Cancer Survivor
-
ఇటీవలే ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం!
ప్రముఖ బెంగాలీ నటి ఆండ్రిలా శర్మ మంగళవారం నాడు గుండెపోటుకు గురైంది. దీంతో ఆమెను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నవంబర్ ఒకటవ తేదీని ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైంది. దీంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు. కోలుకుంటుందన్న సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజా సిటీ స్కాన్‌లో ఆమె మెదడులో అక్కడక్కడా రక్తం గడ్డకట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ఆమెకు ఆపరేషన్ చేయడం సాధ్యం కాదని వైద్యులు తెలిపారు. మందుల ద్వారా నయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందున మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేమన్నారు. కాగా అటు సీరియల్స్‌తో, ఇటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఆండ్రిలా శర్మ రెండుసార్లు క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. తాజాగా మరోసారి ఆమె అనారోగ్యానికి గురి కావడంతో తన కోసం ప్రార్థించమని ఆండ్రిలా ప్రియుడు, నటుడు సవ్యసాచి చౌదరి అభిమానులను కోరాడు. చదవండి: బస్సులో ఒకడు అసభ్యంగా తాకాడు: హీరోయిన్ కూతురి పెదాలపై ముద్దు.. ఐశ్వర్యరాయ్‌పై నెటిజన్ల ఫైర్ -
స్ట్రోక్‌తో కోమాలోకి నటి.. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై!
పొట్టి జుట్టు.. చందమామ లాంటి రూపంతో కనిపించే ఆ ముద్దుగుమ్మ.. మామూలు యోధురాలు కాదు. ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. అదీ ఒక్కసారి కాదు.. రెండుసార్లు!. పూర్తిగా కోలుకుని నటనలోకి మళ్లీ అడుగుపెట్టి అభిమానులను అలరిస్తోందనగా.. పిడుగులాంటి వార్త. ఆమె ఆరోగ్యం మరోసారి తిరగబడింది. ఈసారి పరిస్థితి విషమించి ప్రాణాంతక స్థితికి చేరుకుంది. ప్రముఖ బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ.. చక్కని రూపం, హోమ్లీ క్యారెక్టర్లతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ విశేష అభిమానుల్ని సంపాదించుకుంది. జుమూర్, భోలే, బాబా పర్ కరేగా లాంటి పలు చిత్రాలతో విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. మరోవైపు సీరియల్స్‌లోనూ నటిస్తూ బుల్లితెర గుర్తింపూ దక్కించుకుంది. క్యాన్సర్ సోకపోయి ఉంటే ఆమె ఖాతాలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు ఉండేవే. రెండుసార్లు క్యాన్సర్‌ను జయించిన ఐంద్రీలా శర్మ.. తాజాగా స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. క్రమంగా కోలుకుంటోందని వైద్యులు ప్రకటించడంతో.. ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని అంతా భావించారు. అయితే ఆమె ఇంకా కోమాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్రా సెరిబ్రల్ హెమరేజ్ కారణంగా ఆమె శరీరంలో కొంత భాగం పక్షవాతానికి గురైందని వైద్యులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. వెంటిలేటర్‌పై ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెదడులో అక్కడక్కడ రక్తం గడ్డకట్టిందని తెలుస్తోంది. దిగ్గజ నటి సుచిత్ర సేన్ స్ఫూర్తితో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఐంద్రీలా శర్మ.. చిన్నవయసులోనే ఇలా ప్రాణాంతక స్థితికి చేరకోవడంపై బెంగాలీ ప్రేక్షకులు, ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అద్భుతం జరిగి ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. గతంలో కీమోథెరపీల ద్వారా, సంక్లిష్టమైన సర్జరీల ద్వారా ఆమె క్యాన్సర్ నుంచి రెండుసార్లు కోలుకున్నారు. బెంగాలీలో పలు చిత్రాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతోనూ ఆమె అలరించారు. టీవీ షోలతోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ.. తోటి నటుడు(జుమూర్ సీరియల్లో లీడ్ పెయిర్) సవ్యసాచి చౌదరితో డేటింగ్ చేస్తోంది. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సమయంలో ఇలా ఒక్కసారిగా ఆస్పత్రి పాలైంది. ఇదీ చదవండి: వీ ఆర్ జస్ట్ ఫ్రెండ్స్: జాన్వీ కపూర్ -
ఛాతీలో నొప్పి! గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! ఇప్పుడిలా!
Sunita Meena: ఎన్నాళ్లుగానో వేచి చూస్తోన్న చిన్ననాటి కల.. ఏళ్ల తరువాత మధ్యవయసులో నిజం కాబోతుందన్న ఆనందంలో ఉన్న ఆమెను క్యాన్సర్ వ్యాధి కమ్ముకున్నది. అయినా ఏమాత్రం బెదరలేదు. మరింత ధైర్యాన్ని కూడగట్టుకుని ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూనే, తన కలను నిజం చేసుకునేందుకు రన్నింగ్ చేస్తోంది సునీతా మీనా. ఒకపక్క కీమో థెరపీ తీసుకుంటూనే మరోపక్క రన్నర్‌గా రాణిస్తోన్న సునీత పరుగుల ప్రయాణం ఆమె మాటల్లోనే.... ‘నేను మధురలో పుట్టి పెరిగాను. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. రన్నింగ్ రేసుల్లో పాల్గొని విజేతగా నిలవాలని అనుకునేదాన్ని. కానీ ఇంటర్మీడియట్ పాస్ అవగానే రైల్వేలో పనిచేస్తోన్న దినేష్ కుమార్‌తో నాకు వివాహం అయ్యింది. పెళ్లి అయిన ఏడాదికే బాబు పుట్టాడు. ఇంటిపనులు, బాబుతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకుంటానని మా వారిని అడిగాను. ఆయన పెద్దమనసుతో ఒప్పుకోవడంతో డిగ్రీ పూర్తిచేశాను. ఆయన కూడా రన్నర్ కావడంతో... స్కూల్లో ఉన్నప్పుడు క్రీడల్లో చురుకుగా పాల్గొనేదాన్ని. కానీ పెద్దయ్యాక రన్నింగ్‌లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మా ఆయన అంతర్జాతీయ అథ్లెట్ కావడంతోపాటు, రైల్వే టీమ్‌కు కోచ్‌గా పనిచేసేవారు. రోజూ ఆయన రన్నింగ్‌కు వెళ్తూ రన్నింగ్ గ్రూప్‌తో బిజీగా ఉండేవారు. నన్ను కూడా ‘‘రన్నింగ్ చెయ్యి, ఆరోగ్యంగా ఉంటావు’’ అని చెబుతుండేవారు. నా చిన్ననాటి కోరికే అయినప్పటికీ, పిల్లలు చిన్నవాళ్లు కావడంతో అప్పుడు వీలుపడలేదు. నా ఎత్తుకంటే, బరువు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు తలనొప్పిగా అనిపించేది. ఇలా ఇబ్బంది పడుతోన్న నాకు ‘‘ఈ సమస్యలన్నింటికి రన్నింగ్ చక్కటి పరిష్కార మార్గం’’ అని ఆయన పదేపదే చెబుతుండేవారు. పిల్లలు కూడా పెద్దవాళ్లు అవడంతో 43 ఏళ్ల వయసులో 2018లో రన్నింగ్ ప్రారంభించాను. ఒకపక్క రన్నింగ్ చేస్తూ బరువు పెంచని పోషకాహారం తీసుకుంటూ ఫిట్‌గా తయారయ్యాను. ఆరునెలల్లో మారథాన్ రన్నర్‌గా.. తెల్లవారుజామున నాలుగంటలకే నిద్రలేచి రన్నింగ్ సాధన చేసేదాన్ని. ఇలా అక్కడక్కడ జరిగే మారథాన్లలో పాల్గొనేదాన్ని. ఇలా పాల్గొంటూ తొలిసారి ఢిల్లీ స్టేట్ మారథాన్‌లో పాల్గొని రెండోస్థానంలో నిలిచాను. ఈ ఉత్సాహంతో ప్రతి మారథాన్‌లో పాల్గొనేదాన్ని. రేస్‌లో ఉన్నప్పుడు నా ఛాతీలో విపరీతంగా నొప్పి వస్తుండేది. గ్యాస్ వల్ల వచ్చే నొప్పి కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ కొన్నిరోజులకు స్తనంలో వాపు కూడా రావడంతో మావారి బలవంతం మీద ఆసుపత్రిలో చూపించుకున్నాను. డాక్టర్లు పరీక్షించి క్యాన్సర్ గడ్డ ఉందని చెప్పి, వెంటనే సర్జరీ చేస్తామన్నారు. అప్పటికి సరిగ్గా వారం తరువాత రష్యాలో రన్నింగ్ రేస్‌లో పాల్గొనాల్సి ఉందని, తర్వాత చేయించుకుంటానని డాక్టర్‌కు చెప్పాను. ‘‘సర్జరీ వెంటనే చేయాలి, సర్జరీ తరువాత మీరు రన్నింగ్ రేస్‌లో పాల్గొన వచ్చు’’ అని అభయం ఇచ్చారు. సర్జరీ తరువాత కొంచం విశ్రాంతి తీసుకుని ఆయనతో కలిసి రష్యావెళ్లి రన్నింగ్‌లో పాల్గొన్నాను. రష్యా నుంచి వచ్చిన తరవాత కీమో తీసుకుంటూనే రన్నింగ్ కూడా చేసేదాన్ని. అలా ఏడు కీమోలు చేశారు. తొలి కీమో చేసిన తరువాత నా జుట్టు ఊడడం మొదలైంది. దీంతో నాకేదో అయిపోతోందని కుంగిపోయేదాన్ని. మా ఆయన, పిల్లలు... ‘‘ఇది శాశ్వతం కాదు కొన్నిరోజులే... తరువాత మళ్లీ జుట్టు వస్తుంది’’ అని ధైర్యం చెప్పడంతో కొంచెం కుదురుకున్నాను. భవిష్యత్‌లో మరిన్ని కిలోమీటర్లు.. ‘‘రన్నింగ్తోపోలిస్తే కీమోథెరపీ వల్ల కలిగే బాధ తక్కువే. అందుకే నువ్వు నీ రన్నింగ్‌ను ఆపాల్సిన పనిఏమీ లేదు. నువ్వు చక్కగా పరిగెత్తవచ్చు’’ అని డాక్టర్లు ధైర్యం నూరిపోశారు. దాంతో రెట్టింపు ∙ఉత్సాహంతో కీమోథెరపీ చేసిన కొద్దిరోజుల తరువాత ఢిల్లీలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ ను గంటా తొమ్మిది నిమిషాల్లో పూర్తిచేశాను. ఆ తరువాత లద్ధాఖ్‌లో జరిగిన ఏడు కిలోమీటర్ల మారథాన్‌లో పాల్గొన్నాను. ఈ ఏడాది జూన్‌లో వడోదరలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెట్ చాంపియన్ షిప్లో పాల్గొని ఆరోస్థానంలో నిలిచాను. ఇప్పటికీ నేను కేవలం పదికిలోమీటర్ల రేసుల్లోనే పాల్గొంటున్నాను. భవిష్యత్ లో 21 కిలోమీటర్లు దూరం కూడా ప్రాక్టీస్ చేస్తాను. శరీరంలో క్యాన్సర్ మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయంటేనే జీవితం అయిపోయిందనిపిస్తుంది. అలాంటిది తన శరీరంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ ‘‘... అయితే ఏంటి ..నా పరుగుని అది ఏం చేయలేదు’’ అని 47 ఏళ్ల వయసులో ధైర్యంతో ముందుకు సాగుతూ ఎంతోమంది క్యాన్సర్ రోగులకు స్ఫూర్తిగా నిలుస్తోంది సునీతామీనా. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు నవ్విన జనమే నీరాజనం పట్టారు! మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థం! -
"ఆమే ఒక సైన్యమై, సందేశమై.. " క్యాన్సర్ బాధితురాలి యదార్థ గాధ
‘నీ కన్నీళ్లను మోసే శక్తి నాకు లేదు’ అని నటులు ఏదో ఒక సందర్భంలో మనసులోనో, మనసు దాటో అని ఉండవచ్చు. కొన్ని పాత్రలు అలా ఉంటాయి మరి! పాత్ర పండాలంటే జీవం ఉట్టిపడాలి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. తేలిపోవచ్చు. మరి బాధితులే నటమాధ్యమంలోకి, తమ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే..? వారి జీవితం మన కళ్ల ముందుకు నడిచొస్తుంది. జీవం ఉట్టిపడుతుంది. పదిమందికి మంచి చేసే సందేశం వేగిరంగా అందుతుంది... ప్రియ జోషి (హైదరాబాద్) నటి, రచయిత్రి. ఆమె ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ప్రియ మానసిక ప్రపంచం ఏమిటో మనకు తెలియదు. ధైర్యంగా కనిపించి ఉండొచ్చు. కాని నిజంగానే ధైర్యంగా ఉందా? కళ్లలో నీటిపొరలేవీ కనిపించకపోవచ్చు. కానీ మనకు కనిపించని దుఃఖసముద్రాలు ఆమె మనసులో ఏమైనా ఉన్నాయా? తనకు క్యాన్సర్ ఉందన్న చేదునిజం తెలిసిన క్షణం నుంచి క్యాన్సర్ నుంచి బయట పడిన రోజు వరకు ఆమె హృదయం రణరంగంగా మారి ఉండవచ్చు. అక్కడ ఆశ, నిరాశలకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధం అప్పుడప్పుడూ చేజారిపోతూ ఉండవచ్చు. దాని జాడ కనిపించకుండా ఉండవచ్చు. చేజారిన ఆయుధాన్ని ఆమె కష్టపడి వెదికి పట్టుకొని ఉండవచ్చు. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఒక ఏకాంకిక సమాధానం చెప్పబోతుంది. ప్రియ జోషి ఆత్మబలం, పోరాట పటిమను నితిన్ బస్రూర్ హిందీలో ‘ఔర్ షమా జల్తీ రహీ’ పేరుతో సోలో ప్లేగా మలిచారు. ఈ ప్లేలో ప్రియ జోషి తన పాత్రలో తానే నటించడానికి సన్నద్ధం కావడం ఒక విశేషం అయితే, కస్ట్యూమ్, స్టేజ్ సపోర్ట్, మ్యూజిక్, లైట్ ఆరెంజ్మెంట్లాంటి బాధ్యతలను స్త్రీలే నిర్వహించడానికి రెడీ కావడం మరో విశేషం. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, కాన్సర్ సర్వైవర్‌గా తన అనుభవాలతో రెండు పుస్తకాలు రాసింది ప్రియ. గతంలో టీచర్‌గా పనిచేసిన ప్రియ ఇప్పుడు ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తుంది. రంగస్థలం అనేది సృజనాత్మక వేదిక మాత్రమే కాదు...సందేశం అందే విశాల వేదిక కూడా. అంకితభావం, ఆశావహæదృక్పథం, సంకల్పబలం ఉంటే ఎంతటి జటిలమైన పరిస్థితి నుంచైనా బయటపడవచ్చు అనే సందేశాన్ని ‘ఔర్ షమా జల్తీ రహీ’ ద్వారా ఇవ్వాలన్నది ప్రియ జోషి ఉద్దేశం. నిజజీవితం నుంచి నడిచొచ్చిన కథ, నాటకంలాంటి సృజనాత్మక రూపాలకు జనాలు జేజేలు పలకడం కొత్త కాదు. అయితే ఈ సింగిల్ ప్లే మనం ప్రశంసించడానికి మాత్రమే పరిమితమైన కళారూపం కాదు. మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయుధం కూడా! -
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
మరణించేలోపు ఎన్నో పూర్తి చేయాలి: మనీషా కొయిరాలా
-
చనిపోయేలోపు ఎన్నో పూర్తి చేయాలి
కోమలమైన ముఖం, చెరగని చిరునవ్వు బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా సొంతం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనూహ్యంగా ఆమెకు ఏడేళ్ల క్రితం క్యాన్సర్ మహమ్మారి సోకింది. కానీ ఆ క్యాన్సర్ రక్కసితో చేసిన సుదీర్ఘ పోరాటంలో ఆమెదే పైచేయి అయింది. క్యాన్సర్ కుంగదీస్తుందంటారు. కానీ ఆ కుంగుబాటుకు నుంచి త్వరగానే బయటపడి సానుకూల ఆలోచనలతో అందరినీ అబ్బురపరిచేది. ఈ క్రమంలో బుధవారం మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయక పోస్ట్ చేశారు. దీనికి ‘బలాన్ని తిరిగి కూడగట్టుకుంటున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న కొన్ని ఫొటోలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన శక్తిమంతమైన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితం అందమైనది, లోతైనది, కొన్నిసార్లు చీకటిమయంగానూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా నేను శాశ్వతంగా నిద్రించేలోపు ఎన్నో బాధ్యతలు పూర్తి చేయాల్సి ఉంది’ అని రాసుకొచ్చారు. (అది వ్యవసాయం కాదు ఆడుకోవడం అంటారు) ఆమె ఎప్పుడూ అభిమానుల మెదడులో పాజిటివ్ దృక్పథాన్ని నింపేందుకే ప్రయత్నిస్తారు. ఒక పోస్టులో ఆమె 'రహదారి నాకు గురువు' అంటారు. మరో పోస్టులో 'ఈ క్వారంటైన్లో మీకు సంతోషాన్ని, ప్రశాంతతను అందించే హాబీని వెతుక్కోండి' అని సూచిస్తారు. ఇలా ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులన్నీ ఉత్తేజభరితంగా, మంచి మాట చెప్తున్నట్లుగా ఉంటాయి. కాగా 2012లో అకస్మాత్తుగా వచ్చిన అండాశయ క్యాన్సర్ ఆమె జీవితాన్ని మార్చివేసింది. జీవించేందుకు రెండో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ ఎలా జయించిందో పేర్కొంటూ 'హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్' అనే పుస్తకాన్ని రాశారు. ఆమె చివరిసారిగా 'మస్కా' అనే చిత్రంలో కనిపించారు. (ఇండియా- నేపాల్ సరిహద్దు వివాదంలో హీరోయిన్!) -
‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’
‘ఎటువంటి మేకప్ లేకుండా 47వ ఏట ఇదీ నేను. మనం ఎలా కనిపిస్తున్నామో.. అచ్చంగా... అలాగే ప్రపంచం ముందుకు రావడానికి మనలో ఎంత మందికి ధైర్యం ఉంటుంది? యుక్త వయస్సులో ఉన్నపుడైతే నాకు ఆ ధైర్యం లేదు. ప్రతీ ఒక్కరు మన విలువను గుర్తించలేరు. అయితేనేం మీ చర్మాన్ని, అది చెప్పే కథలను ప్రేమించండి. ఓ మహిళా... నీ అనుభవాలు, నీ ప్రత్యేకతను, నీ విలువను నువ్వే గుర్తించాలి! అపుడే ప్రపంచం కూడా ఇదే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. లేనిపక్షంలో అటువంటి వాళ్ల గురించి వదిలేసెయ్’ అంటూ బాలీవుడ్ నటి, మోడల్ లీసా రే తన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు జత చేసిన సందేశాత్మక క్యాప్షన్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘క్యాన్సర్‌ని జయించి..జీవితంలో నిలదొక్కుకున్న మీరు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదని మరోసారి నిరూపించారు. ప్రతీ మహిళ మీలాగే ఆలోచించాలి. మేకప్ ఉన్నా లేకున్నా మీరెప్పుడూ పర్ఫెక్ట్గానే ఉంటారు మేడమ్’ అంటూ లీసారేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లీసారే క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. క్రమంగా వ్యాధి నుంచి కోలుకున్న ఆమె...2012లో తన ప్రియుడు జాసన్ డేహ్నిని పెళ్లాడారు. ఈ జంట గతేడాది సెప్టెంబరులో సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారు. ఇక తాను క్యాన్సర్‌ను జయించిన తీరును..ఆ క్రమంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను..‘క్లోజ్ టూ ది బోన్’ పేరిట లీసారే పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ‘రోగాల బారిన పడినంత మాత్రాన.. జీవితం ముగిసిపోదు.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. వైద్యరంగంలో వచ్చిన మార్పుల వల్ల నేడు అన్నీ సాధ్యమే. అందుకు నేనే ఉదాహరణ. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందవద్దంటూ’ క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అంతేకాకుండా అందంగా లేనంటూ ఆత్మన్యూనతతో బాధపడకూడదని.. యుక్త వయస్సులో తాను కూడా ఇలా అనుకునేదాన్నని..అది ఎంత పొరపాటో ఆలస్యంగా తెలుసుకున్నానని తన పుస్తకావిష్కరణ సందర్భంగా పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.‘ పదహారేళ్ల వయస్సులో ఎప్పుడూ ఎదుటివారికి ఎలా కనబడుతున్నానా అనే ఓ అభద్రతా భావంతో జీవించేదాన్ని. నేను అందంగా లేనని తెగ ఫీలైపోయేదాన్ని. అయితే ఇప్పుడే అర్థమైంది. టీనేజ్‌లో కంటే 47 ఏళ్ల వయస్సులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నానని’ అంటూ లీసారే తన గురించి చెప్పుకొచ్చారు. View this post on Instagram That’s me at 47, free and unfiltered. Do we have the courage to be seen as we are? I did not when I was younger. Not everyone will recognize your worth, but love your skin and the stories it tells, your experiences, your essence- know your worth woman!- and the world will reflect back your radiance. (And if it doesn’t, fuck it. You’re lovable and perfect regardless) Thanks @binapunjani for clearing the way for more of me and less hair to hide behind 🙏🏼 #unfilterme A post shared by lisaraniray (@lisaraniray) on Sep 15, 2019 at 11:53pm PDT -
'నీ కంటే నీ కొడుకే పెద్ద హీరో'
ఇమ్రాన్ హష్మీని ఉద్దేశించి సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: పసిప్రాయంలోనే కేన్సర్‌పై పోరాడి విజయం సాధించిన బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయాన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. ఈ ఆరేళ్ల బాలుడు తండ్రి కంటే పెద్ద హీరో అని వ్యాఖ్యానించారు. తన కొడుకు జీవితం, కిడ్నీ కేన్సర్‌పై పోరాటం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదన తదితర అంశాలతో హష్మీ, బిలాల్ సిద్దిఖీ రాసిన 'కిస్ ఆఫ్ లైఫ్' పుస్తకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ఆవిష్కరించారు. ఆయాన్‌కు కేన్సర్ సోకినట్టు తేలగానే అతణ్ని కెనడా తీసుకెళ్లి అత్యంత ఖరీదైన చికిత్స ఇప్పించారు. ఏడు నెలలపాటు చేసే ఈ వైద్యం అత్యంత బాధాకరమైనదని హష్మీ పేర్కొన్నారు. ఆయాన్ వంటి చిన్నారులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కిస్ ఆఫ్ లవ్ పుస్తకాన్ని కేన్సర్ బాధితులంతా చదవాలని పిలుపునిచ్చారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
* 3 గంటలు వేచి చూసినా నాడి పట్టి చూడని వైద్యులు * మృత్యువుతో పోరాడి ఓడిన కేన్సర్ బాధితురాలు సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన బి.గంగు(62) తరచూ తలనొప్పి వస్తుండటంతో 45 రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో పరీక్ష చేయించుకుంది. వైద్యులు బ్రెయిన్ కేన్సర్‌గా నిర్ధారించారు. గత జూలై 27న ఆమె ఆస్పత్రిలో చేరింది. సోమవారం ఉదయం ఐదు గంటలకు‘రోగి ఆరోగ్య పరిస్థితి విషమించింది.. మా వల్ల కాదు.. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ వైద్యులు బంధువులకు సూచించారు. కుమారుడు ఆంజనేయులు అచేతనస్థితిలో ఉన్న తల్లి దుస్థితిని చూసి తల్లడిల్లిపోయాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని తల్లిని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించాడు. ఉదయం 7.30 గంటలకు అత్యవసర విభాగానికి చేరుకున్నాడు. ఇక్కడ కేన్సర్ విభాగం లేదని.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. ఆలస్యం చేయకుండా అదే అంబులెన్స్‌లో ఉదయం 8.30 గంటలకు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఓపీ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతే అడ్మిట్ చేస్తామని సిబ్బంది స్పష్టం చేశారు. మృత్యువుతో పోరాడుతున్న తల్లిని అంబులెన్స్ డ్రైవర్‌కు అప్పగించి ఆంజనేయులు ఓపీకి చేరుకున్నాడు. వెంటిలేటర్ లేకపోవడంతో డ్రైవర్ నెబులైజర్ పంప్ ద్వారా ఆమెకు కృత్రిమ శ్వాస అందిస్తున్నాడు. ఓపీ వద్ద భారీ క్యూ ఉంది. ఎమర్జెన్సీ అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. క్యూలో నిలబడి చీటి రాయించుకునే సరికి సమయం 11.10 గంటలైంది. ఆంజనేయులు అంబులెన్స్ వద్దకు చేరుకునేలోపే తల్లి కన్నుమూసింది. అప్పటికీ ఒక్క వైద్యుడు కూడా అటు వైపు రాలేదు. ఇలా ఒక్క గంగూ మాత్రమే కాదు కేన్సర్‌తో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి చేరుకుంటున్న వందల మంది నిరుపేద రోగులది ఇదే దుస్థితి. బోలెడు ఆశతో ఆస్పత్రిలో అడుగు పెట్టిన కేన్సర్ బాధితులు ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందుతున్నారు. ఇలా వారానికి సగటున ముగ్గురు రోగులు విగత జీవులవుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కనిపించని క్యాజువాల్టీ... ప్రతిష్టాత్మక కేన్సర్ ఆస్పత్రిలో ఇప్పటి వరకు క్యాజువాల్టీ లేకపోవడం గమనార్హం. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపుతూ చేతులు దులుపుకుంటున్నారు. అదేమంటే కేన్సర్ ఎమర్జెన్సీ వైద్యం కాదు కదా! అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పుతుండటం కొసమెరుపు. ‘కేన్సర్ నొప్పి కంటే వైద్యులు, సిబ్బంది వ్యవహార శైలే మమ్మల్ని ఎక్కువ బాధిస్తోంది. ఇక్కడ పని చేస్తున్న వైద్యులు కనీసం రోగి నాడి పట్టి చూసిన పాపాన పోవడం లేదు’అని ఖమ్మం జిల్లాకు చెందిన కేన్సర్ బాధితుడు నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.‘వైద్యులు రాసిన మందుల చీటి తీసుకుని ఫార్మసీకి వెళ్తే మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో దొరుకుతాయి కొనుక్కో’అంటూ ఫార్మసిస్టులు ఉచిత సలహా ఇస్తున్నారని మియాపూర్‌కు చెందిన కేన్సర్ బాధితురాలు సురేనా ఆరోపించారు. -
మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మాజీ కస్టమ్స్ కమిషనర్ కుమార్ లేఖ రాశారు. విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఆయన గురువారం మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు 2008లో క్యాన్సర్ సోకినట్లు గుర్తించారని, తన స్వరపేటికతో పాటు నాలుకను కూడా సగం తొలగించారని కుమార్ తన లేఖలో కోరారు. క్యాన్సర్ వల్ల ఆహారం తీసుకోవడం, మాట్లాడం తనకు ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారిందని, మరో వ్యక్తికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే విడిగా సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కుమార్ లేఖలో పేర్కొన్నారు.