
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవల ఆయనను కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలిపారు.
కాగా ఇటీవల చెన్నైలో జరిగిన ‘తలైవి’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తెలినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి హిట్ చిత్రాలకు ఆయన కథ అందించారు. తాజాగా ఆయన బాలీవుడ్ బహుభాష చిత్రం ‘సీత’కు కూడా స్ర్కీప్ట్‌ను సమకుర్చారు.
చదవండి:
అల్లు అర్జున్ అభిమానులపై కేసు
ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్‌జీవీ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment