
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్‌ఎస్ నేత రాజారాం యాదవ్‌లపై లాలాగూడ పోలీసులు నమోదు చేసిన కేసును ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. వీరిద్దరూ నేరం చేశారనేందుకు ఆధారాల్లేవని న్యాయమూర్తి జయకుమార్ తీర్పిచ్చారు. 2009లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా తార్నాకలోని ఓ పెట్రోల్ బంక్ అద్దాలు పగులగొట్టారంటూ ఉస్మానియా వర్సిటీ పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేశారు.