ARMOOR
-
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం..
-
ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
సాక్షి, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెందిన కానీ మూడు రోజులైనా బాధితులకు విషయం చెప్పకుండా వైద్యాధికారిణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిరికొండ మండలం రూప తండాకు చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తీసిన స్కానింగ్ రిపోర్టులను వైద్యాధికారిణికి బాధితురాలు అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా గర్భస్థ శిశువు మృతి చెందినట్లు వైద్యురాలు తెలిపింది.గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: కాలేజీలా.. మురికి కూపాలా? -
BRS కౌన్సిలర్లకు ఊహించని షాక్
-
TSRTC: ‘ఫ్రీ జర్నీ సరే.. మరి మాకు సీట్లుంటలేవ్!’
వైరల్: ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం సదుపాయం.. కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. మహిళలతో బస్సులు కిటకిటలాడిపోతుండగా.. అదే సమయంలో సీట్లు లేక మగవాళ్లు స్టాండింగ్ జర్నీలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడో యువకుడు రోడ్డెక్కి బస్సుకు అడ్డం తిరిగాడు. ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే అయినా.. మగవాళ్లను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాడు. దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా.. మగజాతి ఆణిముత్యం అంటూ కొందరు సరదాగా ఆ యువకుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. -
తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రచారంలో అపశృతి.. పడిపోయిన కేటీఆర్
-
50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది : సీఎం కేసీఆర్
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఏపీలో యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. మూడు గంటల కరెంట్ కావాలా 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారని, రైతు బంధు కావాలా వద్దా అనేది ప్రజలు తేల్చుకోవాలన్నారు.ఎవరో చెప్పారని ఓటు వేయద్దని ఏ పార్టీ మంచి చేసిందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటన్నారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి ఇంకా రాలేదన్నారు. సరైన పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ‘అంకాపూర్ అంటే నాకు బాగా ఇష్టం. అంకాపూర్‌ను రైతులు ఆదర్శంగా తీసుకొని ఎదగాలి. తెలంగాణ రాక ముందు కరెంటు లేదు. తాగునీరు సాగు నీరు లేదు.. వలసలు ఉండేవి. దళిత బందు పథకం కనిపెట్టిందే నేను. దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. ధరణి తీసేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తీసేస్తే రైతు బంధు ఎవరికి ఇస్తారు. ధరణి లేకపోతే మళ్లీ వీఆర్వోలు వస్తారు. మళ్లీ అవినీతి వస్తుంది. ప్రజల మధ్యే ప్రజల కోసం ఉండే జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి’అని కేసీఆర్ కోరారు. బైంసా సభలో కేసీఆర్... ‘ఓటు చేతిలో నుంచి జారిపోక ముందే అలోచించాలని, ఓటు వేయడంలో తప్పిదం జరిగితే తీవ్రంగా నష్టపోతాం. 24 గంటల కరెంట్ వద్దని రేవంత్ రెడ్డి అంటున్నారు. మహరాష్ట్రలో కరెంటు లేదు. మనదగ్గర కరెంటు ఉంది. ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లోని యాభై వేల ఎకరాలకు ఎస్సారేస్పీ నీరు అందిస్తాం. ప్రదానికి మోడికి పిచ్చి పట్టింది. విమానాలు, రైల్వేలు అన్ని ప్రైవేటు పరంచేస్తున్నారు. బైంసాలో బీజేపీ అభ్యర్థిని నిలదీయండి. ఎందుకు మోటర్లకు మీటర్లు పెడుతారని ప్రశ్నించండి. బైంసా అంటేనే యుద్దం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మతం పేరుతో మంటలు చేలరేగాలనా. రక్తం పారలనా..మీరే అలోచించుకోండి’అని కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలి.. ‘దేశ ప్రజాస్వామ్యంలో ఇంకా పరిణితి రావాలి. పోటీలో ఉన్న అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి ప్రజలు ఓటు వేయాలి. ఎవరో చెప్పారని ఓటు వేయొద్దు.తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో చూడాలి. తెలంగాణ వచ్చినంకనే ఇంటింటికి నీళ్లిచ్చాం.24 గంటల కరెంట్ ఇచ్చాం.చేనేత కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతాం. చేనేత కార్మికుల కష్టాలు నాకు తెలుసు.ధరణి తీసేస్తామని కాంగగ్రెస్ అంటోంది.ధరణి ఉండాలన్నా వద్దా తేల్చుకోవాలి’అని కోరుట్ల సభలో కేసీఆర్ ప్రజలను కోరారు. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: సామాజిక తెలంగాణ కోరుకొని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మాటలకు విలువ లేదని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు విషయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు. నాలుగున్నరెళ్ళ కిందట పసుపు బోర్డు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. పసుపు పంటకు రూ. 12 నుంచి 15 వేలు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. పసుపు రైతులతో పాటు అన్ని పంటలకు ఎమ్ఎస్పీతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీ.. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందని దుయ్యబటారు. తన మీద 24 కేసులు ఉన్నాయన్న రాహుల్.. కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవని అన్నారు. దేశంలోనే అవినీతి సీఎం కేసీఆరేనని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు పక్కా కాంగ్రెస్‌ను ఓడించేందుకుచ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెడతారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఎంఐఎం ఉంటుందని మండిపడ్డారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే! ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ నాకు ఇల్లు లేదు. దేశమే నా ఇల్లు. మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. పెన్షన్ రూ. 4 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం. కేసీఆర్ ఎంత లూటీ చేస్తున్నారో అంతా తిరిగి ఇస్తాం’ అంటూ రాహుల్ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు.. సభ అనంతరం ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గంలోనే రాహుల్ హైదరాబాద్ బయల్దేరారు. హైలికాప్టర్ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో నేరుగా శంషాబాద్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది. ఈనెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక యాత్ర ప్రారంభించారు. ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకుమూడు రోజుల యాత్ర సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో కొనసాగింది. కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్ ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. సిట్టింగ్‌ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను జాన్సన్ నాయక్ కేటాయించడంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ఆర్మూరు నియోజకవర్గం చరిత్రను తిరగరాసేది ఎవరు?
ఆర్మూరు నియోజకవర్గం ఆర్మూరు నియోజకవర్గంలో మరోసారి ఆశన్నగారి జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పక్షాన ఘన విజయం సాదించారు.ఆయన 28795 ఓట్ల ఆదిక్యతతో తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, ఎమ్మెల్సీ ఆకుల లలితపై గెలుపొందారు. ఆకుల లలిత ఎన్నికలు పూర్తి కాగానే టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. జీవన్ రెడ్డికి 72125 ఓట్లు రాగా, లలితకు 43330 ఓట్ల వచ్చాయి. కాగా బిజెపి తరపున పోటీచేసిన పి.వినయ్ కుమార్ రెడ్డికి 19వేలకు పైగా ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ది రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆర్మూరులో తొలి నుంచి రెడ్డి సామాజికవర్గం నేతలే అత్యదికంగా గెలిచారు. 2014లో ఆర్మూరులో మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి ని జీవన్ రెడ్డి ఓడిరచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల నాటికి సురేష్ రెడ్డి టిఆర్ఎస్లో చేరిపోయి తదుపరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ఐ అధికారంలోకి వచ్చాక స్పీకరు పదవిని చేపట్టిన కె.ఆర్. సురేష్‌రెడ్డి ఇంతకుముందు బాల్కొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989 నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందగా 2009లో ఆయన బాల్కొండలో కాకుండా ఆర్మూరు నియోజకవర్గానికి మారి పోటీ చేయగా, స్వయాన ఆయన మేనత్త ఆలేటి అన్నపూర్ణమ్మ చేతిలో అనూహ్యంగా పరాజితులయ్యారు. ఆర్మూరు నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఎనిమిది సార్లు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ మూడుసార్లు,టిఆర్ఎస్ మూడుసార్లు, సోషలిస్టుపార్టీ ఒకసారి గెలుపొందాయి. ఆర్మూరు నుంచి సంతోష్‌రెడ్డి నాలుగుసార్లు గెలుపొందారు. రెండువేల నాలుగులో టిఆర్ఎస్ పక్షాన గెలిచి కొంతకాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఆ తరువాత ఆయన అసమ్మతి నేతగా మారి శాసనమండలి ఎన్నికలలో విప్ ఉల్లంఘన కింద అనర్హతకు గురయ్యారు. అయితే తీర్పు వెలువడడానికి ఒక రోజు ముందు ఈయన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు. సంతోష్‌రెడ్డి గతంలో నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కూడా సభ్యునిగా ఉన్నారు. కొంత కాలం జడ్పి చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన తుమ్మల రంగారెడ్డి బాల్కొండలో మరోసారి గెలిచారు. రంగారెడ్డి ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత పొందారు. మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య ఒకసారి, మాజీ మంత్రి జి.రాజారామ్ మరోసారి ఇక్కడ నుంచి గెలిచారు. అంజయ్య ముషీరాబాద్‌లో మూడుసార్లు, రామాయంపేటలో మరోసారి గెలిచారు. అలాగే లోక్‌సభ, రాజ్యసభలకు కూడా ప్రాతినిధ్యం వహించారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఈయన కొంతకాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. రాజారామ్ బాల్కొండలో మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన కూడా జలగం, మర్రిచెన్నారెడ్డి, అంజయ్యల క్యాబినెట్లలో పనిచేసారు. 1999లో ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ 2004లో బాన్స్వాడ నుంచి గెలిచారు. 2014,2018లలో టిఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1985లో ఆర్మూరులో గెలిచిన మహీపాల్‌రెడ్డి, 1994, 2009లో గెలుపొందిన అన్నపూర్ణమ్మలు భార్యాభర్తలు. మహిపాల్‌రెడ్డి ఎన్టీఆర్ క్యాబినెట్లో కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్మూరు గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఆర్మూర్‌లో అక్కాచెల్లెళ్ల హత్య !
నిజామాబాద్: ఆర్మూర్‌లో బుధవారం జరిగిన జంట హత్యలతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. పట్టణంలోని రెండో వార్డు పరిధిలోని జిరాయత్‌నగర్‌లో నివాసముండే రాజవ్వ(72), గంగవ్వ(62) అనే అక్కాచెల్లెళ్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. పట్టణానికి చెందిన రాజవ్వ, గంగవ్వ అక్కాచెల్లెళ్లు. రాజవ్వకు 20 ఏళ్ల క్రితం విడాకులు కావడంతో ఒంటరిగా ఉంటుంది. గంగవ్వకు ఇద్దరు కుమారులు శ్రీనివాస్, మహిపాల్ ఉండగా.. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లో, చిన్న కుమారుడు మహిపాల్ మామిడిపల్లిలో ఉంటున్నారు. గంగవ్వ భర్త 20 ఏళ్ల క్రితం మృతి చెందడంతో అనారోగ్యంతో మంచానపడ్డ అక్క రాజవ్వకు సపర్యలు చేసుకుంటూ ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. మహిపాల్ తన తల్లి గంగవ్వకు నిర్మల్ జిల్లా ముదోల్ ఆస్పత్రిలో మంగళవారం నేత్ర పరీక్షలు చేయించుకుని సాయంత్రం ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయమే ఇద్దరు మహిళలు ధారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఒంటరిగా ఉంటున్న వారి తలలపై ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. అనంతరం హత్యలను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంట్లోని దుస్తులకు నిప్పు పెట్టి జారుకున్నారు. ఇంటి నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు గంగవ్వ కుమారుడు మహిపాల్‌కు సమాచారం అందించారు. అనంతరం లోపలికి వెళ్లిన స్థానికులు పొగల మధ్యన మహిళలను వెతుకుతుండగా హత్యకు గురై విగత జీవులుగా పడి ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, ఎస్‌హెచ్‌వో సురేష్ బాబు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ మహిళలను వారిపై ఉన్న నగల కోసమే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇంటి పక్కన కల్లు కాంపౌండ్ ఉండడంతో అక్కడికి వచ్చే వారే ఒంటరిగా ఉంటున్న మహిళలను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరు కున్న ఇన్చార్జీ సీపీ ప్రవీణ్‌కుమార్ హత్యలు జరిగిన తీరును పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారించి నేరస్తులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
అమెరికా అమ్మాయి-ఆర్మూర్ అబ్బాయి. ఔను వాళ్లు ఇష్టపడ్డారు
సాక్షి, నిజామాబాద్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది పెద్దల మాట. కానీ, మనసులు కలిస్తే చాలు.. అనేది ఇప్పటి జనరేషన్లో కొంతమంది చెప్తున్న మాట. అందుకే తమ వైవాహిక బంధాలకు కులం, మతం, ప్రాంతం లాంటి పట్టింపులు లేకుండా చూసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఓ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు కావడం!. విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మధనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చిఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్‌లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు. ఇవాళ(మంగళవారం) ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్ హాల్లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటినా ఈప్రేమజంటను ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది. -
Photo Feature: కల్లు కమ్మగుంది..
ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద ఆదివారం ఓ కోతి కల్లు తాగింది. కల్లు కవర్‌ను తెచ్చుకొని గోడపై కూర్చొని రుచి చూసింది. -
తలుపు తట్టి.. తలకు తుపాకీ గురిపెట్టి..
బంజారాహిల్స్(హైదరాబాద్): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడు తుపాకీతో కాల్చేందుకు యత్నిస్తుండగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో పరుగున వచ్చిన గన్మెన్లు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గం మాకునూరు మండలం కల్లాడి సర్పంచ్ లావణ్య... పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేతో మొదటినుంచీ విభేదాలు ఉండటం, భార్యపై సస్పెన్షన్ ఎత్తివేత ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఆమె భర్త, టీఆర్ఎస్కే చెందిన పెద్దగాని ప్రసాద్‌గౌడ్ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అంతం చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. నాలుగురోజులు రెక్కీ పథకంలో భాగంగా ప్రసాద్‌గౌడ్ రెండు తుపాకులు, ఒక బటన్ చాకు (కత్తి)ని కొనుగోలు చేశాడు. 4 రోజుల పాటు బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసం వేమిరెడ్డి ఎన్క్లేవ్ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఎమ్మెల్యే ఏ సమయంలో వస్తున్నాడు.. ఎవరెవరు ఇంటి వద్ద ఉంటారు.. అన్నీ పరిశీలించాడు. సోమ వారం రాత్రి 7.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సెక్యూరిటీ గార్డులు, గన్మెన్లతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎమ్మెల్యే నియోజక వర్గానికే చెందిన సర్పంచ్ భర్త కావడం, గతంలో కూడా ఇలాగే వచ్చాడు కదా అని గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి అనుమతించారు. నేరుగా బెడ్రూమ్కు వెళ్లి.. రాత్రి 8.30 గంటల వరకు మెయిన్ హాల్లో తచ్చాడిన ప్రసాద్‌గౌడ్.. గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులు సమీపంలో లేకపోవడం చూసి నేరుగా లిఫ్ట్‌లో మూడో అంతస్తులోని జీవన్‌రెడ్డి పడక గది వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న ఎమ్మెల్యే తలుపులు తీసి ఎదురుగా నిలబడ్డ ప్రసాద్ ను చూసి షాక్ తిన్నారు. ‘ఏంటి? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ప్రసాద్ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు. ఎమ్మెల్యే పెద్దగా కేకలు వేస్తూ, తలుపులు మూస్తూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. ఆయన అరుపులు విన్న గన్మెన్లు, సె క్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మె ల్యేకు ప్రాణహాని తప్పింది. ఒక చేతిలో నాటు తుపాకీ, ఇంకో చేతిలో కత్తితో ఉన్న ప్రసాద్‌ను అదు పులోకి తీసుకున్న గన్మెన్లు వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు తుపాకులు, కత్తి, నిందితుడి కారు (టీఎస్ 16ఎఫ్ బీ 9517) స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 307, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాక్‌కు గురైన జీవన్‌రెడ్డి నిందితుడు నేరుగా బెడ్రూమ్ వరకు వచ్చి కాల్చేందుకు యత్నించడంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధ్యాహ్నం వరకు కూడా కోలుకోలేదు. ఏ మాత్రం అటూఇటూ అయినా ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన -
తాగిన మత్తులో కత్తితో రోడ్డుపై యువకుడి వీరంగం
-
కారు పార్టీలో చిచ్చు.. రచ్చకెక్కిన విభేదాలు
సాక్షి, నిజామాబాద్ : అధికార పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు బట్టబయలవుతోంది. సోమవారం నందిపేట్ మండలం లక్కంపల్లి సెజ్‌లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ ప్రైవేట్ బయో ప్లాస్టిక్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆధిపత్య పోరు తెరపైకి వచ్చింది. కార్యక్రమానికి రాకుండా తనను పోలీసులతో అడ్డగించారని ఎమ్మెల్యేపై విఠల్‌రావు మండిపడ్డారు. దీంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకుని ఇరువురిని సముదాయించాల్సి వచ్చింది. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్సీ కవిత, జిల్లా ముఖ్యనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ మాక్లూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈ పంచాయితీ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా సోమవారం జరిగిన ఘటన పార్టీలో అంతర్గత పోరును బయట పెట్టింది. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నాయకుడు ఏఎస్ పోశెట్టి గత ఎన్నికల వేళ ఏకంగా ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాపై విమర్శనాస్త్రాలు సంధించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య ఉప్పు.. నిప్పు.. అన్న చందంగా పోరు నడిచిన సంగతి తెలిసిందే. భూపతిరెడ్డి టీఆర్ఎస్ను వీడటంతో ఇక్కడ ఆధిపత్య పోరుకు తెరపడినట్లయింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండలో అంతర్గత పోరు ఇప్పటి వరకు బట్టబయలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఇక్కడ ఇద్దరు అగ్రనేతల మధ్య కొంత ఆధిపత్య పోరు తలెత్తే అవకాశాలున్నట్లు అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి ఘటనలేవీ బయటకు రాలేదు. మిగతా నియోజకవర్గాల్లోనూ.. అధికార పార్టీలో అంతర్గత పోరు ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికే పరిమితం కాలేదు. ఇతర నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే నెలకొంది. బోధన్‌లోనూ స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమేర్, స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్‌రెడ్డి మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి మధ్య విభేదాలు ఇప్పటి వరకు ఇలా బహిర్గతం కాకపోయినప్పటికీ, బోధన్ మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల జోక్యంపై శరత్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
కారు దిగి కమలం కండువా కప్పుకుంటారా..!
సాక్షి, నిజామాబాద్ : తెలుగు రాజకీయాల్లో పరిచయమక్కర్లేని పేరు మండవ వెంకటేశ్వరరావు. వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న లీడర్. కీలక పదవులు అనుభవించిన అనుభవం. టీడీపీలో ఎన్టీఆర్‌తో పాటు చంద్రబాబుతో కలిసి చక్రం తిప్పిన నేత.. ఇదంత బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నకల ముందు ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మండవ ఇంటికి వెళ్లి స్వయంగా కలిసి కండువా వేసి వచ్చారు. ఇక అప్పటి నుండి మండవకు పెద్ద పదవే ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. కాని ఇప్పటి వరకు ఏమీ లేక పోవడంతో ఆయన డైలామాలో పడ్డారు.. అసలు మండవ ప్యూచర్ ఏంటీ..? సైకిల్ దిగి కారేక్కశారు.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోను పెద్ద నాయకునిగా గుర్తింపు పోందారు. తన సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తెలంగాణలో టీడీపీ అధికారం కోల్పయినప్పటి నుంచి సైలెంట్ అయిన మండవ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. పార్లమెంట్ ఎన్నికలకంటే ముందు పాత స్నేహంతో సీఎం కేసీఆర్ నేరుగా మండవ ఇంటికి వెళ్ళి మంతనాలు జరిపి గులాబీ పార్టీలోకి అహ్వనించారు. కేసీఆర్‌కు మండవకు మంచి స్నేహం ఉండటంతో కాదనలేక పోయారు. దీంతో సైకిల్ దిగి కారేక్కశారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న సురేష్ రెడ్డి, ఇటు మండవ ఇద్దరు కారేక్కడంతో పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపు ఖాయం అనుకున్నారు అందరూ కానీ ఎంపీగా కవిత ఓడిపోయారు. ఇక అప్పటి నుండి ఇద్దరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. కానీ అనుహ్యంగా సురేష్ రెడ్డికి రాజ్యసభ సీటిచ్చేశారు. మండవకు మాత్రం ఎలాంటి హమీ మాత్రం దక్కకపోగా ఒక్కసారిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడసలు మండవకు పదవి వస్తుందా లేదా గులాబీ బాస్ ఎలా అకామిడేట్ చేయనున్నారు అనే ప్రశ్న అతనితో పాటు అతని అనుచరులును కూడా వేదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని అడగాలో ఎం చేయాలో తెలియని పరిస్థిలో ఉన్నారట. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుండి పెరుగుతుందట. సంవత్సరం గడిచినా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట మండవ. ఇప్పటికే ఓ పదవిని మండవకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీకి దూరంగా.. గతంతో ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కి ఇచ్చిన ప్రభుత్వ సలహదారు పదవిని మండవకు ఇద్దామనే ఆలోచనలో సీఎం ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పదవి తీసుకోవాల వద్దా అనే డైలామా మండవను వేంటాడుతుందని తెలుస్తోంది. టీఆర్ఎస్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులుగా మండవ పార్టీ కార్యక్రమంలో అసలు పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో కారు దిగి కమలం కండువ కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డీఎస్ తన పదవికి రాజీనామా చేస్తే.. ఆ పదవి మండవకు కట్టబెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన రాజీనామా ఎప్పుడు చేస్తారో.. మండవకి రాజ్యసభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. -
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా
సాక్షి, నిజామాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ ఇటీవల కోవిడ్‌బారినపడి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 58,908కి చేరింది. కరోనాతో మంగళవారం ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. (చదవండి: బయటకు వెళ్లి.. ఇంట్లోకి తెస్తుండ్రు) -
ఆర్మూర్‌లో 6కు చేరిన కరోనా కేసులు
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో కరోనా కేసులు 6కు చేరాయి. కాగా గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్థులు బయటి వారు గ్రామంలోకి రాకుండా పొలిమేరలో కంచె ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని అధికారులు పిచికారీ చేయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే) -
త్వరపడండి: రూపాయికే గుడ్డు
సాక్షి, ఆర్మూర్ టౌన్: కరోనా దెబ్బకు రోజురోజుకు కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోతోంది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే పుకార్లు రావడంతో గుడ్ల వ్యాపారం పడిపోయింది. దీంతో ఆర్మూర్ పట్టణంలోని బృందావనం థియేటర్ సమీపంలో ఓ గుడ్ల వ్యాపారి కేవలం వంద రూపాయలకే వందగుడ్లు విక్రయిస్తున్నాడు. అదేవిధంగా 100 రూపాయలకే 100 గుడ్లు అని ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు తరలివచ్చి గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. (అలా పెరిగే కోళ్లతో డేంజర్!) (కోడి కూర.. మాకొద్దు బాబోయ్) -
మూడోసారి ఆర్మూర్ పీఠం ఎవరిదో..?
సాక్షి, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ చరిత్రలో మూడో పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధంమైంది. యాభై రెండు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీగా మార్చారు. సుమారు 44 సంవత్సరాలు గ్రామపంచాయతీగా కొనసాగిన అనంతరం తిరిగి 2006 మే 26న నాటకీయ పరిణామాలమధ్య మున్సిపాలిటీగా మార్చారు. తొలి మున్సిపల్ చైర్మన్ కేవీ నరసింహారెడ్డి 1956 నుంచి 1962 వరకు ఆర్మూర్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్‌గా కేవీ నరసింహారెడ్డి ఎన్నికైయ్యారు. తరువాత గ్రామపంచాయతీగా మారింది. 2001 నుంచి 2006 వరకు గ్రామ పంచాయతీకి చివరి సర్పంచ్‌గా కొంగి సదాశివ్ బాధ్యతలు నిర్వహించారు. తిరిగి ఆర్మూర్ మున్సిపాలిటీగా ఆవిర్భవించిన తరువాత మొదటి సారిగా 2008లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆర్మూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆర్మూర్ మున్సిపల్ పాలకవర్గానికి మూడో పర్యాయము మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వార్డులు - 36 ఓటర్లు - 55,016 పురుషులు - 26,601 మహిళలు - 28,413 ఇతరులు - 02 పట్టణ జనాభా - 67,252 చైర్పర్సన్ రిజర్వేషన్ - బీసీ మహిళ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఈ ఎన్నికలను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అందుకే ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డి పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం పోలింగ్ నిర్వహించి ఈ నెల 25వ తేదీన కౌంటింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విలీన గ్రామాలైన పెర్కిట్–కొటార్మూర్, మామిడిపల్లిని కలుపుతూ ఆర్మూర్ పట్టణ జనాభా 67, 252గా ఉంది. పట్టణంలో మొత్తం ఓటర్లు 36 వార్డులకు 55,016 మంది కాగా అందులో పురుషులు 26, 601 మంది, మహిళలు 28,413 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. బీసీ ఓటర్లే అధికం మొత్తం ఓటర్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలుగా విభజించగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు 44,727 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 21,520 మంది ఓటర్లు, మహిళలు 23,207 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,518 మంది కాగా వీరిలో పురుషులు 2,104 మంది, మహిళలు 2,414 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 664 మంది కాగా అందులో పురుషులు 313 మంది, మహిళలు 351 మంది ఉన్నారు. ఇక మిగిలిన ఓసీ ఓటర్లు 5,105 మంది కాగా అందులో పురుషులు 2,663 మంది, మహిళలు 2,442 మంది ఉన్నారు. 24వ వార్డులో అత్యధికంగా 1,714 మంది ఓటర్లు ఉండగా 9వ వార్డులో అత్యల్పంగా 1,348 మంది ఓటర్లు ఉన్నారు. -
ఏడుగురు కొడుకులు ఏడాదిన్నరకొకరు చొప్పున..!
సాక్షి, ఆర్మూర్: విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఏడుగురి సంతానంలో ఐదుగురు ఏడాదిన్నరకు ఒకరు చొప్పున అకాల మృత్యువాత పడ్డారు. ఏడుగురిలో ఇప్పటికే నలుగురు చనిపోగా, గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదో కుమారుడు ముజా హిదీన్ (22) మరణించాడు. కన్న కొడుకులు పాతిక సంవత్సరాల వయసు కూడా నిండకముందే ఒక్కొ క్కరుగా పిట్టల్లా రాలిపోవడంతో ఆ కన్నతల్లి కడుపుకోత వర్ణనాతీతంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌లో నివాసం ఉండే షేక్ అబ్దుల్ కరీం, రహీమున్సీసా బేగం దంపతులకు ఏడుగురు సంతానం. కాగా, బీడీ పొగాకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించే ఇంటికి పెద్ద దిక్కు అయిన అబ్దుల్ కరీం 15 ఏళ్ల కింద అనారోగ్యంతో మృతి చెందడంతో బీడీలు చుట్టి తల్లి రహీమున్నీసా బేగం పిల్లలను పెంచి పెద్ద చేసింది. ముగ్గురు కొడుకులు అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు ప్రమాదాల బారిన పడి మరణించారు. అయితే మృతి చెందిన ఐదుగురు కూడా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలిచారు. షేక్ ఇర్ఫాన్ ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఇతడు 2011లో అనారోగ్యంతో మృతి చెందాడు. మరో ఏడాదిలోనే (2013లో) పెద్ద కుమారుడు షేక్ బాబా సైతం అనారోగ్యంతో మృతి చెందగా, అతడి భార్య, పిల్లలు అనాథలయ్యారు. నాలుగో కుమారుడు షేక్ మోబిన్ సైతం ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ 2015లో గూండ్ల చెరువులో స్నానం చేయడానికి దిగి ఈత రాక పోవడంతో మృత్యువాత పడ్డాడు. మూడో కుమారుడు షేక్ అజ్జు 2017లో గుండెపోటుతో మృతి చెందడంతో అతడి భార్య, పిల్లలకు పెద్దదిక్కు లేకుండాపోయింది. ప్రస్తుతం ఐదో కుమారుడు ముజాహిద్‌ను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఏడాదిన్నర వ్యత్యాసంతో ఒక్కొక్కరు మృత్యువాత పడుతుండటంతో 55 ఏళ్ల వృద్ధాప్యంలో తల్లి రహీమున్సీసాకు కడుపుకోతగా మారింది. -
అభాసుపాలైన టాస్క్‌ఫార్స్..!
సాక్షి, నిజామాబాద్: టాస్క్‌ఫోర్స్.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ డివిజన్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. కమిషనరేట్‌లో ప్రత్యేకం.. ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్‌ఫోర్స్ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించవచ్చు. సెర్చ్ వారెంట్ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..? టాస్క్‌ఫోర్స్ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
ఎల్ఎల్ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపస్‌లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్ఎల్ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ చదవుతున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండే జీవన్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.