వైరల్: ఆర్టీసీ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత ప్రయాణం సదుపాయం.. కొంత ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తోంది. మహిళలతో బస్సులు కిటకిటలాడిపోతుండగా.. అదే సమయంలో సీట్లు లేక మగవాళ్లు స్టాండింగ్ జర్నీలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడో యువకుడు రోడ్డెక్కి బస్సుకు అడ్డం తిరిగాడు.
ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే అయినా.. మగవాళ్లను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలని కోరుతున్నాడు.
దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుండగా.. మగజాతి ఆణిముత్యం అంటూ కొందరు సరదాగా ఆ యువకుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment