positive results
-
జనవరిలో ‘తయారీ’కి కొత్త ఆర్డర్ల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్ మొత్తం పారిశ్రామికరంగంలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జనవరిలో సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకుంది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 56.5కి ఎగసింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. డిసెంబర్లో ఈ సూచీ 54.9గా (18 నెలల కనిష్టం) నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల ఉపశమనం, డిమాండ్ బాగుండడం, కొత్త ఆర్డర్లలో పురోగతి ఇందుకు ప్రధాన కారణంగా నిలిచినట్లు నెలవారీ సర్వే పేర్కొంది. కాగా, ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే పేర్కొంటారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. -
ఒడిశాలో 180 మందికి స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. సుందర్‌గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు. -
నష్టాల నుంచి.. లాభాల్లోకి
ముంబై: ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ రిలయన్స్, టీసీఎస్ షేర్లు రెండు శాతం రాణించాయి. ఉదయం సెన్సెక్స్ నాలుగు పాయింట్ల స్వల్ప నష్టంతో 66,156 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 19,666 వద్ద మిశ్రమంగా మెదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో స్వల్ప అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 65,999 వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు పతనమై 19,598 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. తదుపరి ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో దేశీయ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సూచీలు నష్టాలను భర్తీ చేసుకొని లాభాలను ఆర్జించగలిగాయి. చివరికి సెన్సెక్స్ 367 పాయింట్లు పెరిగి 66,528 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు బలపడి 19,754 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఐటీ, మెటల్, ఆయిల్, విద్యుత్ షేర్లకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు భారీ డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.31%, ఒకశాతం ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.701 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,488 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు క్షీణించి 82.29 స్థాయి వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోమవారం బీఎస్ఈలో రూ.2.50 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.306.66 లక్షల కోట్లకు చేరింది. ► దేశీయ అత్యంత విలువైన రెండో సంస్థగా టీసీఎస్ తిరిగి తన స్థానాన్ని దక్కించుకుంది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు 2% లాభపడి రూ.3,421 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.12.51 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఈ జూలై 20న రెండో స్థానానికి చేరుకున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు(0.38%) రూ.12.45 లక్షల కోట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. కాగా ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రూ.17.23 లక్షల కోట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ► జెట్ ఎయిర్వేస్ షేరు బీఎస్ఈలో 5% పెరిగి రూ.50.80 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఎయిర్ ఆపరేటర్ సరి్టఫికెట్ పునరుద్ధరించినట్లు జలాన్ – కల్రాక్ కన్సార్షియం తెలపడంతో ఈ షేరుకు డిమాండ్ పెరిగింది. ఎల్అండ్టీ రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ తమ షేర్హోల్డర్లకు రూ. 6 ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. చైర్మన్ ఏఎం నాయక్.. ఆరు దశాబ్దాలుగా గ్రూప్‌నకు నిరంతరాయంగా సేవలు అందిస్తుండటాన్ని పురస్కరించుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి ఆగస్టు 2 రికార్డు తేదీ కాగా ఆగస్టు 14లోగా డివిడెండ్ చెల్లిస్తారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా భారత కార్పొరేట్ చరిత్రలో నాయక్ పేరు చిరస్థాయిగా నిలి్చపోతుందని ఉద్యోగులకు రాసిన లేఖలో ఎల్అండ్టీ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. దశాబ్దాలుగా ఆయన అందించిన సేవలకు గాను గౌరవ సూచకంగా షేర్హోల్డర్లకు ప్రత్యేక డివిడెండ్ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆగస్టు 9న జరిగే సిల్వర్ జూబ్లీ ఏజీఎంలో నాయక్ పాల్గోనున్నట్లు పేర్కొన్నారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
అమెరికా అధ్యక్షునికి కరోనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు గురువారం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరైన్ జీన్–పియర్రీ ప్రకటించారు. కరోనా లక్షణాల తీవ్రతను తగ్గించే యాంటీ వైరల్ డ్రగ్ ‘పాక్స్లోవిడ్’ను తీసుకుంటున్నారని వెల్లడించారు. అధ్యక్షుడు ప్రస్తుతం శ్వేతసౌధంలో ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె త్వరగానే కోలుకున్నారు. -
ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ
న్యూఢిల్లీ: భారత్‌లోనూ రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరిగిపోతోంది. వరసగా 8వ రోజు కేసుల సంఖ్య పెరిగింది. దేశ రాజధానిఢిల్లీలో ఒమిక్రాన్ వేరియెంట్ విస్తృతంగా వ్యాపిస్తూ ఉండడంతో శని, ఆదివారాల్లో కర్ఫ్యూ విధించాల ని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తెలిపారు. బస్సులు, మెట్రో రైళ్లు తిరిగి 100 శాతం సామర్థ్యంతో పని చేస్తాయన్నారు. బస్సులు, మెట్రోల కోసం వేచి చూసే వారు సూపర్ స్ప్రెడర్లుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 8.37%కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటూ ఉండడంతో కరోనా సోకింది. మరోవైపు పంజాబ్ రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలన్నీ మూసివేసింది. సినిమా హాల్స్, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి. యూపీలో జనవరి 15 వరకు విద్యాసంస్థలను మూసివేశారు. 1892కి చేరుకున్న ఒమిక్రాన్ కేసులు గత 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య 1,892కి చేరుకుంది. -
దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా(69) కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు స్వల్పలక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్‌టౌన్‌లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డీక్లార్క్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రమఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమఫోసా కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న రమఫోసా..ఉపాధ్యక్షుడు డేవిడ్ మబూజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో బయటపడిన విషయం తెలిసిందే. -
కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్
Kamal Haasan Tested Coronavirus Positive: విలక్షణ నటుడు కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. చదవండి: యానీ ఎలిమినేషన్‌కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..! ‘ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డాను. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్ క్లాత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్‌హాసన్ అమెరికా వెళ్లారట. அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள். — Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021 -
నాకు మళ్లీ కరోనా:ప్రగ్యా జైస్వాల్
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తను పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఆదివారం నేను కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాను. నాకు స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇంతకముందు కరోనా బారిన పడ్డాను. ఇప్పడు మళ్లీ కరోనా వచ్చింది .ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. గత 10 రోజులుగా నన్ను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి’ అని ప్రగ్యా సూచించింది. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) అయితే ప్రగ్యాకి కరోనా సోకడంతో అఖండ మూవీ టీం ఆందోళనలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆఖండ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందం సెలబ్రెషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె హీరో బాలకృష్ణతో పాటు పలువురితో సన్నిహితంగా మెలిగింది. అంతేగాక బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
చహల్, గౌతమ్‌లకు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనను ముగించిన భారత క్రికెట్ జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్పిన్నర్ యజువేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు శుక్రవారం కోవిడ్–19 పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మంగళవారం పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది (హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, దీపక్ చహర్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే)లో వీరిద్దరు కూడా ఉన్నారు. అప్పటి నుంచి వీరంతా కూడా తమ గదుల్లోనే క్వారంటైన్ అయ్యారు. దాంతో చివరి రెండు టి20 మ్యాచ్‌లకు ఈ ఎనిమిది మంది కూడా దూరమయ్యారు. స్వదేశానికి పయనమయ్యేముందు భారత జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లో చహల్, గౌతమ్ పాజిటివ్‌గా తేలారు. మిగిలిన టీమ్ ప్రత్యేక విమానంలో శుక్రవారం బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి ప్లేయర్లు తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఆ ముగ్గురి పరిస్థితేంటి? పాజిటివ్‌గా తేలిన కృనాల్ పాండ్యా, చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కొలంబోలో ఏడు రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అనంతరం వారికి రెండు సార్లు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పర్యాయాలు నెగెటివ్‌గా తేలితే భారత్‌కు వచ్చేందుకు వారికి అనుమతి లభిస్తుంది. ఇంగ్లండ్‌కు వెళ్లేందుకు సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీరిద్దరికీ తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో... త్వరలోనే కొలంబో నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్‌లు గాయపడటంతో... వారి స్థానాల్లో సూర్యకుమార్, పృథ్వీ షాలను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. -
పాజిటివ్ రిపోర్ట్ తప్పనిసరి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, హెల్త్ సెంటర్లలో వారిని చేర్చుకోవడానికి కరోనా పాజిటివ్ రిపోర్టు తప్పనిసరి కాదని తేల్చిచెప్పింది. అంటే నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు రిపోర్టు ఉన్నా, లేకపోయినా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు కరోనా బాధితుల అడ్మిషన్ల విషయంలో జాతీయ విధానంలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. ఏ ఒక్క బాధితుడికి కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్య సేవలను నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది. ఆక్సిజన్, అత్యవసర ప్రాణాధార ఔషధాల సహా ఇతర సేవలను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది. బాధితుడు మరో నగరానికి, పట్టణానికి చెందినవాడైనప్పటికీ ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందేనని వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి బారిన పడిన బాధితులకు ప్రభావవంతమైన, సమగ్రమైన చికిత్స వేగవంతంగా అందించాలన్నదే లక్ష్యమని ఆరోగ్య శాఖ తెలిపింది. అందుకే జాతీయ విధానంలో మార్పులు చేసినట్లు వివరించింది. అవసరం అనే ప్రాతిపదికగానే.. అనుమానిత కరోనా రోగులను పాజిటివ్ రిపోర్టు లేకపోయినా కోవిడ్ కేర్ సెంటర్(సీసీసీ), డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్(డీసీహెచ్‌సీ)లో చేర్చుకోవాలని∙ఆరోగ్య శాఖ ఉద్ఘాటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో ఇది వర్తిస్తుందని వెల్లడించింది. సదరు బాధితుడి స్వస్థలం ఆసుపత్రి ఉన్న నగరం/పట్టణం కాకపోయినా ప్రవేశం నిరాకరించరాదని సూచించింది. అవసరం అనే ప్రాతిపదికన ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని పేర్కొంది. హాస్పిటల్ సేవలు అవసరమైన వారికి మాత్రమే పడకలు కేటాయించాలని, అవసరం లేని వారికి కేటాయించరాదని స్పష్టం చేసింది. డిశ్చార్జ్ పాలసీకి అనుగుణంగానే పేషెంట్లను డిశ్చార్జ్ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 3 రోజుల్లోగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. -
ప్రసిధ్ కృష్ణ ‘పాజిటివ్’
ముంబై: ఐపీఎల్ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) బృందంలోని సభ్యులే. పేస్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ, న్యూజిలాండ్‌కు చెందిన వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్‌లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్ కూడా మే 3న బబుల్ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. న్యూజిలాండ్‌కు చెందిన సీఫెర్ట్‌కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్’ వచ్చింది. దాంతో సీఫెర్ట్ అహ్మదాబాద్‌లోనే ఆగిపోయాడు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్‌ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే అతను న్యూజిలాండ్ పయనమవుతాడు. సీఫెర్ట్ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ వ్యాఖ్యానించారు. ప్రసిధ్‌కు సాధ్యమేనా... ఇంగ్లండ్ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్ ఆటగాళ్లలో ప్రసిధ్ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్‌గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ను తీసుకుంటే అది ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్‌గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. -
గత పది రోజులుగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం: శిల్పా శెట్టి
తన కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్లు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘గత పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితిల్లో ఉంది. మా అత్తమామ, మా అమ్మ, చివరిగా నా భర్త రాజ్ కరోనా బారిన పడ్డారు. వారంత ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. నాకు నెగిటివ్‌గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు వారంత క్వారంటైన్ గైడ్లైన్ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మా ఇంటి పనివాళ్లలోని ఇద్దరికి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. దేవుడు దయ వల్ల అందరూ కొలుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న కుటుంబ సభ్యులంతా కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకు సహకరించిన ముంబై మున్సిపాలిటీ కమిషన్(బీఎంసీ), అధికారులకు శిల్పా ధన్యవాదాలు తెలిపింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘మీ అందరి ప్రేమ, మద్దతకు కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన వారందరికి రుణ పడి ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. ఇక ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుము మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం తప్పసరి చేసుకొండని సూచించింది. కోవిడ్ పాజిటివ్, నెగిటివ్ అయినా ప్రతి ఒక్కరూ మానసికంగా పాజిటివ్‌గా ఉండాలంటూ సందేశం ఇచ్చింది. కాగా శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, ఏడాది కూతురు ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
యుగానికి ఒక్కడు హీరోయిన్‌కు కరోనా
కరోనా సెకండ్ వేవ్‌లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను!
మరో వారం పది రోజుల్లో డెలివరీ... బిడ్డ పుట్టగానే ఎలా ఉందో చూడాలనే ఆరాటం.. తాకాలనే అనురాగం... బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకోవాలన్న ఆనందం. ఇలా... ఎన్నో ఆశలతో హరితేజ డెలివరీ కోసం ఎదురు చూశారు. సరిగ్గా డెలివరీ టైమ్‌కి వారం పది రోజుల ముందు కరోనా పాజిటివ్. నెగటివ్ ఆలోచనలు దగ్గరకు రాకూడని పరిస్థితి. రుచి తెలియకపోయినా తినాల్సిన పరిస్థితి. బిడ్డ బాగుండాలంటే తల్లి ప్రశాంతంగా ఉండాలి. మరి.. యాంకర్, ‘బిగ్ బాస్’ ఫేమ్, నటి హరితేజ ఈ కరోనా కష్టకాలాన్ని ఎలా అధిగమించారు? ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ► మీకు మాత్రమే కాదు.. ఇంటిల్లిపాదికీ కరోనా వచ్చిందని విన్నాం... హరితేజ: అవును. నాతో పాటు మా అమ్మానాన్న ఉన్నారు. నాకు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో మా అత్తగారు బెంగళూరు నుంచి వచ్చారు. ఒక్క మావారికి తప్ప ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్. అమ్మానాన్న, అత్తయ్య వేరే ఇంట్లో క్వారంటైన్లో ఉండిపోయారు. నాతో పాటు మావారు ఉన్నారు. ► ఇంట్లో ముందు ఎవరికి వచ్చింది? మా అమ్మానాన్నకు! వాళ్లకి వచ్చిన రెండు మూడు రోజులకు నాకు వచ్చింది. నాకు ముందు జ్వరం వచ్చింది.. కొంచెం నీరసంగా అనిపించింది. రెండు రోజులకు రుచి, వాసన పోయాయి. అప్పుడే నాకు పాజిటివ్ అని ఫిక్పయిపోయాను. కానీ ఇంట్లోవాళ్లు అలాంటిదేం ఉండదని వాదించారు. టెస్ట్ చేయించుకున్నాను. కానీ ఆ రోజు రాత్రి ‘నెగటివ్ వస్తే బాగుంటుంది’ అని పదే పదే దేవుణ్ణి తలుచుకున్నాను.. అయితే దురదృష్టం పాజిటివ్ అని వచ్చింది. ఆల్రెడీ నాకు తొమ్మిది నెలల నిండాయి. పొట్ట బరువు ఎక్కింది. మావారికి నెగటివ్ వచ్చింది. అయినా నన్ను అంటిపెట్టుకునే ఉన్నారు.. ఆయనకు ఎక్కడ కరోనా సోకుతుందోనని నా భయం. ► ఇంట్లో ఒకరికి కరోనా వచ్చినా పనివాళ్లను రమ్మనలేం. మీకు సహాయంగా మీవారు తప్ప ఇంట్లే వేరే ఆడవాళ్లు లేరు. ఇంటిపనులు ఎలా మేనేజ్ చేశారు? అంతా మావారే చేశారు. ఆయనకు వంట వచ్చు. ఆ మాటకొస్తే ఆయనకు రానిదంటూ లేదు. ఒక్క ఈ పరిస్థితుల్లోనే కాదు.. మిగతా రోజుల్లో కూడా నేను షూటింగ్స్ కోసం అవుట్డోర్ వెళ్లినప్పుడు ఆయనే ఇంటిని మ్యానేజ్ చేస్తారు. అందుకని ఇబ్బందిపడలేదు. ► నార్మల్వాళ్లే కరోనా సోకిందంటే భయపడుతున్నారు. మీరేమో వట్టి మనిషి కాదు. ‘పాజిటివ్’ అని రాగానే మీ మానసిక స్థితి ఏంటి? అప్పటివరకూ డెలివరీ టైమ్‌లో నొప్పి బాగా ఉంటుందేమో? డెలివరీ ఎలా జరుగుతుందో? అనే ఆలోచనలు ఉండేవి. కానీ అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. కరోనా అని తెలిశాక రాత్రీపగలూ ఒకటే టెన్షన్. ఏ టైమ్‌లో ఏం జరుగుతుందో? ఏం వినాల్సి వస్తుందో? అని భయం. బేబీ బాగుంటే చాలు అనేది మాత్రమే మనసులో ఉండేది. ► బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు అమ్మ వీలైనంత ప్రశాంతంగా ఉండాలి.. టెన్షన్ తగ్గించుకోవడానికి ఏం చేశారు? కరెక్టే... ఎక్కువ టెన్షన్ పడితే నాకు బీపీ పెరిగితే బిడ్డకు మంచిది కాదు. అందుకే నేను కొంచెం బ్యాలెన్డ్స్గానే ఉండేదాన్ని. కరోనా అని తెలిసి నా చుట్టూ ఉన్నవాళ్లు ఏడ్చినా, విపరీతంగా బాధపడినా నాకు మాత్రం ఏడ్చే పరిస్థితి కూడా లేదు. ‘మన కడుపులో ఇంకొకరు మన మీద ఆధారపడి ఉన్నారు’ అనే ఫీలింగ్ ఏడ్వనివ్వలేదు. ‘ఈ టైమ్‌లో మీరు టెన్షన్ పడితే బీపీ పెరిగిపోతుంది. వీలైనంత కూల్‌గా ఉండండి’ అని డాక్టర్లు కూడా చెప్పారు.. ఇక నా కళ్లముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ‘ధైర్యంగా ఉండడం’. నాకు నేనుగా ధైర్యం తెచ్చుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ నేను ప్రశాంతంగా ఉండగలిగానంటే కారణం నేను చేసిన యోగా.. ధ్యానం. తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా నిద్రలేచి, మా మేడ మీద ‘ప్రాణాయామం’ చేసేదాన్ని. దానివల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది అనిపించలేదు. ధాన్యం వల్ల ప్రశాంతంగా ఉండగలిగాను. ► కరోనా అంటే రుచి, వాసన తెలియదు. రుచి తెలియకపోతే ఆహారం తీసుకోలేం. తినాల్సిన నిర్బంధ పరిస్థితి మీది.. అదో బాధ అండీ.. బేబీ కోసం కచ్చితంగా తినాల్సిందే. ఏమీ తినబుద్ధయ్యేది కాదు. కరోనా సోకిన తర్వాత మావాళ్లు తినలేకపోయారు. నాక్కూడా అన్నం చూస్తే ఏదోలా ఉండేది. కానీ కడుపులో బేబీ ఉంది కాబట్టి, బలవంతంగా తిన్నాను. ఏం చేసినా బేబీ కోసమే. కొత్త టెన్షన్‌ని పక్కన పెట్టడం, బాధని వెనక్కి నెట్టడం నుంచి తినాలనిపించకపోయినా తినడం వరకూ ఏం చేసినా బేబీ క్షేమం కోసం చేశాను. ► గర్భవతిగా ఉన్నప్పుడు ఏ మందులు పడితే అవి వాడకూడదు. మరి.. కరోనాకి డాక్టర్లు ఇచ్చే మందులు వాడలేని స్థితిలో ఉన్న మీరు.. వేరే ఏ జాగ్రత్తలు తీసుకున్నారు? అవునండీ... మందులు వాడలేదు. అందుకు బదులుగా ప్రతిరోజూ ఉదయం వేపాకులు నమిలేదాన్ని. తులసి ఆకులు తినేదాన్ని. అల్లం, మిరియాలతో కషా యం చేసుకుని తాగేదాన్ని. రోజుకి నాలుగుసార్లు ఆవిరి పట్టేదాన్ని. యోగా, ధ్యానం వంటివి కూడా హెల్ప్ అయ్యాయి. నెగటివ్ తెచ్చుకోవాలనే తపనతో జాగ్రత్తలు తీసుకున్నాను. ► జనరల్‌గా మనకున్న సౌకర్యాలను బట్టి డెలివరీ జరిగే ఆసుపత్రిని సెలక్ట్ చేసుకుంటాం. మీరలా ఎంపిక చేసుకునే ఉంటారు. ఫైనల్‌గా కోవిడ్ ఆçసుపత్రిలోనే డెలివరీ అన్నప్పుడు కంగారుపడ్డారా? తొమ్మిది నెలలు ప్రతి నెలా చెకప్‌కి ఒకే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. మంచి ఆసుపత్రి సెలక్ట్ చేసుకుని, డెలివరీకి ప్రిపేర్ అయ్యాను. కానీ అది ‘నాన్ కోవిడ్ హాస్పిటల్’. అక్కడ కుదరదన్నారు. వేరే డాక్టర్ని సూచించారు. తొమ్మిది నెలల నా ఆరోగ్య స్థితి ఆ డాక్టర్‌కి తెలిసినంతగా కొత్త డాక్టర్‌కి తెలుస్తుందా? అని టెన్షన్ పడ్డాను. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కొంత రిలీఫ్ ఇస్తాడంటారు. అలా నేను వెళ్లిన డాక్టర్ నాకు చాలా ధైర్యం చెప్పారు. ‘ఏం ఫర్వాలేదు.. కూల్‌గా ఉండండి’ అన్నారు. ట్రీట్మెంట్ బాగా జరిగింది. నాకు డాక్టర్లందరూ దేవుళ్లలా కనిపించారు. అంతా సజావుగా జరిగేలా చేశారు. ► నార్మల్ డెలివరీ కాకుండా ‘సిజేరియన్’ చేయించుకోవాల్సి రావడం గురించి... నార్మల్ డెలివరీ అవ్వాలన్నదే నా ఆశ. అందుకే యోగా చేసుకుంటూ, డ్యాన్స్ కూడా చేసేదాన్ని. కింద కూర్చుని, పైకి లేవడం... ఇలా చాలా యాక్టివ్‌గా ఉన్నాను. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ చాలా ప్రశాంతంగా ఉన్నాను. వేరే ఆరోగ్య సమస్యలేవీ లేవు. నార్మల్ డెలివరీయే అని డాక్టర్ కూడా అన్నారు. కోవిడ్ హాస్పిటల్ కాబట్టి అందరూ కరోనా పేషెంట్లే! డాక్టర్లంతా ‘పీపీఈ’ డ్రెస్సులతో ఫుల్లీ కవర్డ్! ఆ వాతావరణం కొంచెం డిస్టర్బింగ్గానే అనిపించింది. ఆందోళన పడకూడదన్నా పడతాం. ఇక కరోనా సోకడంతో నార్మల్ డెలివరీ మంచిది కాదన్నారు. ఓ ఆరేడు గంటలు నొప్పులు పడటంవల్ల బిడ్డకు మంచిది కాదని, సిజేరియన్ చేయాల్సిందేనని అన్నారు. ప్లస్ నొప్పులు తట్టుకునే శక్తి ఉంటుందా? అనే సందేహం కూడా డాక్టర్లకి ఉంది. అందుకే వీలైనంత త్వరగా బేబీని బయటకు తీయాలన్నారు. ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లేటప్పుడు ‘డెలివరీ ఎలా జరిగినా.. ఏ డాక్టర్ చేసినా.. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు’ అని కోరుకున్నాను. ► బిడ్డ పుట్టగానే చూశారా... తాకారా? ఒక బాధాకరమైన విషయం ఏంటంటే... వెంటనే చూడలేదు. ఇక తాకే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? బిడ్డను బయటకు తీయగానే వేరే గదిలో ఉంచారు. వీడియో కాల్స్‌లో చూపించారు. లక్కీగా మా పాపకు నెగటివ్ వచ్చింది. ► మీకెప్పుడు నెగటివ్ వచ్చింది.. పాపను ఎప్పుడు తాకారు? మరి... బిడ్డకు ఆహారం ఎలా? పాలు ఇవ్వమన్నారు. బేబీకి నా ఉమ్ము టచ్ కాకూడదన్నారు. పాలు పట్టినంతసేపూ దగ్గకుండా, తుమ్మకుండా ఉండాలి. పాప పాలు తాగున్నంతసేపూ ముఖం ఒకవైపుకి తిప్పుకునేదాన్ని. ఆ పది నిమిషాలూ భయం భయంగానే ఉండేది. చేతులకు గ్లౌజులు వేసుకుని ఎత్తుకునేదాన్ని. పాప పుట్టిన 11 రోజులకు నాకు నెగటివ్ వచ్చింది. అప్పుడు గ్లౌజులు అవీ తీసేసి, పాపను తాకితే భలే అనిపించింది. గట్టిగా హత్తుకున్నాను. ► పాపకు పేరు పెట్టారా? లేదు. ఈ కరోనా టైమ్‌లో నామకరణం వేడుక అంటే సాధ్యం అయ్యేది కాదు. అందుకే ఓ రెండు నెలలు ఆగుదాం అనుకున్నాం. ► ఇప్పుడంతా రిలీఫ్.. ఈ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? దేవుడి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డట్లయింది. నాకు ఈ ఆనందం ఈజీగా దక్కలేదు. నార్మల్‌గా నొప్పులు పడి కన్న అమ్మకు చాలా స్పెషల్‌గా ఉంటుంది. సిజేరియన్ అయినా సరే ఆనందంగానే ఉంటుంది. నేను కరోనాతో ఫైట్ చేస్తూ, బిడ్డను కన్నాను. కాబట్టి నాకు డబుల్ స్పెషల్... డబుల్ హ్యాపీనెస్. ధైర్యం కూడా డబుల్ అయింది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. వేరే ఏ టెన్షన్స్ మనసులో లేవు. నా పాపతో చక్కగా గడుపుతున్నాను. ► తొమ్మిది నెలల ప్రాసెస్‌లో డెలివరీ గురించి భయపడ్డారా? మనకు ఆకలి వేసినప్పుడు రెస్టారెంట్‌కి వెళ్లి అది తిందాం.. ఇది తిందాం అనుకుంటాం. అవి దొరక్కపోతే ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తింటాం. అప్పటివరకూ నచ్చినది తినాలనే కోరిక ఫిల్టర్ అయిపోయి, ‘ఏమీ వద్దు భగవంతుడా... ఆకలి తీరితే చాలు’ అనుకుంటాం. నా పరిస్థితి కూడా అలానే అయింది. ‘ఏమీ వద్దు. నా బిడ్డ బాగుంటే చాలు. ఆరోగ్యంగా ఉంటే చాలు’. అదొక్క ఆలోచన తప్ప వేరే ఏదీ లేదు. డెలివరీ టైమ్‌లో నాకేదైనా కష్టంగా ఉంటుందేమో అని అప్పటివరకూ ఉన్న ఆలోచనలన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ► మీరు ప్రెగ్నెంట్ కాబట్టి ఎక్స్ట్రా కేర్ తీసుకుని ఉంటారు. మరి.. ఎవరి ద్వారా కరోనా వచ్చిందంటారు? మనకేం కాదులే అనే ధైర్యం ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ఆ ధైర్యం ఎక్కువే. పైగా ఇంట్లో అందరికీ రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది. పనివాళ్లు, పాల ప్యాకెట్లు, డెలివరీ బాయ్స్.. ఇలా అందరూ వస్తారు. ఎక్కడినుంచి, ఎవరి ద్వారా అని ఇప్పుడు ఆలోచించడం అనవసరం. నాకు రావాలని రాసిపెట్టి ఉంది.. వచ్చింది. నా కూతురు కడుపులోనే ఫైట్ చేసి, బయటకు రావాలని ఉంది కాబట్టి ఇలా జరిగిందనుకుంటున్నాను. ఆ సంగతలా ఉంచితే.. ‘మనకేం అవుతుందిలే’ అని ఎవరూ తేలికగా తీసుకోకూడదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మేం నేర్చుకున్న పాఠం ఇది. ఇప్పటివరకూ ఎన్నో కష్టాలు తట్టుకుని నిలబడ్డాను కానీ ఇది వేరే కష్టం. మన భుజం తట్టే మనిషి పక్కన ఉండలేని పరిస్థితి. మనం మనోధైర్యంతో ఉండగలిగితే ఏ కష్టాన్నయినా ఎదుర్కోగలుగుతాం అని నేర్చుకున్నాను. ఇదే అందరికీ చెబుతాను. కష్టం వచ్చినప్పుడు కంగారుపడతాం. అది సహజం. అయితే దాన్ని ధైర్యంగా అధిగమించి, నిలబడాలి. నా జీవితంలో ఇదొక మైలురాయి అనాలి. ముఖ్యంగా మనల్ని నమ్ముకుని మన లోపల ఒకరున్నారనే జాగ్రత్త ప్రెగ్నెంట్ ఉమన్‌కి ఉండాలి. ఇంట్లో అందరూ తనని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. నాకు కరోనా గురించి అవగాహన లేదు కాబట్టి, విపరీతంగా భయపడ్డాను. కానీ అంత భయపడక్కర్లేదు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏది ఏమైనా బిడ్డను కనేవరకూ కరోనా రాకపోయినా వచ్చినట్లే ఉంటే.. కష్టాలు రాకుండా ఉంటాయి. ప్రశాంతంగా డెలివరీకి వెళ్లొచ్చు. మరో విషయం ఏంటంటే... తల్లికి వచ్చినంత మాత్రాన బిడ్డకు కరోనా సోకుతుందని లేదు. ఎక్కడో ఒకరిద్దరికి తప్ప ఎక్కువ శాతం బిడ్డలకు సోకడం లేదు. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. – డి.జి. భవాని -
కరోనా రికార్డుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గణాంకాల్లో అగ్రదేశాలను భారత్ వెనక్కి నెట్టేస్తోంది. కరోనా సంక్రమణ విషయంలో భారత్ గత కొన్ని రోజులుగా ప్రతీ 24 గంటలకు ఒకసారి రికార్డులను బద్దలుకొడుతోంది. దేశంలో రోజు రోజుకీ వైరస్ సంక్రమిస్తున్నవారి సంఖ్య, మరణాల సంఖ్యలో గణనీయ పెరుగుదలతో భారత్‌లో పరిస్థితి భయంకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,79,257 కొత్త పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం సోకిన వారి సంఖ్య 1,83,76,524కు చేరింది. కరోనా ఎక్కువగా ప్రభావితమైన పది రాష్ట్రాల్లోనే 72.20% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో పోరాడి 3,645 మంది తుది శ్వాస విడిచారు. దీంతో మరణాల సంఖ్య 2,04,832కు పెరిగింది. కొత్తగా 2,69,507 మంది కోలుకున్నారు. వైరస్‌తో పోరాడి ఆరోగ్యవంతులైన వారి సంఖ్య మొత్తంగా 1,50,86,878కు చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా చికిత్స పొందుతున్న యాక్టివ్ రోగుల సంఖ్య 30,84,814. దీంతో దేశంలో రికవరీ రేటు 82.10 శాతానికి, మరణాల రేటు 1.11% పడిపోయాయి. ఢిల్లీలో చికిత్స పొందుత్ను రోగుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 15 కోట్ల డోస్‌ల వ్యాక్సినేషన్ ఇప్పటివరకు దేశంలో మొత్తం 15 కోట్ల 20 వేల 648 వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడో డ్రైవ్ మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ దశలో అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం బుధవారం వరకు భారత్‌లో కరోనా వైరస్ కోసం మొత్తం 28,44,71,979 శాంపిల్స్ పరీక్షలు జరిగాయి. -
ఇప్పుడు శ్వాస తీసుకోగలుగుతున్నా: పూజా హెగ్డే
సమయాన్ని వృథా చేయడాన్ని కొందరు హీరోయిన్లు అస్సలు ఇష్టపడరు. ఈ జాబితాలో అగ్ర హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే పేరు కచ్చితంగా ఉంటుంది. పూజ చేతిలో ఉన్న అరడజను (‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కభీ ఈద్.. కభీ దీవాలీ’, తమిళ విజయ్‌తో సినిమా) సినిమాలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే కరోనా సోకడం వల్ల పూజా హెగ్డే హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఈ టైమ్‌ను కూడా క్వాలిటీగా వినియోగించుకుంటున్నారామె. వర్చ్యువల్ యోగా సెషన్స్‌లో పాల్గొన్నారు పూజ. అంతేకాదు... ఆన్లైన్లో ఈ సెషన్స్‌ను షేర్ చేశారీ బ్యూటీ. ‘‘ఈ కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాయామం మనకు ఎంతో మేలు చేస్తుంది. మనం మెరుగైన విధంగా శ్వాసను తీసుకోగలిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాణాయామం వల్ల నేను సరిగ్గా శ్వాస తీసుకోగలుగుతున్నాను’’ అన్నారు పూజా హెగ్డే. దర్శకుడు హరీష్ శంకర్, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి ప్రముఖులు పూజా ఆన్లైన్ సెషన్‌ను ఫాలో అవ్వడం విశేషం. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
Helping Hands: మానవసేవే మాధవ సేవ!
ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్ పాజిటివ్ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్ దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్ తల్లికి ఫుడ్ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్ ఫుడ్ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది. ఇటీవలే కుందన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్ దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి నీలిమ సింగ్‌కు ఇస్తారు. నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్ పేషంట్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్ దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఫుడ్ ప్యాకెట్స్‌ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది. -
బిగ్‌బాస్: కౌశల్‌కు కరోనా భయం, ఏం జరిగిందంటే!
ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతంగా పెరిగిపోతోంది. రోజుకు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో సైతం కరోనా కోరలు చాస్తోంది. దీంతో పలు షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే 50 మందికి మించకుండ షూటింగ్ నిర్వహించాలనే నిబంధనల మేరకు కొందరు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుకుంటున్నారు. అయినప్పటికి నటీనటులు ఇతర చిత్ర బృందంలోని వ్యక్తులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో మిగతా వారంత కరోనా పట్ల ఆందోళన చెందుతున్నారు. తాజాగా బిగ్‌బాస్ 2 సీజన్ విన్నర్ కౌశల్‌కు సైతం కరోనా భయం పట్టుకుంది. దీంతో అతడు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా తెలినట్లు వెల్లడించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ సినిమాల కంటే ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కౌశల్ మోడలింగ్‌లో దూసుకుపోతున్నాడు. దీంతో అతడు నెల రోజుల నుంచి ఇంటికి దూరంగా ఉంటున్నాడట. ఈ క్రమంలో తన డిజైనర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని దీంతో కౌశల్ ఇంటి దారి పట్టక తప్పలేదు. ఇక నెల రోజుల తర్వాత భార్య పిల్లలను కలుస్తుండటంతో అతడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నానని, ఎప్పుడైనా ముందు జాగ్రత్త పడటం మంచిదే అని సూచించాడు. కాగా ప్రస్తుతం కౌశల్ బ్లాక్ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) చదవండి: బిగ్‌బాస్: లైవ్‌లో రెమ్యూనరేషన్ బయట పెట్టిన కంటెస్టెంట్ టాలీవుడ్లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి పొట్టి వీరయ్య మృతి: ఉదయభాను భావోద్వేగం -
కరోనా కాఠిన్యం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్–19 మహమ్మారి బారిన పడుతున్నవారి సంఖ్య శరవేగంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ రికార్డులను తిరగరాస్తూ దేశంలో వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 3,32,730 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో 75.01 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడినవారి సంఖ్య 1,62,63,695కు చేరింది. దేశంలో 24 గంటల్లో మరో 2,263 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఒక్క రోజులో కరోనా సంబంధిత మరణాల్లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,86,920కు చేరుకుంది. రోజువారీ కరోనా సంబంధిత మరణాల్లో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. 2,027 మరణాలతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలో 568, ఢిల్లీలో 306 మరణాలు సంభవించాయి. రికవరీ రేటు 83.92 శాతం భారత్‌లో ప్రస్తుతం 24,28,616 యాక్టివ్(క్రియాశీల) కరోనా కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 14.93 శాతం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 1,36,48,159కు చేరింది. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. మొత్తం యాక్టివ్ కేసుల్లో 59.12 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఉన్నాయి. బెంగళూరులో 1.37 లక్షలు, పుణేలో 1.17 లక్షలు, ఢిల్లీలో 91 వేలు, ముంబైలో 81 వేలు, నాగపూర్‌లో 80,924, థానేలో 80,643, లక్నోలో 54,967, నాసిక్‌లో 46,706, అహ్మదాబాద్‌లో 36,247, చెన్నైలో 30,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల రేటు 1.15 శాతంగా నమోదయ్యింది. భారత్‌లో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 13,54,78,420కు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లో సింగిల్ డే రికార్డు దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 37,238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 199 మంది బాధితులు మరణించారు. దీంతో యూపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,13,370కి, మరణాల సంఖ్య 10,737కు చేరుకుంది. -
క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్
హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు హీరో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్. ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కోవిడ్ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్‌బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు మహేశ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్‌చరణ్‌లు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మొన్నటివరకు ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ మేకప్‌మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్నారు. రామ్‌చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్‌చరణ్ కూడా క్వారంటైన్లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్ హీరోలు హోమ్ క్వారంటైన్లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. -
ఒక్కరోజులో 2,17,353 కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు. 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే... దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి. 11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు.. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు. యడియూరప్పకు మళ్లీ కరోనా కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్‌సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌లకూ కరోనా సోకింది. -
జాతీయ బాక్సింగ్ శిబిరంలో కరోనా కలకలం
న్యూఢిల్లీ: భారత ఎలైట్ మహిళా బాక్సర్ల కోసం నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో కరోనా కలకలం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో పాల్గొంటున్న వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 21 మందికి పాజిటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిన వారి జాబితాలో భారత మహిళల బాక్సింగ్ జట్టు హెడ్ కోచ్ మొహమ్మద్ అలీ కమర్, హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ రాఫెల్ బెర్గామాస్కో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్లెవరికీ పాజిటివ్ రాలేదని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తెలిపింది. కరోనా సోకిన వారందరూ క్వారంటైన్లో ఉన్నారని... నెగెటివ్ వచ్చిన వారికి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియానికి తరలించామని ‘సాయ్’ వివరించింది. -
ఐపీఎల్లో మరో పాజిటివ్!
ముంబై: ఐపీఎల్ తాజా సీజన్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలర్ యాన్రిచ్ నోర్జేకు నిర్వహించిన తొలి ఆర్టీ–పీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. బుధవారం నోర్జేకు నిర్వహించిన రెండో ఆర్టీ–పీసీఆర్ టెస్టు ఫలితం ఇంకా రాలేదు. దాంతో గురువారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు నోర్జే దూరం కానున్నాడు. అయితే నోర్జేకు పాజిటివ్ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. ‘నోర్జే కరోనా నిర్ధారణ పరీక్షలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అతను క్వారంటైన్‌లోనే ఉన్నాడు’ అని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతినిధి తెలిపాడు. నోర్జేతో ఈనెల 6న కలిసి వచ్చిన దక్షిణాఫ్రికాకే చెందిన మరో బౌలర్ కగిసో రబడకు నెగెటివ్ వచ్చింది. దాంతో అతను ఢిల్లీ జట్టు శిక్షణ శిబిరంలో పాల్గొన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), దేవ్‌దత్ పడిక్కల్, డానియల్ సామ్స్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కరోనా బారిన పడ్డారు. -
‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవల ఆయనను కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలిపారు. కాగా ఇటీవల చెన్నైలో జరిగిన ‘తలైవి’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తెలినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి హిట్ చిత్రాలకు ఆయన కథ అందించారు. తాజాగా ఆయన బాలీవుడ్ బహుభాష చిత్రం ‘సీత’కు కూడా స్ర్కీప్ట్ను సమకుర్చారు. చదవండి: అల్లు అర్జున్ అభిమానులపై కేసు ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్