సాక్షి, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెందిన కానీ మూడు రోజులైనా బాధితులకు విషయం చెప్పకుండా వైద్యాధికారిణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిరికొండ మండలం రూప తండాకు చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీసిన స్కానింగ్ రిపోర్టులను వైద్యాధికారిణికి బాధితురాలు అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా గర్భస్థ శిశువు మృతి చెందినట్లు వైద్యురాలు తెలిపింది.
గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: కాలేజీలా.. మురికి కూపాలా?
Comments
Please login to add a commentAdd a comment