
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత..
నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత రాజారాం యాదవ్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆర్మూరులో టీడీపీ తరపున రాజారాం యాదవ్ పోటీ చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిపోయారు. రెండు నెలల క్రితం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకలా సాఫీగా ఉందని టీఆర్‌ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారు.