మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ బయటపెట్టిన రచయిత | KV Vijayendra Prasad Said Sequel Will Follows SS Rajamouli, Mahesh Babu Movie | Sakshi
Sakshi News home page

Mahesh Babu- SS Rajamouli: మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్‌

Published Sat, Dec 31 2022 11:45 AM | Last Updated on Sat, Dec 31 2022 2:14 PM

KV Vijayendra Prasad Said Sequel Will Follows SS Rajamouli, Mahesh Babu Movie - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం తివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. దీనితో పాటు మహేశ్‌ దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. రాజమౌళి-మహేశ్‌ వంటి దిగ్గజాలు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ అయిన ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఓ మూవీ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన మహేశ్‌-జక్కన్న ప్రాజెక్ట్‌పై ఆసక్తిర అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ను సినిమాగా కాకుండా ఫ్రాంచైజీగా తీస్తామన్నారు.

అంటే ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు. లీడ్ రోల్స్ అలానే ఉంటాయని, కానీ కథా నేపథ్యం మారుతుందని తెలిపారు. ఇది తెలిసి ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతూనే మరోవైపు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే అందరికి తెలసిందే. ఒక్క పార్ట్‌ 2 నుంచి 3 సంవత్సారాలు తీసుకుంటారు. అలాంటిది ఫుల్‌  యాక్షన్‌ అడ్వెంచర్‌గా రాబోయే ఈచిత్రానికి జక్కన్న ఎన్నేళ్లు తీసుకుంటాడో? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: 
మనవరాలి కోసం కోవై సరళ న్యాయ పోరాటం.. ప్రతీకారం తీర్చుకుందా?
సినీ పరిశ్రమలో విషాదం.. నిద్రలోనే కన్నుమూసిన ప్రముఖ నటుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement