RRR 2 Confirmed: KV Vijayendra Prasad Says RRR Sequel Wont Be Directed By Rajamouli, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

RRR 2 Sequel Latest Update: రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌లతో ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌.. కానీ రాజమౌళి చేయడట!

Published Mon, Jul 10 2023 3:30 PM | Last Updated on Mon, Jul 10 2023 3:48 PM

RRR 2: KV Vijayendra Prasad Says RRR Sequel Wont Be Directed By Rajamouli - Sakshi

ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిర్మాతను తీసుకునే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తాడనేది నేను కచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అతడు లే

అద్గదీ.. సినిమా అంటే ఇట్టుండాల... తీసిందెవరు మరి? రాజమౌళి! ఈ మాట చాలాసార్లు విన్నాం. రాజమౌళి ఏ సినిమా తీసినా వంక పెట్టడానికి సందివ్వకుండా చూసుకుంటాడు. తన సినిమాకు వచ్చే ప్రశంసల సుడిగుండంలో ఒకటీరెండు విమర్శలు కొట్టుకుపోతాయి. రాజమౌళి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ రికార్డులు కూడా గడగడలాడిపోతాయి. గతేడాది ఆయన తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. 

అంతర్జాతీయస్థాయిలో అవార్డులు సాధించి ఇండియన్‌ సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పింది. హాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఇంతవరకు ఇలాంటి సినిమాను చూసిందే లేదని ఆశ్చర్యపోయారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఫిదా అవుతూ నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్‌ తెరకెక్కించే ఆస్కారం లేకపోలేదని ఆమధ్య వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా రెడీ చేసే బాధ్యతను రచయిత విజయేంద్రప్రసాద్‌ తన భుజాన వేసుకున్నాడు.

తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్‌ 2పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఇందులో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఉంటారు. హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా దాన్ని తెరకెక్కించాలని ఆలోచిస్తున్నాం. ఈ సినిమా కోసం హాలీవుడ్‌ నిర్మాతను తీసుకునే ఛాన్స్‌ ఉంది. అయితే ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తాడనేది నేను కచ్చితంగా చెప్పలేను. ఒకవేళ అతడు లేదంటే అతడి నేతృత్వంలో మరొకరు ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తారు' అని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు జక్కన్న లేకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ 2ను ఊహించలమా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి.. మహేశ్‌బాబుతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే!

చదవండి: గన్‌ పేలుడు శబ్ధాలు.. అల్లర్ల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి
జీవితమంతా కష్టాలే.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement