సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ (ఫైల్)
న్యూఢిల్లీ: ఓట్ల కోసమే జవాన్లను చంపేశారని, పుల్వామా ఉగ్రవాద ఘటన వెనుక కాషాయ పార్టీ కుట్ర ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పూల్వామా ఉగ్రవాద దాడులను బీజేపీ చేసిన కుట్రపూరిత చర్యగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీ ఓట్ల రాజకీయంలో సైనికులు బలయ్యారని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే.. పుల్వామా దాడిపై విచారణ జరిపిస్తుందని, ఆ దర్యాప్తులో అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. పారా మిలిటరీ దళాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయని.. అసలు జమ్మూ-శ్రీనగర్‌ల మార్గంలో సెక్యూరిటీ తనిఖీలు లేవని, సైనికులను సాధారణ బస్సుల్లో తరలించారన్నారు. తాను ఇప్పడీ విషయాల గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని, ప్రభుత్వం మారినప్పడు జరిగే దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ యాదవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment