KV Vijayendra Prasad
-
RRR Sequel: రామ్‌చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!
అద్గదీ.. సినిమా అంటే ఇట్టుండాల... తీసిందెవరు మరి? రాజమౌళి! ఈ మాట చాలాసార్లు విన్నాం. రాజమౌళి ఏ సినిమా తీసినా వంక పెట్టడానికి సందివ్వకుండా చూసుకుంటాడు. తన సినిమాకు వచ్చే ప్రశంసల సుడిగుండంలో ఒకటీరెండు విమర్శలు కొట్టుకుపోతాయి. రాజమౌళి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ రికార్డులు కూడా గడగడలాడిపోతాయి. గతేడాది ఆయన తీసిన ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయస్థాయిలో అవార్డులు సాధించి ఇండియన్ సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పింది. హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇంతవరకు ఇలాంటి సినిమాను చూసిందే లేదని ఆశ్చర్యపోయారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఫిదా అవుతూ నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ తెరకెక్కించే ఆస్కారం లేకపోలేదని ఆమధ్య వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసే బాధ్యతను రచయిత విజయేంద్రప్రసాద్ తన భుజాన వేసుకున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆర్ఆర్ఆర్కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా దాన్ని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాం. ఈ సినిమా కోసం హాలీవుడ్ నిర్మాతను తీసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తాడనేది నేను కచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అతడు లేదంటే అతడి నేతృత్వంలో మరొకరు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తారు' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు జక్కన్న లేకుండా ఆర్ఆర్ఆర్ 2ను ఊహించలమా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే! చదవండి: గన్ పేలుడు శబ్ధాలు.. అల్లర్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి జీవితమంతా కష్టాలే.. ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? -
మహేశ్-రాజమౌళి మూవీ నుంచి బిగ్ అప్డేట్ బయటపెట్టిన రచయిత
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు మహేశ్ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి-మహేశ్ వంటి దిగ్గజాలు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయిన ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ మూవీ ఫంక్షన్లో పాల్గొన్న ఆయన మహేశ్-జక్కన్న ప్రాజెక్ట్‌పై ఆసక్తిర అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ను సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామన్నారు. అంటే ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. లీడ్ రోల్స్ అలానే ఉంటాయని, కానీ కథా నేపథ్యం మారుతుందని తెలిపారు. ఇది తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూనే మరోవైపు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే అందరికి తెలసిందే. ఒక్క పార్ట్ 2 నుంచి 3 సంవత్సారాలు తీసుకుంటారు. అలాంటిది ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోయే ఈచిత్రానికి జక్కన్న ఎన్నేళ్లు తీసుకుంటాడో? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: మనవరాలి కోసం కోవై సరళ న్యాయ పోరాటం.. ప్రతీకారం తీర్చుకుందా? సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు -
నేను కథలు రాయను.. దొంగలిస్తాను: సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి అనే విషయం తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలతోపాటు మరేన్నో సూపర్ హిట్, బాలీవుడ్ సినిమాలకు ఆయన కథలు అందించారు. రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీతో మెప్పించిన ఆయన నెక్ట్స్ రాజమౌళి-మహేశ్ చిత్రానికి స్క్రీప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటివలె కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభ పదవికి ఎన్నిక చేసింది. చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు ఇదిలా ఉంటే త్వరలో గోవాలో జరగబోయే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI) భాగంగా తాజాగా ఆయన ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. అబద్ధాలు చెప్పేవారు మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం లేని దాని నుంచే మనం కొత్తగా క్రియేట్ చేసి ఆసక్తికర అంశాన్ని వెలిగితియాడమే రచయిత ముఖ్య లక్షణమన్నారు. చదవండి: పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్? ‘హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రేక్షకులు.. ఇలా అందర్నీ మెప్పించే కథలు రాయాలి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఒక అబద్దాన్ని అందంగా చూపించడమే కథా రచన. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. మన చుట్టే చాలా కథలు ఉంటాయి. నిజ జీవితంలో కూడా అనేక కథలు ఉంటాయి. అలాగే మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయి. నేను కూడా అక్కడి నుంచే కథలు తీసుకుంటాను. ఆ కథలని మనదైన శైలిలో రచించాలి’ అంటూ చెప్పకొచ్చారు. -
మహేశ్-రాజమౌళి మూవీపై అప్డేట్ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్
KV Vijayendra Prasad About Rajamouli, Mahesh Babu Movie: మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మే 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మూవీ తర్వాత మహేశ్, త్రివిక్రమ్‌తో సినిమాను స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఇదిలా ఉంటే మహేశ్ హీరోగా, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై క్లారిటీ ఇచ్చారు సినీ రచయిత, రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్. చదవండి: విజయ్‌పై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయనకు జక్కన-మహేశ్ మూవీపై ప్రశ్నఎదురైంది. ఈ మూవీ సెట్‌పైకి వచ్చేది ఎప్పుడని అడగ్గా.. వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇంక కథ పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. చదవండి: హీరోయిన్ లైంగిక దాడి కేసు, దిలీప్ భార్యను విచారించిన పోలీసులు త్వరలోనే మహేశ్ త్రివిక్రమ్‌తో మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ ఏడాది అంతా ఆ ప్రాజెక్ట్‌తోనే మహేశ్ బిజీగా ఉంటాడు. అందుకే రాజమౌళితో సినిమా 2023 ప్రారంభంలో స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు ఆయన. కాగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇదిల ఉంటే ఈ ప్రాజెక్ట్‌పై ఇటీవల ఓ ఇంటర్య్వూలో మహేశ్ మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. -
ఆసక్తిగా సుమంత్ ‘అహం రీబూట్’ ఫస్ట్‌లుక్
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహాం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ ఫస్ట్‌లుక్ విడదుల చేశారు మేకర్స్. ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సుమంత్ లుక్‌ను లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో సుమంత్ లుక్‌ను సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు హెల్ప్ మీ అనే అక్షరాలు రోల్ అవుతుండగా.. సుమంత్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని కకినిపంచాడు. చదవండి: సూరారై పోట్రు హిందీ రీమేక్‌లో అక్షయ్, షూటింగ్ స్టార్ట్ చూస్తుంటే ఇందులో సుమంత్... సాయం కోరే వాళ్లతో మాట్లాడుతూ వారి సమ్యలు తీర్చే వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది! ఈ సందర్బంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు’ అన్నారు. అనంతరం నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు దర్శకుడు ప్రశాంత్ సాగర్‌తో పాటు మూవీ టీంకు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి మాట్లాడుతూ.. ‘అహాం రీ బూట్‌తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్‌ను అందించబోతున్నాం. అనుకోని సంఘటలను మనిషిలోని కొత్త కోణాలను , శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే అహాం రిబూట్. సుమంత్ నటన చాలా హైలెట్‌గా ఉంటుంది. దర్శకునిగా ఈ కథను ప్రేక్షకులకు ముందుకు ఎప్పుడు తెస్తానా అనే ఎగ్జయిట్మెంట్ మా టీం ఉంది’ అని పేర్కొన్నారు. ఈ మూవీకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. -
ఆ కథ వేరేవాళ్లకు ఇవ్వడంతో రాజమౌళి ఏడ్చేశాడు!
తెలుగు ఇండస్ట్రీకి చిరకాలం గుర్తుండిపోయే హిట్లను అందించాడు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. తన కుమారుడు రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్కు కూడా రచయితగా పని చేశారు. తాజాగా ఆయన మూవీ ప్రమోషన్లలో భాగంలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తను రాసిన కథ వేరొకరికి ఇచ్చినప్పుడు రాజమౌళి బాధపడ్డాడని పేర్కొన్నారు. 'భజరంగీ భాయ్‌జాన్ కథ సల్మాన్‌కు చెప్పాననగానే రాజమౌళి కళ్లలో నీళ్లు తిరిగాయి. అతడు కంటనీరు పెట్టుకోవడం చూసి ఆ కథ నీకు ఉంచేయనా? అని అడిగాను. కానీ అతడు లేదు, వారికే ఇచ్చేయండి అని చెప్పాడు. చివరకు ఈ సినిమా రిలీజయ్యాక నా కొడుకు ఏమన్నాడంటే.. బాహుబలి పార్ట్ 1లో రెండు వేల మంది ఆర్టిస్టులతో ఫైట్ సీన్ జరుగుతోంది. అది రోహిణి కార్తె, ఎండలు మండిపోతున్నాయి. మంచి కాక మీదున్నప్పుడు అడిగారు. 15 రోజులు ముందో లేదా 15 రోజులు తర్వాతో అడిగినా ఆ కథ నేనే తీసేవాడిని అన్నాడు' అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. ఇక ఈ సినిమా మొదట ఆమిర్ ఖాన్‌కు వినిపించగా ఆయన కథ బాగుందన్నాడు కానీ పాత్రకు కనెక్ట్ కాలేకపోతున్నానని తిరస్కరించాడని తెలిపారు. ఆ తర్వాత ఇది సల్మాన్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ రాకతో సైడ్ అయిపోయిన సినిమాలు, ఎన్ని స్క్రీన్లలో రిలీజంటే? -
‘సీత’గా వస్తున్నది కరీనా కాదు.. నెక్ట్స్ సినిమాపై క్లారీటీ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘తలైవి’. ఇటీవలై విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జయలలితగా కంగనా నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. కాగా తన తదుపరి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా మంగళవారం ప్రకటించింది కంగనా. రామాయణ కథ ఆధారంగా సీత పాత్ర ప్రధానంగా సాగే ‘సీత: ది ఇన్కార్నేషన్’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు ఆమె తెలిపింది. ‘ఇలాంటి టాలెంటెడ్ టీంతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. జై సీతారామ్’ అని ఆమె క్యాప్షన్ జత చేసింది. పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘సీత: ది ఇన్కార్నేషన్’కి స్క్రీన్ రైటర్ కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్ర కోసం మూవీ టీం మొదట కరీనా కపూర్‌ని సంప్రదించింది. కానీ బెబో ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో ఆమె బదులు కంగనాను ఫైనల్ చేసింది. కాగా ఎంతో పవిత్రమైన సీత పాత్ర చేయడానికి కంగనా ఒప్పుకోవడం ఆనందనిచ్చిందని దర్శకుడు మీడియాతో తెలిపాడు. ఈ మూవీ మనం పురాణాలను చూసే విధానాన్ని మార్చుతుందని అలౌకిక్ చెప్పాడు. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఏ హ్యూమన్ బీయింగ్ స్టూడియో నిర్మించనుంది. View this post on Instagram A post shared by Kangana Thalaivii (@kanganaranaut) -
#BoycottKareenaKhan: ఏం జరుగుతోందంటే..
ఒక సినిమా కోసం ఫలనా హీరో, ఫలానా హీరోయిన్ ఊహించని రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులకు ‘వావ్’ అనిపించొచ్చు.కానీ, కరీనా కపూర్ రెమ్యునరేషన్ డిమాండ్‌పై మాత్రం ‘ఛీ’ అనే బదులు వస్తోంది. సీత మీద తీయబోయే సినిమాలో లీడ్ రోల్ కోసం ఆమె నిర్మాతలను భారీగా డిమాండ్ చేసిందన్న పుకార్లు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని #BoycottKareenaKhan ను ట్రెండ్ చేస్తున్నారు. ఆమె హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని, ఆమె చర్య ఒక మాయని మచ్చ అని వెరైటీగా #BoycottKareenaKhan హ్యాష్‌ట్యాగ్‌తో మండిపడుతున్నారు. ఈ ట్యాగ్ శనివారం ఉదయం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ నడుస్తోంది. మరికొందరేమో కరీనా కంటే కంగనా బెస్ట్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతుండగా, ఇంకొందరేమో సీత కంటే శూర్పణక క్యారెక్టర్ సరిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరేమో అప్పట్లో తాండవ్తో ఆమె భర్త సైఫ్, ఇప్పుడు కరీనా ఖాన్ హిందువుల్ని హర్ట్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అలౌకిక్ దేశాయ్ దర్శకుడిగా ‘సీత’ రూపుదిద్దుకోనుంది. ఈ మూవీకి ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించనున్నట్లు తెలుస్తోంది. సీత నేపథ్యం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. చదవండి: సుశాంత్-సారా బ్రేకప్‌కి కారణం వీళ్లే! -
‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?!
ఇటీవల కాలంలో పౌరాణిక చిత్రాలపై దర్శక-నిర్మాతలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇలాంటి సినిమాలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్లో అలౌకిక్ దేశాయ్ దర్శకుడిగా భారీ ప్రాజెక్ట్ ‘సీత’ మూవీ రానుంది. రామాయణంలోని సీత వెర్షన్లో రూపొందే ఈ చిత్రంలో సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించనుందని సమాచారం. కాగా ఈ మూవీకి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి కరీనా రెండు షరతులు పెట్టిందని వినికిడి. అవి.. తాను ముందుగా సంతకం చేసిన ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన తర్వాత సీతలో నటిస్తానని, మరొకటి తనకు రెమ్యూనరేషన్ భారీగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బీ-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సీత పాత్రను కరీనాతోనే చేయించాలని భావించి ఆమె డిమాండ్లకు మేకర్స్, విజయేంద్ర ప్రసాద్ ఒకే చెప్పారట. సాధారణంగా కరీనా ఒక్క సినిమాకు 6 నుంచి 8 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అయితే సీత ప్రాజెక్టులో లీడ్ రోల్ కావడంతో ఎక్కవ సమయాన్ని ఈ ప్రాజెక్ట్‌కే కెటాయించాల్సి ఉందనే ఉద్దేశంతో కరీనా భారీ మొత్తంలో పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీకి కరీనా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. చదవండి: విద్యాబాలన్ వల్ల కరీనా, షాహిద్ విడిపోయారా? Adipurush: మ్యూజిక్ డైరెక్టర్లుగా సాచెత్-పరంపరాలు సంతకం! -
‘ఆర్ఆర్ఆర్’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు కరోనా
‘ఆర్ఆర్ఆర్’ మూవీ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్(78) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటు హోంక్వారంటైన్ ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక ఇటీవల ఆయనను కలిసిన వారంతా ఐసోలేషన్‌కు వెళ్లాల్సిందిగా ఆయన సూచించినట్లు తెలిపారు. కాగా ఇటీవల చెన్నైలో జరిగిన ‘తలైవి’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయని, దీంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తెలినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా విజయేంద్ర ప్రసాద్ బాహుబలి హిందీలో భజరంగీ భాయిజాన్, మణికర్ణిక వంటి హిట్ చిత్రాలకు ఆయన కథ అందించారు. తాజాగా ఆయన బాలీవుడ్ బహుభాష చిత్రం ‘సీత’కు కూడా స్ర్కీప్ట్ను సమకుర్చారు. చదవండి: అల్లు అర్జున్ అభిమానులపై కేసు ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ -
కేసీఆర్ కోసం బాహుబలి రైటర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బయోపిక్ కోసం దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. ఈ చిత్రం కోసం సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నివాస్ డైరెక్ట్ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం కోసం విజయేంద్ర వర్మతో నివాస్ చర్చించగా.. ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. తొలుత ఈ చిత్రాన్ని కేవలం డాక్యుమెంటరీగానే చిత్రీకరించాలని నిర్మాతలు భావించారు. అయితే చివరకు దీనిని కమర్షియల్ ప్రాజెక్టుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. బాహుబలి రైటర్ ఎంట్రీతో ఆ పని మరింత సులువు కానుంది. తారాగణం, మిగతా టెక్నీషియన్లపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మంచు హీరో కోసం బాహుబలి రైటర్
సాక్షి, సినిమా : సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించే కథలు చాలా వరకు బ్లాక్ బస్టర్లు అవుతాయనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. ముఖ్యంగా బాహుబలి, భజిరంగీ భాయ్‌జాన్‌లతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అందుకే భాషలకతీతంగా దర్శకులు ఆయన కథ కోసం ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరో యువ హీరో కోసం ఆయన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘‘మంచు విష్ణు కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సోషల్ డ్రామాగా అది ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో స్క్రిప్టును పక్కాగా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడి కోసం విష్ణు వేటను ప్రారంభించేశాడు. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరెక్టర్లను పేర్లను విష్ణు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది’’ అన్నది ఆ కథనం సారాంశం. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు విష్ణు నటించిన రెండు చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, గాయత్రి విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్-మంచు విష్ణు -
‘బాహుబలి’ అభిమానులకు చేదువార్త
వెండితెరపై సంచలనాలు సృష్టించిన బాహుబలి సిరీస్ ఇక కొనసాగదా? అంటే అవుననే అంటున్నారు రచయిత కేవీ విజయేంద్రప్రసాద్. ‘బాహుబలి 3’ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మూడో భాగం తెరకెక్కిస్తారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘బాహుబలి కథ ముగిసింది. మూడో భాగం లేదు. నేను, మా అబ్బాయి రాజమౌళి దీని గురించి ప్లాన్ చేయడం లేదు. ఈ పాయింట్ గురించి నేనేమీ రాయడం లేదు. అయితే కామిస్ సిరీస్, టీవీ మాధ్యమం ద్వారా బాహుబలి లెగసీ కొనసాగుతుంద’ని పీటీఐతో చెప్పారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ‘బాహుబలి 3’ ఉండదని ఇంతకుముందు వెల్లడించారు. బ్రిటీష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ... బాహుబలి 3 కోసం కథ రెడీగా లేకుండా ప్రేక్షకులను మోసం చేయలేనని అన్నారు. అయితే ఏదో ఒక రూపంలో బాహుబలి సిరీస్ కొనసాగుతుందని చెప్పారు. బాహుబలి మొదటి రెండు భాగాలు ఘన విజయం సాధించిన నేపథ్యంలో దీనిపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే బాహుబలి 3 ఉండదన్న వార్త అభిమానులకు నిరాశ కలిగించేదే. -
విజయ్ చిత్రానికి బాహుబలి రైటర్?
ఒక స్టార్ హీరోకు మరో స్టార్ రైటర్ తోడైతే ఆ చిత్రాలు ఎంత సంచలన విజయాలు సొంతం చేసుకుంటాయోయన్నది చాలా సార్లు చూశాం. అలాంటి వాటిలో బాహుబలి చిత్రం ఒక ఉదాహరణ. ప్రపంచ సినిమాను అబ్బురపరచిన చిత్రం బాహుబలి.ఆ చిత్ర కథకుడు విజయేంద్రప్రసాద్. ఈయన నవ దర్శకేంద్రుడు రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. ఒక కథకుడిగా ఈయన సాధించిన విజయాలెన్నో. ఇటీవల చూసుకుంటే బాహుబలి, మగధీర, నాన్ఈ(ఈగ) హిందీలో భజరంగి భాయ్‌జాన్ చిత్రాలకు కథలు విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే. ఇక అసలు విషయానికి వస్తే విజయ్ తన 60వ చిత్రం భైరవను పూర్తి చేసే పనిలో ఉన్నారు.అయితే విజయ్ తదుపరి చిత్రం ఏమిటన్న విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడా చిత్రం గురించి కొంత క్లారిటీ వచ్చింది. విజయ్‌తో తెరి వంచి బ్లాక్‌బ్లస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ ఆయనతో మరో చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నారు. దీనికి బాహుబలి చిత్ర రచయిత కథను అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇదే కనుక నిజం అయితే విజయ్ నుంచి మరోసారి రికార్డులను బద్దలు కొట్టే చిత్రాన్ని ఆశించవచ్చునన్నమాట.