
సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో కరోనా కేసులు 6కు చేరాయి. కాగా గ్రామంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామస్థులు బయటి వారు గ్రామంలోకి రాకుండా పొలిమేరలో కంచె ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గ్రామంలోని వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని అధికారులు పిచికారీ చేయిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. (కరోనా వైరస్ బారిన మరో ఎమ్మెల్యే)