
పెర్కిట్(ఆర్మూర్): అత్తారింటి వేధింపులు తాళ లేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ర్మూర్ పట్టణంలో చేసుకుంది. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం.. మెండోరా మండలం సా వెల్ గ్రామానికి చెందిన దీపిక అలియాస్ భావన(23)కు ఆర్మూర్ పట్టణంలోని కాశీహన్మాన్ వీధికి చెందిన హన్మాండ్లుతో తొమ్మిది నెలల క్రి తం వివాహం జరిగింది.
కొన్ని రోజుల నుంచి భర్త, కుటుంబ సభ్యుల వేధింపులతో దీపిక మ నస్థాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం దీపిక సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురా లి తల్లి లింబాయి ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.