Satpal Maharaj
-
కరోనా పాజిటివ్.. నిద్ర పట్టడం లేదు: నటి
డెహ్రాడూన్: తనకు తన కుటుంబ సభ్యులకు కరోనా అని తేలడంతో నిద్ర పట్టడం లేదని ప్రముఖ సీరియల్ నటి మోహేనా కుమారి పేర్కొన్నారు. దీనిపై ఆమె మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘నిద్రపట్టడం లేదు.. ఈ ప్రారంభ రోజులు మా అందరికి ముఖ్యంగా చిన్నవారికి, పెద్దవారికి చాలా కష్టంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మేమంతా త్వరలో బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాము. ఈ విషయంలో దేనిపై మాకు ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే ఇంతకన్నా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నవారు సమాజంలో చాలా మంది ఉన్నారు’ అంటూ ఆమె ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి) అంతేగాక తన కుటుంబమంతా కరోనా బారిన పడిన విషయం తెలిసి సన్నిహితులు, బంధువులు త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామంటు వారికి క్షేమ సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహేనా ‘‘మా కుటుంబం మహమ్మారి నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తూ.. సందేశాలు పంపిస్తున్న వారందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్న. మీ మెసేజ్‌లు మాలో ఆత్మవిశ్వాన్ని నింపుతున్నాయి’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా తనతో పాటు తన భర్త సూయేష్ రావత్, ఆయన తండ్రి, ఉత్తరాఖండ్ పర్యటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్‌కు, ఆయన భార్యకు కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు, వారి బంధువులు 41 మంది క్వారంటైన్లో ఉన్నారు. (మంత్రి భార్యకు కరోనా: 41 మంది క్వారంటైన్) View this post on Instagram 🙏🏽 A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jun 1, 2020 at 3:16pm PDT -
మాకు కరోనా పాజిటివ్‌గా తేలింది: నటి
ముంబై: ‘యెహ్ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోహనా కుమారి మాట్లాడుతూ.. ‘ఇది నిజం. నాకు, నా కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం మేమందరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాము. మాకు కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని.. త్వరలోనే కోలుకుంటామని వైద్యులు తెలిపారు. మేము అదే నమ్ముతున్నాం’ అన్నారు. తొలుత ఆమె అత్త అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. ఆమెను రిషికేశ్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మోహనా కుటుంబంలో పని చేస్తున్న వారికి కూడా కరోనా పాజిటటివ్‌గా తేలడంతో వారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో మోహనా ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కుమారుడు సుయేష్ రావత్‌ని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త, కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌లో నివసిస్తోంది. (ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత) -
మంత్రి భార్యకు కరోనా: 41 మంది క్వారంటైన్
డెహ్రాడున్: కరోనా వైరస్‌కు తన తమ తారతమ్య బేధాలు లేవు. సామాన్యుడి నుంచి పాలకుల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరినీ గజగజలాడిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పల్ మహారాజ్ భార్య, మాజీ మంత్రి అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. దీంతో మంత్రి సహా 41 మంది క్వారంటైన్లో ఉన్నారు. గత కొంతకాలంగా అస్వస్థతగా ఉన్న అమృత రావత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం పాజిటివ్‌గా తేలింది. (దుబాయ్ టూ హైదరాబాద్) దీంతో ఆమెను రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఫలితాల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కాగా మంత్రి సత్పల్ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి సమావేశమవడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక ఉత్తరాఖండ్‌లో తాజాగా నమోదైన 22 కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 749కు చేరుకుంది. (కరోనా కేసులింకా పెరుగుతాయ్..) -
హిమాలయాల్లో ఓ పర్వతానికి వాజ్‌పేయ్ పేరు
డెహ్రడూన్ : భారత మాజీ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి అరుదైన గౌరవం దక్కింది. హిమాలయాల్లోని ఓ పర్వాతానికి వాజ్‌పేయి పేరును పెట్టనున్నట్లు ఉత్తరఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ ప్రకటించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘వాజ్‌పేయి వల్లనే ఉత్తరఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆయన మా రాష్ట్ర ప్రజలకు చేసిన మేలును ఎన్నటికి మరవం. వాజ్‌పేయి ప్రకృతి ప్రేమికుడు. అడవులు, పర్వతాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందువల్లే హిమలయాల్లోని ఓ పర్వతానికి వాజ్‌పేయి పేరు పెట్టాలని నిర్ణయించాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం’ అని తెలిపారు. వాజ్‌పేయి మరణించిన తరువాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, నాయకులు కేంద్రం ఆమోదంతో మాజీ ప్రధాని గౌరవార్థం తమ తమ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం బీజేపీ నాయకుడి గౌరవార్థం రాష్ట్రంలోని ఏడు ప్రదేశాలకు వాజ్‌పేయి పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ త్వరలో నిర్మించబోయే చత్తీస్‌గఢ్ నూతన రాజధాని ‘నయా రాయ్‌పూర్’ను ‘అటల్ నగర్’గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అటల్ బిహారి వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలోనే ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించాయి. -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు
-
కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శుక్రవారం షాక్ మీద షాక్ తగిలింది. కాంగ్రెస పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బూటా సింగ్, సత్పాల్ మహారాజ్‌లు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన సత్తాల్ మహారాజు శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మరో10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. ఆ పరిణామంతో ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కకుంది. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానానికి సత్పాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి ఎరుగని ధీరుడిగా సత్పాల్ పేరు పొందారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే బూటా సింగ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరనున్నారు. ఆయన రాజస్థాన్‌లోని జాలోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎస్పీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవనున్నారు. గతంలో బూటా సింగ్ కూడా కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.