బెంగళూరు: ఒకే అపార్టుమెంటులో నివసిస్తున్న దాదాపు 103 మంది ఒకేసారి కరోనా వైరస్ బారిన పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల అపార్టుమెంటులో నిర్వహించిన పార్టీలో దాదాపు 45 మంది పాల్గొన్న అనంతరం 103 మందికి కరోనా పాజిటివ్ తేలిందని అధికారులు తెలిపారు. ఆ పార్టీ కారణంగానే అపార్టుమెంటు వాసులకు కరోనా సోకినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీబీఎమ్‌పీ అధికారుల సమాచారం మేరకు.. బెంగళూరులోని ఎస్‌ఎన్‌ఎన్ రాజ్ లేక్‌వ్యూ అపార్టుమెంటులో ఫిబ్రవరి 6న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అపార్టుమంటు నివాసితులు 45 మంది పాల్గొన్నట్లు సమాచారం.దీంతో ఆది, సోమవారల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ అపార్టుమెంటులోని వాచ్‌మెన్, డ్రైవర్, వంటవాళ్లతో సహా మొత్తం 103 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా ఇందులో ఉన్న మొత్తం 435 ప్లాట్స్‌లో 1500 మందిపైగా నివసిస్తున్నారు.లో ఫిబ్రవరి 6న నిర్వహించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లోని ఒక కార్యక్రమాని దాదాపు 45 మంది సమావేశమయ్యారు.
అయితే ఇందులో చాలామందికి కరోనా లక్షణాలు లేవని, కనీసం ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు కానీ, ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొన్నారు. మొదట ఫిబ్రవరి 10న ఈ అపార్టుమెంటులోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, అనంతరం అపార్టుమెంటు వాసలంతా గృహనిర్భందంలోకి వెల్లినట్లు బీబీఎమ్‌పీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అపార్టుమెంటుతో పాటు చూట్టు పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఆదివారం 513 మందికి, సోమవారం 600 మందికి కరోనా పరీక్షలు చేయించామని, ఇవాళ(మంగళవారం) మిగిలిన 300 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని బీబీఎమ్‌పీ సీనియర్ అధికారి చెప్పారు. అనంతరం అపార్టుమెంటు సెక్రటరీ, సిబ్బందితో సమావేశమై వారు పాటించాల్సిన కోవిడ్ ప్రోటోకాల్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెర్చించినట్లు తెలిపారు.
(చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు)
(కరోనా వైరస్.. 7 కొత్త లక్షణాల కథ..)
(యూకేకు ప్రయాణం మరింత కఠినం)
Comments
Please login to add a commentAdd a comment