కరీమ్ మొరానీ
బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీమ్ కుమార్తెలు జోవా, షాజాలకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ నెల 5న షాజా, ఈ నెల 7న జోవా (నటి) లు కరోనా పరీక్షలు చేయించుకోగా వారి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చాయి. షాజా, జోవాల తర్వాత కరీమ్‌కు రిపోర్ట్స్‌లో కరోనా పాజిటివ్ వచ్చింది. దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే జోవా శ్రీలంక నుంచి ఇండియా వచ్చారట. అలాగే రాజస్తాన్ నుంచి ముంబై చేరుకున్నారట షాజా. ఇక ‘యోధ’ (1991) చిత్రంతో నిర్మాతగా మారిన కరీమ్ మొరానీ ఆ తర్వాత షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’(2013), ‘దిల్‌వాలే’ (2015) చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా, ‘రా.వన్’(2011), ‘హ్యాపీ న్యూఇయర్’ (2014) చిత్రాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment