
ప్రముఖ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి తండ్రి అనే విషయం తెలిసిందే. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి పాన్ ఇండియా చిత్రాలతోపాటు మరేన్నో సూపర్ హిట్, బాలీవుడ్ సినిమాలకు ఆయన కథలు అందించారు. రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో మెప్పించిన ఆయన నెక్ట్స్ రాజమౌళి-మహేశ్ చిత్రానికి స్క్రీప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటివలె కేంద్ర ప్రభుత్వం ఆయనను రాజ్యసభ పదవికి ఎన్నిక చేసింది.
చదవండి: వైష్ణవిని పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు
ఇదిలా ఉంటే త్వరలో గోవాలో జరగబోయే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI) భాగంగా తాజాగా ఆయన ఫిల్మ్ రైటింగ్‌పై స్పెషల్ క్లాసులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. అబద్ధాలు చెప్పేవారు మంచి స్టోరీ రైటర్స్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏం లేని దాని నుంచే మనం కొత్తగా క్రియేట్ చేసి ఆసక్తికర అంశాన్ని వెలిగితియాడమే రచయిత ముఖ్య లక్షణమన్నారు.
చదవండి: పుష్ప 2 నుంచి కొత్త అప్‌డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్?
‘హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రేక్షకులు.. ఇలా అందర్నీ మెప్పించే కథలు రాయాలి. ఈ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఒక అబద్దాన్ని అందంగా చూపించడమే కథా రచన. నేను కథలు రాయను, దొంగిలిస్తాను. మన చుట్టే చాలా కథలు ఉంటాయి. నిజ జీవితంలో కూడా అనేక కథలు ఉంటాయి. అలాగే మన ఇతిహాసాలు రామాయణం, మహాభారతం, మన చరిత్రల నుంచి అనేక కథలు వస్తాయి. నేను కూడా అక్కడి నుంచే కథలు తీసుకుంటాను. ఆ కథలని మనదైన శైలిలో రచించాలి’ అంటూ చెప్పకొచ్చారు.