Boycott Kareena Kapoor Trend Amid Karena Demands Huge Remuneration For Sita’s Role - Sakshi
Sakshi News home page

కరీనా ఖాన్‌.. శూర్పణక రోలే కరెక్ట్‌ నీకు!

Published Sat, Jun 12 2021 3:01 PM | Last Updated on Sat, Jun 12 2021 6:53 PM

Boycott Kareena Kapoor Trend Amid Karena Demands Huge Remuneration  - Sakshi

ఒక సినిమా కోసం ఫలనా హీరో, ఫలానా హీరోయిన్‌ ఊహించని రేంజ్‌లో రెమ్యునరేషన్‌ తీసుకోవడం అభిమానులకు ‘వావ్‌’ అనిపించొచ్చు.కానీ, కరీనా కపూర్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌పై మాత్రం ‘ఛీ’ అనే బదులు వస్తోంది. సీత మీద తీయబోయే సినిమాలో లీడ్‌ రోల్‌ కోసం ఆమె నిర్మాతలను భారీగా డిమాండ్‌ చేసిందన్న పుకార్లు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని #BoycottKareenaKhan ను ట్రెండ్‌ చేస్తున్నారు.

ఆమె హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని, ఆమె చర్య ఒక మాయని మచ్చ అని వెరైటీగా  #BoycottKareenaKhan హ్యాష్‌ట్యాగ్‌తో మండిపడుతున్నారు. ఈ ట్యాగ్‌ శనివారం ఉదయం నుంచి ట్విట్టర్‌లో ట్రెండ్‌ నడుస్తోంది. మరికొందరేమో కరీనా కంటే కంగనా బెస్ట్‌ ఛాయిస్‌ అని కామెంట్లు పెడుతుండగా, ఇంకొందరేమో సీత కంటే శూర్పణక క్యారెక్టర్‌ సరిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరేమో అప్పట్లో తాండవ్‌తో ఆమె భర్త సైఫ్‌, ఇప్పుడు కరీనా ఖాన్‌ హిందువుల్ని హర్ట్‌ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకుడిగా ‘సీత’ రూపుదిద్దుకోనుంది. ఈ మూవీకి ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్టోరీ అందించనున్నట్లు తెలుస్తోంది. సీత నేపథ్యం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

చదవండి: సుశాంత్‌-సారా బ్రేకప్‌కి కారణం వీళ్లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement