విలేకరులతో మాట్లాడుతున్న బాల్కసుమన్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సంబంధించిన అంశాలను పక్కనపెట్టి సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీ వివాదాస్పదంగా మారుస్తున్నాయని, ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యతిరేకిలా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రాజకీ యంగా పబ్బం గడుపుకునేందుకే జై శ్రీరామ్‌కు బదులుగా జై భీమ్ అంటున్నారని, కేసీఆర్‌కు వ్యతి రేకంగా కాంగ్రెస్, బీజేపీలు పన్నిన ఉచ్చులో దళి తులు చిక్కుకోవద్దని సూచించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మెతుకు ఆనంద్‌తో కలిసి సోమవారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సుమన్ మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షకు కమిటీ వేయడంతో పాటు అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి కేబినెట్‌లో చోటు కల్పించిందన్నారు. రాజ్యాంగ సవరణలు, కొత్త రాజ్యాంగం వంటిది తెచ్చినా అంబేడ్కర్ స్ఫూర్తితోనే జరుగుతుందని, కేసీఆర్ చెప్పినంత మాత్రాన రాజ్యాంగం రాత్రికి రాత్రే మారదనే విషయం తెలిసి కూడా బీజేపీ అంశాన్ని పక్కదారి పట్టిస్తోందని సుమన్ మండిపడ్డారు.
ముందు అంబేడ్కర్‌ను దూషించిన బీజేపీ మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, సీఎం మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం లేదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment