సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు (కేసీఆర్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేశంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్‌గా ఉండేలా చూసుకోవాలని సీఎం పేర్కొన్నారు. గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో ఫైరింజన్లు పెట్టాలని ఆయన సూచించారు.
యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్‌ను ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అందేలా సమన్వయం చేసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కరోనా టెస్టు కిట్స్ కొరత లేకుండా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అందరికీ కిట్స్ అందించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందించాలని ప్రజలకు మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
చదవండి: కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా?
కరోనా: ఎలాంటి మాస్క్ ధరించాలి? ఏది బెస్ట్?
Comments
Please login to add a commentAdd a comment