
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కరోనా మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని.. ప్రజలంతా భయంతో ఉన్నారని తెలిపారు. 4 లక్షల రెమిడిసివర్ ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామని.. 21,500 ఇంజక్షన్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని మంత్రి వెల్లడించారు. రెమిడిసివర్ విషయంలో కేంద్రం షాక్ ఇచ్చినట్లైందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి సరిపడా కరోనా డోసులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నామన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా కేటాయింపులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిడిసివర్ ఇంజక్షన్లను కేంద్రం పరిధిలోకి తీసుకుందని.. కేంద్రం తీరు చాలా బాధాకరమన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి కేటాయింపులు చేయాలని కోరారు. ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత ఇబ్బందిగా మారిందని మంత్రి పేర్కొన్నారు. రెమిడిసివర్ బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు.
చదవండి:
కరోనా టెస్టులు లేకుండానే ఫలితాలొస్తున్నాయ్.. అదెలా
గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్
Comments
Please login to add a commentAdd a comment