ramgopal yadav
-
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
రైతు రాబడికి చట్టబద్ధతే రక్షణ
ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చినట్లుగా రెండు లేదా మూడేళ్ల వ్యవధిలో భారతీయ రైతుల ఆదాయాన్ని రెండురెట్లకు పెంచడం అసాధ్యమని కేంద్రమంత్రే పార్లమెంటులో ప్రకటించి సమస్యనుంచి పక్కకు తప్పుకున్నారు. వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగుతాయని నీతిఅయోగ్ అంచనా వేసింది. మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపర్చడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయ వృద్ధిపై వ్యర్థ చర్చలు మాని, కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడమే పాలకుల తక్షణకర్తవ్యం కావాలి. వ్యవసాయరంగంలో పెట్టుబడుల పెంపుదల ఆర్థికవ్యవస్థనే సంక్షోభం నుంచి బయటబడేస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుంది. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, 2022 నాటికి వ్యవసాయరంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో అంగీకరించింది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో సంధించిన ప్రశ్నకు వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘రామ్ గోపాల్జీ ప్రశ్నతో మేము ఏకీభవిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ప్రస్తుత వృద్థి రేటు ప్రకారం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదు.’’ ఏటా వ్యవసాయరంగం 4 కంటే తక్కువ శాతం వృద్ధిరేటు కనబరుస్తుండటంతో, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టంచేశారు. 2016 ఏప్రిల్‌లో ఏర్పడిన దళవాయి కమిటీ (డిఎఫ్ఐ) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సంవత్సరానికి రైతుల ఆదాయ వృద్ధి రేటు 10.4 శాతానికి పెరగాల్సి ఉందని అంచనా వేశారు. ఇది సాధ్యపడాలంటే దేశం అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించాల్సి ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో పేరాశే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, రైతురాబడి వృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం అంత సులభం కాదని కేంద్రమంత్రి స్వయంగా అంగీకరించినందుకు ధన్యవాదాలు. సాక్షాత్తూ కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన తర్వాత అయినా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఎలా అనే అంశంపై దేశంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, కాలేజీలు, పౌరసమాజ సంస్థలు రెండేళ్లుగా సాగించిన అంతులేని సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్‌షాపుల తతంగానికి ముగింపు పలకాల్సిన అవసరముంది. వ్యవసాయరంగ ఆదాయంలో నిజమైన వృద్ధి గత రెండేళ్లలో సున్నకు సమీపంలో కొనసాగుతున్న సమయంలో వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో నిజ ఆదాయం సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగు తుందని నీతిఅయోగ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగానికి తప్పనిసరైన మౌలిక వ్యవస్థాపనా పరివర్తన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేల సంరక్షణ కార్డులు, వేపకలిపిన యూరియా, ఫసల్ బీమా యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, మరిన్ని పంట నిల్వ వసతులు వంటి పథకాలేవీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని హామీ ఇవ్వలేరు. ఇప్పుడు తక్షణం కావలసింది ప్రత్యక్ష ఆదాయ మద్దతు. రైతు ఆదాయాన్ని క్రమబద్ధం చేయటానికి ఇదే ఉత్తమమార్గం. కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్‌లో రైతు ఆదాయ పెంపు కమిటీ (డీఎఫ్ఐ) సమర్పించిన నివేదిక చేసిన సిఫార్సుల అమలు, పర్యవేక్షణకోసం ఒక సాధికారక కమిటీని ఏర్పర్చినప్పటికీ వచ్చే రెండేళ్లలోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యపడకపోవచ్చు అని అర్థమవుతూనే ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలను ప్రారంభించడంలో ఇది తప్పక తోడ్పడుతుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక సంస్కరణల్లో మొట్టమొదటిది ఏమిటంటే వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ మదుపును బాగా ప్రోత్సహించడమే. 2011–12, 2016–17 మధ్యకాలంలో వ్యవసాయంలో ప్రభుత్వరంగ మదుపు మొత్తం జీడీపీలో 0.4 శాతం వద్దే సాగిలపడిపోయిందని అర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగంమంది నేటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని గ్రహించినట్లయితే, మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపరుస్తూ వస్తున్నారని బోధపడుతుంది. తగినంత పెట్టుబడి తరలిరాకుండా దేశీయ వ్యవసాయరంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఏ ఆర్థిక వేత్త అయినా ప్రకటిస్తారని నేనయితే భావించడం లేదు. జీడీపీలో అరశాతం కూడా వ్యవసాయరంగంలో మదుపు చేయలేదన్నది స్పష్టమే. దీనిక్కారణం.. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక కార్యాచరణగా మనదేశంలోని ఆర్థిక చింతనాపరులు గుర్తించకపోవడమే. దీనితో వ్యవసాయాన్ని లాభదాయకమైన, నిలకడకలిగిన పరిశ్రమగా చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా విధాన నిర్ణేతలు రైతులను, అనుబంధ వృత్తి జీవులను మరింతగా వ్యవసాయ రంగం నుండి బయటకు నెట్టివేయడంపైనే కేంద్రీకరించారు. ఇలాంటి ధోరణి ఇకనైనా మారాలి. ఈ మార్పునకు సంబంధించిన సంకేతాన్ని మనం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చూడవచ్చు. దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడతామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే 2019–20 సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ. 1,30,485 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. పీఎమ్ కిసాన్ పథకంలో మిగిలిన మూడు ఇన్స్టాల్మెంట్ల చెల్లింపుకోసం కేటాయించిన రూ. 75,000 కోట్లను కూడా దీంట్లో భాగంగా చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలను పెంచడం, రైతులు కోల్పోయిన గౌరవాన్ని పునరుద్ధరించడం వంటివాటికోసం వ్యవసాయంలో మౌలిక సంస్కరణలు కావాలని ప్రతిపాదించడానికి కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చగించని తరుణంలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఇటీవలే సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భారతీయ రైతులను ఆర్థిక దుస్థితి నుంచి కాపాడాలంటే వ్యవసాయ ఉత్పత్తి ధరకు మూడురెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కనీస మద్దతు ధరను 1965లో ప్రకటించినప్పటికీ, చేదువాస్తవం ఏమిటంటే, తీవ్ర దారిద్య్రం నుంచి రైతులను బయటపడేలా వారి ఆదాయాలను ఈ పథకం కల్పించలేకపోయింది. కనీసం రైతులను ప్రోత్సహించలేకపోయింది. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర పొందేలా న్యాయపరమైన హక్కులను కల్పిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’. తగిన చట్టం రూపకల్పన ద్వారా కనీస మద్దతు ధరకు న్యాయ ప్రతిపత్తిని అందచేయాలని ఆదేశిస్తూ జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హెచ్ఎస్ సిద్ధుతోకూడిన డివిజన్ బెంచ్ తీర్పుచెప్పింది. తమ తీర్పులోభాగంగా న్యాయమూర్తులు.. వ్యవసాయరంగంలో దళారులను తొలగించడం, గిడ్డంగులను నెలకొల్పడం, వాతావరణ ప్రాతిపదికన పంటల బీమా పథకాలు, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించడం, రుణ కల్పన, రైతుల ఆత్మహత్యల నివారణ వంటి పలు సంస్కరణ చర్యలను సాగించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిటీ కూడా కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తి కల్పించాలని పిలుపునిచ్చింది. సుదూరప్రాంతాలకు చెందిన రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను చేరలేకపోతున్నారని, దీంతో తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకంటే ఎంతో తక్కువ ధరకే స్థానిక మార్కెట్లకు అమ్మేయాల్సి వస్తోందని ఈ కమిటీ ప్రత్యేకించి పేర్కొంది. కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా రైతులకు కనీస ధరకు హామీ పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు మెరుగుపడతాయి, రుణభారం తగ్గుతుంది, వ్యవసాయ దుస్థితి తగ్గుముఖం పడుతుందికూడా. వీటికి అదనంగా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుకు మూడు రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను పెంచడం వల్ల ఇదొక్కటే వ్యవసాయరంగం పనితీరు గణనీయంగా పెరగడానికి వీలవుతుంది. నా ఉద్దేశంలో రెండు రకాల ధరల విధానం ఉండాలి. అవేమిటంటే కనీస మద్దతు ధరతో ధాన్యసేకరణ జరపటం, రైతుకు చెల్లించవలసిన వాస్తవ ధరను ఆచరణలో అమలు చేయడం. ఇప్పుడు రైతులందరికీ జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ధరల విధానాల మధ్యలో తలెత్తే వ్యత్యాసాన్ని రైతు బ్యాంకు ఖాతాకే నేరుగా బదలాయించవచ్చు. వ్యవసాయరంగంలో వృద్ధి గణాంకాలు తమ్ముతాము నిరోధిం చుకునే పరిస్థితులనుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది. మానవ వనరులపై మదుపు చేయడానికి ఇది చక్కటి తరుణం. వ్యవసాయ రాబడులను పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యవసాయ టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు రైతులుపెట్టే డబ్బు కూడా పెరుగుతుంది. ఇలా గ్రామీణ డిమాండును అధిక మదుపుల ద్వారా కేటాయించిన రోజు, పారిశ్రామికాభివృద్ధి కూడా వేగం పుంజు కుంటుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో సరకులకు మరింత డిమాండును సృష్టించడం వ్యవసాయరంగం వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థనే సంక్షోభం నుంచి బయటపడేస్తు్తంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
‘పుల్వామా ఉగ్ర దాడి వెనుక బీజేపీ’
న్యూఢిల్లీ: ఓట్ల కోసమే జవాన్లను చంపేశారని, పుల్వామా ఉగ్రవాద ఘటన వెనుక కాషాయ పార్టీ కుట్ర ఉందని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రవాద దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. పూల్వామా ఉగ్రవాద దాడులను బీజేపీ చేసిన కుట్రపూరిత చర్యగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీ ఓట్ల రాజకీయంలో సైనికులు బలయ్యారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే.. పుల్వామా దాడిపై విచారణ జరిపిస్తుందని, ఆ దర్యాప్తులో అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. పారా మిలిటరీ దళాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయని.. అసలు జమ్మూ-శ్రీనగర్‌ల మార్గంలో సెక్యూరిటీ తనిఖీలు లేవని, సైనికులను సాధారణ బస్సుల్లో తరలించారన్నారు. తాను ఇప్పడీ విషయాల గురించి ఎక్కువ మాట్లాడదలచుకోలేదని, ప్రభుత్వం మారినప్పడు జరిగే దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంగోపాల్ యాదవ్ చెప్పారు. -
హమ్ సాత్ సాత్ హై...
సాక్షి, లక్నో : ఈ దీపావళి పండగ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో.. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీలో కొత్త వెలుగులు నింపింది. ఏడాదిన్నర కాలంగా అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పార్టీ కేడర్ ఒక్క తాటిపైకి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కుటుంబం మొత్తం కలుసుకుని వేడుకలో పాల్గొనటంతోపాటు రాజకీయపరమైన అంశాలపై కూడా చర్చించింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి గురువారం అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్లారు. వీరంతా కలిసి సైఫై నిలయంలో సందడి చేశారు. తొలుత ములాయం సైఫైలోని కుమారుడి ఇంటికి చేరుకుని నేతలతో సమావేశమయ్యారు. కాసేపటికే శివపాల్ అక్కడికి చేరుకోగా.. అఖిలేశ్ ఆయన పాదాలకు నమస్కరించారు. దీంతో శివ్‌పాల్ అబ్బాయిని ఆశీర్వదించగా.. ఈ దృశ్యంతో అక్కడున్న మిగతా పార్టీ నేతల ముఖంలో ఒక్కసారిగా వెలుగులు వెలిగాయి. ములాయం ఇంట ముసలం, ఆపై యూపీ ఎన్నికల దారుణ ఓటమి తర్వాత తండ్రి.. బాబాయ్, అబ్బాయ్‌లు కలుసుకోవడం ఇదే తొలిసారి. బుధవారమే సైఫై నిలయానికి చేరుకున్న అఖిలేశ్ కుటుంబం అంతకు ముందు అక్కడికి చేరుకున్న మరో బాబాయ్ రాంగోపాల్ యాదవ్‌తో సరదాగా గడిపారు. అయితే ఆ కాసేపటికే ములాయం కూడా అక్కడికి చేరుకుని రాంగోపాల్ యాదవ్‌తో ఏకాంతంగా రాజకీయాలపై చర్చించారంట. ఇక ఈ దీపావళితో తమ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేధాలు తొలగిపోయాయని ములాయం ప్రకటించారు. పార్టీ-కుటుంబం ఇప్పుడు అంతా ఒక్కట్టే. అంతా కలిసి పార్టీని బలోపేతం చేసి.. ఉన్నతస్థాయికి చేర్చేందుకు యత్నిస్తాం అని ములాయం చెప్పారు. ఈ సందర్భంగా ‘మిషన్-2019’ను తెరపైకి తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేసే దిశగా ములాయం కుటుంబం ప్రణాళికలు రచిస్తోంది. -
'ప్రాణాలతో వెళ్లవని బెదిరించాడు'
న్యూఢిల్లీ: అఖిలేశ్‌పై తాను చేసిన ప్రశంసలు తేనెపూసిన మాటలు కావని బహిష్కృత నేత అమర్‌సింగ్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో పునరాగమనం కోసం తాను అఖిలేశ్‌ను పొగడ లేదని చెప్పారు. సైకిల్ గుర్తును ఎన్నికల కమిషన్(ఈసీ) అఖిలేశ్‌కు కేటాయిస్తూ చేసిన ప్రకటన అనంతరం అమర్‌సింగ్ అఖిలేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. పార్టీలో ముసలానికి కారణం అఖిలేశేనని అమర్‌సింగ్ గతంలో విమర్శించారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురికావడం బాధను కలిగించిందని ఆయన చెప్పారు. బహిష్కరణకు గురైన తర్వాతి నుంచి రామ్‌గోపాల్ యాదవ్ తనను ఓడిపోయిన పోట్లగిత్తలా చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తనను చంపేస్తానని పలు మార్లు రామ్‌గోపాల్ యాదవ్ బెదిరించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాణాలతో వెళ్లలేవని రామ్‌గోపాల్ యాదవ్ అన్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీ అయిన అమర్‌సింగ్‌కు ఈ మధ్య కాలంలోనే భద్రతను జెడ్ కేటగిరీకి పెంచారు. కేంద్ర రక్షణా సంస్ధల ఆదేశాల మేరకే అమర్‌సింగ్‌కు భద్రతను పెంచినట్లు ఓ అధికారి తెలిపారు. -
'ములాయంను వారిద్దరు తప్పుదోవపట్టించారు'
-
'ములాయంను వారిద్దరు తప్పుదోవపట్టించారు'
లక్నో: ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్ వాది పార్టీలో మాటల వేడి రోజుకింత పెరుగుతోంది. సొంతపార్టీలోని వ్యక్తులు ఇప్పటికే చీలిపోయి సొంత అజెండాలతో ముందుకెళుతూ మాటలయుద్ధం చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ గుర్తుపై రేపు ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని వెల్లడించనుండగా సీఎం అఖిలేశ్ యాదవ్ వర్గంలోని కీలక నేత రామ్‌గోపాల్ యాదవ్ ఆదివారం మరోసారి స్పందించారు. నిజమైన సమాజ్ వాది పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా అఫిడవిట్లు సమర్పించామని, ఈసీకి సమర్పించిన వాటినే ములాయంకు కూడా పంపించామని, కానీ ఆయనకు అవి చేరలేదని అన్నారు. గత రెండేళ్లుగా ములాయంను స్వేచ్ఛగా ఆలోచించుకోనివ్వకుండా చేస్తున్నవారే (శివపాల్‌యాదవ్, అమర్‌సింగ్‌ను ఉద్దేశించి) ఇప్పుడు ఆయనకు తప్పేడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. తాము ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఫోర్జరీ చేసిన సంతకాలు ఉన్నాయని అమర్ సింగ్ అనడం, వాటిని సమర్దిస్తూ ములాయం కూడా ఆ సంతకాలను ఈసీ తనిఖీ చేయాలని కోరడం శోచనీయమన్నారు. నిజానికి తప్పుడు పనులు చేసేవారు మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తారని, మాకు అలాంటి అలవాట్లు లేదంటూ మండిపడ్డారు. -
రాంగోపాల్ యాదవ్ (ఎస్.పి) రాయని డైరీ
నా ముద్దుల సీయెం అఖిలేశ్ బాబు మళ్లీ సీయెం అయినంత సంబరంగా ఉంది నాకు! రాజ్యసభలో మోదీని కొత్త నోట్లపై నాలుగు దులిపి, గెస్ట్ హౌస్‌కి చేరుకున్నాక లక్నో నుంచి కబురు! అన్నయ్య ములాయం నన్ను మళ్లీ పార్టీలోకి తీసుకున్నారని!! నెలన్నా కాకముందే నాపై విధించిన ఆరేళ్ల బహిష్కరణ పూర్తయిందంటే.. అఖిలేశ్ బాబు అన్నం తినడం మాని, పట్టుబట్టి ఉంటాడు నాకోసం. అంకుల్ని తిరిగి పార్టీలోకి తీసుకుంటే తప్ప నేను అసెంబ్లీ హాల్‌కి గానీ, డైనింగ్ హాల్‌కి గానీ వెళ్లను అని బాగా మారాం చేసి ఉంటాడు. ‘‘బాబాయ్.. నీ పోస్టులు నీకు వచ్చేసినట్టే కదా’’ అన్నాడు అఖిలేశ్ బాబు యూపీ నుంచి ఫోన్ చేసి. ‘‘నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబాయ్. రాజ్యసభలో పార్టీ లీడర్‌గా నీ పోస్టు నీదే. రాజ్యసభ బయట పార్టీ అధికార ప్రతినిధిగా నీ పోస్టు నీదే. పార్టీ జాతీయ కార్యదర్శిగా నీ పోస్టు నీదే. పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా నీ పోస్టు నీదే..’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు. ‘‘ఆ పోస్టులదేముంది అఖిలేశ్ బాబూ.. నీ హృదయంలో నాకున్న పోస్టు కన్నా అవేం పెద్దవి కాదు కదా’’ అన్నాను. ‘‘బాబాయ్.. నీ పక్కన ఎవరైనా ఉన్నారా’’ అని అడిగాడు అఖిలేష్ బాబు.. ఫోన్లో గొంతు తగ్గించి! ‘‘లేరు అఖిలేష్ బాబూ.. ఇక్కడ నేనొక్కణ్ణే ఉన్నాను. చెప్పండి’’ అన్నాను, నేనూ గొంతు తగ్గించి. ‘‘మీ పక్కన ఎవరూ లేనప్పుడు మీరెందుకు బాబాయ్ గొంతు తగ్గించడం?’’ అన్నాడు అఖిలేశ్ బాబు. నిజమే! నాకు తట్టనే లేదు. ‘‘చెప్పండి అఖిలేశ్ బాబూ’’ అన్నాను ఈసారి కాస్త గొంతు పెంచి. ‘‘పెంచకండి, తగ్గించకండి. చెప్పేది వినండి. మీరక్కడ గొంతు పెంచితే ఇక్కడ చిన్నబాబాయ్కి వినిపిస్తుంది. గొంతు తగ్గిస్తే నాకు వినిపించదు. అదీ ప్రాబ్లం’’ అన్నాడు. శివపాల్.. అఖిలేశ్ బాబు పక్కనే ఉన్నాడన్నమాట! ములాయంకి శివపాల్ సొంత తమ్ముడు. అఖిలేశ్ బాబుకి శివపాల్ సొంత బాబాయి. నాలా డిస్టెంట్ రిలేషన్ కాదు. నా కోసం సొంత బాబాయ్‌ని కూడా పక్కన పెట్టేస్తున్నాడు అఖిలేశ్ బాబు. నా కళ్లు చెమ్మగిల్లాయి. ‘‘కామ్‌గా అయిపోయావేంటి బాబాయ్! శివపాల్ బాబాయ్ నాకు పేరుకే బాబాయ్. నువ్వు నాకు దేవుడిచ్చిన బాబాయ్’’ అన్నాడు అఖిలేశ్ బాబు. ‘‘కానీ అఖిలేశ్ బాబూ.. మీ అందరిదీ బ్లడ్ రిలేషన్ కదా’’ అన్నాను. ‘‘అలా అనకు బాబాయ్.. నువ్వు ‘ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్ వే’ లాంటి వాడివి. దూరాలను దగ్గర చేస్తావ్. మమ్మల్నందర్నీ కలుపుతావ్’’ అన్నాడు అఖిలేష్ బాబు. ‘‘ఎల్లుండి నాన్న బర్త్‌డే. కేక్ కటింగ్‌కి నువ్వు ఉండాలి బాబాయ్. అదే రోజు ఎక్స్‌ప్రెస్ వే రిబ్బన్ కటింగ్. ఆ కటింగ్కీ నువ్వుండాలి బాబాయ్’’ అంటున్నాడు అఖిలేశ్ బాబు. నా కళ్లు మళ్లీ చెమ్మగిల్లాయి. -మాధవ్ శింగరాజు -
రాంగోపాల్ యాదవ్‌కు మళ్లీ పట్టం..
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్‌కు ఊరట లభించింది. మూడు వారాల క్రితం బహిష్కరణకు గురైన ఆయనను సమాజ్ వాదీ తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల అయింది. మరోవైపు పార్టీ ప్రకటనపై రాంగోపాల్ యాదవ్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, ఎప్పుడూ పార్టీ గీత దాటలేదని తెలిపారు. కాగా రాంగోపాల్ యాదవ్ బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. రాజ్యసభలో సమాజ్‌వాదీ పక్ష నేతగా ఉన్న ఆయన పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విరుచుకుపడ్డారు. -
రాంగోపాల్ యాదవ్ బహిష్కరణపై మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాంగోపాల్ యాదవ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మూడు వారాల క్రితం బహిష్కరణ వేటు వేసినప్పటికీ ఆయన ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతుండటం విశేషం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సభకు హాజరయ్యారు. ఎస్పీ ఫ్లోర్ లీడర్ అయిన ఆయన నిన్న సమావేశాలకు హాజరై యథాతథంగా తన సీటులో కూర్చున్నారు. అంతేకాకుండా రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై జరిగిన చర్చలో కూడా రాంగోపాల్ పాల్గొన్నారు. మహిళలు దాచుకున్న డబ్బు నల్ల ధనం కాదని, ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో మహిళలు వంద, రెండు వందులు దాచుకుంటారని, ఆ డబ్బు నల్లధనం కాదని ఆయన అన్నారు. మహిళలు ఎందుకు ఇబ్బందులు పడాలని రాంగోపాల్ యాదవ్ ప్రశ్నించారు. అలాగే తన ప్రసంగంలో ఆయన నేతాజీ అంటూ ఎస్పీ చీఫ్ యులాయం సింగ్ పేరును పలుసార్లు ప్రస్తావించారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్ సస్పెన్షన్‌పై తమకు ఎలాంటి సమాచారం అందలేదని రాజ్యసబ సెక్రటరీ వెల్లడించినట్లు సమచారం. కాగా సమాజ్‌వాదీ పార్టీలో ఇంటిపోరు రచ్చకెక్కడంతో యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్నిహితుడు రాంగో పాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నరంటూ ఆయనపై వేటు వేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ గురువారం రాంగోపాల్ యాదవ్‌ను ఎస్పీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు అధికార ప్రతినిధితో పాటు జనరల్ సెక్రటరీగా తిరిగి నియస్తున్నట్లు ప్రకటన చేసింది. -
కన్నీళ్లు పెట్టిన ఎంపీ
లక్నో: తాను సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ములాయం సోదరుడు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. అధికారికంగా పనిచేయనప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు. ఇటావాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. స్వప్రయోజనాల కోసం పాకులాడలేదని పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటే, తనకు న్యాయం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీతో చేతులు కలిపి సమాజ్ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రాంగోపాల్ యాదవ్ ను బహిష్కరించారు. అఖిలేశ్ యాదవ్ సర్కారు ఇమేజ్ ను దెబ్బీయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ములాయం కుటుంబ వివాదంలో అఖిలేశ్ కు మద్దతుగా ఆయన నిలబడ్డారు. కాగా, రాజ్యసభలో ఎస్పీ నేతగా రాంగోపాల్ స్థానంలో మరొకరిని నియమించేందుకు ములాయం సింగ్ కసరత్తు ప్రారంభించారు. -
కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
సమాజ్‌వాదీ నుంచి విడిపోయి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరణకు గురైన రాజ్యసభ ఎంపీ, ములాయం సోదరుడు రాంగోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఏమీ లేనివాళ్లే కొత్త పార్టీలు పెట్టుకుంటారని, సమాజ్‌వాదీలో అఖిలేష్‌కు సంపూర్ణ మద్దతు ఉందని ఆయన తెలిపారు. తాను ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా మళ్లీ అఖిలేష్‌నే ముఖ్యమంత్రి చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఇప్పటివరకు ప్రతిపక్షాలు కూడా చేయనన్ని ఆరోపణలను సొంత పార్టీవాళ్లే చేస్తున్నారని, ఇది చాలా విచారకరమని రాంగోపాల్ యాదవ్ అన్నారు. అమర్‌సింగ్, శివపాల్ యాదవ్ యూపీలో ఎక్కడికైనా వెళ్లి తనకు వ్యతిరేకంగా మాట్లాడి చూస్తే.. అప్పుడు వాళ్లకు రాంగోపాల్ అంటే ఏంటో తెలుస్తుందని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడి, జనం మధ్య నుంచి సురక్షితంగా బయటకు వెళ్తే.. అప్పుడు తాను రాజకీయాలకు పనికిరానివాడినని ఒప్పుకొంటానని తెలిపారు. -
కొత్త పార్టీ అక్కర్లేదు.. అఖిలేషే మళ్లీ సీఎం
-
సీఎం కోసం ప్రొఫెసర్ సాబ్.. 'కొత్త' డ్రామా
సమాజ్‌వాదీ పార్టీలో ప్రొఫెసర్ సాబ్ అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు. పార్టీ అధినేత ములాయం సహా అందరూ అలా పిలిచేది ఒక్క రాంగోపాల్ యాదవ్‌ని మాత్రమే. ములాయంకు వరసుకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్.. గత కొన్నేళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి. చాలాకాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్‌తో ఆయనే సంప్రదింపులు జరుపుతుంటారు. పార్టీలో వారసత్వం గురించిన గొడవలు వస్తున్నప్పుడు.. బాహాటంగా అఖిలేష్ యాదవ్‌కు రాంగోపాల్ మద్దతు పలికారు. అయితే.. ప్రొఫెసర్ సాబ్ ఉన్నట్టుండి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో గల ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఇల్లు ఉంది. ఎప్పుడైనా ఆయన అక్కడ ఉంటుంటారు. ఎన్నికల కమిషన్ వద్దకు ఆయన వెళ్లడం కూడా మామూలే. ఈసారి కూడా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మ్యాప్‌లు ఇవ్వాలని కోరేందుకే ఆయన వెళ్లారని అంటున్నారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీల వాళ్లూ అలా వెళ్లడం కూడా మామూలే. కానీ.. ఇక్కడ ప్రొఫెసర్ సాబ్ పాత్ర గురించి పార్టీలో రకరకాలుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వంద కంటే తక్కువ సీట్లు వస్తే.. అందుకు పూర్తి బాధ్యత ములాయందేనని గతంలోనే లేఖ రాశారు. పార్టీలో 95 శాతం మంది అఖిలేష్ వెంటే ఉన్నారని కూడా ఆయన చెబుతుంటారు. అలాంటి ప్రొఫెసర్ సాబ్.. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు వెళ్లినప్పుడు ఏం చేశారన్నది స్వతహాగానే ఆసక్తికరంగా మారింది. అన్న కొడుకు కోసం కొత్త పార్టీని ఆయన ఏమైనా రిజిస్టర్ చేస్తున్నారా అన్న విషయం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ పార్టీ గుర్తు సైకిల్ కాగా, ఇప్పుడు మోటార్‌సైకిల్‌గా మార్చాలని కూడా కొందరు అంటున్నారు. దాన్నిబట్టి చూస్తే, పార్టీలో యువత అంతా పాత నాయకులను వదిలిపెట్టి అఖిలేష్ యాదవ్‌ను తమ నాయకుడిగా గుర్తిస్తారా అనే చర్చ మొదలైంది. ఒకవైపు అఖిలేష్ యాదవ్ రథయాత్ర మొదలుపెడుతుండగా.. మరోవైపు ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ దక్షిణాది యాత్రకు బయల్దేరుతున్నారు. ఇటువైపున్న ప్రాంతీయ పార్టీల నాయకులతో ఆయన మంతనాలు జరుపుతారని సమాచారం. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందుగానీ, ఆ తర్వాత గానీ ములాయం పార్టీలో ముసలం రావడం తప్పకపోవచ్చని అంటున్నారు. -
యాదవ్ కుటుంబంలో మళ్లీ చిచ్చు!
సమాజ్‌వాదీ పార్టీలోను, ఆ పార్టీ పెద్దలు యాదవ్ కుటుంబంలోను మళ్లీ మరో చిచ్చు మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివపాల్ యాదవ్.. ఆ వెంటనే తమ మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువైన ఓ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించారు. భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడన్న ఆరో్పణలతో అతడిని పార్టీ నుంచి తప్పించడంతో కుటుంబంలో మళ్లీ కలహాలు మొదలయ్యాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాంగోపాల్ యాదవ్ సమీప బంధువైన అరవింద్ ప్రతాప్ యాదవ్ అనే ఎమ్మెల్సీని, ఆయనతో పాటు ఇటావా గ్రామ మాజీ సర్పంచ్ అఖిలేష్ కుమార్ యాదవ్‌ను పార్టీ నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లిద్దరి మీద భూ ఆక్రమణలతో పాటు మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో అతడిని బహిష్కరించినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఆర్ఎస్ యాదవ్ చెప్పారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వెళ్లే ముందు విమానాశ్రయంలో తన అన్న ములాయం సింగ్ యాదవ్‌ను శివపాల్ కలిశారు. బహిష్కరణ వేటుకు గురైన ఇద్దరూ రాంగోపాల్ యాదవ్‌కు సమీప బంధువులే కావడంతో యాదవ్ కుటుంబంలో ఇప్పుడు మరో చిచ్చు మొదలయ్యేలా ఉంది. శివపాల్ - అఖిలేష్ మధ్య పోరు జరిగినప్పుడు ములాయం సోదరుల్లో ఒకరైన రాంగోపాల్ యాదవ్.. తన మద్దతును అఖిలేష్‌కే తెలిపారు. దాంతో ఇప్పుడు అఖిలేష్ వర్గం బలాన్ని క్రమంగా తగ్గించే చర్యలను శివపాల్ యాదవ్ మొదలుపెట్టారని అంటున్నారు. ఇంతకుముందు అఖిలేష్‌కు అనుకూలంగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేసినప్పుడు కూడా.. ''మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే, ముందు పార్టీకి అనుకూలంగా, తర్వాత నేతాజీకి అనుకూలంగా, ఆ తర్వాత ముఖ్యమంత్రికి అనుకూలంగా ఇవ్వండి. అంతే తప్ప పార్టీలో గ్రూపిజానికి చోటులేదు'' అని హెచ్చరించారు. -
మరో బాబాయి మద్దతు పలికాడు!
లక్నో: యూపీ అధికార పార్టీ సమాజ్‌వాదీ పరివారంలో తలెత్తిన వార్ గురువారం కొత్త మలుపు తీసుకుంది. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను తొలగించడంతో రగిలిపోతున్న సీఎం అఖిలేశ్ యాదవ్‌కు కుటుంబం నుంచి మద్దతు లభించింది. బాబాయి శివ్‌పాల్ యాదవ్‌తో అమీతుమీ సిద్ధపడ్డ ఆయనకు మరో బాబాయి రాంగోపాల్ యాదవ్ అండగా నిలిచారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు కజిన్ సోదరుడు, రాజ్యసభ సభ్యుడైన రాంగోపాల్ గురువారం అఖిలేశ్‌ను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అఖిలేశ్‌ను ఎస్పీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం తప్పేనని తేల్చేశారు. అఖిలేశ్‌కు చెప్పకుండానే ఆయన తండ్రి ములాయం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 'ముఖ్యమంత్రిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో నాయకత్వం కొంత పొరపాటు చేసింది. ఈ విషయాన్ని ముందే సీఎంకు చెప్పాల్సి ఉండేది. ఎన్నికల దృష్ట్యా సీఎం పదవిలో ఉన్న వారు రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగడం అంతగా వీలు కాదు కాబట్టి వేరే వారిని నియమిస్తున్నామని చెప్పి ఉంటే.. అఖిలేశ్ స్వయంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసేవారు' అని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. అయితే, ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వివాదం తలెత్తిందని, అంతేకానీ, పార్టీలో కానీ, కుటుంబంలోని కానీ ఎలాంటి సంక్షోభం లేదని చెప్పుకొచ్చారు. ఏమైనా చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉంటే వాటిని సరిచేసుకుంటామని చెప్పారు. సీఎం సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, సీఎం అన్నప్పుడు ఆ అధికారం ఉటుందని అఖిలేశ్‌ను ఆయన వేనకేసుకొచ్చారు. -
అమర్‌సింగ్‌ను పార్టీలో చేర్చుకోం: యాదవ్
మెయిన్‌పురి: రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ను మళ్లీ సమాజ్‌వాది పార్టీ చేర్చుకుంటారని వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తోసిపుచ్చారు. అమర్‌సింగ్‌ను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదని యాదవ్ చెప్పారు. నాలుగేళ్ల తర్వాత ములాయం సింగ్ యాదవ్, అమర్‌సింగ్ ఓ బహిరంగ సభలో ఒకే వేదిక మీద కనిపించారు. దీంతో అమర్‌సింగ్ మళ్లీ సమాజ్‌వాది పార్టీలో చేరతారని ప్రచారం మొదలైంది.