Bengali Actress Aindrila Sharma Suffered From Multiple Heart Attacks, She Is On Ventilator - Sakshi
Sakshi News home page

Aindrila Sharma: నటికి గుండెపోటు, ఆపరేషన్‌ కష్టమన్న వైద్యులు!

Published Wed, Nov 16 2022 6:24 PM | Last Updated on Wed, Nov 23 2022 11:43 PM

Bengali actress Aindrila Sharma Suffered from Multiple Heart Attacks - Sakshi

సిటీ స్కాన్‌లో ఆమె మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్‌ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు.

ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ మంగళవారం నాడు గుండెపోటుకు గురైంది. దీంతో ఆమెను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా..  వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నవంబర్‌ ఒకటవ తేదీని ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైంది. దీంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. కోలుకుంటుందన్న సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తాజా సిటీ స్కాన్‌లో ఆమె మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్‌ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. మందుల ద్వారా నయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నందున మెడిసిన్‌ ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేమన్నారు.

కాగా అటు సీరియల్స్‌తో, ఇటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఆండ్రిలా శర్మ రెండుసార్లు క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆమె అనారోగ్యానికి గురి కావడంతో తన కోసం ప్రార్థించమని ఆండ్రిలా ప్రియుడు, నటుడు సవ్యసాచి చౌదరి అభిమానులను కోరాడు.

చదవండి: బస్సులో ఒకడు అసభ్యంగా తాకాడు: హీరోయిన్‌
కూతురి పెదాలపై ముద్దు.. ఐశ్వర్యరాయ్‌పై నెటిజన్ల ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement