
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమికి కారణాలపై కాంగ్రెస్ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై సాగించిన ప్రతికూల ప్రచారంతోనే ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి కుమారుడు అనిల్ శాస్ర్తి అన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా అతిగా చేసిన నెగెటివ్ ప్రచారం బెడిసికొట్టిందని వ్యాఖ్యానించారు.
ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు, సమస్యలను ఎన్నికల ప్రచారంలో బలంగా ప్రజల ముందుకు తేవడంలో పార్టీ విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 స్ధానాల్లో గెలుపొంది లోక్‌సభలో తిరుగులేని ఆధిక్యం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment