Rajaram Yadav
-
బాల్కసుమన్‌పై కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్‌లపై లాలాగూడ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వీరిద్దరూ నేరం చేశారనేందుకు ఆధారాల్లేవని న్యాయమూర్తి జయకుమార్ తీర్పిచ్చారు. 2009లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్ అద్దాలు పగులగొట్టారంటూ ఉస్మానియా వర్సిటీ పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. -
ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు షాక్
నిజామాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్మూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత రాజారాం యాదవ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆర్మూరులో టీడీపీ తరపున రాజారాం యాదవ్ పోటీ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిపోయారు. రెండు నెలల క్రితం మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరిన సంగతి తెల్సిందే. గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ల తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో ఆర్మూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకలా సాఫీగా ఉందని టీఆర్ఎస్ కార్యకర్తలు భావిస్తున్నారు. -
మేకల మందలో మేకవన్నె పులి కేసీఆర్
టీడీపీ నేత రాజారాం యాదవ్ హైదరాబాద్: యాదవుల గురించి చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా చెబుతూ కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత రాజారాం యాదవ్ విమర్శించారు. మేకల మందలో మేకవన్నె పులి, గొర్రెల మందలో చొరబడ్డ గుంటనక్క కేసీఆర్ అని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా యాదవులను, బీసీలను టీడీపీ నుంచి దూరం చేయలేరని అన్నారు.