సాక్షి, బెంగుళూరు: పాఠశాలల పునరారంభంపై అనుకూల, ప్రతీకూల చర్చ జరుగుతున్న నేపథ్యలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 8మంది ఉపాధ్యాయులకు కరోనా సోకడం కలకలం రేకెత్తిస్తోంది. ధ్వారాడలోని కిల్లా సమీపంలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తరగతులు పునః ప్రారంభంపై ఈనెల 6న సన్నద్ధత సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 24 మంది పాల్గొన్నారు. (కొనసాగుతున్న కరోనా విభృంభణ)
వీరిలో యాలక్కి శెట్టర్ కాలనీ నివాసీ అయిన ఉపాధ్యాయురాలికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. సమావేశంలో పాల్గొన్న బోధన, బోధనేతర సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించుకోగా వారిలో ఆరుగురు ఉపాధ్యాయునిలు, ఒక ఉపాధ్యాయుడికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇంకా మిగతా వారినివేదిక అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. అప్పటి వరకు అందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment