
డెహ్రాడున్: కరోనా వైరస్‌కు తన తమ తారతమ్య బేధాలు లేవు. సామాన్యుడి నుంచి పాలకుల వరకూ ఎవ్వరినీ వదిలిపెట్టకుండా అందరినీ గజగజలాడిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పల్ మహారాజ్ భార్య, మాజీ మంత్రి అమృత రావత్ కరోనా బారిన పడ్డారు. దీంతో మంత్రి సహా 41 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. గత కొంతకాలంగా అస్వస్థతగా ఉన్న అమృత రావత్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా శనివారం పాజిటివ్‌గా తేలింది. (దుబాయ్ టూ హైదరాబాద్)
దీంతో ఆమెను రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఫలితాల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కాగా మంత్రి సత్పల్ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో కలిసి సమావేశమవడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇక ఉత్తరాఖండ్‌లో తాజాగా నమోదైన 22 కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 749కు చేరుకుంది. (కరోనా కేసులింకా పెరుగుతాయ్..)
Comments
Please login to add a commentAdd a comment