జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని ఆయన విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు తమతో ఉంటూ అకస్మాత్తుగా టీడీపీపై విమర్శలు చేయడం అనుమానాలనకు దారితీస్తోందని అన్నారు. పవన్ వెనుక బీజేపీ హస్తం ఉండచ్చొని, పవన్‌ను బీజేపీ ఒక పావులా వాడుకుంటుందని అభిప్రాయపడ్డారు.