యాదవుల గురించి చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా చెబుతూ కేసీఆర్,
టీడీపీ నేత రాజారాం యాదవ్
హైదరాబాద్: యాదవుల గురించి చంద్రబాబు అనని మాటలను అన్నట్లుగా చెబుతూ కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత రాజారాం యాదవ్ విమర్శించారు.
మేకల మందలో మేకవన్నె పులి, గొర్రెల మందలో చొరబడ్డ గుంటనక్క కేసీఆర్ అని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా యాదవులను, బీసీలను టీడీపీ నుంచి దూరం చేయలేరని అన్నారు.