సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశకి చేరుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల న్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ప్రా రంభించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా మూ డో దశలోకి వస్తే గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థా యి కరోనా ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్సకే వినియోగించేలా తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే గాంధీలో చే యాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రి లో చేస్తున్నారన్నారు. నెలాఖరు వరకు మిగ తా అన్నీ విభాగాలనూ తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డిని ఆదేశించారు.
కింగ్‌కోఠి ఆసుపత్రిని కూడా కరోనా చికిత్సలకు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రుల సేవలనూ వినియోగిం చుకొనేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. మూడో దశలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు షట్‌డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని, వారితో కలసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దని ఆదేశించారు. కావాల్సిన వైద్య పరికరాలు అన్నీ సమీకరించుకోవాలన్నారు.
ఇద్దరు డాక్టర్లకు కరోనా వైరస్
గురువారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో 44 మందికి కరోనా వైరస్ సోకిందన్నారు. అందరూ కోలుకుంటున్నారన్నారు. గురువారం ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా, అందులో ఇద్దరు ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నారన్నారు. వారిద్దరూ ఇటీవల దేశంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. వీరిని కలసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని మంత్రి కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవారు, ఆశ వర్కర్లు ఎక్కడ పని చేసే వారు అక్కడే ఉండేలా చూడాలని, సెలవులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం కల్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి డేటా ఉండాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే ఆసుపత్రులు, సిబ్బంది, వైద్య పరికరాలపై చర్చించారు. కరోనా రోగుల సంఖ్య పెరిగితే ముం దుగా అవసరమయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అన్నారు. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని ఆదేశించారు. తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు కొనుగోలు చే యాలని ఆదేశించారు. ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలన్నారు.
డీఆర్‌డీవోలో వెంటిలేటర్ల తయారీకి కేంద్రం అనుమతివ్వాలి..
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశా ఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరోనా రోగులకు చికిత్స సమయంలో ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్‌మెంట్స్, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో, బీడీఎల్, ఈసీఐఎల్ సంస్థల్లో తయారు చేయడానికి అనుమతినివ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఈటల తెలిపారు. ఎన్–95 మాస్క్‌లు, పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్‌మెంట్స్, వెంటిలేటర్స్ అందించాలని కోరినట్లు తెలిపారు.
కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. కోవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సం తృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని అబ్జర్వేషన్‌లో ఉంచాలని, హోమ్ క్వారంటైన్ నుంచి బయటికి రాకుండా చూడాలని కోరారు. ఆశ వర్కర్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రకటించారు. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా చూసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment