సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు.
రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్‌వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు.
బైంసా సభలో కేసీఆర్...
‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు.
ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి..
‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment