డెహ్రాడూన్: తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో నిద్ర పట్టడం లేదని ప్రముఖ సీరియల్ నటి మోహేనా కుమారి పేర్కొన్నారు. దీనిపై ఆమె మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నిద్రపట్టడం లేదు.. ఈ ప్రారంభ రోజులు మా అందరికి ముఖ్యంగా చిన్నవారికి, పెద్దవారికి చాలా కష్టంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మేమంతా త్వరలో బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాము. ఈ విషయంలో దేనిపై మాకు ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇంతకన్నా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు సమాజంలో చాలా మంది ఉన్నారు’ అంటూ ఆమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి)
అంతేగాక తన కుటుంబమంతా కరోనా బారిన పడిన విషయం తెలిసి సన్నిహితులు, బంధువులు త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామంటు వారికి క్షేమ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహేనా ‘‘మా కుటుంబం మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సందేశాలు పంపిస్తున్న వారందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. మీ మెసేజ్‌లు మాలో ఆత్మవిశ్వాన్ని నింపుతున్నాయి’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తనతో పాటు తన భర్త సూయేష్ రావత్, ఆయన తండ్రి, ఉత్తరాఖండ్ పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్‌కు, ఆయన భార్యకు కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు, వారి బంధువులు 41 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. (మంత్రి భార్యకు కరోనా: 41 మంది క్వారంటైన్)
Comments
Please login to add a commentAdd a comment