరిచేశారని.. ఇప్పటికీ భూ రికార్డులు తప్పులతడకగా ఉన్నాయని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. గురువారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుబంధు పథకంలో నియోజకవర్గంలోని 30 శాతం మంది రైతులకు చెక్కులు, పాస్‌పుస్తకాలు అందలేదని, వాస్తవంగా ఉన్న భూమికి రికార్డుల్లో ఉన్న భూ వివరాలకు పొంతనలేని పరిస్థితి ఉందన్నారు. ఒక్కో మండలంలో వేల ఎకరాల్లో భూమి ఉన్నదాని కంటే రికార్డులు ఎక్కువగా ఉన్నట్లు చూయిస్తోందని రెవెన్యూ అధికారులే చెబుతున్నారని, చాలా గ్రామాల్లో తప్పులు తడకగా రికార్డులు ఉన్నాయని, చెక్కులు లేకున్నా లక్షలు విలువ చేసే భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు భయపడుతున్నారని తెలిపారు. చెక్కులు, పాస్‌పుస్తకాలు అందలేదని గ్రామ పంచాయతీ ఎన్నికల లోపే ఆ సమస్యలను పరిష్కరించి అందరికి పాస్‌పుస్తకాలు, చెక్కులు అందజేయాలని డిమాండ్ చేశారు. రాబోయే సర్పంచు ఎన్నికల్లో గెలుపొందాలనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం రూ. 4వేల చెక్కులను ఇస్తుందని ఆరోపించారు. నాలుగేళ్లుగా రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని తీసుకొచ్చిందని, లక్ష రుణమాఫీకి నాలుగేళ్ల సమయం తీసుకున్నారన్నారు. దేశంలోనే ఎక్కువశాతం రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగేళ్లుగా నెట్టెంపాడు కాలువలను కూడా పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. గట్టు ఎత్తిపోతల పథకం ఇంకా డీపీఆర్ దశలోనే ఉందని, గద్వాలలోని ఈద్గాకు రూ.2కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని, డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నట్లు ఈద్గా కమిటీ ద్వారా తెలిసిందని, ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు తెలియజేయాల్సి ఉన్నా ఇప్పటి అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, డీటీడీసీ నర్సిములు, సుదర్శన్, ఇతర నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రైతులకు పరిహారం ఇవ్వరా..?: పొన్నాల
సాక్షి, హైదరాబాద్ : వడగండ్ల వర్షాలతో పంట నేలపాలవుతున్నా, పిడుగుపాట్లతో రైతులు మృత్యువాత పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ...పంట నష్టంపై ఇంతవరకు అధికారులెవ్వరూ క్షేత్రస్థాయికి వెళ్లలేదని, రైతులకు నష్ట పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఇప్పటివరకు కనీసం పరామర్శించని సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుబంధు పేరుతో వారిని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
కాంగ్రెస్ పాపాల్లో కమ్యూనిస్టులూ బాధ్యులే
సాక్షి, హైదరాబాద్ : యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కొమ్ముకాసిన కమ్యూనిస్టు పార్టీకి ఇందులో బాధ్యత లేదా అని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచి ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటన్నారు. సోమ వారం ఆయన బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. అవినీతి, అక్రమాలకు నిలయమైన కూటములతో జతకట్టే కమ్యూనిస్టులు కౌరవులా, దేశంకోసం పనిచేస్తున్న బీజేపీ నేతలు కౌరవులా అని ప్రశ్నించారు. గవర్నర్‌కు మెమోరాండం అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకు నేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే తగు విధంగా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ నరసింహన్‌ను కోరింది. సోమవారం ఆ పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్‌రెడ్డి, సుధాకరశర్మ, ప్రకాశ్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. -
కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి
టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులదే కీలక భూమిక పోషించారు. అలాంటి వారికి కేసీఆర్ హామీలు ఇచ్చి మోసగించారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మికులు.. వారి కుటుంబాలకు అన్యాయం జరిగింది. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్కు గురైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి విస్మరించారు.’ రూ.10 లక్షల ఇంటి రుణం హామీ అమలుకాలేదు. కొత్త గనులు, ఉద్యోగాల కల్పన గాలికొదిలారు. అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి గోదావరిఖనిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రలో మాట్లాడారు. గోదావరిఖని : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సింగరేణి కార్మికులే కీలకభూమిక పోషించారని, అలాంటి వారికి అనేక హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసగించారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రెండోవిడత ప్రజాచైత న్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరిగిన బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ కా ర్మికులను, వారి కుటుంబాలను మోసం చేశారన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరని స్వయంగా అసెంబ్లీలో ప్రకటించి వారిని పర్మినెంట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. గైర్హాజరు పేరుతో డిస్మిస్కు గురైన కార్మికులనూ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి మోసం చేశారన్నారు. 2014 ఎన్నికల్లోనే రూ.10లక్షలు ఇంటి రుణం ఇప్పిస్తామన్న హామీ అమలు చేయలేదన్నారు. కొత్తగనులు, ఉద్యోగాల కల్పన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. 20 అసెంబ్లీ స్థానాల్లో సింగరేణి కా ర్మికుల ప్రభావం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజా వ్యతిరేక పాలనపై యుద్ధం : మక్కాన్‌సింగ్ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకులు మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, కానీ నేటి ప్రభుత్వంలో పక్కనే ఉన్న రామగుండంకు తాగు, సాగునీరు ఇప్పించలేని పరిస్థితి ఉందన్నారు. సాగు, తాగునీటి కోసం పాదయాత్ర చేస్తే ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, కానీ అది పూర్తవుతుందా లేదా అనేది నమ్మకం లేదన్నారు. 62.5 మెగావాట్ల రామగుండం విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరిస్తామన్న హామీ నెరవేరలేదన్నారు. ప్రశ్నించేవారిని గొంతునొక్కుతున్న ఈ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పకతప్పదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, దానం నాగేందర్, డి.శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆరెపెల్లి మోహన్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు రవి, గోమాస శ్రీనివాస్, హర్కర వేణుగోపాల్‌రావు, జనక్‌ప్రసాద్ మాట్లాడారు. బోడ జనార్దన్, ప్రేమ్‌సాగర్‌రావు, నేరెళ్ల శారద, ఫకృద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, గంట సత్యనారాయణరెడ్డి, దాసోజు శ్రావణ్, భార్గవ్ దేశ్‌పాండే, అరవిందరెడ్డి, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగసభ నిర్వహించగా.. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రామగుండం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లతోపాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల నుంచి ప్రజలను సమీకరించారు. బహిరంగసభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహ నిండింది. సభ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ దూరప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు సభ ముగిసేవరకు ఉన్నారు. రాష్ట్రంలో సోయిలేని పాలన: రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సోయిలేని పాలన సాగుతోందని... గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయానికి వెళ్లేవారని.. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే ఉంటూ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. 12 వందల మంది విద్యార్థుల బలిదానంతో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్, వారి కుటుంబం అధికారాన్ని చేపట్టి ఆర్థికంగా బలపడుతున్నారని ఆయన అన్నారు. సింగరేణిలో ఎన్నికల సమయంలో దసరా పండుగకు ఓటేస్తే.. దీపావళి పండుగకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్, టీఆర్ఎస్ నాయకుల మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న తెలంగాణను.. అప్పుల తెలంగాణగా మార్చారని, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. -
‘చంద్రబాబు సచ్ఛీలతను నిరూపించుకోవాలి’
మదనపల్లె: అవినీతి అక్రమాలతోపాటు, కేంద్రం నిధుల దుర్వినియోగంపై బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్‌తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శని వారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని సీఎంలలో ఎక్కువ పరిపాలన అనుభవజ్ఞుడిగా చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని, టీడీపీ నాయకులు అవినీతికి పాల్ప డుతున్న వైనాన్ని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు వివరిస్తున్నారని, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అమిత్‌షా పంపిన నిధుల వివరాల లేఖపై సీఎం ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. కేంద్ర నిధుల వినియోగంపై బీజేపీ, టీడీపీ భిన్న కథనాలు వెలువరిస్తున్న నేపథ్యంలో జ్యుడిషియల్ లేదా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా చేస్తున్న పోరాట ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపారు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిధులు ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ పనులకు రూ.23 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ భాగస్వామ్యంతో సీసీ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఇంకా రావాల్సి ఉందని, త్వరలో వీటిని తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సమావేశంలో బీసీ నాయకులు జన్నే రాజేంద్రనాయుడు, కౌన్సిలర్ మస్తాన్‌రెడ్డి, అంబేడ్కర్ చంద్రశేఖర్, పూజారి రమేష్, వెలుగు చంద్ర, కృష్ణగోపాల్ నాయక్ పాల్గొన్నారు. -
పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు: పల్లె
-
పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదు
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్‌ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇచ్చాడు కాబట్టే ఆయన సలహాలను పరిగణలోకి తీసుకున్నామని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శేఖర్ రెడ్డి కేసులో లోకేశ్ హస్తం ఉందని పవన్ ఆరోపించడం అర్థం లేనిదనీ, ఇంతవరకు శేఖర్‌రెడ్డిని లోకేశ్ చూడలేదనీ తెలిపారు. శేఖర్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారని తెలిపారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అర్థరహితమని పేర్కొన్నారు. పవన్ పరిణతి చెందిన నాయకుడిగా వ్యవహరించడం లేదని పల్లె రఘునాథరెడ్డి మండిపడ్డారు. లోకేశ్‌పై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కాగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ చేస్తున్న అవినీతి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసే పనులకు ఎన్టీఆర్ ఆత్మ పడే క్షోభ అంతా ఇంతా కాదంటూ పవన్ కల్యాణ్... జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. -
చంద్రబాబు అవినీతిపై పోరాటం
-
అర్చక సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: అర్చకులు, దేవాదాయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. దేవాలయాల అర్చక ఉద్యోగ సమాఖ్య జూన్ నాలుగు నుంచి నిర్వహించనున్న సమ్మెకు సంబంధించి గోడ పత్రికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు సమస్యలు విన్నవించినా ఫలితం లేకపోవడంతో సమ్మెకు వెళ్తున్నారన్నారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్న వీరి డిమాండ్ న్యాయమైనదని పేర్కొన్నారు. అర్చక ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ భానుమూర్తి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అర్చకులు, ఉద్యోగులు పాల్గొన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నర్సింగరావు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోదీపై విమర్శ.. రాహుల్ కు ప్రశంస
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించడం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తప్పిదమని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా విమర్శించారు. ఇలా వ్యాఖ్యనించడంలో మోదీ ఉద్దేశం.. కేవలం నేను, నేనొక్కడినే అనే తీరుగా వ్యవహరించడమేనని ఓమర్ వ్యాఖ్యానించారు. మోదీని విమర్శించడంతో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గురించి మాట్లాడుతూ.. కొన్ని రోజుల పాటు అజ్ఞాతానికి వెళ్లే ముందు ఉన్న రాహుల్ కు, ప్రస్తుతం కనిపిస్తున్న రాహుల్ కు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రధాని మోదీ పాలనపై రాహుల్ గాంధీ చాలా చక్కని విషయాలు, లోపాలు ఎత్తిచూపారని ఓమర్ మెచ్చుకున్నారు. రాహుల్ తీరును చూసి ఆశ్చర్యానికి లోనయినట్లు చెప్పారు. విదేశీ పర్యటనలో ప్రతిపక్షాలను విమర్శించడం మోదీ తప్పిదమని గతంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా చేసిన ఓమర్ అబ్దుల్లా అభివర్ణించారు. భారత్ లో పుట్టినందుకు సిగ్గుపడుతున్నామని విదేశాలలోని భారతీయులు అంటున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఓమర్ ఖండించారు. -
కార్పొరేట్ల రుణం తీర్చుకోడానికే!
భూసేకరణ బిల్లుపై రాహుల్ ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ల రుణం తీర్చుకునేందుకే ప్రధాని నరేంద్రమోదీ భూ సేకరణ బిల్లును తీసుకువచ్చారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాలరాసేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు వ్యతిరేకంగా.. రైతుల పక్షాన తాను ముందుండి పోరాడుతానన్నారు. రాంలీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కిసాన్ మహా ర్యాలీ(సభ)నుద్దేశించి మాట్లాడుతూ మోదీ సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండు నెలల సెలవు అనంతరం రెండురోజుల క్రితమే ఢిల్లీ తిరిగొచ్చిన రాహుల్ నూతనోత్సాహంతో కనిపించారు. అకాల వర్షాలతో ఇప్పటికే దెబ్బతిని ఉన్న రైతులపై పుండుపై కారంలా ప్రభుత్వం భూ బిల్లును తీసుకువస్తోందని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ విమర్శించారు. ‘యువతరం గుండె చప్పుడ’ంటూ రాహుల్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. 2013లో తాము తెచ్చిన భూసేకరణ చట్టాన్ని బలహీన పర్చే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అందులో సవరణలు చేస్తోందని ఆక్షేపించారు. లోక్‌సభ ఎన్నికలు, ఆ తరువాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ కాంగ్రెస్‌లో కొత్త జవసత్వాలు నింపేలా సభ విజయవంతమైంది. దేశం నలుమూలల నుంచి భారీగా వచ్చిన రైతులు, కూలీలు, కార్యకర్తలు పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపారు. భూబిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకునేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సభ విజయవంతమైంది. భూములు లాక్కోవడమే మోదీ మోడల్ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘బడా పారిశ్రామిక వేత్తల నుంచి కోట్లాది రూపాయలు రుణంగా తీసుకుని, వాటిని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుని మోదీజీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మీ భూములు లాక్కొని ఆ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం ద్వారా ఆ రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. మొదట సాగునీరు అందించకుండా, సబ్సిడీలో ఎరువులు దొరకనివ్వకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిమ్మల్ని బలహీనులుగా మారుస్తారు. ఆ తరువాత మీ భూముల్ని లాక్కుని తన కార్పొరేట్ మిత్రులకు బహుమతిగా ఇస్తారు. అదే ప్రధాని ప్రణాళిక. గుజరాత్లో అమలు చేసిన ఈ ప్లాన్‌ను ఇప్పుడు దేశవ్యాప్తం చేయాలనుకుంటున్నారు. పునాదులను బలహీనపర్చి.. భవనానికి ప్రకాశవంతమైన రంగులేసి, వెలిగిపోతున్నామంటూ ప్రపంచానికి చూపాలనుకుంటున్నారు. లోలోపల భవనం బలహీనమవుతున్న విషయాన్ని మాత్రం మరుగుపరుస్తున్నారు. ఇదే మోదీ మోడల్’ అంటూ మోదీపై విరుచుకుపడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని, వారి ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోదన్నారు. ‘రైతులు దేశానికి శక్తినిస్తున్నారు. హరిత విప్లవం దేశానికి ఆహారాన్ని ఇచ్చింది. రైతుల చెమట చుక్కలతో ఈ దేశం అభివృద్ధి చెందింది. ఇప్పుడా రైతులు తమ భూములను ఎప్పుడు, ఎవరు లాక్కుంటారోనని భయపడుతున్నారు. తమ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా? అని ఆందోళన చెందుతున్నారు’ అని రైతుల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. భూములు బంగారం కన్నా విలువైనవన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల పొట్టగొట్టొద్దు భూసేకరణ చట్టంలో రైతులకు సాధికారత కల్పించేలా యూపీఏ పొందుపర్చిన నిబంధనలను మోదీ సర్కారు తొలగించాలనుకుంటోందని రాహుల్ ధ్వజమెత్తారు. ‘అభివృద్ధి అవసరమే.. రైతులూ అవసరమే. అభివృద్ధి పేరుతో రైతుల పొట్టగొట్టిపారిశ్రామికవేత్తల కడుపునింపే ప్రయత్నాలను అడ్డుకుని తీరుతాం’ అని అన్నారు. ఒడిశాలోని నియంగిరి హిల్స్‌లో నిర్మించ తలపెట్టిన పారిశ్రామిక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఉద్యమానికి బాసటగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించారు. తమ భూములు లాక్కొంటే నక్సలైట్లలో చేరుతామంటూ 400 మంది స్థానిక యువకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నియంగిరిలో గెలిచినట్లే ఈ భూబిల్లు విషయంలోనూ గెలుస్తామన్నారు. నియంగిరి, భట్టాపర్సాల్ తరహా ఉద్యమాలు చేయాలని రైతులకు సూచించారు. వారికి బాసటగా నిలుస్తానన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పేరుతో రైతుల భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. కెనడాలో గత ప్రభుత్వాల పై మోదీ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తులు చేయాల్సిన వ్యాఖ్యలు అవి కావన్నారు. ‘భార తదేశ ప్రజల శక్తి ఆయనకు అర్థం కాదు. యాభై ఏళ్లుగా ఈ దేశాన్ని నిర్మించిన మీ చెమట, రక్తం విలువ ఆయనకు తెలియదు. ఆయన మాటలు ఆయనకు గానీ, ప్రధాన మంత్రి పదవికిగాని శోభనివ్వవు’ అన్నారు. రైతులకు అన్యాయం జరగనివ్వం సభనుద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ సభ మోదీ సర్కారుకు ఒక సందేశం కావాలన్నారు. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. రైతు కుటుంబమంతా రాత్రి, పగలు తేడా లేకుండా పొలాల్లోనే కష్టపడే సమయమిదని తనకు తెలుసని, అయినా భారీ సంఖ్యలో ఈ సభకు హాజరైనందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానన్నారు. ‘రైతులు, వ్యవసాయ కూలీలు, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదు అన్న సందేశాన్ని దేశ ప్రధానికి గట్టిగా పంపేందుకే మనమంతా ఈ రోజు ఇక్కడ కలిశాం’ అన్నారు. ‘అధికారంలో లేకున్నా రైతుల పక్షాన పోరాడడంలో వెనకాడం. రైతుల గొంతుకను పార్లమెంట్లో వినిపిస్తాం’ అని అన్నారు. రైతులకు సాధికారత కల్పించేందుకు భూ సేకరణ చట్టంలో తాము పొందుపర్చిన నిబంధనలన్నింటినీ మోదీ ప్రభుత్వం తొలగించాలనుకుంటోందని విరుచుకుపడ్డారు. ‘అందరితో కలిసి..అందరి అభివృద్ధి’ అని చెప్పే మోదీకి రైతులు, కూలీలు ఆ అందరిలో ఒకరిగా కనిపించడం లేదా? అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ఒక్క రైతునూ ఆత్మహత్య చేసుకోనివ్వబోమన్న బీజేపీ ఎన్నికల హామీ ఏమైందని అడిగారు.