Bengali actor
-
దాదాకు ఫాల్కే
బాలీవుడ్లో తెల్లరంగు హీరోల మధ్య మొదటిసారి ఒక నల్లరంగు హీరో జెండా ఎగరేశాడు. పంజాబీ హీరోల మధ్య మొదటిసారి ఒక బెంగాలీ సూపర్‌స్టార్ అవతరించాడు. దక్షిణాదిలో కమల్ హాసన్, చిరంజీవి డాన్స్‌ను అట్రాక్షన్ గా పూర్తిగా మలచక ముందే ‘డిస్కో డాన్సర్’తో మిథున్ చక్రవర్తి డాన్సింగ్ సూపర్‌స్టార్ అయ్యాడు. వెండితెర మెరుపులను పూర్తిగా నమ్మక ‘మోనార్క్’ బ్రాండ్‌తో హోటెలింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించి స్థిరపడ్డాడు. ఇండస్ట్రీకి అతను ‘మిథున్‌దా’! దాదాకు దాదాసాహెబ్ ఫాల్కే!! నటించిన తొలి సినిమాకే నేషనల్ అవార్డు వస్తుందా ఎవరికైనా? మిథున్ చక్రవర్తికి వచ్చింది. మృణాల్‌సేన్ దర్శకత్వంలో మిథున్ నటించిన బెంగాలీ చిత్రం ‘మృగయా’ (1976) అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. అందులో అతను నేర విచారణను ఎదుర్కొనే అమాయక గిరిజనుడిగా నటించాడు. ఈ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన మిథున్, అవార్డు అందుకున్నాక బయటకు రాగానే జర్నలిస్టులు చుట్టుముట్టి ఇంటర్వ్యూ అడిగారు. ‘ఇస్తాను.. ఇస్తాను.. ముందు నాకు భోజనం పెట్టించండి’ అన్నాడు మిథున్ . జేబులో రూపాయి దారి ఖర్చులు లేని పేదరికం అతడి చేతి అవార్డు కంటే ఆకలి తీరడమే ముఖ్యమనిపించింది.∙∙ మిథున్ చక్రవర్తికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. మిథున్ ఇప్పుడు వందల కోట్ల ఆస్తి కలిగినవాడు. కాని అతను పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అని నార్త్ కోల్‌కతాలో ఇప్పటికీ అలాగే ఉన్న ఆ ఇంటిని రెండో కొడుకు ఉష్‌మయ్ చక్రవర్తి సందర్శించాడు. ‘ఇంటి వాకిలిలోనే మురుగునీటి కాలువ ఉంది. దానిని దాటి లోపలికి వెళితే ఆయన పెరిగిన ఇంట్లో కనీసం సూర్యకాంతి రావడం లేదు. ఈ చీకటి కొట్టం నుంచి వచ్చిన మా నాన్న అంత పెద్ద స్వ΄్నాన్ని కన్నాడా అని ఆయన పట్ల నా గౌరవం వందరెట్లు పెరిగింది’ అన్నాడతను.∙∙ మిథున్ చక్రవర్తి అసలు పేరు వేరు. అదేంటనేది మనకు అక్కర్లేదు. కాని అతను కాలేజీ రోజుల్లో రాడికల్ స్టూడెంట్‌గా మారాడు. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమంలోనే అతడి సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాడు. ఇక కోల్‌కతాలో ఉండేందుకు ఏ మాత్రం వీలు లేని పరిస్థితి వచ్చింది. ఉద్యమంలో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తి వీథి నాటకాలు హుషారుగా వేసేవాడు. అది గమనించిన ఒక మిత్రుడు నువ్వు దాక్కున్నట్టు ఉంటుంది, నటన నేర్చుకున్నట్టు ఉంటుంది అని పూణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్లో చేర్పించాడు. అక్కడే అతను సొంతపేరు దాచి మిథున్ గా మారాడు. కోర్సు పూర్తయిన వెంటనే సినిమా కూడా దొరికింది. విడుదలైంది. నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇక దిగుల్లేదు... బాలీవుడ్లో బతికిపోవచ్చు అని ముంబై చేరుకున్నాడు మిథున్ . అక్కడ అతి కర్కశమైన జీవితం అతడికి ఎదురుపడింది.∙∙ ‘నలుపు నలుపు అనేరు నలుగురు నవ్వేరు నలుపు నారాయణమూర్తే గాదా’ అనే పాట మనం పాడుకుంటాంగానీ బాలీవుడ్ వాళ్లు విని అర్థం చేసుకునే అవకాశం లేదు. బాలీవుడ్లో హీరోలంటే తెల్లరంగు పంజాబీవారు. అంతే! దక్షిణాదిలో బాలచందర్ ఎలాగో అప్పటికే రజనీకాంత్‌ను ప్రవేశపెట్టాడు కాని బాలీవుడ్లో నల్లరంగు హీరో అసాధ్యం. మిథున్ నల్లగా ఉంటాడు. పైగా హిందీ కూడా సరిగ్గా రాదు. దానికి తోడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఒకటి తెచ్చుకున్నాడు. ఇక ఎవరు రానిస్తారు? తినడానికి తిండి, ఉండటానికి గది ఏమీ లేని దారుణమైన రోజులు చూశాడు. చాలారోజులు పార్కుల్లో పడుకున్నాడు. ఒక స్నేహితుడు మాతుంగాలోని జిమ్‌ఖానాలో మెంబర్షిప్ ఇప్పిస్తే ఉదయాన్నే కాలకృత్యాల కోసం అక్కడకు వెళ్లేవాడు. మిగిలిన సమయం అంతా రోడ్డు మీదే. ప్రసిద్ధ దర్శకుడు మన్ మోహన్ దేశాయ్ దగ్గరకు వెళితే ఆయన తన జేబులో ఉన్న పది రూపాయల నోటు ఇచ్చి పంపించేయడం ఇప్పటికీ చెప్పుకుంటారు. మరో దర్శకుడు ‘ఇతను కనుక హీరో అయితే నేను ఇండస్ట్రీ వదిలేసి పోతాను’ అని ముఖానే చె΄్పాడు. 1980ల కాలం అది. అప్పటికే అమితాబ్ సూపర్‌స్టార్ అయ్యాడు. యువ ప్రేక్షకుల కోసం రిషికపూర్ లాంటి వారు ఉన్నారు. నె΄÷టిజం ఉంది. ఏ తలాతోకా లేని మిథున్ ఎలా హీరో అవుతాడు? ∙∙ కాని దేవుడు కూడా ఏదో ఒక వేళలో ఎదురు పడతాడు. ఈసారి దేవుడు బి.సుభాష్ అనే పేరుతో వచ్చాడు. ‘నేను నీతో సినిమా తీస్తాను. దాని పేరు డిస్కో డాన్సర్’ అన్నాడు బి.సుభాష్. అప్పటికే బప్పి లాహిరి కూడా ఇండస్ట్రీకి వచ్చి మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. బి.సుభాష్, మిథున్, బప్పి లాహిరి కలిసి ‘డిస్కో డాన్సర్’ తయారు చేశారు. డిసెంబర్ నెల 1982లో విడుదల అయిన ఆ సినిమా దేశమంతా అగ్గి పుట్టించింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ కుర్రకారు నుంచి గృహిణుల వరకూ అందరి నోటా ‘ఐయామే డిస్కో డాన్సర్’ పాటే. ఏ పెళ్లిలో కాలేజీ ఫంక్షన్ లో చూసినా ఆ పాటే. రష్యాలో ఆ సినిమా 1000 ప్రింట్లతో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లో 100 కోట్లు సంపాదించిన తొలి సినిమా అది. ఇప్పటి లెక్కల ప్రకారం 1200 కోట్లు! మిథున్ ఇప్పుడు సూపర్‌స్టార్ అయ్యాడు. ఆ తర్వాత బి.సుభాష్‌తోనే తీసిన ‘కసమ్ పైదా కర్నేవాలేకీ’, ‘డాన్స్ డాన్స్’ కూడా భారీ హిట్లే. అమితాబ్, జితేంద్ర, శశి కపూర్, వినోద్ ఖన్నా అందరూ ఇప్పుడు మిథున్ వైపు కళ్లప్పగించి చూస్తున్నారు. అమితాబ్‌కు ప్రధాన పోటీదారు వచ్చినట్టే.∙∙ మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో మాస్ పాత్రలు పోషించినా బెంగాలీలో తనకు నచ్చిన పాత్రలు పోషిస్తూ అక్కడా తన ప్రాభవం కాపాడుకున్నాడు. ‘స్వామి వివేకానంద’ (1998)లో రామకృష్ణ పరమహంసగా నటిస్తే దానికి మళ్లీ నేషనల్ అవార్డ్ వచ్చింది. మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా తీసిన ‘΄్యార్ ఝక్తా నహీ’ (1985) సంవత్సరాల తరబడి ఆడింది. ఇది తెలుగులో కృష్ణ, శ్రీదేవిలతో ‘పచ్చని కాపురం’ పేరుతో రీమేక్ అయ్యింది. పద్మినీ కొల్హాపురి, రంజిత, శ్రీదేవిలతో మిథున్ చేసిన సినిమాలు ప్రేక్షకులకు హిట్ జోడీగా నచ్చాయి. ∙∙ మిథున్ చక్రవర్తి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా హిట్ అయ్యాడు. అమితాబ్ ‘అగ్నిపథ్’లో వేసిన అయ్యర్ పాత్ర అతడికి చాలా పేరు తెచ్చింది. మణిరత్నం తీసిన ‘గురు’లో పత్రికాధిపతిగా (గోయెంకా) నటించి ఆశ్చర్యపరిచాడు. ‘ఓ మైగాడ్’ (గోపాల గోపాల)లో స్వామీజీగా వేసిన పాత్ర మిథున్ లోని మరో పార్శా్వన్ని చూపింది. టెలివిజన్ షోస్ చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మిథున్ అనుక్షణం బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాడు.∙∙ ప్రారంభాలు మర్చిపోనివాడి గమనం స్థిరంగా ఉంటుంది. ఒకరోజు ఊటీలో షూట్ జరుగుతుంటే అక్కడొక మురికి కాలువ పారుతూ ఉంది. పక్కన ఉన్న నటిని పిలిచి ‘నా ఫ్లాష్‌బ్యాక్ చెప్పమని అడుగుతావుగా. ఇదే నా ఫ్లాష్‌బ్యాక్’ అన్నాడతను ఆ కాలువ చూపుతూ.మురుగు నీటి నుంచి వెలిసిన వెండితెర వేల్పు మిథున్ . కుప్పతొట్టిలో ఉన్న అమ్మాయిని కూతురిగా1996 డిసెంబర్ 1న కోల్‌కతాలో న్యూస్ పేపర్ చదువుతున్న మిథున్ కి ఒక వార్త కలుక్కుమనిపిం చింది. తన భార్య యోగితా బాలి (ఒకప్పటి హీరోయిన్ )ని పిలిచి ఆ వార్త చూపించాడు. అందులో కుప్పతొట్టిలో ఎవరో ఆడపిల్లను వదిలేసి పోయారు అని ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. బాధపడ్డారు. ఆ పాపను తెచ్చి పెంచుకోవాలని వెంటనే నిశ్చయించుకున్నారు. ఒక ఎన్ .జి.ఓ ద్వారా ప్రయత్నిస్తే కుప్పతొట్టిలో ఉండటం వల్ల పాప చాలా సీరియస్ కండిషన్ లో ఉందని చె΄్పారు. అయినా సరే మిథున్, యోగితా ఆ పాపను తెచ్చుకుని కంటికి రెప్పలా కాపాడారు. చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారు. దిశానీ చక్రవర్తి అని పేరు పెట్టారు. అమెరికాలో చదివించారు. మిథున్ కు ఎంతో ప్రాణం ఈ కూతురు.నవ్వలేను...సంతోషంతో ఏడవలేను‘దాదాసాహెబ్ వచ్చిందన్న వార్త నన్ను చేష్టలుడిగేలా చేసింది. నేను నవ్వలేను... ఆనందంతో ఏడ్వలేను. ఫుట్‌పాత్ నుంచి వచ్చిన నేను ఇక్కడ దాకా చేరుకున్నానంటే ఈ పురస్కార ప్రకటన నాలో ఇంకా రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. ఒకటి మాత్రం నిజం. నేను ఈ అవార్డు ΄÷ందానంటే ప్రతిభ, అంకితభావం ఉన్న ఎవరైనా ΄÷ందవచ్చు’ అన్నారు మిధున్ చక్రవర్తి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటన తర్వాత! కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా ఈ వార్తను సోమవారం ప్రకటించారు. దాదాసాహెబ్ పురస్కారం సందర్భంగా మిథున్ చక్రవర్తికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. -
కోపంతో ఆ హీరోయిన్ చెంప చెళ్లుమనిపించా..: హీరో
అలనాటి హీరోయిన్ షర్మిల ఠాగూర్‌పై గతంలో చేయి చేసుకున్నానని చెప్తున్నాడు బెంగాలీ హీరో ప్రోసెంజిత్ చటర్జీ. చిన్న వయసులో ఆమె చెంప చెళ్లుమనిపించానని తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 'అప్పుడు నాకు నాలుగైదు ఏళ్లు ఉంటాయనుకుంటాను. నాన్న(విశ్వజిత్ చటర్జీ)తో పాటు షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు హీరోయిన్ షర్మిల ఠాగూర్ ఓ ఎమోషనల్ సీన్లో నాన్నను కొట్టింది.ఆ కోపం నా మీద..లంచ్ బ్రేక్‌లో అంతా ఒకేచోట కూర్చున్నాం. ఆమె నన్ను తన దగ్గరికి తీసుకున్న వెంటనే చెంప మీద కొట్టాను. ఇప్పటికీ మేము కలిసిన ప్రతిసారి ఆ సంఘటనను గుర్తు చేస్తూ ఉంటుంది. మీ నాన్నను కొట్టానన్న కోపంతో నన్ను కొట్టావు కదా.. అంటుంది' అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా విశ్వజిత్ చటర్జీ, షర్మిల ఠాగూర్.. ప్రభాతెర్ రంగ్, యె రాత్ ఫిర్ నా ఆయేగి అనే రెండు సినిమాల్లో జంటగా నటించారు. గోల్డెన్ కపుల్..ఇక ప్రోసెంజిత్ విషయానికి వస్తే.. హీరోయిన్ రితుపర్ణ సేన్గుప్తతో కలిసి దాదాపు 50 సినిమాలు చేశాడు. వీరిని అభిమానులు గోల్డెన్ కపుల్ అని పిలుచుకుంటారు. ఇటీవలే వీరు అజోగ్యో మూవీలో జంటగా నటించారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి.చదవండి: శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు! -
Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!నటిగా ప్రయాణం.. 1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్‌లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. రాజకీయాల్లోకి... సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.వంద శాతం ఇస్తా...తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లేటు వయసులో ప్రియురాలిని పెళ్లాడిన హీరో!
హిందీ, బెంగాలీ చిత్రాలలో ఫేమ్ తెచ్చుకున్న నటుడు పరంబ్రత ఛటర్జీ. తాజాగా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు పియా చక్రవర్తిని వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే పియాకు ఇప్పటికే మ్యూజిషియన్ అనుపమ్ రాయ్‌తో పెళ్లయింది. ఇప్పుడు పరంబ్రత ఛటర్జీని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. ఈ వేడుకకు నిర్మాత, దర్శకురాలైన అరిత్రా సేన్ కూడా హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగింది. వివాహం తర్వాత ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే ఈ జంట తమ పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచారు. బెంగాలీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కాగా.. 43 ఏళ్ల పరంబ్రత, పియా కలిసి గత నెలలో తమ స్నేహితులతో కలిసి ఉన్న ఓ ఫోటోను పియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను అవాస్తవమని ఛటర్జీ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. పియా, అనుపమ్ రాయ్ 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో పరంబ్రతతో ప్రేమలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. పియా సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఇటీవలే వీరిద్దరు లండన్‌ను కూడా సందర్శించారు. ఛటర్జీ సినీ కెరీర్ బెంగాలీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన పరంబ్రత 2012లో విద్యాబాలన్ సరసన కహానీ మూవీలో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అరణ్యక్, జెహనాబాద్ - ఆఫ్ లవ్ అండ్ వార్, కౌన్ ప్రవీణ్ తాంబే , రాంప్రసాద్ కి తెహ్ర్వి, బుల్బుల్, ట్రాఫిక్, పరి సినిమాలు, షోలలో కనిపించారు. బెంగాలీ వెబ్ సిరీస్ ఫెలుడాలో ఫిక్షన్ డిటెక్టివ్, ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌గా నటించి ఫేమస్ అయ్యారు. -
నటుడికి చేదు అనుభవం.. ఎయిర్‌పోర్ట్‌లో భార్యతో అసభ్యంగా!
ప్రముఖ బెంగాలీ నటుడు మైనాక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో అతని భార్యను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లగా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గొడవ పెట్టుకున్నారు. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే గొడవకు సంబంధించి ఫేస్బుక్ లైవ్‌లో మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు బెనర్జీ. (ఇది చదవండి: దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..) ఆ తర్వాత బెనర్జీ మాట్లాడుతూ..' నా భార్య చెన్నై నుంచి విమానాశ్రయానికి వచ్చింది. ఆమె కోసం కారు తీసుకుని గేట్ వద్దకు వెళ్లా. అయితే నా వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని పోలీసు నాకు చెప్పాడు. అక్కడే చాలా వాహనాలు ఉన్నాయని.. అయితే పోలీసులు వారిలో ఎవరికీ చెప్పలేదు. అంతే కాకుండా నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే నేను కారు నుంచి దిగాల్సి వచ్చింది.' అని అన్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?) అసలేం జరిగిందంటే.. తన భార్య ఐశ్వర్యను రిసీవ్ చేసుకునేందుకు ఎయిర్పోర్ట్ గేటు ముందు మైనాక్ బెనర్జీ కారు ఆపాడు. అతని భార్య లగేజీ ఎక్కువగా ఉండడంతో కొంత సమయం పట్టింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భద్రతా సిబ్బంది కారు త్వరగా తీయాలని చెప్పారు. అదే ఇరువురి మధ్య గొడవకు దారి తీసింది. -
15 ఏళ్ల బంధానికి ముగింపు.. బాలీవుడ్ జంట విడాకులు!
బాలీవుడ్ జంట బర్క బిష్త్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు ఈ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాము విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది బర్క. 'అవును, మేము విడాకులు తీసుకుంటున్నాం. త్వరలోనే అందుకు సంబంధించిన పత్రాలు వచ్చేస్తాయి. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్‌ను. నా కూతురు మీరాయే నా సర్వస్వం. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నాను. టీవీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసేందుకు సిద్ధం' అని చెప్పుకొచ్చింది బర్క. కాగా బర్క, ఇంద్రనీల్.. 'ప్యార్ కె దో నామ్- ఏక్ రాధ, ఏక్ శ్యామ్' అనే సీరియల్లో జంటగా నటించారు. 2007లో వచ్చిన ఈ సీరియల్ సెట్స్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. డ్యాన్స్ షో నాచ్ బలియే మూడో సీజన్లోనూ వీరిద్దరూ జంటగా పాల్గొన్నారు. 2008 మార్చిలో వివాహం చేసుకున్న వీరికి మీరా అనే కూతురు జన్మించింది. ఏమైందో ఏమో కానీ, గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే విడాకులు తీసుకుంటున్నారు. బర్క.. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌తో పాటు రాజ్‌నీతి వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇంద్రనీల్.. హిందీ, బెంగాలీ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో ఐతే 2లోనూ ముఖ్య పాత్ర పోషించాడు. ఇకపోతే ఇంద్రనీల్ బెంగాలీ నటి ఇషా సాహాతో డేటింగ్ చేస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బర్క కూడా నటుడు ఆశిశ్ శర్మతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ రిలేషన్‌షిప్‌పై ఇంతవరకు వీరెవరూ స్పందించనేలేదు. చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర -
ఆర్థిక కష్టాలతో రోడ్డెక్కిన కచ్చాబాదం సింగర్‌కు బుల్లితెరపై ఛాన్స్!
ఒక్కరోజులో వచ్చే స్టార్డమ్ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. కానీ దాన్ని దీర్ఘకాలం నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. అందుకు కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ కచ్చా బాదమ్ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. పాటలు, ప్రదర్శనలతో బోలెడంత డబ్బు రావడంతో కారు కూడా కొనుక్కున్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురై ఆస్పత్రి పాలయ్యాడు. మరోవైపు అడిగినవారికల్లా అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లిపోయాడే కానీ దాన్ని తిరిగి వసూలు చేయలేకపోయాడు. చివరికి ఉన్నదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. తనకు లోకజ్ఞానం లేకపోవడంతో ఓ కంపెనీ మూడు లక్షలివ్వగానే వాళ్లు చూపించిన పత్రాల మీద సంతకం పెట్టాడు. దీంతో అతడు కచ్చా బాదమ్ పాట మాత్రమే కాదు ఏ పాట యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినా కాపీరైట్ ఇష్యూ వస్తోంది. ఇన్ని మోసాలు, కష్టాల తర్వాత అద్దె ఇంట్లో బతుకు వెల్లదీస్తున్న భూబన్ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఓ బెంగాలీ సీరియల్లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తైందట. ఒక్క పాత్రతోనే రూ.40 వేల దాకా సంపాదించిన అతడు మున్ముందు కూడా మంచి అవకాశాలు వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానంటున్నాడు. -
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నటుడు
ప్రముఖ బెంగాలీ నటుడు, సామాజిక కార్యకర్త బిభాష్ చక్రవర్తి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాగా బిభాష్ 'నందికర్' అనే సంఘంలో థియేటర్ ఆర్టిస్టుగా జాయిన్ అయ్యారు. 1960లో ఎన్నో రకాల పాత్రలు పోషించిన ఆయన తర్వాత థియేర్ వర్క్‌షాప్‌ను స్థాపించి రాజ్రక్త, చక్భంగ మోదు అనే నాటకాలను డైరెక్ట్ చేశారు. అనంతరం పశ్చిమ బంగ నాట్య అకాడమీ మెంబర్‌గానూ సేవలదించారు. అనారోగ్య కారణాల వల్ల 2018లో పశ్చిమ బంగ నాట్య అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చదవండి: గర్భవతి అయ్యాక సడన్‌గా పెళ్లి? నటి ఏమందంటే? బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతున్న ధమాకా -
Aindrila Sharma: యువనటి ఆండ్రిలా శర్మ మృతి.. వైద్యులు చెప్తున్నదేంటి?
విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి... 24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది. (చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు) కారణాలేంటి? ఎందుకిలా? చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే.. 1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం. 2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం. 3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం. 4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం. 5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం. (చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి) -
ఇటీవలే ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం!
ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ మంగళవారం నాడు గుండెపోటుకు గురైంది. దీంతో ఆమెను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నవంబర్ ఒకటవ తేదీని ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. దీంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. కోలుకుంటుందన్న సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజా సిటీ స్కాన్‌లో ఆమె మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. మందుల ద్వారా నయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేమన్నారు. కాగా అటు సీరియల్స్‌తో, ఇటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఆండ్రిలా శర్మ రెండుసార్లు క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆమె అనారోగ్యానికి గురి కావడంతో తన కోసం ప్రార్థించమని ఆండ్రిలా ప్రియుడు, నటుడు సవ్యసాచి చౌదరి అభిమానులను కోరాడు. చదవండి: బస్సులో ఒకడు అసభ్యంగా తాకాడు: హీరోయిన్ కూతురి పెదాలపై ముద్దు.. ఐశ్వర్యరాయ్‌పై నెటిజన్ల ఫైర్ -
ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం
ప్రముఖ బెంగాలీ నటి సోనాలీ చక్రవర్తి(59) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భర్త శంకర్ కూడా నటుడే కాగా.. వారికి ఓ కుమార్తె ఉన్నారు. బెంగాలీ అభిమానులకు సుపరిచితురాలైన సోనాలి కాలేయ సమస్యలతో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: వాటిని నేను పట్టించుకోను.. కాంతార హీరో రిషబ్ శెట్టి) బెంగాలీకి చెందిన బుల్లితెర నటి సోనాలీ దాదర్ కీర్తి (1980), హర్ జీత్ (2002), చోఖేర్ బాలి (2003), బంధన్ (2004) వంటి చిత్రాలలో కూడా కనిపించారు. చివరగా ఆమె నటించిన మెగా సీరియల్ గాట్చోరలో కనిపించింది. ఆమె మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆత్మహత్యకు యత్నించిన నటుడు, ఫేస్బుక్లో వీడియో..
బెంగాలీ నటుడు సైబాల్ భట్టాచార్య సోమవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో సూసైడ్‌కు ప్రయత్నిస్తూ దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 'నాకు మరో దారి కనిపించడం లేదు. నా భార్య, అత్తమ్మ..' అంటూ ఆయన మాట్లాడుతున్న సగంలోనే ఆ వీడియో ఆగిపోయింది. ఇందులో నటుడు చేతిలో పదునైన ఆయుధంతో తన తల, కాళ్లను గాయపర్చుకున్నట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా సైబాల్కు అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడట. పైగా ఇటీవలే ఆయన డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడని, ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. సైబాల్కు.. ప్రోతోమా కాదంబిని సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. తండ్రిగా, అంకుల్‌గా పలు పాత్రలు పోషించిన ఆయన స్క్రిప్ట్ రైటర్, డైలాగ్స్ రచయితగానూ పని చేశాడు. ఇకపోతే సెలబ్రిటీల వరుస ఆత్మహత్యలతో బెంగాలీ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. పల్లవి డే, బిడిషా డే మజుందార్, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్న కొద్ది వారాలకే సైబాల్ ఆత్మహత్యకు యత్నించడంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి మీనాను పరామర్శించిన అలనాటి హీరోయిన్లు, ఫొటో వైరల్ -
ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు
Bengali Actor Rahul Arunoday Banerjee Kept Mum For 15 Days: సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచే హీరోలు ఉన్నారు. అలాగే పాత్రలో ఒదిగిపోయేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడతారు కొందరు నటులు. అలాంటి నటుల్లో ఒకరు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. ఆయన తాజాగా నటించిన బెంగాలీ చిత్రం 'మృత్యుపతోజాత్రి (ఎవరు చనిపోతారో)'. సౌమ్య సేన్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరణశిక్ష పడిన ఖైదీ పాత్రలో రాహుల్ నటించారు. చనిపోవడానికి 12 గంటల ముందు ఖైదీల మానసిక పరిస్థితిని ఇందులో చూపించారు. అయితే ఇందుకోసం షూటింగ్‌కు ముందు సుమారు 15 రోజులు ఎవరితోనూ రాహుల్ మాట్లాడలేదట. కనీసం వారి ఇంటిసభ్యులతో కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉన్నాడట. 'నిజానికి తాము ఎప్పుడూ చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ, తన జీవితం 12 గంటల తర్వాత ముగుస్తుందని తెలుసు. దానిని అర్థం చేసుకోవడం కష్టం. అతనికి తెలుసు ఆ మరణంలో ఎలాంటి గౌరవం ఉండదని. ఆ సమయంలో అతనికి మద్దతుగా ఎవరు నిలబడరు. నేను చిత్రీకరణకు 15 రోజులు ముందు నుంచే మా ఇంట్లోవాళ్లతో మాట్లాడటం మానేశాను. మా డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా చాలా బాగా రీసెర్చ్ చేశారు. చాలా స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు.' అని పేర్కొన్నారు నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ. చదవండి: వచ్చేస్తోంది 'చంద్రముఖి 2'.. సీక్వెల్‌పై అధికారిక ప్రకటన హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం. ఇది కల్పితమైనప్పటికీ నిజ జీవితంలో ఖైదీల గురించి కొన్ని పుస్తకాలు, న్యాయవాదులు, పోలీసులతో జరిగిన చర్చల ఆధారంగా స్క్రిప్ట్‌ను డెవలప్ చేయడంలో ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష పడిన ఖైదీ చివరి 12 గంటలు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఆ సమయంలో అపరాధ భావం, మానసిక సంఘర్షణ, మరణ భయం వంటి విషయాలను ఎలా అనుభవిస్తారో ప్రేక్షకులకు తెలియచెప్పాలనుకున్నాను. ప్రేమ, జీవితాలపై సినిమాలు చేయగలిగినప్పుడు మరణంపై ఎందుకు సినిమా తీయకూడదు.' అని తెలిపారు డైరెక్టర్ సౌమ్య సేన్‌గుప్తా. -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
Abhishek Chatterjee Passed Away: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలి నుటుడు అభిషేక్ ఛటర్జీ(58) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం(మార్చి 24) రాత్రి తుదిశ్వాస విడిశారు. అయితే ఆయన మరణానికి అసలు కారణం మాత్రం ఇప్పటివరకు కుటుంబ సభ్యులు వెల్లడించకపోవడం గమనార్హం. 1985లో పాత్భోలా సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన అభిషేక్ ఛటర్జీ.. బెంగాలిలో దాదాపు వందకి పైగా చిత్రాల్లో నటించారు. ఓరా చార్జోన్, తుమీ కోటో సుందర్, సురర్ ఆకాశే, తూఫాన్, మర్యాద, అమర్ ప్రేమ్ లాంటి చిత్రాలు అభిషేక్‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. కేవలం వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా తనదైన ముద్రవేశాడు. ఒకవైపు సినిమా చేస్తూనే.. మరోవైపు టీవీ సీరియళ్లలో నటించారు. అభిషేక్ మృతితో బెంగాలి చిత్రపరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో వందల సినిమాల్లో అలరించిన నటుడు కళ్ల ముందు లేడనే విషయాన్ని తెలుసుకుని బాధ పడుతున్నారు అభిమానులు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు సీనీ, రాజకీయ ప్రముఖలు అభిషేక్ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. Sad to know of the untimely demise of our young actor Abhishek Chatterjee . Abhishek was talented and versatile in his performances, and we shall miss him. It is a great loss for TV serials and our film industry. My condolences to his family and friends. — Mamata Banerjee (@MamataOfficial) March 24, 2022 -
తొలి తరం నటుడు సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు
ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 6న ఛటర్జీ కరోనా బారిన పడి, కోల్‌కత్తాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబర్ 14న ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘గత రెండు రోజులుగా ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది.. ఆయన్ను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్‌లో జన్మించిన సౌమిత్ర ఛటర్జీ థియేటర్ ఆర్టిస్ట్‌గా అహింత్ర చౌదరి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. స్వయంకృషితో బెంగాలీ చిత్ర సీమలో నంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. బెంగాలీ తొలి తరం నటుల్లో అగ్రగణ్యుడైన సౌమిత్ర ఛటర్జీ.. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ‘అపుర్ సంసార్’తో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి, పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో ఆయన నటించడం విశేషం. ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ తదితర చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందిన ఛటర్జీ బెంగాలీ చిత్రసీమకు ఎంతో వన్నె తెచ్చారు. సోనార్ ఖెల్లా, జోయ్ బాబా ఫెలునాథ్, ఘరె బైరె వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారాయన. అంతేకాదు.. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు ఛటర్జీ. వీటితో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారాయన. కాగా సౌమిత్ర ఛటర్జీ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు సినీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. యస్–యస్–సక్సెస్ సౌమిత్ ఛటర్జీ అనగానే సత్యజిత్ రేతో ఆయనకున్న అనుబంధం గుర్తురాక మానదు. ప్రపంచ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్–డైరెక్టర్ కాంబినేషన్లలో ఈ ఇద్దరి పేర్లు తప్పక ప్రస్తావించాల్సిందే. సౌమిత్ర ఛటర్జీను ప్రపంచ సినిమాకు పరిచయం చేసింది సత్యజిత్ రేయే. రే తీస్తున్న ‘జల్సాగర్’ సినిమా చిత్రీకరణ చూడటానికి వెళ్లారట సౌమిత్ర. అప్పటికి ఆయనకు తెలియదు రే ఇచ్చే పెద్ద హిట్లలో హీరో వేషం తనే వేస్తానని, రే ఫ్యావరెట్ హీరో అవుతానని. ఆ చిత్రీకరణ చూడటానికి వెళ్లే సమయానికే సౌమిత్రను ‘అపుర్ సంసార్’ (1959) చిత్రానికి హీరోగా ఫిక్స్ అయ్యారు రే. ‘అపుర్..’ షూటింగ్ స్టార్ట్ అయ్యి, మొదటి సన్నివేశం తీసే వరకూ కూడా సౌమిత్రకు తన మీద తనకు నమ్మకం అంతగా లేదట. మొదటి షాట్ సింగిల్ టేక్‌లో ఓకే అయ్యాక నమ్మకం వచ్చింది. తన జన్మకారణం ఇదే (నటన) అని అర్థం అయిపోయింది. సౌమిత్ర ఛటర్జీ – సత్యజిత్ రే ఇద్దరూ కలసి సుమారు 14 సినిమాలు చేశారు. సౌమిత్రలోని నటుడిలో ఉన్న అన్ని కోణాలను సత్యజిత్ కథలు ఆవిష్కరించాయి. కొన్ని కథలు రాసే సమయంలో సౌమిత్రను మనసులో పెట్టుకొని రాశారట సత్యజిత్ రే. ‘ఫెలుదా’లోని బెంగాలీ డిటెక్టివ్ ఫెలుదా పాత్ర సౌమిత్రకు బాగా పేరు తెచ్చింది. ఆ తర్వాత ఫెలుదా పాత్రకు సంబంధించిన నవలల్లో సౌమిత్ర ఛటర్జీ రూపురేఖల ఆధారంగా బొమ్మలు వేయించారట రే. సౌమిత్ర, నిర్మల్యా ఆచార్య స్థాపించిన మేగజీన్‌కి పేరు పెట్టమని రేని కోరితే ‘ఎక్కోన్’ అని పేరు పెట్టారు. ‘ఎక్కోన్’ అంటే ‘ఇప్పుడు’ అని అర్థం. పేరుతో పాటు కవర్ పేజీ డిజైన్ కూడా చేసి పెట్టారట. వీరి కాంబినేషన్లో ‘దేవి, అరణ్యేర్ దిన్ రాత్రి, చారులత, ఆషానీ సంకేత్, సోనార్ ఖెల్లా’ వంటి సినిమాలు పాపులారిటీ పొందాయి. ‘‘మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయాను. మా నాన్నగారిది, ఆయన (సౌమిత్ర)ది అద్భుతమైన కెమిస్ట్రీ. నాన్న సృష్టించిన పాత్రను తనదైన ఆలోచనతో చేశారాయన. ‘ఆషానీ సంకేత్’లోని గంగాచరణ్ పాత్ర సౌమిత్రగారికి ఎంతో ఇష్టం. ఆయన సినిమాలో ఎంతగా లీనమయ్యేవారంటే ఒకసారి ట్రాలీ తోసే మనుషులు తక్కువైతే ఆయనే తోశారు. అంతటి గొప్ప వ్యక్తి. – దర్శకుడు సందీప్ రే, సత్యజిత్ రే తనయుడు -
కరోనా పాజిటివ్: క్షీణించిన నటుడి ఆరోగ్యం
కోల్‌కతా: ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ బెంగాలీ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే విజేత సౌమిత్రా ఛటర్జీని(85) కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తరలించారు. నిన్న(శుక్రవారం) ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి క్షణం వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయించాల్సిందిగా వైద్యులు సూచించారు. కోవిడ్ పరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్ వచ్చినట్లు అక్టోబర్ 6న డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతాలోని బెల్లెవ్ నర్సింగ్ హోంకు తరలించారు. (చదవండి: కరోనాతో చనిపోతే లోక్‌సభను మూసేయాలా?) ఇటీవల కేంద్రం షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఆయన దర్శకత్తం వహిస్తున్న అభియాన్ షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కరోనా బారిన ఉంటారని కుటుంబ సభ్యులు అభిప్రాయ పడుతున్నారు. అయితే సౌమిత్రా ఆస్కార్ విజేతలైన సత్యజిత్ రే, ఫెలుడాల రచనలలో కూడా ఒక భాగంగా ఉన్నారు. వారి రచనలైన ది వరల్డ ఆఫ్ అపు, సంఘర్ష్లు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అంతేగా ఆయన రాసిన ‘అషాని సంకేట్, ఘరే బైర్, అరణ్య దిన్ రాత్రి, చారులత, షాఖా ప్రోశాఖా, జిందర్ బండి, సాత్ పాక్ బంధతో పాటు మరిన్ని రచనలు ఉత్తమంగా నిలిచాయి. (చదవండి: పిల్లల్లోనూ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) -
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మృతి
కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్‌పాల్ (61) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్‌పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. తపస్‌పాల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్ గుండె జబ్బుల కారణంగా పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. కాగా తపస్‌పాల్ పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్ కాలేజీలో బయోసైన్స్ చదివారు. సినిమాల మీద మక్కువతో ..1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1984లో తపస్‌పాల్.. మాధురీ దీక్షిత్‌తో కలిసి అబోద్ చిత్రంలో నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్ కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచి సేవలందించారు. -
ఆ నిర్మాత నన్ను అసభ్యంగా తాకాడు: నటి
కలకత్తా: బీటౌన్ నుంచి దక్షిణాది వరకు, అటు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సంచలనం సృష్టించింది ‘మీ టూ’ ఉద్యమం. తాజాగా ఈ ఉద్యమ సెగ బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా తాకింది. ప్రముఖ బెంగాలీ బుల్లితెర నటీ రూపంజన మిత్రా తనను దర్శకుడు అరిందం సిల్ లైంగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పడంతో సంచలనంగా మారింది. రూపంజన మిత్రా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘భూమికన్యా’ సీరియల్ నిర్మాత అరిందమ్ సిల్ ఆఫీసులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ‘ఈ సీరియల్ మొదటి ఎసిసోడ్ కోసం స్క్రిప్ట్ చదవాలంటూ అరిందమ్ సిల్ కలకత్తాలోని తన ఆఫీసుకు రమ్మని చెప్పాడు. నేను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆఫీసుకు వెళ్లాను. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నేను, ఆయన మాత్రమే ఉన్నాము. నేను లోపలికి వెళ్లిన కాసేపటికీ ఆయన నా తల నుంచి వీపుకు వరకు చేతితో తడమడం మొదలు పెట్టాడు. ఎవరైనా వచ్చి నన్ను అక్కడి నుంచి బయటపడేస్తే బాగుండనకుంటూ దేవుడికి ప్రార్థించాను. అతని వికృత చేష్టలు భరించలేక స్క్రిప్ట్ గురించి చెప్పండి అన్నాను. ఆ తర్వాత స్క్రిప్ట్‌ను వివరించడం మొదలు పెట్టిన కొద్ది నిమిషాలకే ఆయన భార్య ఆఫీసులోకి వచ్చింది. ఇక నేను హమ్మయ్యా.. బతికిపొయాననుకొని నా ప్రార్థన విన్న దేవుడికి మనసులో థ్యాంక్స్ చెప్పుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటన దుర్గ పూజకు కొన్ని రోజుల ముందే జరిగిందని ఆమె పేర్కొన్నారు. కాగా నిర్మాత అరిందమ్ సిల్ అలాంటిదేం లేదని, రూపంజన నేను పాత స్నేహితులమంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇక దర్శకుడు, నటుడైన అరిందమ్ సిల్ ‘హర్ హర్ బ్యోమకేష్’, ‘ఈగోలర్ ఛోఖ్’, ‘దుర్గా సోహాయ్’ వంటి ప్రముక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘సిందూర్ ఖేలా’, ‘సోతి’, ‘ఏక్ఆకాష్’ వంటి సీరియల్లో నటించిన రూపంజన మిత్రా బెంగాలీ బుల్లితెర నటులలో ఒకరుగా మారారు. -
హోటల్ గదిలో నటి ఆత్మహత్య?
కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ సినీ, టీవీ నటి పాయెల్ చక్రబోర్తి (38) మృతిచెందారు. పశ్చిమబెంగాల్లోని సిలిగురిలోని ఓ హోటల్ గదిలో బుధవారం రాత్రి పాయెల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. 'మంగళవారం హోటల్లో ఓ గది తీసుకున్న పాయెల్ బుధవారం గ్యాంగ్‌టక్‌కు వెళ్లాలని చెప్పారు. గదిలో దిగే ముందే తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దన్నారు. అంతేకాకుండా బుధవారం రాత్రిపూట భోజనం కూడా తీసుకోలేదు' అని హోటల్ సిబ్బంది తెలిపారు. దీంతో బుధవారం ఎంతగా డోర్ కొట్టినా తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తే అమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందన్నారు. పాయెల్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే హత్యా, ఆత్మహత్యా అనేది తేలుతుందన్నారు. సినిమాలు, టీవీ సీరియల్లు, పలు వెబ్ సిరీస్‌ల్లో పాయెల్ నటించారు. చోఖేర్ తారా తుయ్, గొయెండా గిన్నీ వంటి షోలను కూడా ఆమె చేస్తున్నారు. పాయోల్ మృతితో పశ్చిమబెంగాల్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తన భర్తనుండి గత కొద్దిరోజు నుండే వేరుగా ఉంటున్నారు. పాయెల్‌కు ఓ కుమారుడు ఉన్నారు. పాయెల్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిలిగురి చేరుకొన్నారు. పాయెల్ రాంచి వెళుతున్నట్టు తనతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకొచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఆమె తండ్రి ప్రబిర్ గుహా తెలిపారు. -
బంగ్లాపైనుంచి పడిపోయిన సీనియర్ నటుడు!
కోల్‌కతా : బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్ ప్రమాదవశాత్తు తన అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి పడిపోయారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పడి ఉన్న ఆయనను గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ కోల్‌కతాలోని తమ నివాసంలో ఈ ఘటన జరిగిందని, ఈ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో లేనని ఆయన కుమారుడు శాంఖ్యా తెలిపారు. 77 ఏళ్ల చిన్మయ్ రాయ్‌కి కాళ్లకు, చేతులకు, శరీరంలోని పలుభాగాలకు గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని శాంఖ్యా తెలిపారు. చార్మూర్తి, బసంతా బిలాప్, నానిగోపాలెర్ బైయే తదితర కళాత్మక క్లాసిక్ చిత్రాల్లో చిన్మయ్ రాయ్ నటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బెంగాల్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు పరామర్శించారు. -
రేప్ కామెంట్స్ పై సారీ: దేవ్
ఎన్నికల బరిలో నిలబడటం, రేప్ (అత్యాచారం) రెండూ ఒకేలాంటవేనని తాను చేసిన వ్యాఖ్యలపై క్షమించాలని బెంగాలీ నటుడు దేవ్ ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. తాను రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించానని, మహిళలను తల్లిగా, సోదరిగా గౌరవిస్తానని చెప్పారు. ప్రజల మనస్సులు గాయపరచడం తన ఉద్దేశ్యం కాదన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనసులైనా గాయపడి ఉంటే క్షమించాలన్నారు.ఈ మేరకు దేవ్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా, గట్టల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవ్ బరిలో నిలిచారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ మాట్లాడుతూ... ఎన్నిక బరిలో నిలబడటం, రేప్ రెండు ఒక లాంటివేనని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. దేవ్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో దేవ్ దిగి రాక తప్పలేదు.