Negative campaign
-
రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?
భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ ప్రాధాన్యం ప్రజల సంక్షేమమేనని చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. అణగారిన వర్గాలు ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు ప్రజలందరికీ కులమత, వర్గ రహితంగా చదువుకొనే అవకాశాలను కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ, మాతాశిశు సంరక్షణలను ప్రాధాన్యంగా స్వీకరించి, వాటికి అనుగుణమైన కార్యక్రమాలు అమలు చేయా లని సూచించింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి నుంచి పేద వర్గాలకు, అట్టడుగు ప్రజానీకానికి పలు వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతోంది. దీన్ని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన తెలుగు దేశం పార్టీ... నేటి ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచుతోందని దుష్ప్రచారం సాగిస్తూ... పేద వర్గాలకు అందుతున్న రాయితీలను, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును పేద వర్గాలకు దోచి పెడుతున్నారన్న అడ్డగోలు వాదనను తారస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలలో ప్రతి ఒక్కరూ పన్ను చెల్లింపుదారులే! అత్యధికశాతం ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తుంటారు. జనాభాలో ప్రత్యక్ష పన్ను చెల్లించేవారి శాతం చాలా తక్కువ. నిత్యావసర వస్తువులు మొదలుకొని దైనందిన జీవితంలో అవసరమయ్యే ఏ వస్తువును కొనుగోలు చేసినా వాటిపై ఉండే పన్నులను ప్రజలు చెల్లించాల్సిందే! జనాభాలో అధికంగా ఉన్న పేద ప్రజలు పరోక్షంగా చెల్లించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరికి ఖర్చు చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో రైతులు అప్పులపాలై 10,000 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. బలన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి కొంత మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని ఆనాటి ప్రతిపక్షాలు కోరితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియా కోసమే మరింత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారు’ అంటూ రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. వ్యవసాయరంగాన్ని నిరుత్సాహ పర్చి, సేవల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సేవల రంగానికే భవిష్యత్తు ఉందని వ్యవసాయం దండుగమారిది అన్న విధానాన్ని పాటించడంతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు పొట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసబాట పట్టారు. ఉచిత కరెంటు ఇవ్వకపోగా, కరెంట్ చార్జీలు పెంచారు. తగ్గించమంటే ప్రజలను గుర్రాలతో తొక్కించి చంపారు. (చదవండి: రెండు నాల్కలు-పొల్లు మాటలు) ఇంజనీరింగ్ కాలేజీలను ఇబ్బడిముబ్బడిగా స్థాపించి అధిక ఫీజులు, డొనేషన్లు నిర్ణయించి పేదలకు ఆ విద్యను దూరం చేశారు. ఈ దుఃస్థితి నుంచి సామాన్య వర్గాలను కాపాడాలనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించారు. ఆ కారణంగానే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం లభించింది. ఫలితంగా పేద వర్గాల కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. విద్యతోపాటు ఆరోగ్య రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటుపరం చేసిన ఘనత బాబుదే! కార్పొరేట్ ఆసు పత్రుల సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి... ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య సేవలను గాలికి వదిలేశారు. 2004లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పేదల పాలిట కల్పతరువుగా మారింది. లక్షలమంది పేదలు గుండె ఆపరేషన్లతో సహా ఖర్చులతో కూడుకొన్న అనేక జబ్బులను ఖర్చు లేకుండా నయం చేసుకోగలిగారు. ఆరోగ్యశ్రీతోపాటు ఆనాడు ప్రవేశపెట్టిన 104, 108 వంటి సేవలతో రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ వైద్య సేవల్ని విస్తరించి సామాన్య ప్రజల జీవితాల్లో భరోసా నింపారు. సంపద పెంచానంటూ అసత్యాలు చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు సెల్ఫ్‌గోల్ చేసుకొన్నట్లయింది. కారణం చంద్రబాబు పాలనలో రైతుల ఆదాయం పెరగ లేదు సరికదా... మరింత అప్పుల్లో కూరుకొనిపోయారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకోకుండా నిరాశకు గురిచేశారు. విద్యార్థుల, యువతీ యువకుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. పేదలకు అందించే సబ్సిడీల్లో కోత పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదించాలంటూ... వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను కూడా అలాగే గాలికి వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను అనేక వేధింపులకు గురిచేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే... చంద్రబాబు పాలనలో ఎవరికి మేలు జరిగినట్లు? ఆయన పెంచానని చెప్పుకొనే సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లింది? (చదవండి: చెప్పేటందుకే చంద్రబాబు నీతులు...) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ తప్పుల్ని వెతుకుతున్నారు, వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. రైతులకు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేయడం, పేదలకు ఉచితంగా 32 లక్షల ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం, వాటిలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం దోహదం చేయడం, మధ్యతరగతి వర్గాలకు జగనన్న ఇండ్ల కాలనీల పథకం ప్రవేశపెట్టడం... ఇలా పేద వర్గాల అభ్యున్నతికి ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతిపక్షానికి కంటగింపుగా తయాౖ రెంది. కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. సాధికారతే పరమావధిగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తు లోనూ దీర్ఘకాలం ఉంటాయనేది నేటి వాస్తవం! (చదవండి: పనిమంతుడికి అక్కర్లేదు ప్రచారం) - డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
#BoycottKareenaKhan: ఏం జరుగుతోందంటే..
ఒక సినిమా కోసం ఫలనా హీరో, ఫలానా హీరోయిన్ ఊహించని రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులకు ‘వావ్’ అనిపించొచ్చు.కానీ, కరీనా కపూర్ రెమ్యునరేషన్ డిమాండ్‌పై మాత్రం ‘ఛీ’ అనే బదులు వస్తోంది. సీత మీద తీయబోయే సినిమాలో లీడ్ రోల్ కోసం ఆమె నిర్మాతలను భారీగా డిమాండ్ చేసిందన్న పుకార్లు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కొందరు పనిగట్టుకుని #BoycottKareenaKhan ను ట్రెండ్ చేస్తున్నారు. ఆమె హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందని, ఆమె చర్య ఒక మాయని మచ్చ అని వెరైటీగా #BoycottKareenaKhan హ్యాష్‌ట్యాగ్‌తో మండిపడుతున్నారు. ఈ ట్యాగ్ శనివారం ఉదయం నుంచి ట్విట్టర్లో ట్రెండ్ నడుస్తోంది. మరికొందరేమో కరీనా కంటే కంగనా బెస్ట్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతుండగా, ఇంకొందరేమో సీత కంటే శూర్పణక క్యారెక్టర్ సరిపోతుందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరేమో అప్పట్లో తాండవ్తో ఆమె భర్త సైఫ్, ఇప్పుడు కరీనా ఖాన్ హిందువుల్ని హర్ట్ చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అలౌకిక్ దేశాయ్ దర్శకుడిగా ‘సీత’ రూపుదిద్దుకోనుంది. ఈ మూవీకి ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించనున్నట్లు తెలుస్తోంది. సీత నేపథ్యం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. చదవండి: సుశాంత్-సారా బ్రేకప్‌కి కారణం వీళ్లే! -
బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం
కొద్ది రోజులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ముందుగా ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న సినిమాకు సంబంధించి కో డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌కు గొడవ అయినట్టుగా వార్తలు వచ్చాయి. తరువాత బన్నీ కొత్తగా కొన్న కారవాన్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా లోకేషన్లో బన్నీ డిమాండ్లు నిర్మాతలకు తలనొప్పిగా మారాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వరుసగా వస్తున్న ఈ నెగెటివ్ వార్తలపై మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, పీఆర్వో, నిర్మాత ఎస్కేఎన్ స్పందించాడు. అల్లు అర్జున్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా అల్లు అర్జున్ ఎంతో కష్టపడి, శ్రమించి తెచ్చుకున్న స్టార్ ఇమేజ్ను కొన్ని వార్తలు తగ్గించలేవు. అంకితభావం, సాయం చేసే మనస్థత్వం ఆయన్ని ఎప్పుడూ అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. ప్రస్తుతం ఏఏ19 చిత్రీకరణ జరుగుతోంది అదే సమయంలో తదుపరి రెండు చిత్రాల ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు ఎస్కేఎన్. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్‌తో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. Dear invisible enemy Few Negative articles can't bring down 18 years hard work of a down to earth star. His dedication & helping nature always connect him with his followers Let's see who ll have last smile Super fantastic #AA19 getting ready& 20,21's pre production work in swing — SKN (@SKNonline) July 27, 2019 -
‘ప్రతికూల ప్రచారమే కొంపముంచింది’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమికి కారణాలపై కాంగ్రెస్ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై సాగించిన ప్రతికూల ప్రచారంతోనే ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి కుమారుడు అనిల్ శాస్ర్తి అన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా అతిగా చేసిన నెగెటివ్ ప్రచారం బెడిసికొట్టిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు, సమస్యలను ఎన్నికల ప్రచారంలో బలంగా ప్రజల ముందుకు తేవడంలో పార్టీ విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్ధానాల్లో గెలుపొంది లోక్‌సభలో తిరుగులేని ఆధిక్యం సాధించింది. -
ఆయన ధైర్యాన్ని అభినందిస్తున్నా!
నెగెటివ్ ప్రచారాన్ని ఆపండి, సెంటిమెంట్లను పక్కన పెట్టండి అన్నారు యువ దర్శకుడు మోహన్‌రాజా. సంగీతదర్శకుడు విజయ్‌ఆంటోని సంగీతం అందించి, కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన చిత్రం పిచ్చైక్కారన్. శశి కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన ఈ చిత్రం గత వారం తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం సాయంత్రం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు మోహన్‌రాజా మాట్లాడుతూ పిచ్చైక్కారన్ టైటిల్‌పై కొనసాగుతున్న నెగెటివ్ ప్రచారానికి చిత్ర విజయం పుల్‌స్టాప్ పెట్టిందన్నారు.తాను తన చిత్రానికి తనీఒరువన్ అని పేరు నిర్ణయించినప్పుడూ అదేం పేరు ఆ చిత్రంతో మోహన్‌రాజా ఒంటరి వాడయైపోతారనే ప్రచారం జరిగిందన్నారు. ఆ చిత్ర విజయం అలాంటి వాళ్ల నోళ్లను మూయించిదని వ్యాఖ్యానించారు. తాను తనీఒరువన్ పెడితేనే అలాంటి కామెంట్స్ చేసిన వాళ్లు విజయ్‌ఆంటోని పిచ్చైక్కారన్ టైటిల్‌ను నిర్ణయించనప్పుడు ఇంకెలా నెగెటివ్ ప్రచారం చేస్తారోనని అనుకున్నానన్నారు. దీన్ని పలువురు రాంగ్ సెంటిమెంట్ అంటూ ప్రచారం చేశారని గుర్తు చేశారు.అలాంటి ప్రచారాన్ని ఎదురొడ్డి పిచ్చైక్కారన్ విజయపథంలో దూసుకుపోతోందన్నారు. అలాంటి టైటిల్‌తో చిత్రం చేసిన విజయ్‌ఆంటోని ధైర్యానికి అభినందిస్తున్నానన్నారు. పిచ్చైక్కారన్ కాపాడింది పిచ్చైక్కారన్ చిత్రం విజయవంతం అయ్యి తనను కాపాడిందని ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత విజయ్‌ఆంటోని అన్నారు.దర్శకుడు శశి పిచ్చైక్కారన్ టైటిల్ చెప్పగానే బాగా నచ్చేసిందన్నారు.తన భార్యకు ఆ పేరు గురించి చెప్పగా చాలా మెస్మరైజ్ అయ్యారన్నారు. పిచ్చైక్కారన్ లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు శశికి కృత జ్ఞలు చెప్పుకుంటున్నానని అన్నారు.చిత్రాన్ని విడుదల చేసిన ఆర్కే ఫిలింస్, స్కైలార్క్ అధినేతలు తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.