
కోల్‌కతా: ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని(85) కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. నిన్న(శుక్రవారం) ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు అక్టోబర్ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంకు తరలించారు.
(చదవండి: కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?)
ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న అభియాన్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. అయితే సౌమిత్రా ఆస్కార్ విజేతలైన సత్యజిత్ రే, ఫెలుడాల రచనలలో కూడా ఒక భాగంగా ఉన్నారు. వారి రచనలైన ది వరల్డ ఆఫ్ అపు, సంఘర్ష్‌లు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేగా ఆయన రాసిన ‘అషాని సంకేట్, ఘరే బైర్, అరణ్య దిన్ రాత్రి, చారులత, షాఖా ప్రోశాఖా, జిందర్ బండి, సాత్ పాక్ బంధతో పాటు మరిన్ని రచనలు ఉత్తమంగా నిలిచాయి. (చదవండి: పిల్లల్లోనూ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్)